రాష్ట్రీయం
NTR Coin: నేటి నుంచి అందుబాటులోకి రూ.100 ఎన్టీఆర్ నాణెం.. ధర ఎంతో తెలుసా?
Rudraఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముద్రించిన రూ.100 స్మారక నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం విడుదల చేశారు. రాష్ట్రపతి భవన్‌లోని సాంస్కృతిక కేంద్రంలో ఈ కార్యక్రమం జరిగింది.
Telugu Language Day 2023: నేడు తెలుగు భాషా దినోత్సవం.. ఆగస్టు 29న ఎందుకు జరుపుకుంటారో తెలుసా? తెలుగు భాషా దినోత్సవంపై ప్రధాని మోదీ ఏమన్నారంటే??
Rudraనేడు తెలుగు భాషా దినోత్సవం. ఆగస్టు 29న ఏటా ఈరోజును జరుపుకుంటారు. తెలుగు కవి గిడుగు వెంకట రామమూర్తి జయంతి నేడు. తెలుగు భాషలో ఆయన చేసిన అద్భుతమైన పనిని గౌరవించటానికి.. ఆయన జయంతిని దృష్టిలో ఉంచుకుని, ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగస్టు 29 న జరుపుకుంటారు.
APPSC: నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ.. మొత్తం 597 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.. గ్రూప్ 1లో 89, గ్రూప్ 2లో 508 పోస్టుల భర్తీ
Rudraఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు శుభవార్త. గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ అయ్యాయి. 597 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీపీఎస్సీ ద్వారా వీటిని భర్తీ చేయనున్నారు.
Andhra Pradesh: విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎవరైనా సరే నో మొబైల్, ఏపీలోని అన్ని పాఠశాలల్లో మొబైల్‌ ఫోన్ల వాడకంపై నిషేధం, ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
Hazarath Reddyఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో మొబైల్ ఫోన్లపై నిషేధం విధిస్తూ కీలక ఆదేశాలను జారీ చేసింది. పాఠశాలలకు విద్యార్థులు ఫోన్లను తీసుకురాకుండా ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధ్యాయులు సైతం తమ ఫోన్లను తరగతి గదుల్లోకి తీసుకురాకూడదని ఆదేశించింది.
TSRTC: టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు అలర్ట్, టి-9 టికెట్లను తాత్కాలికగా నిలిపివేస్తున్నట్లు ప్రకటన, రేపటి నుంచి నాలుగు రోజుల పాటు నిలుపుదల అమల్లోకి..
Hazarath Reddyరాఖీ పౌర్ణమికి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా టి-9 టికెట్లను తాత్కాలికగా నిలిపివేస్తున్నట్లు #TSRTC ప్రకటించింది. రేపటి నుంచి నాలుగు రోజుల పాటు నిలుపుదల అమల్లో ఉంటుందని తెలిపింది. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి ఈ టికెట్లు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది.
Lakshmi Parvathi: మరో లేఖ విడుదల చేసిన లక్ష్మీపార్వతి, పురంధేశ్వరిపై నా పోరాటం కొనసాగుతుందని లేఖలో వెల్లడి
Hazarath Reddyఆమె అసంతృప్తి లేఖను విడుదల చేశారు. అంతేకాదు ఎన్టీఆర్‌ కూతురు దగ్గుబాటి పురంధేశ్వరిపైనా ఆమె ఆగ్రహాం వ్యక్తం చేస్తూ.. మీడియా ముందుకు వచ్చారు. విడుదల చేసిన లేఖలో ఇక నుంచి తన పోరాటం పురంధేశ్వరిపైనేనని లక్ష్మీ పార్వతి ప్రకటించారు. లేఖ ఇదే..
Jagananna Vidya Deevena: సొంత కొడుకు మీదే చంద్రబాబుకు నమ్మకం లేదు, అందుకే దత్త పుత్రుడుకి ప్యాకేజీ ఇచ్చి అరువు తెచ్చుకున్నాడు, జగనన్న విద్యాదీవెన నిధులు విడుదల కార్యక్రమంలో సీఎం జగన్
Hazarath Reddyజగనన్న విద్యాదీవెన పథకంలో భాగంగా ఏప్రిల్‌–జూన్‌ 2023 త్రైమాసికానికి సంబంధించి 9,32,235 మంది విద్యా­ర్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను సోమ­­వారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేశారు. చిత్తూరు జిల్లా నగరిలో బటన్‌ నొక్కి రూ.680.44 కోట్లను 8,44,336 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమచేసింది ఏపీ ప్రభుత్వం.
