రాష్ట్రీయం

Prithviraj Joined Janasena: జనసేనలో చేరిన సినీనటుడు పృథ్వీరాజ్‌, కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పవన్‌ కల్యాణ్‌

Hazarath Reddy

కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌, సినీనటుడు పృథ్వీరాజ్‌ (Prudhvi Raj) జనసేనలో చేరారు. బుధవారం మంగళగిరిలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan).. వీరికి జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Hyderabad: జీవో నెంబర్ 55ను తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని నిరసన, విద్యార్థిని జుట్టుపట్టి లాగిపడేసిన మహిళా పోలీసులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

అగ్రికల్చర్ యూనివర్సిటీ 100 ఎకరాల భూములను హైకోర్టుకు కేటాయించవద్దంటూ విద్యార్థులు నిరసన చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 55ను గవర్నమెంట్ వెంటనే వెనక్కి తీసుకోవాలని నిరసన చేస్తున్న విద్యార్దిని జుట్టును మహిళా కానిస్టేబుళ్లు లాగి పడేసారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Accident Caught on Camera: జూబ్లీహిల్స్‌ హిట్‌ అండ్‌ రన్‌ కేసు సీసీ పుటేజీ ఇదిగో, బైక్‌పై వెళ్తున్న బౌన్సర్‌ను ఢీకొట్టిన కారు, అక్కడికక్కడే బౌన్సర్ మృతి

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్‌లో బుధవారం హిట్‌ అండ్‌ రన్‌ కేసు నమోదైంది. ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఓ బౌన్సర్‌ అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు గాయపడ్డారు.

Andhra Pradesh Elections 2024: ఏపీ ఎన్నికలు, లోక్ సభకు రూ.25,000, అసెంబ్లీకి రూ. 10,000, సీటు ఆశించే వారి నుంచి 'విరాళం'గా వసూలు చేస్తున్న కాంగ్రెస్

Hazarath Reddy

ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది. మరికొద్ది నెలల్లో జరగనున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థుల నుంచి ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ యూనిట్‌ బుధవారం దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించింది.

Advertisement

Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్ పనులు నేటితో పూర్తి, ఆసియా ఖండంలోనే అతిపెద్ద నీటిపారుదల సొరంగాలు నిర్మించి చరిత్ర సృష్టించిన జగన్ సర్కారు

Hazarath Reddy

ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్‌ కడప జిల్లాల్లోని ప్రాంతాలకు నీరు అందించే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం చేపట్టిన వెలిగొండ ప్రాజెక్టు (Veligonda Project) రెండవ సొరంగం పనులు పూర్తి చేశారు.ఈ మేరకు మంగళవారం సాయంత్రం రెండవ సొరంగం వద్ద ఏంఇఐఎల్‌ కంపెనీ కార్మికులు విజయం సాధించినట్లు బేనర్‌ తో ప్రదర్శన చేశారు.

Bengaluru Boy Missing Case: బెంగుళూరులో మిస్సైన బాలుడు నాంపల్లి మెట్రో దగ్గర తేలాడు, సోషల్‌మీడియా సాయంతో బాలుడిని పట్టుకున్న పోలీసులు

Hazarath Reddy

కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru)లో 12 ఏళ్ల బాలుడి మిస్సింగ్ (Boy Missing) కేసును పోలీసులు చేధించారు. మూడు రోజుల క్రితం కన్పించకుండా పోయిన అతడిని హైదరాబాద్‌ (Hyderabad)లో పోలీసులు గుర్తించారు. సోషల్‌మీడియా సాయంతో బాలుడి ఆచూకీ తెలియడంతో తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు.

Telangana: నకిలీ డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపిన తెలంగాణ డ్రగ్ అధికారులు, పలు చోట్ల కోట్ల రూపాయల విలువైన నకిలీ మందులు స్వాధీనం

Hazarath Reddy

తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) లైసెన్స్ లేని, నకిలీ డ్రగ్స్‌పై ప్రత్యేక డ్రైవ్‌లను ప్రారంభించింది. బొల్లారం వద్ద రూ. 4.35 కోట్ల విలువైన క్యాన్సర్ నిరోధక మందులను స్వాధీనం చేసుకుంది. అలాగే చౌటుప్పల్ వద్ద రూ. 66 లక్షల విలువైన 'టిజానిడిన్ హైడ్రోక్లోరైడ్'ను సీజ్ చేసింది.గుమ్మడిదల వద్ద రూ. 50 లక్షల విలువైన డయాసెరిన్ ను పట్టుకుంది.

