రాష్ట్రీయం
Rains Alert to Hyderabad: రానున్న 12 గంటల్లో హైదరాబాద్‌ లో భారీ వర్షం.. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోనూ వానలు.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారుల హెచ్చరిక.. ప్రమాదకరస్థాయికి హుస్సేన్ సాగర్
Rudraతెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన నాలుగు రోజులుగా రాజధాని హైదరాబాద్ వర్షాలతో తడిసి ముద్దవుతుంది. రానున్న 12 గంటల్లో భాగ్యనగరంలో భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
PRC For Telangana Employees: తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌, రెండో పీఆర్సీ కమిటీ కోసం కసరత్తు, రిటైర్డ్ ఐఏఎస్ నేతృత్వంలో త్వరలోనే కమిటీ
VNSతెలంగాణ ప్రభుత్వం గవర్నమెంట్ ఉద్యోగులకు (Telangana Government Employees) గుడ్ న్యూస్ తెలిపింది. జీతభత్యాల సవరణకు త్వరలో పే రివిజన్ కమిషన్ (PRC)ని అమలు చేయనుంది. జులై ఆఖరులో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయనుంది. రిటైర్డ్ ఐఏఎస్ నేత‌ృత్వంలో పే రివిజన్ కమిషన్ ఏర్పాటు చేయనుంది.
Vijayashanti On Kiran Kumar Reddy: బీజేపీ ఆఫీస్‌ నుంచి మధ్యలోనే వెళ్లిపోయిన విజయశాంతి, తెలంగాణను వ్యతిరేకించిన వారితో కలిసి స్టేజి పంచుకోలేనంటూ సంచలన ట్వీట్
VNS” బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుండగా మధ్యలో ఎందుకు వచ్చేశానని పాత్రికేయ మిత్రులు అడుగుతున్నారు. అది సరికాదు. కిషన్ రెడ్డిని అభినందించి, శుభాశీస్సులు తెలియచేసిన తరువాతే వచ్చాను.
IMD Weather Forecast: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన, వచ్చే 5 రోజుల పాటు అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
Hazarath Reddyకోస్తాంధ్ర - ఒడిశాను ఆనుకుని అల్పపీడన ప్రాంతం ఏర్పడినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ, ఒడిశా, మధ్యప్రదేశ్‌, కేరళ, కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. దీంతో, ఈనెల 25 వరకు మోస్తరు నుంచి విస్తారంగా జల్లులు కరిసే అవకాశం ఉందని వెల్లడించింది.
Video: షాకింగ్ వీడియో, ఉన్నట్లుండి బస్సు టైర్ కింద తల పెట్టిన మహిళ, ప్రయాణికులు కేకలు వేయడంతో బ్రేక్ వేసిన డ్రైవర్
Hazarath Reddyజగిత్యాల - మెట్‌పల్లిలో ఆర్టీసీ డ్రైవర్ అప్రమత్తతతో ఓ ప్రమాదం తప్పింది. మెట్‌పల్లి నుంచి జగిత్యాలకు వెళుతున్న ఆర్టీసీ బస్సు టైరు కింద ఓ మహిళ తల పెట్టగా . అదే సమయంలో బస్సు ఎక్కుతున్న ప్రయాణికులు కేకలు వేయడంతో అకస్మాత్తుగా డ్రైవర్ బ్రేక్ వేశాడు. దీంతో ఆ మహిళకు ప్రాణాపాయం తప్పింది.అయితే ఆ మహిళ అలా ