రాష్ట్రీయం
APSRTC Bus Accident: వైరల్ వీడియో, ఏపీలోని అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 100 అడుగుల లోయలో పడిపోయిన ఆర్టీసీ బస్సు, బస్సులో 60 మంది ప్రయాణికులు..
kanhaఅల్లూరి జిల్లా - పాడేరు ఘాట్ రోడ్డు వ్యూపోయింట్ వద్ద 100 అడుగుల లోయలో నుండి పడిపోయిన ఆర్టీసీ బస్సు. బస్సులో 60 మంది ప్రయాణికులు. నలుగురు మృతి, పలువురికి గాయాలు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Minister Talasani Viral Video: వైరల్ వీడియో..మంత్రి కేటీఆర్ ముందు ఓ వ్యక్తి చెంప చెళ్లు మనిపించిన, మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
kanhaబిఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్..తాజాగా వివాదంలో చిక్కుకొని వార్తల్లో నిలిచారు.స్టీల్‌ బ్రిడ్జి ప్రారంభ కార్యక్రమంలో ఓ వ్యక్తిని మంత్రి తలసాని కొట్టడం ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. బ్రిడ్జి చూసేందుకు ఓ వ్యక్తి తలసాని కంటే ముందు వెళ్లారు. దీంతో అతన్ని వెనక్కి లాగి, చెంప దెబ్బ కొట్టారు తలసాని.దీంతో మంత్రిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Viral Video: హైదరాబాద్ ఓల్డ్ సిటీ బహదూర్ పురాలో ఒక్కసారిగా పక్కకు ఒరిగిన నాలుగు అంతస్తుల భవనం, వీడియో చూస్తే షాకే..
kanhaహైదరాబాద్ ఓల్డ్ సిటీ బహదూర్ పురాలో ఒక్కసారిగా పక్కకు ఒరిగిన నాలుగు అంతస్తుల భవనం రెండంతస్తుల పర్మిషన్ తీసుకుని నాలుగు అంతస్తులు వేసిన ఇంటి ఓనర్. భవనం కింది భాగంలో పగుళ్లు.. బిల్లింగ్ చుట్టుపక్కల వారిని ఖాళీ చేయించిన అధికారులు. భవన యజమాని పై కేసు నమోదు.
Ex MLA Madan Lal Viral Photos: ఖమ్మం బీఆర్‌ఎస్‌లో రాసలీలల కలకలం, అమ్మాయితో సన్నిహితంగా ఉన్నట్లు మాజీ ఎమ్మెల్యే ఫోటోలు హల్ చల్‌, ఫస్ట్ లిస్ట్ ప్రకటించేముందు బీఆర్ఎస్‌లో హీటెక్కిన గ్రూపు రాజకీయాలు
VNSఖమ్మం జిల్లా వైరా (Wyra) రాజకీయం రసవత్తరంగా మారింది. బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ వ్యక్తిగత ఫోటోలు వైరల్ గా మారాయి. వైరా మాజీ ఎమ్మెల్యే బానుకు మదన్ లాల్ ఓ మహిళతో సన్నిహితంంగా ఉన్న ఫోటోలను ప్రత్యర్థి వర్గం వైరల్ చేస్తోంది.
Vallabhaneni Vamsi Escapes Major Accident: గన్నవరం ఎమ్మెల్యే వంశీకి తప్పిన పెను ప్రమాదం, సూర్యాపేట వద్ద కాన్వాయ్‌కు యాక్సిడెంట్, వేరే కారులో హైదరాబాద్‌ వెళ్లిన వంశీ
VNSఆంధ్రప్రదేశ్‌లోని గన్నవరం (Gannavaram) ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌ (MLA Vallabhaneni Vamsi Mohan) తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. విజయవాడ (Vijayawada) నుంచి హైదరాబాద్‌కు (Hyderabad) వస్తున్న ఆయన కాన్వాయ్‌లోని (Convay) వాహనాలు సూర్యాపేట (Suryapet) జిల్లా చివ్వెంల మండలం కాసింపేట (Kasimpet) వద్ద ఒకదానికొకటి ఢీకొన్నాయి.