Andhra Pradesh Elections 2024: నేటి నుంచే కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లకు దరఖాస్తుల స్వీకరణ, కాంగ్రెస్ మాజీలకే పెద్దపీట వేసే అవకాశం

Hazarath Reddy

ఏపీ రాజకీయాల్లోకి వైఎస్ షర్మిల రాకతో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అన్న మీద విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టిన ఏపీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రానున్న ఎన్నికలే లక్ష్యంగా దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సమరానికి కాంగ్రెస్ సమాయత్తమవుతోంది

Advertisement

Sharmila Meets Konathala Ramakrishna: కొణతాల రామకృష్ణతో భేటీ అయిన వైఎస్ షర్మిల, ఇప్పటికే జనసేనలో చేరుతున్నానని ప్రకటించిన మాజీ మంత్రి

Hazarath Reddy

ఏపీసీసీ అధినేత్రి వైఎస్‌ షర్మిల, మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ నేత కొణతాల రామకృష్ణతో విశాఖపట్నంలోని ఆయన నివాసంలో భేటీ అయింది. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి బలమైన అనుచరుడుగా కొణతాల రామకృష్ణ ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ మధ్యే ఆయన జేఎస్పీ అధినేత పవన్ కల్యాణ్‌ను కలిశారు

TTD: తిరుమ‌ల శ్రీ‌వారి భక్తులకు గుడ్ న్యూస్, ఒకే రోజు ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం, గ‌దుల కోటా టికెట్ల విడుద‌ల

VNS

తిరుమ‌ల‌, తిరుప‌తిలోని గదుల కోటాను మధ్యాహ్నం 3 గంట‌లకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు తెలిపింది. భక్తులు విషయాన్ని గ్రహించి.. ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌లో ముందస్తుగా దర్శన టికెట్లు, గ‌దుల‌ను బుక్‌ చేసుకోవాలని భక్తులకు సూచించింది.

Sharmila Slams CM Jagan Ruling: వీడియో ఇదిగో, బీజేపీ చేతిలో చేతిలో కీలుబొమ్మలా జగన్‌ ప్రభుత్వం, రాష్ట్రం గురించి ఆలోచించే పార్టీ కాంగ్రెస్‌ అని తెలిపిన షర్మిల

Hazarath Reddy

బీజేపీకు ఇక్కడి పార్టీలు తొత్తులుగా మారాయి. మోదీ సర్కారుకు కీలుబొమ్మలా జగన్‌ ప్రభుత్వం మారింది. రాష్ట్రాన్ని ఆ పార్టీ మోసం చేసింది. ఒక్క రోజు కూడా జగన్‌ ప్రత్యేక హోదా గురించి అడగలేదు. 25 మంది ఎంపీలను ఇస్తే ‘హోదా’ తెస్తా అనే మాటలు ఇప్పుడు ఎక్కడికి పోయాయి?

Telangana Politics: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంగళవారం కలిశారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పఠాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావులు ముఖ్యమంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

Advertisement

APPSC Group-1: జనవరి 28వ తేదీ అర్ధరాత్రి వరకు ఏపీపీఎస్సీ గ్రూప్‌ -1 పరీక్ష దరఖాస్తుల గడువు పొడిగింపు, మార్చి 17న ప్రిలిమినరీ పరీక్ష

Hazarath Reddy

ఏపీలో గ్రూప్‌- 1 ఉద్యోగాలకు దరఖాస్తుల గడువును ఏపీపీఎస్సీ పొడిగించింది. రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో మొత్తం 81 గ్రూప్‌- 1 పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువు ఈనెల 21తో ముగిసిన విషయం తెలిసిందే. అయితే, గ్రూప్‌-1 అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు దరఖాస్తుల గడువును పొడిగించాలని APPSC నిర్ణయించింది

Telangana: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి ? ఆయనతో పాటు మరో ఇద్దరి పేర్లు పరిశీలించిన స్క్రీనింగ్‌ కమిటీ, మహేందర్‌రెడ్డికే ఎక్కువ అవకాశాలు

Hazarath Reddy

TSPSC చైర్మన్‌గా రిటైర్డ్‌ డీజీపీ ఎం. మహేందర్ రెడ్డిని (Retired Telangana DGP M. Mahender Reddy) నియమించాలని రేవంత్ రెడ్డి సర్కారు నిర్ణయించినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం.ఈ పదవికి (TSPSC chairman post) మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డితో పాటు మరో ఇద్దరి పేర్లను స్క్రీనింగ్‌ కమిటీ పరిశీలించినట్లు తెలిసింది.

