రాష్ట్రీయం
Andhra Pradesh Politics: వీడియో ఇదిగో, షర్మిలకు వైఎస్ జగన్ పరోక్షంగా కౌంటర్, రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి ప్రవేశించిన చంద్రబాబు అభిమాన సంఘం కష్టపడి జాకీలు పెట్టి ఆయనను లేపుతున్నారని ఎద్దేవా
Hazarath Reddyఏనాడూ మంచి చేయని చరిత్ర ఉన్న చంద్రబాబు కోసం పక్క రాష్ట్రం.. పక్క పార్టీల్లోనూ స్టార్‌ క్యాంపెయినర్‌లు ఉన్నారని.. మంచినే నమ్ముకున్న తనకు అలాంటి వాళ్ల అవసరం తనకు ఏమాత్రం లేదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.
Andhra Pradesh: ఇకపై జగనన్న గారూ అనే పిలుస్తానని తెలిపిన షర్మిల, రాష్ట్రంలో వైసీపీ చేసిన అభివృద్ధిని చూసేందుకు సిద్ధమని సవాల్, వీడియోలు ఇవిగో..
Hazarath Reddyఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఇకపై జగనన్న గారూ అనే సంబోధిస్తానంటూ ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల పేర్కొన్నారు. జగన్ రెడ్డి గారూ అని పిలిస్తే అధికార పార్టీ నేతలకు నచ్చడంలేదని, అందుకే ఇకపై జగనన్న గారూ అనే పిలుస్తానని చెప్పారు.
Andhra Pradesh: సమ్మె విరమించిన అంగన్వాడీ వర్కర్లు, నేటి నుంచి విధుల్లోకి, ఏపీ ప్రభుత్వంతో చర్చలు సఫలమయ్యాయని తెలిపిన అంగన్‌వాడి నాయకులు
Hazarath Reddyఏపీ ప్రభుత్వంతో చర్చలు సఫలం అయ్యాయని, సమ్మె విరమిస్తున్నట్లు ఏపీ అంగన్‌వాడీలు (Anganwadi Workers) ప్రకటించారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని అంగన్‌వాడీల ప్రతినిధులు పేర్కొన్నారు. జులైలో వేతనాలు పెంచుతామని ప్రభుత్వం తమకు హామీ ఇచ్చిందని, మంగళవారం(ఈరోజు) నుంచి విధుల్లోకి వెళ్తామని వారు పేర్కొన్నారు
Telangana Lok Sabha Elections 2024: పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి 30 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు, మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyపార్లమెంట్ ఎన్నికల తర్వాత BRS ఖాళీ అవడం ఖాయమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkatreddy) విమర్శించారు. నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా తిప్పర్తి మండలంలోని కొన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
MP Sri Krishna Devarayalu Lavu Quits YCP: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మ‌రో షాక్, న‌ర‌స‌రావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌లు రాజీనామా
Hazarath Reddyఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మ‌రో షాక్ త‌గిలింది. ఆ పార్టీకి చెందిన న‌ర‌స‌రావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌లు రాజీనామా చేశారు. పార్టీ ప్రాథ‌మిక సభ్య‌త్వంతో పాటు ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. కొంత‌కాలంగా పార్టీలో నెల‌కొన్న ప‌రిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌లు తెలిపారు.
Prashant Kishor: వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుతో కలిసి పనిచేయడం లేదు, షాకిచ్చిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌, వీడియో ఇదిగో...
Hazarath Reddyవచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ చంద్రబాబు కలిసి పనిచేస్తున్నారనే వార్తలపై తాజాగా ప్రశాంత్‌ కిషోర్‌ క్లారిటీ ఇచ్చారు. ఓ ఫేస్‌ టు ఫేస్‌ ఇంటర్వ్యూలో ప్రశాంత్‌ కిషోర్‌ దీనిపై స్పష్టత ఇస్తూ.. చంద్రబాబు తన కోసం ఎన్నికల్లో పని చేయమని అడిగాడనని, అందుకు తాను కుదరదని చెప్పానని పేర్కొన్నారు..