WWE Event: సెప్టెంబర్ 8న హైదరాబాద్ లో డబ్ల్యూడబ్ల్యూఈ ఈవెంట్.. ఒక్క రోజులో టికెట్లు ఖాళీ
Rudraప్రపంచంలోనే ఎంతో పాప్యులర్ అయిన ‘వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్ టైన్ మెంట్’ (డబ్ల్యూడబ్ల్యూఈ) మొదటిసారి హైదరాబాద్ లో జరగబోతోంది. ఈ పోటీలకు సంబంధించిన టికెట్లను బుక్ మై షో అందుబాటులోకి తీసుకురాగా, ఒక్క రోజులోనే అన్నీ అయిపోయాయి.
Panic in Hyderabad: పాతబస్తీలో తప్పిన ఘోర ప్రమాదం.. పక్కకు ఒరిగిన నిర్మాణంలో ఉన్న 4 అంతస్తుల బిల్డింగ్.. వీడియో ఇదిగో..
Rudraపాతబస్తీలో ఘోర ప్రమాదం తప్పింది. నిర్మాణంలో ఉన్న 4 అంతస్తుల బిల్డింగ్ ప్రమాదకరంగా పక్కకు ఒరిగింది. రెండు అంతస్తుల నిర్మాణానికి అనుమతి తీసుకొని నాలుగు అంతస్తుల నిర్మాణాన్ని అక్రమంగా చేపట్టినట్టు అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు వీడియోలో..
Telangana Secretariat: తెలంగాణ నూతన సచివాలయం ప్రాంగణంలో ఆలయం, చర్చి, మసీదు... ఈ నెల 25న ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
Rudraతెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కొత్త సచివాలయంలో మరొక ఆశ్చర్యకరమైన అంశం కూడా ఉంది. ఈ సచివాలయం ప్రాంగణంలో దేవాలయం, చర్చి, మసీదు నిర్మించడం విశేషం. ఈ మూడు ప్రార్థన మందిరాలను సీఎం కేసీఆర్ ఆగస్టు 25న ప్రారంభించనున్నారు.
LB Nagar Police Third Degree On Woman: మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఎల్బీ నగర్ హెడ్ కానిస్టేబుల్ శివ శంకర్, మహిళా కానిస్టేబుల్ సుమలత సస్పెండ్
kanhaస్వాతంత్రం దినోత్సవం రోజున మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఎల్బీ నగర్ హెడ్ కానిస్టేబుల్ శివ శంకర్, మహిళా కానిస్టేబుల్ సుమలతను సస్పెండ్ చేయగా తాజాగా ఎస్ఐ రవి కుమార్ ను పోలీస్ కంట్రోల్ రూంకు బదిలీ చేశారు.
Yarravaram Bala Ugra Narasimha Swamy: ఎర్రవరం బాలనరసింహ స్వామి క్షేత్రంలో ఏ నైవేద్యం పెడితే కోరిన కోరికలు వెంటనే తీరుతాయో తెలుసా..?
kanhaబాల నరసింహ స్వామి క్షేత్రంలో ఉన్నటువంటి ఈ మహత్యాన్ని గుర్తించి ఆదిశేషువును ప్రసన్నం చేసుకునేందుకు పాలతో ఉడికించిన అన్నం అంటే పాయసం నైవేద్యంగా స్వామి వారికి సమర్పించడం ద్వారా కోరిన కోరికలు తీరుతాయని పండితులు చెబుతున్నారు.
Gannavaram MLA Vallabhaneni Vamsi Accident Video: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌‌కు తృటిలో తప్పిన ప్రమాదం, వీడియో చూస్తే షాక్ తినడం ఖాయం..
kanhaగన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌ కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. అయితే ఎమ్మెల్యేకు పెద్దగా గాయాలు కాలేదు.
Hyderabad Shocker: ఉలిక్కిపడ్డ నగరం..ముషీరాబాద్ లో పేలుడు, ఒక వ్యక్తికి తీవ్రగాయాలు..
kanhaముషీరాబాద్‌లోని స్క్రాప్‌ యార్డులో శనివారం మధ్యాహ్నం జరిగిన పేలుడులో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. స్క్రాప్ యార్డ్‌లో పనిచేస్తున్న బాధితుడు గౌసుద్దీన్ కొన్ని మెటీరియల్‌ను తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
Hyderabad Shocker: హైదరాబాద్ లో దారుణం, దివ్యాంగురాలిని బాత్రూంలో లైంగిక దాడి చేసిన యువకుడు..దారుణం
kanhaదిగ్భ్రాంతికరమైన సంఘటనలో, శుక్రవారం రాత్రి హుమాయున్‌నగర్‌లో దివ్యాంగురాలిపై ఒక వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయ్‌నగర్‌ కాలనీకి చెందిన సాయి అనే వ్యక్తి బాధితురాలి ఇంట్లోకి వెళ్లి బలవంతంగా ఇంట్లోని వాష్‌రూమ్‌లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
Viral Video: ఈ వీడియో చివర్లో లవర్స్ ఇద్దరికీ ఏమైందో తెలిస్తే షాక్ తినడం ఖాయం..ఒళ్లు గగుర్పాటు కల్పించే వీడియో ఇదే..
