రాష్ట్రీయం

Andhra Pradesh: విదేశాలకు వెళ్లేందుకు సీఎం జగన్, వైసీపీ ఎంపీకి సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్, కోర్టుకు వచ్చి పాస్ పోర్ట్ తీసుకువెళ్లిన విజయసాయిరెడ్డి

Hazarath Reddy

సెప్టెంబర్‌ 2 నుంచి 12వ తేదీ వరకు జగన్‌ విదేశాలకు వెళ్లేందుకు అనుమతినిచ్చారు. అదే మాదిరిగా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి కూడా విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది.

MLA Kondeti Chittibabu Health Update: వైసీపీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకు బ్రెయిన్ స్ట్రోక్, కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పి.గన్నవరం ఎమ్మెల్యే, ప్రస్తుతం నిలకడగా ఆరోగ్యం

Hazarath Reddy

ఏపీలో కోనసీమ జిల్లా పి.గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బుధవారం రాత్రి అస్వస్థతకు గురైన ఆయనను రాజమండ్రిలోని బొల్లినేని ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఆయనకు వైద్యులు ఎంఆర్ఐ స్కాన్ చేశారు

Video: తల్లి నిర్లక్ష్యానికి పాప ఎలా బలైందో వీడియోలో చూడండి, చిన్నారుల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలంటూ ట్వీట్ చేసిన సజ్జనార్

Hazarath Reddy

చిన్నారుల విషయంలో తల్లిదండ్రులు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. వారిని రోడ్లపై తీసుకొచ్చినప్పుడు సెల్ ఫోన్ వాడుతూ ఇలా నిర్లక్ష్యంగా అసలే ఉండొద్దు. చిన్నారుల చేతులను తప్పకుండా పట్టుకోవాలని జాగ్రత్తలు చెప్పారు. వీడియో ఇదిగో...

YSR Rythu Bharosa: రైతుల అకౌంట్లోకి నేరుగా రూ. 7,500, బటన్ నొక్కి కౌలు అన్నదాతలకు పెట్టుబడి సాయాన్ని విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్ ఏమన్నారంటే..

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద కౌలు రైతులకు నిధులను విడుదల చేశారు.వారి ఖాతాల్లోకి 7,500 రూపాయల చొప్పున నగదు మొత్తాన్ని తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ ఈ కార్యక్రమంలో సీఎం జగన్ బటన్ నొక్కి జమ చేశారు.

Advertisement

Ayyanna Patrudu Arrest: సీఎంపై అనుచిత వ్యాఖ్యలు, టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు అరెస్ట్, అడ్డుకున్న టీడీపీ శ్రేణులు, 41 ఏ నోటీస్ ఇచ్చిన పోలీసులు

Hazarath Reddy

మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడుని శుక్రవారం విశాఖ ఎయిర్ పోర్టులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల గన్నవరం యువగళం మీటింగ్‌లో సీఎంతో పాటు ఇతర మంత్రులను అయ్యన్న దూషించిన సంగతి తెలిసిందే.

Hyderabad: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కోసం పాకిస్తాన్ నుండి అక్రమంగా భారత్‌లోకి, ఆధార్ సంపాదించే క్రమంలో పోలీసులకు చిక్కిన నిందితుడు

Hazarath Reddy

భార్య కోసం పాకిస్తాన్ నుండి హైదరాబాద్‌కు అక్రమంగా వచ్చిన యువకుడు అరెస్ట్ అయ్యాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కోసం పాకిస్థాన్ యువకుడు అక్కడి నుండి నేపాల్ మీదుగా భారత్‌లోకి అక్షమంగా ప్రవేశించి హైదరాబాద్ చేరాడు.

IT Notice to Chandrababu: రూ. 118 కోట్ల ముడుపులు తీసుకున్నాడని అభియోగాలు, చంద్రబాబుకి షోకాజ్‌ నోటీసులు జారీ చేసిన ఐటీ శాఖ

Hazarath Reddy

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఆదాయ పన్ను శాఖ(ఐటీ) షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఇన్ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్టుల ద్వారా రూ. 118 కోట్ల ముడుపులు తీసుకున్నారనే అభియోగాలు మీద ఈ నోటీసులు జారీ చేసింది.

