రాష్ట్రీయం

Hyderabad: కల్తీ ఆహారంలో టాప్ ప్లేస్ లో హైదరాబాద్, కల్తీ ఆహారంతో దెబ్బతిన్న హైదరాబాద్ బిర్యానీ బ్రాండ్, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సర్వేలో వెల్లడి

Arun Charagonda

ఫుడ్ క్వాలిటీ ఇండెక్స్ లో హైదరాబాద్ లాస్ట్ ప్లేస్‌లో నిలిచింది. ఫుడ్ సేఫ్టీపై ఆందోళన కలిగిస్తుంది నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సర్వే. కల్తీ ఆహారంతో హైదరాబాద్ బిర్యానీ బ్రాండ్ దెబ్బతింది. దేశవ్యాప్తంగా 19 ప్రధాన నగరాల్లో సర్వే నిర్వహించగా ఈ విషయం వెల్లడైంది.

Nara Ramamurthy Naidu Passed Away: ఏపీ సీఎం చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడు మృతి, మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకున్న చంద్రబాబు..హీరో నారా రోహిత్ తండ్రే రామ్మూర్తి నాయుడు

Arun Charagonda

ఏపి సీఎం నారా చంద్రబాబు నాయుడు తమ్ముడు, మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి నాయుడు మృతి చెందారు. హైదరాబాద్‌లో AIG ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన నారా రామ్మూర్తి నాయుడు. మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకొని మధ్యహ్నం హైదరాబాద్‌కు బయలుదేరనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.

Andhra Pradesh Assembly: జీరో అవర్.. డ్రైవర్ లేని కారులా ఉందన్న టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్, సభ్యులు చెప్పే సమస్యలను రాసుకునే మంత్రులే లేరని కామెంట్.. మంత్రులపై స్పీకర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Arun Charagonda

ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ సంచలన కామెంట్స్ చేశారు. సభ్యులు చెప్పే సమస్యలను రాసుకునే మంత్రి లేరని చెప్పారు. మరి సభలో సమస్యలు చెప్పి ఏం లాభమని ప్రశ్నించారు కూన రవికుమార్.

Telangana: సంగారెడ్డి గురుకుల పాఠశాలలో దారుణం, ఉరేసుకుని 9వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య

Arun Charagonda

తెలంగాణలోని సంగారెడ్డి మండలం కొత్లాపూర్లోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల 9వ తరగతి విద్యార్థిని స్వాతి ఇవాళ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వెంటనే చికిత్స కోసం సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. కాని అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

AP CM Chandrababu: ఢిల్లీలో బిజీగా సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రులు నిర్మలా, జై శంకర్‌లతో భేటీ...రాష్ట్ర జీఎస్టీ సర్ ఛార్జ్‌ని పెంచాలని కోరిన ఏపీ సీఎం

Arun Charagonda

ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీగా ఉన్నారు. నిన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి జైశంకర్ తో భేటీ అయ్యారు. రాష్ట్ర జీఎస్టీ సర్ ఛార్జ్ ని ఒక్క శాతం పెంచవల్సిందిగా కేంద్ర ఆర్థిక మంత్రిని కోరారు చంద్రబాబు. గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధానానికి సరిపడ నిధులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.

Telangana Police: తెలంగాణ పోలీస్ బ్యాడ్జిల్లో మార్పు, తెలంగాణ స్టేట్ పోలీస్ స్థానంలో తెలంగాణ పోలీస్, TSSP స్థానంలో TGSPగా మార్చాలని ఆదేశాలు..

Arun Charagonda

తెలంగాణ పోలీస్ బ్యాడ్జిల్లో మార్పు చేయాలని ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. బ్యాడ్జిల్లో TSP స్థానంలో TGP, తెలంగాణ స్టేట్ పోలీస్ స్థానంలో తెలంగాణ పోలీస్, TSSP స్థానంలో TGSPని చేర్చారు. TSPS స్థానంలో TGPS ఉండే విధంగా బ్యాడ్జిలను మార్చాలని హోంశాఖ కార్యదర్శి రవి గుప్తా ఆదేశాలు జారీ చేశారు.

CM Revanth Reddy: శైవ క్షేత్రాలకు తెలంగాణ ప్రసిద్ధి..కోటి దీపోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి, ఆనాటి త్రిలింగ క్షేత్రమే ఈనాటి తెలంగాణ..మహాకాళేశ్వరునికి కోటి పుష్పార్చనలో పాల్గొన్న సీఎం

Arun Charagonda

శైవ క్షేత్రాలకు తెలంగాణ ప్రసిద్ధి అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కార్తీక పూర్ణిమ శుభవేళ సతీసమేతంగా ఎన్ టీవీ, భక్తి టీవీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన కోటి దీపోత్సవంలో పాల్గొన్నారు రేవంత్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన...ఒక్క దీపాన్ని వెలిగించినా, ఒక్క దీపాన్ని సంరక్షించినా అది మనకు ముక్తిని కలిగిస్తుంది అన్నారు. సమాజానికి మేలు జరుగుతుందని వేదపండితులు బోధిస్తున్నారు... అలాంటిది కోటి దీపోత్సవ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం అన్నారు.

