రాష్ట్రీయం
Ram Ke Naam: అయోధ్య‌లో రామ‌మందిర ప్రాణ ప్ర‌తిష్ట ముందు హైద‌రాబాద్ లో క‌ల్లోలం సృష్టించేందుకు య‌త్నం, వివాదాస్ప‌ద డాక్యుమెంట‌రీని ప్ర‌ద‌ర్శించిన ముగ్గురిపై కేసు
VNSరామ మందిరం ప్రారంభోత్స‌వం ముందు రెండు వ‌ర్గాల మ‌ధ్య చిచ్చు పెట్టేందుకు కొంద‌రు వ్య‌క్తులు ప్ర‌య‌త్నించారు. రామ్ కే నామ్ (Ram Ke Naam) అనే నిషేదిక డాక్యుమెంట‌రీని ప్ర‌ద‌ర్శించారు. దీంతో వారిపై కేసు న‌మోదు చేశారు నేరేడ్ మెట్ పోలీసులు. సైనిక్ పురిలోకి ఓ బార్ అండ్ రెస్టారెంట్ లో పోలీసుల (documentary) నుంచి ఎలాంటి ముంద‌స్తు అనుమ‌తి తీసుకోకుండా ఈ డాక్యుమెంట‌రీని ప్ర‌ద‌ర్శించారు.
KTR On Congress: క‌రెంట్ బిల్లుల‌ను సోనియా గాంధీకే పంపిద్దాం! ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చిన బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
VNSఅసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కన్నా కేవలం నాలుగు లక్షల ఓట్లు ఎక్కువ సాధించిందన్నారు. బీఆర్ఎస్ ఇంకో ఏడో ఎనిమిదో స్థానాలు అదనంగా గెలిచి ఉంటే రాష్ట్రంలో హాంగ్ అసెంబ్లీ ఉండేదన్నారు. తక్కువ ఓట్ల తేడాతో 14 సీట్లు కోల్పోయామన్నారు. పోయిన మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానాన్ని అతి తక్కువ ఓట్లతో కోల్పోయామన్నారు.
AP PCC Cheif YS Sharmila: సీఎం అయ్యాక జగన్‌ ఒక్కసారైనా ప్రత్యేక హోదాపై పోరాడారా..ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజం..
sajayaవైఎస్ షర్మిల మాట్లాడుతూ, తన తండ్రి వైఎస్ఆర్ గతంలో రెండుసార్లు పిసిసి అధ్యక్ష పదవిని నిర్వహించారని, తనపై నమ్మకం ఉంచి ఆ బాధ్యతను అప్పగించినందుకు కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు. గత పదేళ్లుగా అధికార యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సిపి), గత తెలుగుదేశం పార్టీ (టిడిపి) పాలన సాగించాయని షర్మిల విమర్శించారు.
YS Sharmila: షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి...
sajayaఅధికార వైసీపీకి రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. విజయవాడలో వైఎస్‌ షర్మిల సమక్షంలో పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. రెడ్డితో పాటు శెట్టి గంగాధర్, ఇతర వైఎస్సార్సీపీ సభ్యులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Konathala Ramakrishna: జనసేనలో చేరుతున్నా.. పవన్ తోనే నా రాజకీయ ప్రయాణం : కొణతాల రామకృష్ణ (Video)
sajayaమాజీ మంత్రి కొణతాల రామకృష్ణ హైదరాబాద్‌లో జనసేన పార్టీ అధినేత కె.పవన్ కళ్యాణ్‌ను కలిశారు, ఈ భేటీలో రాష్ట్ర రాజకీయాలు, ఉత్తరాంధ్రలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై జేఎస్పీ అధినేత పవన్ కల్యాణ్‌తో కొణతాల రామకృష్ణ చర్చలు జరిపారు.
Ayodhya Invitation for KCR: అయోధ్య రామాలయ వేడుకకు కేసీఆర్ ను ఆహ్వానించిన శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్.. ఇప్పటికే చంద్రబాబు, పవన్ లకు ఆహ్వానం
Rudraఈ నెల 22న అయోధ్య రామ మందిరంలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగబోతోంది. ఈ కార్యక్రమానికి ఇప్పటికే ఎంతో మంది ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి.
Devarakonda with Prabhas: ప్రభాస్ సినిమాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ?!
Rudraపాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. కల్కి 2829 AD చిత్రంతో మొదటిసారి సైన్స్ ఫిక్షన్ జోనర్ చేస్తున్నాడు. ప్రభాస్ కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్ తో కల్కి తెరకెక్కుతుంది. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు.