NTR Commemorative Coin Released: ఎన్టీఆర్ 100 రూపాయల స్మారక నాణెం విడుదల చేసిన రాష్ట్రపతి ముర్ము, ఎన్టీఆర్ నాణెం ప్రత్యేకతలు ఇవిగో..
Hazarath Reddyనందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముద్రించిన 100 రూపాయల స్మారక నాణెంను (NTR Commemorative Coin) సోమవారం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల (NTR Commemorative Coin Released) చేశారు.
Hyderabad Road Accident: రోడ్డు ప్రక్కన చెత్త ఊడుస్తున్న స్వీపర్‌ను ఢీకొట్టిన ప్రైవేట్ కాలేజ్ బస్సు, చెట్టుకు-బస్సుకు మధ్యలో నలిగిపోయి అక్కడికక్కడే మృతి
Hazarath Reddyహైదరాబాద్ నగరంలో రామ్ కోటిలో రోడ్డు పక్కన చెత్త ఊడుస్తున్న జీహెచ్ఏంసీ స్వీపర్ సునీతను వేగంగా దూసుకొచ్చిన ఓ ప్రైవేట్ కాలేజ్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె బస్సు, చెట్టుకు మధ్యలో నలిగిపోయి అక్కడికక్కడే మృతిచెందింది.
Fake Voters in Telangana: తెలంగాణలో 10 లక్షల బోగస్ ఓట్ల తొలగింపు, నకిలీ ఓట్లలో 50% హైదరాబాద్‌లోనే..
Rudraతెలంగాణలో భారీఎత్తున బోగస్ ఓట్లు బయటపడ్డాయి. వీటిని ఈసీఐ తొలగించింది. దాదాపు10 లక్షల డూప్లికేట్ ఓటర్లు ఉన్నట్టు తెలిసింది. ఇందులో సగానికి పైగా గ్రేటర్ హైదరాబాద్ మరియు చుట్టుపక్కల నియోజకవర్గాలకు చెందినవారేనని సమాచారం.
Andhra Pradesh: చెన్నై విమానాశ్రయంలో కుప్పకూలి మృతి చెందిన చిత్తూరు వాసి, దక్షిణాఫ్రికా నుంచి సొంత ఊరికి తిరిగివస్తూ మధ్యలోనే తిరిగిరాని లోకాలకు..
Hazarath Reddyచెన్నై విమానాశ్రయంలోని డొమెస్టిక్ టెర్మినల్‌లో ఆదివారం ముంబై నుంచి విమానం దిగి వచ్చిన 47 ఏళ్ల వ్యక్తి ఏరోబ్రిడ్జ్‌లో కుప్పకూలి మృతి చెందాడు. దక్షిణాఫ్రికాకు చెందిన సోలమన్ మార్టిన్ లూథర్ అనే ఎలక్ట్రికల్ ఇంజనీర్ తన స్వగ్రామమైన ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరుకు వెళ్తున్నాడు.
Telangana: వీడియో ఇదిగో, పోలీస్ స్టేషన్లో ఫిట్స్ వచ్చి కూర్చున్న చోటనే కుప్పకూలి మృతి చెందిన నిందితుడు, పోలీసులు థర్డ్‌ డిగ్రీ ఉపయోగించారని కుటుంబ సభ్యులు ఆరోపణలు
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలో గల బెల్లంపల్లిలో 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కూర్చున్న చోటనే కీర్తి అంజి (25) అనే యువకుడు కుప్పకూలిపోయాడు. ఓ మహిళ ఇంటిపై దాడి కేసు విషయమై విచారణ కోసం పోలీసులు అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకు రాగా అక్కడ కూర్చున్న అంజికి ఫిట్స్ రావడంతో కుప్పకూలిపోయాడు.
Uddhav Thackeray: మహారాష్ట్ర సంగతి తర్వాత.. ముందు మీ రాష్ట్రాన్ని చక్కదిద్దుకోండి.. కేసీఆర్‌పై ఉద్ధవ్ థాకరే ఫైర్
Rudraతెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశం బాగు కోసం పోరాడతారా? లేదంటే, బీజేపీకి మద్దతిస్తారా? ఏదో ఒక విషయాన్ని స్పష్టం చేయాలని కోరారు.