Telangana Free Electricity: 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, అది దాటితే బిల్లు కట్టాల్సిందే, ఫిబ్రవరి నెల నుంచి అమల్లోకి తీసుకువస్తామని తెలిపిన మంత్రి కోమటిరెడ్డి

Hazarath Reddy

తెలంగాణలో ఫిబ్రవరి నెల నుంచి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు హామీ (Telangana Free Electricity) అమలు చేస్తామని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Minister Komati Reddy) వెల్లడించారు.మంగళవారం గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది.

HYD DCP Son Dies of Heart Attack: గుండెపోటుతో హైదరాబాద్ డీసీపీ కొడుకు మృతి, కన్నీరు మున్నీరవుతున్న కుటుంబ సభ్యులు

Hazarath Reddy

మాదాపూర్, సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు కుమారుడు చంద్రతేజ్‌ (20) హార్ట్ ఎటాక్ తో మృతి చెందాడు. సోమవారం రాత్రి గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ప్రాణాలు విడిచాడు.

Advertisement

Telangana: వీడియో ఇదిగో, రైతుబంధు రాలేదని చెప్పిన రైతు మీద కేసు, బొమ్రాస్ పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

Hazarath Reddy

కొడంగల్ - కొత్తూరు గ్రామానికి చెందిన కోస్గి బాల్ రెడ్డి అనే రైతు మాట్లాడుతూ రైతుబంధు లేదు, రుణమాఫీ అమలు కాలేదని మాట్లాడగా ఆయన మీద చర్యలు తీసుకోవాలని బొమ్రాస్ పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పలువురు నాయకులు. వీరంతా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారని వార్తలు వస్తున్నాయి. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

CM Jagan Slams Chandrababu: జనం గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్‌ ఎజెండా, చంద్రబాబును జాకీ పెట్టి లేపేందుకు స్టార్ క్యాంపెయినర్లు తెగ కష్టపడుతున్నారని సెటైర్లు

Hazarath Reddy

ఏనాడూ మంచి చేయని చరిత్ర ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు కోసం పక్క రాష్ట్రం.. పక్క పార్టీల్లోనూ స్టార్‌ క్యాంపెయినర్‌లు ఉన్నారని.. మంచినే నమ్ముకున్న తనకు అలాంటి వాళ్ల అవసరం ఏమాత్రం లేదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (Andhra Pradesh CM Jagan Mohan Reddy) స్పష్టం చేశారు.

YSR Asara Funds Released: వివక్షకు, లంచాలకు ఏపీలో చోటు లేదు, ప్రతి పథకం రాష్ట్రంలో పక్కాగా అమలవుతోంది, వైఎ­స్సార్‌ ఆసరా నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం జగన్ స్పీచ్ హైలెట్స్ ఇవిగో..

Hazarath Reddy

నాలుగో విడత ‘వైఎ­స్సార్‌ ఆసరా’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం అనంతపురం జిల్లా ఉరవకొండలో లాంఛనంగా ప్రారంభించారు. బటన్‌ నొక్కి డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేశారు.అంతకు ముందు అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

Dog Attack in Hyderabad: బాలుడిపై వీధి కుక్క దాడి, వరంగల్ - ఎల్బీ నగర్ ఏరియాలో పిల్లలపై ఐదు సార్లు కుక్కల దాడి జరిగిందని స్థానికులు ఆందోళన

Hazarath Reddy

వరంగల్ - ఎల్బీ నగర్ ఏరియాలో బాలుడిపై వీధి కుక్క దాడి చేసింది. ఈ మధ్యకాలంలో పిల్లలపై ఐదు సార్లు కుక్కల దాడి జరిగిందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement
Advertisement