రాష్ట్రీయం

Hyderabad Murder Case: హైదరాబాద్‌లో తొలిసారి, భార్యను పొడిచి చంపిన భర్తకు ఉరిశిక్ష విధించిన కోర్టు, కత్తెరతో గొంతులో, స్క్రూ డ్రైవర్‌తో ప్రైవేట్ భాగాల్లో దారుణంగా..

Hazarath Reddy

భార్యను అత్యంత కిరాతకంగా హత్యచేసిన భర్తకు (Hyderabad man stabs wife in throat with scissors) నాంపల్లి క్రిమినల్‌ కోర్టు మరణశిక్షను విధించింది. 2018కి సంబంధించిన ఓ కేసులో నిందితుడు ఇమ్రాన్ ఉల్ హక్‌ను దోషిగా తేల్చిన కోర్టు ఉరిశిక్ష (gets death sentence for murder) విధిస్తూ తీర్పును వెల్లడించింది.

Women Fight For Seat Video: వీడియో ఇదిగో, బస్సులో సీటు కోసం చెప్పులతో కొట్టుకున్న మహిళలు, దుబ్బాకకి బస్సు వస్తుండగా ఘటన

Hazarath Reddy

సిద్దిపేట - సికింద్రాబాద్ నుంచి దుబ్బాకకి బస్సు వస్తుండగా సీటు కోసం మహిళల మధ్య గొడవ. ఒకరిపై ఒకరు చెప్పులతో దాడి చేసుకున్న మహిళలు.సీటు తనదంటే తనదంటూ ఇద్దరు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఇద్దరూ చెప్పులు ఝులిపించుకున్నారు. ఒకరిపై ఒకరు చెప్పులతో దాడులు చేసుకున్నారు.

Mega Plastic Surgery Camp: పేదలకు గొప్ప శుభవార్త. హైదరాబాద్ లో ఉచితంగా మెగా ప్లాస్టిక్‌ సర్జరీ క్యాంప్‌.. ఈ నెల 22 నుంచి ఫిబ్రవరి 5 వరకు.. పూర్తి వివరాలు ఇవే!

Rudra

హైదరాబాద్ లోని పేదలకు శుభవార్త. మెర్సీ మిషన్‌, లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ గ్రీన్‌ ల్యాండ్స్‌, రాంకీ ఫౌండేషన్‌, పరవస్తు క్రియేటివ్‌ ఫౌండేషన్‌ సంయుక్తాధ్వర్యంలో ఈ నెల 22 నుంచి ఫిబ్రవరి 5 వరకు ఉచిత మెగా ప్లాస్టిక్‌ సర్జరీ క్యాంప్‌ నిర్వహిస్తున్నారు.

Ram Lalla Statue in Ayodhya Ram Temple: అయోధ్య గర్భగుడిలో కొలువైన బాల రామయ్య రామ్ లల్లా.. విగ్రహం తొలి ఫొటో ఇదే..

Rudra

జాతి జనులు వెయ్యి కండ్లతో ఎదురుచూస్తున్న అయోధ్యలో ఈ నెల 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠ క్రతువుల్లో భాగంగా గురువారం కీలక ఘట్టం చోటుచేసుకుంది. అయోధ్య రామాలయ గర్భగుడిలోకి రామ్‌ లల్లా విగ్రహాన్ని చేర్చారు.

Advertisement

YS Raja Reddy Engagement: వీడియో ఇదిగో, సోదరి షర్మిలను ఆప్యాయంగా గుండెలకు హత్తుకున్న సీఎం జగన్, మేనల్లుడు రాజారెడ్డి నిశ్చితార్థానికి హాజరైన సీఎం జగన్‌ దంపతులు

Hazarath Reddy

తన సోదరి షర్మిల కుమారుడి వివాహ నిశ్చి­తార్థ వేడుకకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి దంపతులు హాజరయ్యారు. గురువారం సాయంత్రం హైదరాబాద్‌లోని గండిపేటలో జరిగిన రాజారెడ్డి, ప్రియ నిశ్చి­తార్థ వే­డుకలో పాల్గొని కాబోయే వధూవరులను ఆశీర్వదించారు.

YSRCP 4th List: వైసీపీ నాలుగో జాబితా విడుదల, మొత్తం 9 మంది అభ్యర్థులతో 4వ జాబితా విడుదల చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ

Hazarath Reddy

సుదీర్ఘ కసరత్తు తర్వాత వైసీపీ తొమ్మిది పేర్లతో కూడిన నాలుగో జాబితాను గురువారం రాత్రి మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాకు వెల్లడించారు. రీజినల్‌ కోఆర్డినేటర్లు, ముఖ్యనేతలతో చర్చించిన అనంతరం ఈమేరకు సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారు.

