రాష్ట్రీయం

Telangana Shocker: తీసుకున్న రూ. 4 లక్షల అప్పు తిరిగి ఇవ్వని అత్త, రివాల్వర్‌తో కాల్చి చంపిన కానిస్టేబులైన అల్లుడు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

అత్తకు 4 లక్షల రూపాయల అప్పు ఇచ్చిన కానిస్టేబుల్ ప్రసాద్ తిరిగి ఇవ్వమని అడగడంతో ఇవ్వలేదని అత్తను రివాల్వర్‌తో కాల్చి చంపాడు.రామగుండం పోలీస్ కమిషనరేటు పరిధిలోని కొత్తకోట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు ప్రసాద్.

Telangana Shocker: పుస్తకాలకు తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వలేదని బాలుడు ఆత్మ‌హ‌త్య, త‌న ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని సూసైడ్

Hazarath Reddy

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా చంద్రుగొండ మండ‌లం బెండ‌ల‌పాడులో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పుస్త‌కాల‌కు డబ్బులు ఇవ్వ‌లేద‌ని ఓ బాలుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. బెండ‌ల‌పాడు గ్రామానికి చెందిన సుధీర్ బాబు(11) పుస్త‌కాల కోసం త‌న త‌ల్లిదండ్రుల‌ను డ‌బ్బులు అడిగాడు.

YSR Jagananna Colonies: జగనన్న కాలనీల్లో కడుతున్నవి ఇళ్లు కాదు ఊళ్లు, రాష్ట్రంలో 22 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపిన సీఎం జగన్

Hazarath Reddy

రెండేళ్లలోనే పేదల సొంతింటి కలను నెరవేర్చినట్లు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. 31 లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాలను కేటాయించామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 వేల జగనన్న కాలనీలు ఏర్పాటు అవుతున్నాయని తెలిపారు.

Skill Development Scam Case: చంద్రబాబుకు హైకోర్టులో చుక్కెదురు, బెయిల్‌ పిటిషన్‌పై విచారణ ఈ నెల 17కు వాయిదా వేసిన ధర్మాసనం

Hazarath Reddy

స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో రిమాండ్ ఖైదీగా రాజమండ్రి జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. చంద్రబాబు పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని సీఐడీని హైకోర్టు ఆదేశిస్తూ.. విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది

Advertisement

Telangana Assembly Election 2023: ఎన్నికల వేళ ఈసీ కీలక నిర్ణయం, తెలంగాణలో 20 మంది అధికారులపై వేటు, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకు ఎలాంటి బాధ్యతలు అప్పగించొద్దని ఆదేశాలు

Hazarath Reddy

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం బదిలీలకు తెరలేపింది. రాష్ట్రవ్యాప్తంగా ముగ్గురు పోలీస్ కమిషనర్లు, నాలుగు జిల్లాల కలెక్టర్లు, 10 జిల్లాల ఎస్పీలకు స్థాన చలనం కలిగించింది. రవాణా శాఖ కార్యదర్శి, ఎక్సైజ్ డైరెక్టర్, వాణిజ్య పన్నుల కమిషనర్‌నూ ఈసీ పక్కన పెట్టేసింది.

Nara Lokesh Meets Amit Shah: ఫలించిన పురందేశ్వరి రాయబారం, కేంద్రహోంమంత్రి అమిత్ షాతో నారాలోకేష్ భేటీ, సీఎం జగన్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ ఫిర్యాదు

VNS

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Lokesh Meets Amit Shah) కేంద్రహోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. చంద్రబాబు అరెస్ట్ (CBN Arrest) వ్యవహారాన్ని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. ఏపీ సీఎం జగన్ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని అమిత్ షాకు ఫిర్యాదు చేశారు నారా లోకేశ్. చంద్రబాబు అరెస్ట్, విచారణ పేరుతో తనను కూడా వేధిస్తున్నారని చెప్పారు లోకేశ్.