Hepatitis-A Vaccine: దేశీయంగా తొలి హెపటైటిస్‌ ఏ టీకా ఆవిష్కరణ.. అభివృద్ధి చేసిన ఐఐఎల్‌-హైదరాబాద్
Rudraదేశీయంగా అభివృద్ధి చేసిన తొలి హెపటైటిస్‌ ఏ టీకా హవిష్యూర్‌ ను హైదరాబాద్‌కు చెందిన ఇండియన్‌ ఇమ్యూనోలాజికల్స్‌ లిమిటెడ్‌(ఐఐఎల్‌) ఆవిష్కరించింది. ‘క్లినికల్‌ పరీక్షల్లో ఈ టీకా సురక్షితం, సమర్థవంతమైనదిగా నిరూపితమైంది’ అని ఐఐఎల్‌ ఎండీ ఆనంద్‌ కుమార్‌ తెలిపారు.
Ramoji Film City Tragedy: రామోజీ ఫిల్మ్ సిటీపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఘోర ప్రమాదంలో విస్టెక్స్ కంపెనీ సీఈవో సంజయ్‌ షా మృతి, చైర్మన్‌ విశ్వనాథరాజుకు తీవ్ర గాయాలు
Hazarath Reddyరామోజీ ఫిల్మ్ సిటీలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి గాయాలు అయ్యాయి. దీంతో అబ్దుల్లాపూర్‌ మెట్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో రామోజీ ఫిల్మ్‌ సిటీ మేనేజ్‌మెంట్‌ను నిందితులుగా చేర్చారు.
CM Jagan Slams TDP: దళితులకు చంద్రబాబు సెంటు భూమి కూడా ఇచ్చింది లేదు, సామాజిక సమతా సంకల్ప సభలో ప్రతిపక్షాలపై మండిపడిన సీఎం జగన్
Hazarath Reddyపెత్తందారుల పత్రికలు చరిత్రను కూడా వక్రీకరిస్తున్నాయని.. ఎల్లో మీడియాను చూస్తే పాత్రికేయం ఏ స్థాయికి దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (Andhra Pradesh CM YS Jagan Mohan Reddy) మండిపడ్డారు.
Ayodhya Ram Mandir: రామ‌మందిర ప్రాణ‌ప్ర‌తిష్ట‌కు రారండి! బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు ఆహ్వానం పంపిన రామ‌తీర్ధ‌క్షేత్ర ట్ర‌స్టు, ఆహ్వానంపై కేసీఆర్ ఏమ‌న్నారంటే?
VNSఈనెల 22వ తేదీన అయోధ్యలో జరిగే రామమందిరం ప్రారంభోత్సవానికి (Ayodhya Ram Mandir Event) రావాల్సిందిగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు (BRS Chief KCR) శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ (Shri Ram Janmabhoomi Teerth Kshetra) తరఫున ఆహ్వానం పంపించారు.
Statue of Social Justice Unveiled: ప్రపంచంలో అత్యంత ఎత్తయిన అంబేద్కర్ విగ్రహం వీడియో ఇదిగో, స్వరాజ్య మైదాన్‌లోఆవిష్కరించిన సీఎం జగన్
Hazarath Reddyవిజయవాడ స్వరాజ్య మైదాన్‌లో ఏర్పాటు చేసిన 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఏపీ సీఎం జగన్ ఈ సాయంత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోరాటానికి రూపమే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని కీర్తించారు. సామాజిక న్యాయ మహాశిల్పం పేరిట అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.
Statue Of Social Justice: ప్ర‌పంచంలోనే అత్యంత ఎత్త‌యిన అంబేద్క‌ర్ విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ‌, సామాజిక న్యాయ మహా శిల్పమంటూ అభివ‌ర్ణించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్, విగ్ర‌హ ప్ర‌త్యేక‌త‌లివే!
VNSప్ర‌పంచంలోనే అత్యంత ఎత్త‌యిన డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ (Statue Of Social Justice) విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు ఏపీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. విజ‌య‌వాడ‌లో ఏర్పాటు చేసిన ఈ విగ్ర‌హాన్ని స్టాట్యూ ఆఫ్ సోష‌ల్ జ‌స్టిస్ గా (Statue Of Social Justice) అభివర్ణించింది రాష్ట్ర ప్ర‌భుత్వం.