Akasa Air: 150 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల కొనుగోలుకు ఆకాశ ఎయిర్‌లైన్స్‌ ఆర్డర్, విమానయాన రంగంలో సంచలనానికి తెరలేపిన ఎయిర్ లైన్స్

Hazarath Reddy

ప్రముఖ విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్‌లైన్స్‌ 150 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలను కొనుగోలు చేయడానికి ఆర్డర్ ఇచ్చింది. హైదరాబాద్‌లో జరిగిన వింగ్స్ ఇండియా ఈవెంట్‌లో దీనికి సంబంధించిన ఒప్పందం కుదుర్చుకున్నట్లు సీఈఓ వినయ్ దూబే వెల్లడించారు.

206 Feet BR Ambedkar Statue Video: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ రేపు, 206 అడుగుల మహాశిల్ప ఆవిష్కరణకు ప్రజలంతా తరలిరావాలని సీఎం జగన్ పిలుపు

Hazarath Reddy

భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని, 206 అడుగుల మహాశిల్పాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నెలకొల్పింది. విజయవాడలో మా ప్రభుత్వం ఏర్పాటు చేసిన 206 అడుగుల అంబేద్కర్ మహాశిల్పం రాష్ట్రానికే కాకుండా దేశానికే ప్రతీక అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎక్స్‌లో రాశారు.

Advertisement

Ram Temple Pran Pratishtha Ceremony: ఎన్నికల్లో లబ్ధి కోసమే ఈ అయోధ్య రామ మందిర ఘట్టం, అసంపూర్తిగా ఉన్న ఆలయంలో ప్రాణ ప్రతిష్ఠ ఎలా చేస్తారని తెలిపిన తెలంగాణ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

Hazarath Reddy

అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమంపై తెలంగాణ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. అసంపూర్తిగా ఉన్న ఆలయంలో ప్రాణ ప్రతిష్ఠ చేయడం సరికాదని మన శంకరాచార్యులు నలుగురూ అన్నారు.. ఈ ఘటనను రాజకీయ ఘట్టంగా అందరూ భావిస్తున్నారు.

Kalbairav Hanuman Mandir: పాతబస్తీ కాలభైరవ హనుమాన్ మందిర్‌లో లోకశాంతి కోసం మహా యజ్ఞం, అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించిన భక్తులు

Hazarath Reddy

హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీ హుస్సేనీ ఆలం ప్రాంతంలోని కాలభైరవ హనుమాన్ మందిర్‌లో రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ముందు రామభక్తులు లోకశాంతి కోసం మహా యజ్ఞం నిర్వహించారు. ఈ ప్రాంతంలో శాంతి, సామరస్యాలను పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Andhra Pradesh: 4.07 లక్షల మంది మహిళల ఖాతాల్లోకి రూ.46.9 కోట్లు, ఇళ్ల లబ్దిదారులకు వడ్డీ రీయింబర్స్‌మెంట్ విడుదల చేసిన సీఎం జగన్

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి 4.07 లక్షల మంది మహిళల ఖాతాల్లో రూ.46.9 కోట్లు బటన్ నొక్కి జమ చేశారు.

Free Travel for Women: పురుషులు డబ్బులు పెట్టి టికెట్లు కొన్నా సీట్లు దొరకడం లేదు, ఆర్టీసీలో ఉచిత పథకంపై అధికారం రాష్ట్రానికి లేదని హైకోర్టులో పిటిషన్

Hazarath Reddy

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ (Public interest litigation) దాఖలైంది.

Advertisement

Srivari Seva Tickets: తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల షెడ్యూల్ విడుద‌ల‌, ఏప్రిల్ నెలలో సుప్ర‌భాతం, తోమాల వంటి సేవ‌ల‌కోసం ల‌క్కీడిప్ రిజిస్ట్రేష‌న్లు మొదలు

VNS

సుప్రభాతం (Suprabhatham), తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవల ఆన్‌లైన్‌ లక్కీడిప్‌ (Luckey DIP) కోసం ఈ నెల 18న ఉదయం 10 గంటల నుంచి 20న ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. లక్కీడిప్‌లో టికెట్లు పొందిన భక్తులు 22న మధ్యాహ్నం 12 గంటలలోపు నిర్ణీత రుసుం చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.