Fire Breaksout at Madhapur PS: మాదాపూర్‌ పీఎస్‌ లో మంటలు.. నిప్పురవ్వ ఎగిరి పోలీస్‌ స్టేషన్‌ వెనుక ఉన్న ఓ సిలిండర్‌ పై పడటంతో ప్రమాదం
Rudraతనిఖీల్లో స్వాధీనం చేసుకున్న సిలిండర్లు మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ లో పేలడం తీవ్ర కలకలం సృష్టించింది. మాదాపూర్‌ డీసీపీ వినీత్‌ తెలిపిన వివరాల ప్రకారం… స్ట్రీట్‌ వెండర్స్‌ వద్ద తనిఖీల్లో సీజ్‌ చేసిన నాలుగు సిలిండర్లను పోలీస్‌స్టేషన్‌ వెనుక ఉన్న ఖాళీ స్థలంలో ఉంచారు.
Hyderabad Metro Rail Phase Two Plan: హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌-2 విస్తరణకు రూట్‌ మ్యాప్ ఖరారు, 70 కిలో మీటర్ల మేర కొత్త మెట్రో మార్గాన్ని నిర్మించేలా ప్రతిపాదనలు
Hazarath Reddyసీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాలతో హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌-2 విస్తరణకు రూట్‌ మ్యాప్ ఖరారైంది. 70 కిలోమీటర్ల మేర కొత్త మెట్రో మార్గాన్ని నిర్మించేలా ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు.. ఈ వివరాలను సీఎంకు అందించారు.
Special Trains to Ayodhya: తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లు, సికింద్రాబాద్‌, విజయవాడ నుంచి బయలుదేరే రైళ్ల పూర్తి వివరాలు ఇవిగో..
Hazarath Reddyన్నో ఏళ్ళ తరువాత అయోధ్య రామ మందిరంలో బాల రాముడు కొలువు దీరాడు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ నుంచి అయోధ్యకు వెళ్లేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.
Ram Mandir Pran Pratishtha: వీడియో ఇదిగో, రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా స్వీట్లు పంచిన ముస్లిం యువకుడు, హైదరాబాద్ నగరంలో వెల్లివిరిసిన మతసామరస్యం
Hazarath Reddyఅయోధ్య శ్రీరాముడి ప్రతిష్ఠాపన మహోత్సవాల నేపథ్యంలో హైదరాబాద్ నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లొ ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ ముస్లిం నేత హిందువులకు సంతోషంతో స్వీట్లు పంచారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Anganwadis Protest: వీడియో ఇదిగో, పోలీసులపై తిరగబడిన అంగన్వాడీలు, అదుపులోకి తీసుకుంటుండగా మహిళా కానిస్టేబుళ్ల పై దాడి
Hazarath Reddyవిస్సన్నపేట జాతీయ రహదారిపై సీఐటీయూ కార్యకర్తలతో కలిసి అంగన్వాడీలు రోడ్డుపై బైఠాయింఛీ ఆందోళన చేపట్టారు. కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుంటుండగా.. మహిళా కానిస్టేబుళ్ల పై అంగన్వాడీ కార్య కర్తలు తిరగబడ్డారు.
Telangana MLC Elections 2024: తెలంగాణ ఎమ్మెల్సీలుగా మహేష్‌ కుమార్‌ గౌడ్‌, బల్మూరి వెంకట్‌ ఏకగ్రీవం, ప్రకటించిన అసెంబ్లీ కార్యాలయం
Hazarath Reddyఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్‌కు ఉపసంహరణ గడువు నేటితో(మంగళవారం) ముగిసింది. రెండు ఎమ్మెల్సీ స్ధానాలకు రెండు నామినేషన్‌లు మాత్రమే రావడంతో ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది.
Andhra Pradesh Voter List 2024: ఏపీలో మొత్తం 4,08,07,256 ఓటర్లు, పురుషుల కంటే మహిళల ఓటర్లే ఎక్కువ, జిల్లాల వారీగా ఓటర్ల తుది జాబితాను విడుదల చేసిన ఈసీ
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో 2024 ఓటర్ల తుది జాబితాను జిల్లాల వారీగా కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. సీఈఓ ఆంధ్రా వెబ్‌సైట్‌(CEO Andhra)లో జిల్లాల వారీగా తుది ఓటర్ల జాబితా విడుదల చేసినట్లుగా సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. నియోజకవర్గాల వారీగా పీడీఎఫ్ ఓటర్ల జాబితాలను సీఈఓ ఆంధ్రా వెబ్‌సైట్‌లో ఈసీ అప్ లోడ్ చేసింది.