Andhra Pradesh: పెళ్లి కావట్లేదని స్టేట్ బ్యాంకు ఎదురుగా నిలబడి ఓ యువకుడు ఏం చేశాడో మీరే చూడండి

Hazarath Reddy

చీరాలలో పెళ్లి కాలేదని ఆర్య వైశ్య కులంకి చెందిన ఓ యువకుడు స్టేట్ బ్యాంకు ఎదురుగ తనని తాను ఈ విధంగా పెళ్లి కాలేదని ఎవరైనా చేసుకోవచ్చు అని అక్కడ నిలబడ్డాడు.

Amaravati IRR alignment Case: రెండో రోజు ముగిసిన నారా లోకేష్ సీఐడీ విచారణ, ఢిల్లీకి బయలుదేరిన టీడీపీ జాతీయ కార్యదర్శి, ఈ రోజు విచారణపై ఏమన్నారంటే..

Hazarath Reddy

న్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించి రెండో రోజు నారా లోకేశ్ సీఐడీ విచారణ ముగిసింది. నిన్న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించారని వెల్లడించారు. ఒక్క రోజు విచారణకు హాజరవ్వాలని హైకోర్టు చెప్పినా, సీఐడీ అధికారులు తనను రెండో రోజు కూడా విచారణకు పిలిచారని తెలిపారు.

Advertisement

Amaravati Inner Ring Road Case: చంద్రబాబుకు కాస్త ఊరట, సోమవారం వరకు చంద్రబాబును అరెస్ట్‌ చేయొద్దని కోర్టు ఆదేశాలు, రైట్ టు ఆడియెన్స్ పిటిషన్ ను డిస్మిస్ చేసిన ఏసీబీ కోర్టు

Hazarath Reddy

అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, అంగళ్లు కేసుల్లో టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టులో కాస్త ఊరట లభించింది. అంగళ్లు కేసులో 12వ తేదీ (గురువారం) వరకు చంద్రబాబును అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులోనూ 16వ తేదీ (సోమవారం) వరకు అరెస్టు చేయొద్దని ఆదేశాలు ఇచ్చింది.

Andhra Pradesh High Court: ఏపీ హైకోర్టు జడ్జిలుగా నలుగురు న్యాయవాదులను సిఫార్సు చేసిన కొలీజియం, వారెవరంటే..

Hazarath Reddy

Singareni Elections: సింగరేణి ఎన్నికలను వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు, డిసెంబరు 27న నిర్వహించాలని, నవంబర్‌ 30 లోపు ఓటర్‌ లిస్ట్‌ చేయాలని ఆదేశాలు

Hazarath Reddy

సింగరేణి ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈనెల 28న జరగాల్సిన సింగరేణి ఎన్నికలను వాయిదా వేయాలన్న సింగరేణి యాజమాన్యం అభ్యర్థనను అంగీకరించిన కోర్టు.. ఈ మేరకు ఎన్నికలను వాయిదా వేసింది

Telangana Assembly Elections 2023: వీడియో ఇదిగో, కియా కారులో 3.35 కోట్ల రూపాయలను పట్టుకున్న పోలీసులు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఘటన

Hazarath Reddy

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపించే కొద్ది డబ్బు భారీగా పట్టుబడుతోంది. ఎన్నికల్లో తాయిలాల కోసం డబ్బును పంచేందుకు రాజకీయ నాయకులు అక్రమంగా తరలిస్తున్నారు. తాజాగా ఎన్నికల తనిఖీల్లో భాగంగా పంజాగుట్టలో కియా కారులో 3.35 కోట్ల రూపాయలు తరలిస్తున్న వారిని పోలీసులు పట్టుకున్నారు.అయితే అది ఎవరిదనేది తెలియాల్సి ఉంది.

Advertisement

Students Fight Video: వీడియోలు ఇవిగో, అమలాపురంఎస్‌కేబీఆర్‌ కాలేజీలో తన్నుకున్న బీఏ, బీకామ్‌ విద్యార్థులు

Hazarath Reddy

BR అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కళాశాల విద్యార్థుల రెండు గ్రూపులు రోడ్డుపై దారుణంగా ఘర్షణకు దిగారు. అమలాపురంలో చిన్నపాటి వివాదంపై ఎస్‌కేబీఆర్‌ కళాశాల బీఏ, బీకామ్‌ విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. వీడియో ఇదిగో..