Bomb Threat to Shamshabad Airport: శంషాబాద్ విమానాశ్రయంలో బాంబు కలకలం.. విమానంలో బాంబు ఉందంటూ ఓ ప్రయాణికుడి హల్ చల్

Rudra

శంషాబాద్ విమానాశ్రయంలో బాంబు కలకలం రేపింది. హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ వెళ్లాల్సిన విమానం గేటు దగ్గరికి రాగానే బాంబు ఉందంటూ ఓ ప్రయాణికుడు హల్ చల్ సృష్టించాడు.

Advertisement

Hyderabad Fire Accident: హైదరాబాద్‌ లోని పుప్పాలగూడలో అగ్ని ప్రమాదం.. అపార్ట్ మెంట్ లో మంటలు.. బయటకు పరుగులు తీసిన జనం (వీడియో)

Rudra

హైదరాబాద్ లో ఘోర ఆగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నార్సింగి పీఎస్ పరిధిలోని పుప్పాలగూడలో గోల్డెన్ ఒరియా అపార్ట్‌ మెంట్‌ లోని మూడో అంతస్తులో శనివారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెల్లరేగాయి.

Telugu CM's At Maharashtra Poll Campaign: మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల్లో తెలుగు గుభాళింపులు, మూడు రోజుల పాటూ చంద్ర‌బాబు, రేవంత్ రెడ్డి స‌హా అనేక ముఖ్య‌నేత‌ల ప్ర‌చారం

VNS

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ప్రచారానికి ఆహ్వానించాయి అక్కడి కూటమి పార్టీలు. దీంతో ఎలక్షన్ క్యాంపెయిన్ లో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేపు మహారాష్ట్రకు వెళ్లనున్నారు.

Women Fight Video: వీడియో ఇదిగో, విశాఖలో నడిరోడ్డుపై ఇష్టమొచ్చినట్లు కొట్టుకున్న మహిళలు, వ్యాపారానికి సంబంధించిన షాపు కోసం గొడవే కారణం

Hazarath Reddy

విశాఖపట్నం జిల్లా గాజువాకలో మహిళా వ్యాపారులు ఘర్షణ పడ్డారు. రోడ్డు మీద వ్యాపారానికి సంబంధించిన షాపు కోసం నడిరోడ్డుపై మహిళలు కొట్టుకున్నారు. అందరూ చూస్తుండగానే పరస్పరం జుట్లు పట్టుకుని దాడులు చేసుకున్నారు. కొట్టుకుంటున్న వారిని ఆపడానికి స్థానికులు ప్రయత్నించారు.

CM Chandrababu Delhi Tour: అమరావతి రాజధాని నిర్మాణంలో సింగపూర్ భాగస్వామ్యం, సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో చర్చకు వచ్చిన అంశాలు ఇవే..

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి జైశంకర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారితో రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలు చర్చించారు.

Advertisement

Ragging Incident: మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ భూతం..10 మంది సీనియర్ల సస్పెండ్, ర్యాగింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న డైరెక్టర్ రమేష్

Arun Charagonda

మ‌హబూబ్‌న‌గ‌ర్ గ‌వ‌ర్న‌మెంట్ మెడిక‌ల్ కాలేజీలో ర్యాగింగ్ భూతం కలకలం రేపింది. ఈనెల 10న కొంద‌రు ఫ్రెష‌ర్స్‌ను ర్యాగింగ్ చేశౄరు సీనియ‌ర్లు. 13న వారికి కౌన్సిలింగ్ చేసిన డైరెక్ట‌ర్‌...బాధిత విద్యార్థుల ఫిర్యాదుతో 10 మంది సీనియర్లను సస్పెండ్ చేశారు. ర్యాగింగ్ చేసినా, మిస్‌బిహేవ్ చేసినా త‌నకు నేరుగా ఫిర్యాదు చేయాల‌ని డైరెక్ట‌ర్ ర‌మేష్‌ తెలిపారు.

Telangana Student Dies in Philippines: వీడియో ఇదిగో, ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ వైద్య విద్యార్థిని అనుమానాస్పద మృతి, పుట్టినరోజు నాడే విషాదకర ఘటన

Hazarath Reddy

ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ విద్యార్థిని మృతి చెందిన విషాదకర ఘటన చోటు చేసుకుంది. పటాన్‌చెరు మండలం ఇంద్రేశం గ్రామ పంచాయతీ పరిధిలో నివాసముంటున్న చింత అమృత్ రావు కుమార్తె స్నిగ్ధ ఫిలిప్పీన్స్ లోని మనీలాలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.