Balka Suman: కాంగ్రెస్ పార్టీలోకి కోవర్టులను పంపాం.. కాంగ్రెస్ వాళ్లను ఏమీ అనొద్దు.. కార్యకర్తలకు బాల్క సుమన్ హితవు.. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దన్న చెన్నూరు ఎమ్మెల్యే
Rudraమరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వాళ్లు మనోళ్లేనని, ఆ పార్టీలో మన కోవర్టులు ఉన్నారని, కాబట్టి వారినేమీ అనొద్దని కార్యకర్తలకు హితవు పలికారు.
Tirumala: తిరుమలలో చిక్కిన మరో చిరుత.. అధికారుల ప్రయత్నాలకు ఎట్టకేలకు దక్కిన ఫలితం.. ఇప్పటివరకూ నాలుగు చిరుతలను బంధించామన్న అధికారులు
Rudraతిరుమలలో చిరుతలను పట్టుకునేందుకు అధికారుల చేస్తున్న ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలిస్తున్నాయి. తాజాగా మరో చిరుత బోనులో చిక్కింది. అలిపిరి కాలి నడక మార్గంలో ఏడో మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కినట్టు అధికారులు తాజాగా తెలిపారు.
TSRTC To Operate Electric Buses: హైదరాబాద్‌ ప్రజలకు గుడ్‌న్యూస్, గ్రేటర్‌ పరిధిలో కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయం, ఎంఎంటీఎస్, మెట్రో రైలు అందుబాటులో లేని ఏరియాల్లో సర్వీసులు
VNSప్ర‌యాణికుల ర‌ద్దీని దృష్టిలో ఉంచుకుని టీఎస్ ఆర్టీసీ (TSRTC) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఎంఎంటీఎస్, మెట్రో రైలు అందుబాటులో లేని ఏరియాల్లో ఎల‌క్ట్రిక్ బ‌స్సుల‌ను (Electric Buses) న‌డ‌పాల‌ని ఆర్టీసీ అధికారులు నిర్ణ‌యించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్, మియాపూర్ డిపోల ప‌రిధిలో ఈ బ‌స్సుల‌ను న‌డిపేందుకు గ్రేట‌ర్ హైద‌రాబాద్ జోన్ అధికారులు నిర్ణ‌యించారు.
CPI On Alliance With Congress: కాంగ్రెస్‌తో పొత్తుకు సీపీఐ సై, ప్రాథమిక చర్చలు జరిగాయన్న నేతలు, బీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు ఎవరితోనైనా కలుస్తామంటూ ప్రకటన
VNSతెలంగాణలో మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న వేళ పొత్తుల కోసం సీపీఐ ప్రయత్నాలు చేస్తోంది. వామపక్ష పార్టీలతో పొత్తులు లేవని బీఆర్ఎస్ (BRS) తేల్చేయడంతో కాంగ్రెస్ (Congress ) పార్టీతో పొత్తుల కోసం సీపీఐ నేతలు చర్చలు జరుపుతున్నారు. కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్ రావు ఠాక్రేతో సీపీఐ (CPI) చర్చించినట్లు ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే
Amit Shah Meeting At Khammam: 4జీ, 3జీ, 2జీ కాదు, తెలంగాణలో వచ్చేది బీజేపీనే, రైతులను బీఆర్‌ఎస్ మోసం చేసింది - ఖమ్మం సభలో అమిత్ షా చురకలు
ahanaతెలంగాణలోని ఖమ్మంలో జరిగిన రైతు గోస-బీజేపీ భరోసా ర్యాలీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన బీఆర్‌ఎస్ పార్టీపై విరుచుకుపడ్డారు.
Medak Leopard: మెదక్ జిల్లాలో చిరుత హల్ చల్, పొలంలో దూడను తినేయడంతో, భయాందోళనలు..
ahanaమాసాయిపేట మండలం చెట్ల తమ్మాయి పల్లి గ్రామంలో చిరుతపులి సంచరించడంతో రైతుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. వ్యవసాయ పొలంలో చిరుత దూడను చంపి తినేసింది.
Rain Alert to Telugu States: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ వర్ష సూచన.. సెప్టెంబరు 1 వరకు తెలంగాణలో కొన్ని జిల్లాల్లో వానలు.. ఎల్లో అలర్ట్ జారీ.. ఏపీలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
Rudraతెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు పడతాయని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. తెలంగాణలో సెప్టెంబరు 1 వరకు వర్షాలు కురుస్తాయని తెలిపింది. వాతావరణ మార్పులే అందుకు కారణమని ఐఎండీ వివరించింది.