Hyderabad Shocker: ఓ వ్యక్తిపై విచక్షణారహితంగా దాడి చేసిన వీడియో వైరల్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పిఎ భాస్కర్ అరెస్ట్

Hazarath Reddy

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పిఎ భాస్కర్ ను జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయనకు పీఏగా విధులు నిర్వహిస్తున్న భాస్కర్,ఓ వ్యక్తిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్‌ గా మారింది.

APPSC: వయసు మీరిన నిరుద్యోగులకు జగన్ సర్కారు గుడ్ న్యూస్, ఏపీపీఎస్సీ నాన్‌ యూనిఫాం పోస్టులు, యూనిఫాం పోస్టులకు వయో పరిమితి పెంపు

Hazarath Reddy

వయసు మీరిన నిరుద్యో­గులకు మేలు చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్, ఇతర రిక్రూట్‌మెంట్‌ ఏజె­న్సీలు నేరుగా భర్తీ చేసే నాన్‌ యూనిఫాం పోస్టులు, యూనిఫాం పోస్టులకు అభ్యర్థుల వయో పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం పెంచింది.

KCR Election Campaign Schedule: ఈ నెల 15 నుంచి ఎన్నికల సంగ్రామంలోకి సీఎం కేసీఆర్, 17 రోజుల్లో 42 సభలతో కేసీఆర్ ఎన్నికల షెడ్యూల్ విడుదల, నవంబర్ 9న రెండు చోట్ల నామినేషన్ వేయనున్న కేసీఆర్

VNS

ముచ్చటగా మూడోసారి విజయం సాధించాలని అధికార బీఆర్ఎస్ (BRS) లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు అనుగుణంగా వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ (CM KCR) స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేయనున్నారు. సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్ (KCR Election Campaign Schedule) ఖరారైంది.

Advertisement

Group 2 Exams: గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు TSPSC ప్రకటన, ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో TSPSC వాయిదా

ahana

గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు TSPSC ప్రకటించింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో TSPSC వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. గ్రూప్-2 జనవరి 6, 7 తేదీల్లో నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయం.

Amaravati Inner Ring Road Case: రేపు కూడా సీఐడీ విచారణకు నారా లోకేష్, నేడు విచారణ అనంతరం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన చంద్రబాబు కుమారుడు

Hazarath Reddy

అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్‌ కేసులో చంద్రబాబు కుమారుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ విచారణ ముగిసింది. మంగళవారం ఆరు గంటలపాటు విచారించిన ఏపీ సీఐడీ.. విచారణలో సహకరించకపోవడంతో మళ్లీ నోటీసులు జారీ చేసింది.

YSRCP Bus Yatra: వై ఏపీ నీడ్స్‌ జగన్‌, క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజలకు చెప్పాలని పార్టీ శ్రేణులకు సీఎం జగన్ పిలుపు, ఈ నెల 26వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు

Hazarath Reddy

వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మంగళవారం వైఎస్సార్‌సీపీ రీజినల్‌ కో-ఆర్డినేటర్లతో సీఎం జగన్ భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాలకు జరిగిన మంచిని.. క్షేత్రస్థాయికి వెళ్లి మరీ తెలియజెప్పాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.

Jagananna Arogya Suraksha: జగనన్న ఆరోగ్య సురక్షపై ప్రశంసల వర్షం కురిపించిన లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ, వీడియో ఇదిగో..

Hazarath Reddy

జగనన్న ఆరోగ్య సురక్షపై మాజీ ఐఏఎస్, లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ ప్రశంసల వర్షం కురిపించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ వెళ్లి ఉచిత వైద్య పరీక్షలు చేయడం,హెల్త్ రికార్డులు నమోదు చేయడం ఆదర్శనీయమని కితాబిచ్చారు.

Advertisement
Advertisement