Telangana Shocker: జగిత్యాలలో దారుణం, అనుమానంతో స్కూలు కెళ్లి విద్యార్థుల ముందే ప్రిన్సిపాల్‌ అయిన భార్యపై దాడి చేసిన భర్త, తమ్ముడు

Hazarath Reddy

గురుకుల పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గురుకుల ప్రిన్సిపాల్ మమతపై భర్త సంపత్, ప్రిన్సిపాల్ తమ్ముడు రాజశేఖర్ దాడికి పాల్పడ్డారు. విద్యార్థినిలు, స్టాఫ్ సమక్షంలోనే చితకబాదిన కుటుంబసభ్యులు. దీంతో తీవ్ర భయాందోళనకు విద్యార్థినిలు గురైయ్యారు

Telangana: వీడియో ఇదిగో, బామర్ది పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ 23 ఏళ్ల యువకుడు గుండెపోటుతో మృతి, జగిత్యాల జిల్లాలో విషాదకర ఘటన

Hazarath Reddy

జగిత్యాల జిల్లాలో గల మేడిపల్లి మండలం మోతుకురావుపేటలో బుధవారం అర్థరాత్రి పెళ్లిలో నృత్యం చేస్తూ గుండెపోటుతో సంజీవ్ (23) అనే యువకుడు మృతి చెందాడు. గ్రామస్తుల కథనం ప్రకారం.. కమ్మరికుంటలో నివాసముంటున్న సంజీవ్ మోతుకురావుపేటలో జరిగే తన మేనమామ కుమారుడి వివాహానికి హాజరయ్యాడు.

Advertisement

Minister Ponnam Prabhakar: 35 శాతం కుటుంబ సర్వే పూర్తి..ఎలాంటి అపోహలు వద్దన్న మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రజలంతా స్వచ్ఛందంగా సర్వేకు సహకరిస్తున్నారన్న పొన్నం

Arun Charagonda

సిద్ధిపేట జిల్లా దుద్దెడ గ్రామంలో 9 వ వార్డు లో పంజాల కవిత నివాసంలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే లో పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సర్వే పై ఎలాంటి అపోహలు అవసరం లేదని సూచించారు. రాష్ట్రంలో ఎక్కడ ఇబ్బందులు లేవని ప్రజలే స్వచ్చందంగా సమాచారాన్ని ఇస్తున్నారని తెలిపారు.

Kakinada Subbaiah Hotel Seized: కాకినాడ సుబ్బయ్య హోటల్ సీజ్ చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు, భోజనంలో జెర్రి రావడంతో కీలక నిర్ణయం తీసుకున్న అధికారులు

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫేమస్ అయిన కాకినాడ సుబ్బయ్య హోటల్ ను విజయవాడలో ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పేరు ఉన్న కాకినాడ సుబ్బయ్య హోటల్లో జెర్రి కలకలం రేపిన సంగతి విదితమే. ఒక వ్యక్తి భోజనంలో ఈ జెర్రి దర్శనమిచ్చింది.

Tirupati: నటుడు పోసాని కృష్ణమురళిపై జనసైనికుల ఆగ్రహం, పోసాని దిష్టిబొమ్మ దగ్దం.. అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసానిపై చర్యలు తీసుకోవాలని పీఎస్‌లో ఫిర్యాదు

Arun Charagonda

నటుడు పోసాని కృష్ణ మురళిపై ఆగ్రహం వ్యక్తం చేశారు జనసేన నాయకులు. తిరుపతిలో పోసాని కృష్ణమురళి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు పై పోసాని చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని జనసైనికులు డిమాండ్ చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసానిపై వెంటనే చర్యలు తీసుకోవాలని తిరుపతి ఈస్ట్ పీఎస్ లో జనసేన నేతలు ఫిర్యాదు చేశారు.

Addanki Dayakar: కేటీఆర్‌వి పొలిటికల్ డ్రామాలు, అధికారం కోసం ఇంతగా దిగజారాలా అని మండిపడ్డ అద్దంకి దయాకర్, తెలంగాణ సమాజం తలదించుకునే పరిస్థితి వచ్చిందని కామెంట్

Arun Charagonda

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మండిపడ్డారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. కేటీఆర్ పొలిటికల్ డ్రామాలు ఆపాలని...దాడులు చేయించింది మీరే అని అందరికీ తెలిసిన తర్వాత పరువు పోకుండా ఉండడానికే రైతుల పేరు మీద పరామర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

Advertisement
Advertisement