రాష్ట్రీయం

Gadwal: గద్వాలలో మిషన్ భగీరథ పైపులైన్ లీక్, గాల్లోకి ఎగిసి పడి వృథాగా పోతున్న నీళ్లు....వీడియో ఇదిగో

Arun Charagonda

మిషన్ భగీరథ పైపు లైన్ పగిలి నీళ్లు ఎగిసిపడుతున్నాయి. గద్వాల నియోజకవర్గం, ధరూరు మండలం, కోతుల గిద్ద స్టేజి సమీపంలో (పెట్రోల్ బంకు దగ్గర) మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలి ఎగిసిపడుతున్నాయి నీళ్లు. మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలి పోయి నీళ్లు వృధాగా పోతుండగా మిషన్ భగీరథ అధికారులు ఇట్టి విషయాన్ని గమనించి చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Warangal: కోచింగ్ లేకుండా ఏకంగా 8 ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టిన యువకుడు,అన్న బాటలోనే తమ్ముడు కూడా.. శభాష్ అంటున్న గ్రామస్తులు

Arun Charagonda

వరంగల్ జిల్లా నల్లబెల్లికి చెందిన రాయరాకుల రాజేశ్ అనే యువకుడు కోచింగ్ లేకుండానే ఏకంగా 8 ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టాడు. పంచాయితీ సెక్రటరీ, PGT గురుకుల, ASO, TGT గురుకుల, హాస్టల్ వెల్ఫేర్ గ్రేడ్-2, గ్రూప్-4, DSC, JL ఉద్యోగాలు సాధించాడు. ప్రస్తుతం మల్లంపల్లిలో PGT(SOCIAL)గా పనిచేస్తున్నాడు. ఇతని తమ్ముడు సంతోష్ కూడా అన్న స్ఫూర్తిగా గ్రూప్-4 సాధించి, గ్రూప్-1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాడు. అన్నదమ్ములు ఇద్దరిపై గ్రామస్తులు ప్రశంసలు గుప్పిస్తున్నారు.

PM Modi: 29న ఆంధ్రప్రదేశ్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ..రూ.80 వేల కోట్ల పెట్టుబడులతో స్థాపిస్తున్న పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన, 48 వేల మందికి దక్కనున్న ఉపాధి

Arun Charagonda

ఈనెల 29న ఏపీలో పర్యటించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. రూ.80 వేల కోట్ల పెట్టుబడులతో స్థాపిస్తున్న ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ హబ్తో పాటు గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని. ఈ ప్రాజెక్ట్‌లు పూర్తి అయితే వచ్చే నాలుగేళ్లలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 48 వేల మందికి పైగా ఉపాధి లభించనుంది.

KTR In Sangareddy Central Jail: సంగారెడ్డి సెంట్రల్ జైలులో మాజీ మంత్రి కేటీఆర్, లగచర్ల రైతులతో ములాఖత్...వీడియో

Arun Charagonda

సంగారెడ్డి జైలులో లగచర్ల రైతన్నలను జైలులో ములాఖాత్ లో కలిసింది బీఆర్ఎస్ పార్టీ నేతల బృందం. రైతులను కలిసిన వారిలో కేటీఆర్, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే చింత ప్రభాకర్, అనిల్ జాదవ్, రమావత్ రవీంద్ర కుమార్, జాన్సన్ నాయక్ తదితరులు ఉన్నారు.

Advertisement

Telangana: మాజీ మంత్రి మల్లారెడ్డి మోసం చేశాడు...రూ.14 కోట్లు ఇవ్వాలని బాధితుడు నరసింహరెడ్డి ఆరోపణ, బంధువని నమ్మితే నిండా ముంచేశాడని మండిపాటు

Arun Charagonda

బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డిపై ఆయన బంధువు నరసింహరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మల్లారెడ్డి తనను దారుణంగా మోసం చేశాడని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా యాడారంలో నా 23 ఎకరాల వ్యవసాయ భూమిని కొంటానాని మల్లారెడ్డి నన్ను సంప్రదించి ఎకరం రూ.2 కోట్లకు మాట్లాడుకున్నాడు. మొదలు మొత్తం కొంటానని నమ్మించి తరువాత రూ.8 కోట్లు మాత్రమే ఇచ్చి 9 ఎకరాలను రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు అన్నారు.

Koti Deepotsavam 2024: అంగరంగ వైభవంగా కోటి దీపోత్సవం, భారీ సంఖ్యలో తరలివస్తున్న భక్తులు, ఈ నెల 25వ తేదీ వరకు కార్యక్రమాలు

Hazarath Reddy

భక్తి TV మరియు NTV హైదరాబాద్‌లో నిర్వహించే వార్షిక కార్యక్రమం కోటి దీపోత్సవం అంగ రంగ వైభవంగా కొనసాగుతోంది. కార్తీక మాసం వచ్చిందంటే ప్రతి హిందువు కార్తీక వేడుకల్లో భాగంగా దీపాలు వెలిగించి దేవతా పూజల్లో మునిగితేలుతున్నారు.