Konda Raghava Reddy: వీడియో ఇదిగో, వైఎస్సార్‌ని చంపింది కాంగ్రెస్ పార్టీ, కొండా రాఘవ రెడ్డి సంచలన వ్యాఖ్యలు, షర్మిలతో కలిసి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం

Hazarath Reddy

దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై వైఎస్సార్టీపీ పార్టీ నేత కొండా రాఘవ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న ఓ ప్రముఖ ఛానెల్‌ లో పాల్గొన్న వైఎస్సార్టీపీ పార్టీ నేత కొండా రాఘవ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై ఊహించని కామెంట్స్ చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని చంపింది కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటికీ మాకు అనుమానాలు ఉన్నాయని ఫైర్‌ అయ్యారు.

Advertisement

Rakhi Pournami 2023: వీడియో ఇదిగో, సీఎం కేసీఆర్‌కు రాఖీలు కట్టిన తోబుట్టువులు, ప్రగతి భవన్‌లో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు

Hazarath Reddy

రక్షాబంధన్ వేడుకలు ప్రగతి భవన్ లో ఈరోజు ఘనంగా జరిగాయి. తోబుట్టువుల ప్రేమానురాగాలు, అనుబంధాలకు ప్రగతి భవన్ ముఖ్యమంత్రి నివాసం వేదికయింది. రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అక్కలు శ్రీమతి లక్ష్మీబాయి, శ్రీమతి జయమ్మ, శ్రీమతి లలితమ్మ, చెల్లెలు శ్రీమతి వినోదమ్మ తమ సోదరునికి రాఖీ కట్టారు.

Gym Owner Sells Steroids in Hyd: కండలు పెంచుకునేందుకు స్టెరాయిడ్‌లు, ఇంజక్షన్లు అమ్మకం, జిమ్ ఓనర్‌ను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు

Hazarath Reddy

స్టెరాయిడ్‌లు, కండలు పెంచేందుకు ఇంజక్షన్లు విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్‌లోని సైబరాబాద్ పోలీసులు ఇటీవల నగరంలో అరెస్టు చేశారు. నిందితులు స్టెరాయిడ్స్, ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్లు విక్రయించారని, ఇవి కండరాలను బలపరిచేందుకు, శక్తిని పెంచడానికి సహాయపడతాయని పోలీసులు తెలిపారు. 10 లక్షల విలువైన సామాగ్రిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్, సెప్టెంబర్ 18 నుంచి తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక దర్శనాలు రద్దు, శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం

Hazarath Reddy

సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభం కానున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ప్రత్యేక దర్శనాలపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి కీలక ప్రకటన చేశారు. బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం బ్రహ్మోత్సవాల సమయంలో జర్మన్ షెడ్లను వేసి లాకర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు

TTD Srivari Brahmotsavam: సెప్టెంబరు 18వ తేది నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు, అదే రోజున రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్

Hazarath Reddy

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 18వ తేది నుంచి 26వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు టీటీడీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి తెలిపారు.సెప్టెంబరు 18న సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారని వెల్లడించారు

Advertisement

Paidithalli Sirimanotsavam: అక్టోబర్ 31న పైడితల్లి సిరిమానోత్సవం, అక్టోబ‌ర్ 15 నుంచి న‌వంబ‌ర్ 15వ తేదీ వ‌ర‌కు నెల రోజుల పాటు పైడిత‌ల్లి అమ్మ‌వారి ఉత్స‌వాలు

Hazarath Reddy

ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల ఇల‌వేల్పు అయిన శ్రీపైడిత‌ల్లి అమ్మ‌వారి సిరిమానోత్స‌వం అక్టోబ‌ర్ 31న నిర్వ‌హించ‌నున్నట్లు అసిస్టెంట్ క‌మిష‌న‌ర్, ఆల‌య ఈవో కె.ఎల్. సుధారాణి పూర్తి వివరాలను మీడియాకు తెలియజేశారు.

