రాష్ట్రీయం

Renuka Chowdary: వీడియో ఇదిగో, జగన్ ఒక మూర్ఖుడు మానసిక రోగి, చంద్రబాబును అరెస్ట్ చేయడంపై ఏపీ ముఖ్యమంత్రి మీద ఫైర్ అయిన రేణుకా చౌదరి

Hazarath Reddy

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయడం పట్ల తెలంగాణ కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి ఘాటుగా స్పందించారు. ఏపీ సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్ ఒక మూర్ఖుడిగా, మానసిక రోగిగా అభివర్ణించారు. అసలు జగన్ మోహన్ రెడ్డి 'స్కిల్ డెవలప్ మెంట్' కు ఎవరూ సరితూగరని ఎద్దేవా చేశారు.

RGV on Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్ లైట్ తీసుకున్న జూనియర్, ఇక టీడీపీ భవిష్యత్తు దబిడి దబిడే అంటూ ట్వీట్ చేసిన దర్శకుడు వర్మ

Hazarath Reddy

దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ చేసిన ట్వీట్‌ ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 'చంద్రబాబు అరెస్ట్‌ను ఎన్టీఆర్‌ పట్టించుకోవడం లేదు, కనీసం ఖండించడం లేదు కూడా! ఇక టీడీపీ భవిష్యత్తు దబిడి దబిడే' అని ట్విటర్‌లో రాసుకొచ్చాడు.

Chandrababu Arrest: వీడియో ఇదిగో, చంద్రబాబు అరెస్టుకు నిరసనగా హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు ధర్నా, వెంటనే ఆయన్ని విడుదల చేయాలని డిమాండ్

Hazarath Reddy

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు నిరసన తెలిపారు విప్రో సర్కిల్‌ నుంచి ఔటర్‌ రింగ్‌రోడ్డు వరకు భారీ ర్యాలీ నిర్వహించిన ఐటీ ఉద్యోగులు చంద్రబాబు అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండించారు. ఆయామ్‌ విత్‌ సీబీఎన్‌ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఉద్రిక్తత నెలకొంది.

CM Jagan in Action: ప్రజారోగ్యం కోసం ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం, సెప్టెంబర్‌ 30 నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష, ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా వైద్యం పొందడం ఎలా బ్రోచర్ విడుదల

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఆరోగ్యసురక్షపై, సీఆర్‌డీఏపై బుధవారం సమీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రి విడదల రజని, సీఎస్ జవహర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

KA Paul on Chandrababu Arrest: వీడియో ఇదిగో, చంద్రబాబు అరెస్ట్ 100 శాతం కరెక్ట్, ఆ ప్యాకేజీ స్టార్ గురించి ఇకనైనా జనసైనికులు తెలుసుకుని బయటకు రావాలని తెలిపిన కేఏ పాల్

Hazarath Reddy

చంద్రబాబు అరెస్ట్, పవన్ కళ్యాణ్ మద్దతుపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వందకు వందశాతం అవినీతి చేశాడు. చంద్రబాబును గాంధీ, ఆంబేద్కర్‌తో పోల్చడం దారుణమన్నారు. 6 వందల మంది టీడీపీ కార్యకర్తలు రోడ్లమీదకి రాలేదు

Gone Prakash Rao: చంద్రబాబు అరెస్ట్‌తో ఏపీలో టీడీపీకి 80 సీట్లు గ్యారంటీ, తెలంగాణలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తున్నాడు, మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

రేవంత్ రెడ్డి అనే వాడు కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తున్నాడంటూ మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని మటాష్ చేస్తున్నాడు. షర్మిలని రాకుండా అడ్డుకుంటున్నాడని మండిపడ్డారు. సమైక్య మద్దతుదారులు రావొద్దు అంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఎందుకు తీసుకున్నావ్? డబ్బులు ఇస్తే తీసుకున్నావ్.

AP Assembly Sessions 2023: ఈ నెల 20న ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్ సమావేశం, 21 నుంచి అసెంబ్లీ సమావేశాలు, కీలక బిల్లులు సభలో ప్రవేశపెట్టే అవకాశం

Hazarath Reddy

అసెంబ్లీ సమావేశాల తేదీలను ఏపీ ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ నెల 21 నుంచి అయిదు రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. అవసరాన్ని బట్టి మరో రెండు రోజులు పెంచే అవకాశముంది.

WhatsApp Video Calls: వాట్సాప్‌ వీడియో కాల్స్‌ వస్తున్నాయా, అయితే సెట్టింగ్స్ ఇలా మార్చేసి వాటికి చెక్ పెట్టండి, సజ్జనార్ షేర్ చేసిన వీడియో ఇదిగో..