Rajareddy Engagement: మేన‌ల్లుడి నిశ్చితార్ధానికి హాజ‌రుకానున్న వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, చాలా రోజుల త‌ర్వాత ఒక్క‌టి కానున్న వైయ‌స్సార్ ఫ్యామిలీ

VNS

మేనల్లుడు వైఎస్ రాజారెడ్డి ఎంగేజ్ మెంట్ (Ys Sharmila Son Rajareddy) వేడుకలో పాల్గొనేందుకు ఏపీ సీఎం జగన్ (YS Jagan) ఇవాళ‌ హైదరాబాద్ కు రానున్నారు. సీఎం జగన్ సాయంత్రం 4 గంటలకు తాడేపల్లి నుంచి హైదరాబాద్ బయలుదేరతారు. హైదరాబాద్ లోని గండిపేటలో ఉన్న గోల్కొండ రిసార్ట్స్ లో వైఎస్ రాజారెడ్డి, అట్లూరి ప్రియల నిశ్చితార్థ వేడుకకు జగన్ హాజరుకానున్నారు.

Tribute to NTR: ఎన్టీఆర్ ఘాట్ వ‌ద్ద నంద‌మూరి కుటుంబ స‌భ్యుల నివాళులు, తాత‌కు ఘ‌నంగా నివాళులు అర్పించిన జూనియ‌ర్ ఎన్టీఆర్

VNS

హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన మనవళ్లు, సినీనటులు జూనియర్ ఎన్టీఆర్(Jr NTR), కల్యాణ్ రామ్ (Kalyan Ram) నివాళులర్పించారు. తెల్లవారు జామున ఘాట్ వద్దకు చేరుకొని అంజలి ఘటించారు. మరోవైపు.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించేందుకు భారీ సంఖ్యలో టీడీపీ శ్రేణులు, ఎన్టీఆర్ అభిమానులు చేరుకోవడంతో సందడి వాతావరణం నెలకొంది.

Sankranti Holidays Extended: సంక్రాంతి సెలవులు మరో 3 రోజులు పొడిగించిన ఏపీ సర్కారు, జనవరి 22న పాఠశాలలు పునఃప్రారంభం

Hazarath Reddy

ఏపీలో సంక్రాంతి సెలవులను మరో మూడు రోజులు పొడిగించారు. ముందుగా గురువారం వరకు (జనవరి 18) సంకాంత్రి సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కోరిక మేరకు మరో మూడు రోజులు సెలవులు పొడిగిస్తున్నట్లు నిర్ణయించినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌ సురేష్‌ కుమార్‌ తెలిపారు.

Advertisement

KCR Walking Video: వీడియో ఇదిగో, ఊత కర్ర సాయంతో నడుస్తున్న కేసీఆర్, తుంటి ఎముక సర్జరీ అనంతరం కోలుకుంటున్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తన ఫాం హౌస్ లో కాలు జారి పడిపోయిన సంగతి విదితమే. అనంతరం ఆయనకు యశోదా ఆస్పత్రిలో కాలికి సర్జరీ చేశారు. తాజాగా ఆయన తుంటి ఎముక సర్జరీ అనంతరం కోలుకుంటూ ఊత కర్ర సాయంతో నడుస్తున్న వీడియో బయటకు వచ్చింది.

206 Feet Ambedkar Statue: 206 అడుగుల అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ, ప్రజలందరూ స్వచ్చందంగా తరలి రావాలని వీడియో ద్వారా కోరిన సీఎం వైఎస్ జగన్

Hazarath Reddy

విజయవాడలో ఈనెల 19వ తేదీన 206 అడుగుల అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఈ మహత్తర కార్యక్రమానికి ప్రజలందరూ స్వచ్చందంగా తరలి రావాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కోరారు.

Tammineni Veerabhadram Health Bulletin: తమ్మినేని వీరభద్రం హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏఐజీ ఆసుపత్రి వైద్యులు, వచ్చే 24 నుంచి 48 గంటలు చాలా కీలకమని రిపోర్డులో వెల్లడి

Hazarath Reddy

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెల్త్ బులెటిన్‌ను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రి బుధవారం విడుదల (Tammineni Veerabhadram health bulletin) చేసింది. ప్రస్తుతం తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం నిలకడగా (condition stable) ఉందని.. నిన్నటితో పోలిస్తే బీపీ లెవెల్స్ నార్మల్‌కి చేరుకుంటున్నాయని ఏఐజీ ఆసుపత్రి ప్రకటించింది.

Sudden Death in Telangana: వీడియో ఇదిగో, కల్లు గీస్తుండగా కార్మికుడికి గుండెపోటు, తాటి చెట్టుపైనే ప్రాణాలు వదిలిన గీత కార్మికుడు

Hazarath Reddy

తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ ప‌రిధిలోని రాజ‌న్న‌గూడెంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. తాటి చెట్టు పైనే గుండెపోటుతో కల్లు గీత కార్మికుడు మృతి చెందాడు.

Advertisement
Advertisement