YSR Rythu Bharosa: కౌలు రైతులకు జగన్ సర్కారు శుభవార్త, రేపే అన్నదాతల అకౌంట్లోకి రూ. 7500, వైఎస్సార్‌ రైతు భరోసా కింద రూ.109.74 కోట్లు విడుదల చేయనున్న ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

పంట హక్కు సాగు పత్రాలు పొందిన వారిలో అర్హులైన 1,46,324 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలుదారులు, దేవదాయ భూము­లను సాగు చేస్తున్న రైతులకు ఒక్కొక్కరికి రూ.7,500 చొప్పున రూ.109.74 కోట్లు సాయం (rs 109.74 Crore ) పంపిణీ చేయనున్నారు.

Raksha Bandhan 2023: జగన్‌కు రాఖీలు కట్టిన సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ హౌస్‌ కీపింగ్‌ మహిళలు, ఆప్యాయంగా పలకరించిన ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

రాఖీ పౌర్ణమి సందర్భంగా సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసి రాఖీలు కట్టిన సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ హౌస్‌ కీపింగ్‌ మహిళలు. వాటిని ఆప్యాయంగా పలకరించిన ఏపీ ముఖ్యమంత్రి. ఫోటోలు, వీడియో ఇదిగో..

Pawan Kalyan: 470 కిలోల వెండితో పవన్ కళ్యాణ్ చిత్రపటం, సెప్టెంబరు 2 పుట్టిన రోజున జనసేనానికి గిఫ్ట్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

సెప్టెంబరు 2న జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో, నెల్లూరు సిటీ జనసేన పార్టీ అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు 470 కేజీల వెండితో పవన్ కల్యాణ్ చిత్రరూపాన్ని రూపొదించారు.

Advertisement

Viral Video: తమ్ముడికి రాఖీ కట్టేందుకు 8 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లిన అక్క, సోషల్ మీడియాలో లక్షల మంది హృదయాలను గెలుచుకున్న వీడియో ఇదిగో..

Hazarath Reddy

తన సోదరుడికి రాఖీ కట్టేందుకు దాదాపు 8 కిలోమీటర్లు ఓ మహిళ కాలినడకన నడిచింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో లక్షల మంది హృదయాలను గెలుచుకుంది.

Video: నా కుక్కలనే ఢీ కొడతారా అంటూ పోలీసులపై దూసుకెళ్లిన యువకుడు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

హైదరాబాద్ - ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ముందు పెట్రోలింగ్ కార్ నెంబర్-2 సిబ్బంది విధుల్లో భాగంగా రోడ్లపై గస్తీ చేస్తున్నారు. అదే టైంలో ప్రణయ్ తన 2 పెంపుడు కుక్కలతో అదే దారిలో వెళ్తున్నాడు.

Hyderabad: వీడియో ఇదిగో, రోడ్డు మీద కుప్పకూలిన వ్యక్తికి సీపీఆర్ ఇచ్చి రక్షించిన హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ ఏసీపీ పి.మధుసూధన్ రెడ్డి, ప్రస్తుతం నిలకడగా అతని ఆరోగ్యం

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలో బేగంపుట్ వద్ద ఓ వ్యక్తి నడుచుకుంటూ వస్తూ కుప్పకూలిపోయాడు. అక్కడ విధులు నిర్వహిస్తున్న హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ ఏసీపీ పి.మధుసూధన్ రెడ్డి వెంటనే అతనికి సీపీఆర్ ఇస్తూ కాపాడారు. ఆ వ్యక్తి ఇప్పుడు ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. ఏసీపీపై సోషల్ మీడియా వేదికగా అభినందనలు వెలువెత్తుతున్నాయి. వీడియో చూడండి

Andhra Pradesh Assembly Elections 2024: రాజానగరంలో జనసేనకు షాక్, వైసీపీలో చేరిన రాయపురెడ్డి ప్రసాద్‌, కండువా కప్పి ఆహ్వానించిన సీఎం జగన్

Hazarath Reddy

గత సార్వత్రిక ఎన్నికలలో రాజానగరం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి, ఓటమి చెందిన రాయపురెడ్డి ప్రసాద్‌ (చిన్న) వైఎస్సార్‌‌సీపీలో చేరారు

Advertisement
Advertisement