Hazarath Reddy

అజ్ఞాత వ్యక్తుల నుంచి మీకు తరచూ వాట్సాప్‌ వీడియో కాల్స్‌ వస్తున్నాయా? వాటికి సులువుగా చెక్‌ పెట్టొచ్చు. మీ స్మార్ట్ ఫోన్ కాంటాక్ట్‌ లిస్ట్‌లో ఉన్న ఫోన్‌ నంబర్ల నుంచే కాల్స్‌ వచ్చేలా ఇలా సెట్టింగ్స్‌ చేసుకోండి. వాట్సాప్ వీడియో కాల్ స్కాంలకు అడ్డుకట్ట వేయండని సూచించారు.

Advertisement

Ashwini Dutt on Chandrababu Arrest: వీడియో ఇదిగో, చంద్రబాబు అరెస్టును ఖండించిన సినీ నిర్మాత అశ్వినీ దత్, అలాంటి నేతను దుర్మార్గంగా అరెస్టు చేశారని ఆవేదన

Hazarath Reddy

చంద్రబాబు అరెస్టును సినీ నిర్మాత, వైజయంతీ మూవీస్ వ్యవస్థాపకుడు అశ్వినీ దత్ ఖండించారు. దేశానికి గొప్ప ప్రధానిని, స్పీకర్‌ని, రాష్ట్రపతిని ఇచ్చిన ఘనత చంద్రబాబుది. అలాంటి నేతను దుర్మార్గంగా అరెస్టు చేశారు. మరికొన్ని నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కచ్చితంగా 160 సీట్లను గెలుస్తుంది.

Skill Development Scam Case: చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణ ఈనెల 19కి వాయిదా, ఏపీ సీఐడీ పిటిషన్‌పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ

Hazarath Reddy

స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. విచారణను ఈనెల 19కి హైకోర్టు వాయిదా వేసింది.క్వాష్‌ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలుకు సీఐడీ సమయం కోరగా.. హైకోర్టు అంగీకరించింది.

Skill Development Scam Case: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌ ఇవిగో, టీడీపీ అధినేత క్వాష్‌ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో ప్రారంభమైన విచారణ, మరిన్ని వివరాలు రాబట్టేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ ఏపీ సీఐడీ పిటిషన్‌పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ

Hazarath Reddy

చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఇరు పక్షాల న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తున్నారు. ఈ కేసు విచారణ ప్రక్రియను నిలుపుదల చేయాలని చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ లో పేర్కొన్నారు.

Visakhapatnam Shocker: విశాఖలో విషాదం, కార్టూన్ క్యారక్టర్ అనుకరిస్తూ మెడకు శాలువా కట్టుకుని కరెంట్ తీగలకు వేలాడిన బాలుడు, పట్టు తప్పడంతో అక్కడికక్కడే మృతి

Hazarath Reddy

కార్టూన్‌ క్యారెక్టర్‌ని అనుకరించేందుకు ప్రయత్నించి ఎనిమిదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. విద్యుత్ తీగకు బిగించిన కండువాతో చిన్నారి మెడకు చుట్టుకున్న ఘటన విశాఖపట్నంలో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.

Advertisement

ICICI Bank Staff Fraud: బ్యాంకుకు కన్నం వేసిన డిప్యూటీ మేనేజర్, గోల్డ్‌లోన్ డబ్బులతో ఆన్‌లైన్‌ క్రికెట్ బెట్టింగ్ ఆడిన కేటుగాడు, ఏకంగా రూ. 8.65 కోట్లు గోల్‌మాల్

VNS

రుణ ఖాతా క్లోజ్‌ చేయకుండానే బంగారు ఆభరణాలు ఖాతాదారులకు ఇచ్చేవాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఆ మొత్తాన్ని ఇతనే చెల్లించి ఖాతా నడుస్తున్నట్టుగా బ్యాంకు రికార్డుల్లో చూపి ఆ డబ్బులను కార్తీక్‌ సొంతానికి వాడుకునేవాడు. ఇలా తీసిన రూ.8.65 కోట్లను ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌లో (Cricket betting) పెట్టి పోగొట్టాడు.

CM Jagan Mohan Reddy Delhi Tour: ఢిల్లీకి చేరిన ఏపీ రాజకీయాలు, హస్తిన బాటపట్టనున్న వైయస్ జగన్, చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఆసక్తికరంగా మారనున్న టూర్

VNS

లండన్ పర్యటన నుంచి రాష్ట్రానికి తిరిగొచ్చిన సీఎం జగన్ బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు అనే ప్రచారం జరుగుతోంది. ఈ పర్యటనలో సీఎం జగన్ కేంద్ర పెద్దలతో భేటీ కానున్నారని అంటున్నారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం లండన్ వెళ్లిన సీఎం వచ్చీరాగానే ఢిల్లీ పర్యటనకు వెళ్తుండటంపై రాజకీయంగా రకరకాల చర్చ జరుగుతోంది.