kanhaసోషల్ మీడియా మత్తులో పడి యువతి యువకులు బంగారు భవిష్యత్ ను నాశనం చేసుకోవద్దని ఆర్టీసీ చైర్మన్, ఐపీఎస్ ఆఫీసర్ వీసీ సజ్జనార్ తన ట్విట్టర్ లో ఓ షాకింగ్ వీడియో అప్ లోడ్ చేశారు. ఓ యువకుడు తన స్నేహితురాలిని బైక్ వెనక కూర్చోబెట్టుకొని స్టంట్స్ చేస్తు కింద పడిన ఘటన వైరల్ గా మారింది.
Viral Video: వైరల్ వీడియో.. కరీంనగర్ లో దారుణం, ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన యువకుడిని చితకబాదిన పోలీసు కానిస్టేబుల్
kanhaకరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన రోగిని చితకబాదిన ఔట్ పోస్టు కానిస్టేబుల్.
Allu Arjun: అల్లు అర్జున్ నా తరపున ప్రచారం చేస్తాడు.. పిల్లనిచ్చిన మామ చంద్రశేఖర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. రాజకీయంగా బన్నీ సేవలు అవసరమని వ్యాఖ్య
Rudraటాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ మామ (భార్య స్నేహ రెడ్డి తండ్రి), బీఆర్ఎస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవకాశం వస్తే వచ్చే ఎన్నికల్లో నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలుస్తానని చెప్పారు. తన కోసం అల్లు అర్జున్ ప్రచారాన్ని నిర్వహిస్తారని తెలిపారు.
Disco Shanti: తాళి తప్ప ఇంకేమీ మిగల్లేదు.. శ్రీహరి భార్య డిస్కో శాంతి భావోద్వేగం.. తమ ఆర్థిక స్థితి తలకిందులైందని ఆవేదన
Rudraదివంగత టాలీవుడ్ నటుడు, రియల్ స్టార్ శ్రీహరి.. నటి శాంతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. శ్రీహరి సినిమాల్లో అన్ని తరహా పాత్రలు చేసి మెప్పించారు. అయితే ఆయన 2013లో మరణించడం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు.
Brahmanandam: అంగరంగ వైభవంగా బ్రహ్మానందం చిన్న కుమారుడి వివాహం.. నూతన దంపతులను ఆశీర్వదించిన సీఎం కేసీఆర్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. వేడుకకు హాజరైన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు
Rudraప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం చిన్న కుమారుడు సిద్ధార్థ వివాహం శుక్రవారం హైదరాబాద్‌ లో అంగరంగ వైభవంగా జరిగింది. నగరానికి చెందిన డా. పద్మజ వినయ్‌ల కుమార్తె ఐశ్వర్యతో కలిసి సిద్ధార్థ వైవాహిక బంధంలో అడుగుపెట్టారు.
Steel Bridge: లోయర్ ట్యాంక్‌ బండ్ వద్ద రూ. 450 కోట్లతో స్టీల్‌ బ్రిడ్జ్ నిర్మాణం.. నేడు ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్.. హైదరాబాద్‌ లో ఇవాళ ఈ రూట్‌ లో వెళ్లొద్దు
Rudraహైదరాబాద్‌ లోని లోయర్ ట్యాంక్‌ బండ్ వద్ద స్టీల్‌ బ్రిడ్జ్ ప్రారంభం సందర్భంగా నేటి మధ్యాహ్నం వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.
AP Digital Certificates: వాహనదారులకు అలర్ట్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై డిజిటల్ సర్టిఫికేట్లనే జారీ చేసేందుకు నిర్ణయించిన ఏపీ రవాణా శాఖ
Rudraఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డ్రైవింగ్ లైసెన్సు, ఆర్‌ సీలను ఇకపై డిజిటల్ రూపంలోనే జారీ చేస్తామని రాష్ట్ర రవాణా శాఖ ప్రకటించింది. ప్లాస్టిక్ కార్డుల జారీకి స్వస్థి పలికినట్టు వెల్లడించింది.