TSRTC Bus Collides with Oil Tanker: హన్మకొండలో ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ఆయిల్‌ ట్యాంకర్‌, 12 మందికి గాయాలు, బస్సులో 70 మంది ప్రయాణికులు
Hazarath Reddyములుగు జిల్లా పస్రా నుంచి హనుమకొండ వైపు వస్తున్న ఆర్టీసీ బస్సును వరంగల్‌ నుంచి మణుగూరు వెళ్తోన్న ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీకొట్టింది. నీరుకుళ్ల శివారులోని జరిపోతుల వాగు మూలమలుపు వద్ద ఇవి ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు వాహనాల డ్రైవర్లు తీవ్రంగా గాయపడ్డారు.
Telangana: వీడియో ఇదిగో, గంజాయి మత్తులో దొంగతనానికి పాల్పడ్డ దొంగను చితకబాదిన స్థానికులు
Hazarath Reddyఎల్బీనగర్‌లొ గంజాయి మత్తులో దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తికి స్థానికులు దేహశుద్ధి చేశారు. హోల్ సేల్ మార్కెట్‌ గల్లీలో రెండు రోజుల క్రితం కూల్ డ్రింక్ షాప్‌లొ చొరబడి కౌంటర్ నుంచి పదివేల నగదును ఎత్తుకెళ్లాడు. మరోసారి అదే ప్రాంతానికి వచ్చి దొంగతనానికి పాల్పడుతుండగా గుర్తించిన స్థానికులు పట్టుకొని, చితకబాది పోలీసులకు అప్పగించారు.
Skill Development Scam Case: చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌, సుప్రీంకోర్టులో కేసు విచారణ ఫిబ్రవరి 12కు వాయిదా, 4 వారాల గడువు కోరిన చంద్రబాబు తరపు లాయర్
Hazarath Reddyస్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో TDP అధినేత చంద్రబాబు (Chandrababu) బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో (Supreme Court) శుక్రవారం విచారణ జరిగింది. కౌంటర్‌ దాఖలు చేసేందుకు 4 వారాల గడువు కావాలని చంద్రబాబు తరఫు న్యాయవాది హరీశ్‌ సాల్వే కోరారు.
Malla Reddy Enjoyed Ride in Dubai: వీడియో ఇదిగో, దుబాయ్‌లో ఎంజాయ్ చేస్తున్న మల్లారెడ్డి, రాజకీయాలకు కాస్త విరామం ప్రకటించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Hazarath Reddyరాజకీయాల నుంచి కాస్త విరామం తీసుకున్న తెలంగాణ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మల్లా రెడ్డి దుబాయ్‌లో రైడ్‌ను ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Telangana: వీడియో ఇదిగో, 35 మందితో ప్రయాణిస్తున్న బస్సు రన్నింగ్‌లో ఉండగా ఊడిన టైరు, ఒక్కసారిగా అంటుకున్న మంటలు, డ్రైవర్ అప్రమత్తతో తప్పిన పెను ప్రమాదం
Hazarath Reddyమహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల వద్ద నేషనల్ హైవేపై బెంగళూరు నుండి హైదరాబాద్‌కు 35 మందితో వస్తున్న ప్రైవేట్ వోల్వో బస్సు రన్నింగ్‌లో టైర్ ఊడి మంటలు అంటుకున్నాయి.. డ్రైవర్ వెంటనే అప్రమత్తమై మంటలు ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది.
Telangana Shocker: అంబర్ పేటలో దారుణం, ప్రేమించడం లేదని అమ్మాయిని కత్తితో పొడిచిన బాలుడు, అనంతరం రైలు కింద పడి ఆత్మహత్య
Hazarath Reddyహైదరాబాద్ అంబర్‌పేటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమించడం లేదని మైనర్ అమ్మాయి‌పై ఓ బాలుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆ బాలుడు కూడా ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. ఈ ఘటనలో అడ్డు వచ్చిన ఆమె సోదరిపై కూడా ఆ బాలుడు దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు
Muslim Women Perform Shiva-Puja: వీడియో ఇదిగో, శివుడికి పూజలు చేసిన ముస్లిం మహిళలు, తెలంగాణలో వెల్లివిరిసిన మతసామరస్యం
Hazarath Reddyతెలంగాణలో మతసామరస్యం వెల్లవిరిసిన వీడియో సోషల్ మీడియలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ముస్లిం మహిళలు శివుడికి పూజలు చేస్తూ కనిపించారు. నాగర్‌కర్నూల్ - అచ్చంపేట మండలం రంగాపూర్ గ్రామంలోని నిరంజన్ షావలి దర్గాను దర్శించుకున్న ముస్లిం మహిళలు.. అనంతరం ఉమామహేశ్వర కొండకు వెళ్లి శివుడికి ప్రత్యేక పూజలు చేశారు.