Viral Video: సూర్యాపేటలో ఘోరం, చెట్ల పొదల్లో లభించిన ఆడ శిశువు, వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు..ఆడ జన్మకు ఎన్ని శోకాలో..

ahana

సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం, నెమ్మికల్‌ గ్రామంలో ఘోరం జరిగింది. స్థానికుల చెప్పిన వివరాల ప్రకారం నెమ్మికల్‌ గ్రామ చెట్ల పొదలలో అర్ధరాత్రి వేళ అప్పుడే పుట్టిన ఆడ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వేశారు.

Hyderabad Rains: హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం, మెహదీపట్నం, టోలిచౌకి, మాసబ్ ట్యాంక్ ప్రాంతాల్లో కుండపోత వాన

Hazarath Reddy

తెలంగాణ (Telangana) రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని (Hyderabad Rains) పలు ప్రాంతాల్లో వర్షం పడింది. షేక్ పేట్, గోల్కొండ, మణికొండ, బేగంపేట, అమీర్ పేట పరిసర ప్రాంతాల్లో ఓ మోస్తారు వాన కురిసింది.

Advertisement

Chikoti Praveen: వీడియో వైరల్, జూద వ్యాపారి చికోటి ప్రవీణ్ కు ఘోర అవమానం, బీజేపీలో చేరేందుకు భారీ ర్యాలీతో వచ్చిన చీకోటికి దక్కని అధ్యక్షుడు కిషన్ రెడ్డి దర్శనం..

ahana

క్యాసినో కింగ్ చికోటికి చుక్కెదురు. నేడు బీజేపీలో చేరడానికి పెద్ద ఎత్తున తన అనుచరులతో కలిసి చీకోటి ర్యాలీగా తరలివచ్చాడు. చీకోటి రాకముందే బిజెపి పార్టీ కార్యాలయం నుండి కిషన్ రెడ్డి వెళ్లిపోయారు. మొన్న మాజీమంత్రి కృష్ణ యాదవ్.. నేడు చికోటికి ఘోర అవమానం. పెద్ద హంగు ఆర్భాటంతో వచ్చిన చికోటి అనుచరుల ఆగ్రహం.

Chandrababu House Custody Petition Dismissed: చంద్రబాబు హౌస్ కస్టడీ పిటిషన్‌ కొట్టివేత, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడిన వీడియో ఇదిగో

Hazarath Reddy

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు హౌస్ కస్టడీపై ఏసీబీ కోర్టు తీర్పును వెల్లడించింది..హౌస్ కస్టడీ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తిరస్కరించారు. జైలు రిమాండ్‌ను హౌస్ రిమాండ్‌గా మార్చాలన్న పిటిషన్‌ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది.

Chandrababu Arrest Row: వీడియో ఇదిగో, ఎన్టీఆర్‌ పెట్టిన పార్టీ ఇది అంటూ కంటతడిపెట్టిన చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, చంద్రబాబు నిర్మించిన భవనంలోనే ఆయన్ను తీసుకెళ్లి పెట్టారని ఆవేదన

Hazarath Reddy

చంద్రబాబు నిర్మించిన భవనంలోనే ఆయన్ను తీసుకెళ్లి పెట్టారు. చంద్రబాబును వీడి బయటకు వస్తుంటే నా మనసు చలించింది. ఆయన కోసం నా ఆత్మ వదిలేసి వచ్చా. ఇలాంటి పరిస్థితులు వస్తాయని ఊహించలేదు. చంద్రబాబు ఆరోగ్యం బాగానే ఉంది.. ధైర్యంగా ఉన్నారు. చన్నీళ్ల స్నానం చేయాల్సి వస్తోంది

Skill Development Scam Case: చంద్రబాబు హౌస్ కస్టడీ పిటిషన్‌ కొట్టివేసిన ఏసీబీ కోర్టు,  జైల్లో పూర్తి స్థాయి భద్రత కల్పించామనే సీఐడీ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం

Hazarath Reddy

టీడీపీ అధినేత చంద్రబాబు హౌస్‌ కస్టడీ పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించింది. స్కిల్‌ స్కాంలో ప్రధాన నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కుంటున్న చంద్రబాబు హౌస్ రిమాండ్‌ కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది

Advertisement
Advertisement