SBI Rate Hike: రుణాల వడ్డీ రేటును పెంచేసిన ఎస్బీఐ.. 0.05 శాతం ఎంసీఎల్ఆర్ పెంచిన దిగ్గజ బ్యాంకు

Rudra

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు షాకింగ్ వార్త. అయితే ఎస్బీఐ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (MCLR- ఎంసీఎల్ఆర్)లో 0.05 శాతం పెంచినట్లు ప్రకటించింది.

Tiger Spotted In Nirmal: నిర్మల్ జిల్లాలో పెద్దపులి సంచారం, ఖానాపూర్ అడవుల్లో పులి సంచారం..భయాందోళలో ప్రజలు..వీడియో ఇదిగో

Arun Charagonda

తెలంగాణలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ అడవుల్లో పెద్దపులి సంచారానికి సంబంధించిన వీడయో వైరల్‌గా మారింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

Advertisement

Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం, గడ్డిమందు తాగి యువకుడు ఆత్మహత్య...11 నెలల క్రితమే పెళ్లి..వీడియో ఇదిగో

Arun Charagonda

రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం నెలకొంది. గడ్డి మందు తాగి యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామానికి చెందిన బుర్రవేణి వేణు (27) వారం రోజుల క్రితం గడ్డి మందు సేవించగా నాలుగు రోజుల క్రితం కుటుంబ సభ్యులకు తెలుపగా వెంటనే స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు.

Telangana Samagra Kutumba Survey: మేడ్చల్‌ రోడ్డుపై సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు, సిబ్బందితో వెళ్లి ఫారాలు తీసుకెళ్లిన మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి...వీడియో ఇదిగో

Arun Charagonda

సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు రోడ్డు పాలు అయ్యాయి. మేడ్చల్‌ రోడ్డుపై అర కిలోమీటర్ పొడవునా జాతీయ రహదారి పక్కన దర్శనం ఇచ్చాయి. సమాచారం అందుకున్న మేడ్చల్ మున్సిపాలిటీ కమిషనర్ నాగిరెడ్డి హుటాహుటీనా సర్వే ఫారాలు పడిన చోటుకు సిబ్బందితో కలిసి వెళ్లారు. అన్ని ఫారాలను సేకరించి, తన వాహనంలో కార్యాలయానికి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Snake Dance at Dwaraka Tirumala: కార్తీక పౌర్ణమి రోజున పాముల సయ్యాట.. ద్వారకా తిరుమలలో కనిపించిన దృశ్యం.. వైరల్ వీడియో

Rudra

నేడు కార్తీక పౌర్ణమి. ఈ పర్వదినం రోజున రెండు పాములు చేసిన సయ్యాట కనువిందు చేసింది. ద్వారకా తిరుమలలో కనిపించిన ఈ దృశ్యానికి అందరూ పరవశితులయ్యారు. శివాలయానికి సమీపంలోనే ఇది జరగడంతో దేవుడి మహత్యంగా భక్తులు భావిస్తున్నారు.

Weather Forecast in Telugu States: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం.. ఆంధ్రప్రదేశ్‌ లో భారీ వర్షాలు.. తెలంగాణలో జల్లులు.. రెండు రోజులు ఇలాగే..!

Rudra

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీన పడింది. అయితే, దీని ప్రభావం మాత్రం తెలుగు రాష్ట్రాలపై ఇంకా కొనసాగుతూనే ఉంది.

Advertisement

Bears at Lord Siva Temple: శివాలయంలోకి ఒకేసారి చొరపడ్డ మూడు ఎలుగుబంట్లు.. భయంతో పరుగెత్తిన జనాలు (వీడియో)

Rudra

ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో భయానక ఘటన చోటుచేసుకుంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శివాలయంలో భక్తులు పూజలు చేస్తుండగా.. ఉన్నట్టుండి ఆలయంలోకి ఒకేసారి మూడు ఎలుగుబంట్లు చొరబడ్డాయి.

Kartik Purnima 2024: కార్తీక పౌర్ణమి.. తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలకు పోటెత్తిన భక్తులు, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల ప్రత్యేక పూజలు

Arun Charagonda

కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో భక్తులు పూజలు నిర్వఃఇంచారు. ద్వారకా తిరుమలలోని శివాలయంలో కార్తీక పౌర్ణమి సందడి నెలకొంది. కోటిలింగాల కోటేశ్వర స్వామి ఆలయంలో స్వామివార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు భక్తులు.