Anganwadis Protest: అంగన్వాడీలపై ఏపీ ప్రభుత్వం సీరియస్, విధుల్లో చేరని వారిని తొలగించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు, జగన్ సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టిన ప్రతిపక్షాలు
Hazarath Reddyవేతన పెంపు, ఉద్యోగ భద్రత.. తదితర డిమాండ్లతో ఆందోళన చేస్తున్న అంగన్వాడీలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయ్యింది.. విధుల్లో చేరని అంగన్వాడీలను తొలగించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.. విధుల్లో చేరని అంగన్వాడీలపై చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లా కలెక్టర్లకు సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు ఇవ్వగా.. ఇప్పటికే ఆ ఆదేశాలు అమలు చేసే దిశగా అడుగులేస్తున్నారు వివిధ జిల్లాల కలెక్టర్లు.
Pawna Kalyan Selfie at Ram Mandir: అయోధ్య రామమందిరం ఎదుట సెల్ఫీ తీసుకున్న పవన్ కళ్యాణ్, రామ కార్యం అంటే రాజ్య కార్యం, ప్రజా కార్యం అంటూ ట్వీట్
Hazarath Reddyపవన్ కల్యాణ్ అయోధ్య రామ మందిరంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరయ్యారు.నేడు శాస్త్రోక్తంగా జరిగిన బాల రాముడి దివ్య మంగళ విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఆయన సంప్రదాయ దుస్తులు ధరించి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయోధ్య రామ మందిరం ఎదుట పవన్ ఓ సెల్ఫీ తీసుకున్నారు.
Ram Temple Inauguration: వీడియో ఇదిగో, అయోధ్య రామజన్మభూమి ఆలయంలో చంద్రబాబు, రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన టీడీపీ అధినేత
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అయోధ్యలోని రామజన్మభూమి ఆలయానికి చేరుకున్న రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు.
Ayodhya Ram Mandir Inauguration LIVE: అయోధ్య రాముడు కొలువుదీరే శుభదినం నేడే..రామనామ స్మరణలో యావత్తు దేశం..మధ్యాహ్నం 12.20 గం.కు ప్రాణప్రతిష్ఠ.. రేపటి నుంచి భక్తులకు రామయ్య దర్శనం (లైవ్ వీడియో)
Rudraయావత్తు దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ నేడే జరుగనున్నది. సోమవారం మధ్యాహ్నం 12.20 గంటలకు మొదలై మధ్యాహ్నం ఒంటి గంటలకు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ముగుస్తుంది.
Chandrababu Naidu In Ayodhya: అయోధ్యకు చేరుకున్న చంద్రబాబునాయుడు, బాలరాముడి ప్రాణ ప్రతిష్టలో పాల్గొంటున్న టీడీపీ అధినేత..
sajayaఅయోధ్యలోని రామ మందిరంలో జరిగే శ్రీరామప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత నారా చంద్రబాబు నాయుడు హాజరు అయ్యేందుకు అయోధ్యకు వెళ్లారు. ఇదిలా ఉంటే రామమందిర ప్రారంభోత్సవానికి అయోధ్యకు రావాల్సిందిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కూడా ఆహ్వానం అందింది.
Ram Ke Naam Movie: వివాదాస్పద చిత్రం రాం కే నామ్ ప్రదర్శించిన వ్యక్తులపై నేరేడ్ మెట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు..
sajaya"రామ్ కే నామ్" అనే డాక్యుమెంటరీ/సినిమా ప్రదర్శనను నిర్వహించినందుకు ముగ్గురు వ్యక్తులపై రాచకొండలోని నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
Hyderabad Shocker: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత.. రూ.41 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్..
sajayaహైదరాబాద్‌: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత.. రూ.41 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్.. 5.92 కిలోల హెరాయిన్‌ స్వాధీనం.. జాంబియా నుంచి వచ్చిన మహిళా ప్రయాణికురాలి నుంచి డ్రగ్స్ సీజ్‌.. హ్యాండ్‌బ్యాగ్‌లో డ్రగ్స్ తీసుకొచ్చిన మహిళ.