Karthika Pournami 2024 Wishes In Telugu: నేడే కార్తీక పౌర్ణమి. ఈ పర్వదినంనాడు లేటెస్ట్ లీ తెలుగు అందించే ప్రత్యేక హెడ్ డీ ఇమేజెస్ ద్వారా మీ బంధు, మిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయండి..!

Rudra

పరమశివుడితోపాటు శ్రీమహావిష్ణువుకు కూడా అత్యంత ఇష్టమైన పర్వదినం కార్తీక పౌర్ణమి. నేడే ఆ శుభదినం. ఇంతటి పవిత్రత ఉన్న ఈ పర్వదినం రోజు మీరు మీ బంధుమిత్రులకు లీ తెలుగు అందించే ప్రత్యేక హెడ్ డీ ఇమేజెస్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేయండి.

CM Revanth Reddy: యువతరాన్ని ప్రోత్సహించాలి... శాసనసభకు పోటీ చేసే వయస్సు 21 ఏళ్లకు తగ్గించాలన్న సీఎం రేవంత్ రెడ్డి, యువత డ్రగ్స్‌కు బానిస కావొద్దని పిలుపు

Arun Charagonda

రాష్ట్రంలో ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఏ సన్నబియ్యంతో తింటున్నారో గురుకుల హాస్టళ్లలో ఉంటున్న మా బిడ్డలకు కూడా అదే అన్నం పెట్టాలని చెప్పాం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ హాస్టళ్లలో ఉండి చదువుతున్న ఆ బిడ్డలు తెలంగాణ ఆత్మగౌరవం. భావి భారత నిర్మాతలు. వారికి నాణ్యమైన ఆహారం సరఫరా చేయని వారిపై కఠినమైన చర్యలు తప్పవు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

Advertisement

Subbaiah Hotel Seized: తింటున్న భోజనంలో కాళ్ల జెర్రీ… ఎన్‌ హెచ్‌ ఆర్సీ ఛైర్‌పర్సన్‌ ఆగ్రహం.. కాకినాడ సుబ్బయ్య హోటల్ సీజ్ (వీడియో)

Rudra

విజయవాడలోని ప్రముఖ హోటల్ లో గురువారం మధ్యాహ్నం ఓ కస్టమర్ కు సర్వ్ చేసిన భోజనంలో కాళ్ల జెర్రీ ప్రత్యక్షమయ్యింది. నగరంలోని సూర్యారావు పేటలో ఉన్న సుబ్బయ్య హోటల్‌ లో ఈ ఘటన జరిగింది.

Transgender for Traffic Control: హోంగార్డుల తరహాలో ట్రాన్స్‌ జెండర్ల సేవలు.. ట్రాఫిక్‌ నియంత్రణకు వినియోగించాలన్న సీఎం రేవంత్‌రెడ్డి.. అధికారులకు ఆదేశం

Rudra

హైదరాబాద్ లో ట్రాఫిక్‌ నిత్యనరకంగా మారిపోయింది. హోంగార్డుల తరహాలో ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్‌ జెండర్లను వినియోగించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు.

Visakhapatnam Horror: విశాఖ గాజువాకలో ప్రేమోన్మాది ఘాతుకం, యువతి తలపై ఇనుపరాడ్డుతో దాడి, బాధితురాలి తలపై వైద్యులు 30కి పైగా కుట్లు, వీడియో ఇదిగో..

Vikas M

విశాఖపట్నం గాజువాకలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. పెదగంట్యాడ బాలచెరువు సమీపంలో యువతిపై ఓ యువకుడు రాడ్డుతో దాడి చేశారు. ఈ ఘటనలో బాధితురాలు మేఘనకు తీవ్ర గాయాలు అయ్యాయి. మేఘన తలపై బలంగా ఇనుప రాడ్డుతో నిందితుడు నీరజ్ శర్మ దాడి చేశాడు.

TSPSC Group 4 Provisional Selection List: తెలంగాణ గ్రూప్ -4 ఫ‌లితాలు విడుద‌ల‌,మొత్తం ఎంత‌మంది సెల‌క్ట్ అయ్యారంటే? పూర్తి వివ‌రాలివిగో

VNS

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్ 4 అభ్యర్థుల కోసం ప్రొవిజనల్ ఆప్షన్ జాబితాను అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. ఈ గ్రూపు 4 పరీక్షకు హాజరైన అభ్యర్థులు, ప్రొవిజనల్ ఆప్షన్ జాబితాను చెక్ చేయాలనుకునే అభ్యర్థులు (tspsc.gov.in)లో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు

Advertisement
Advertisement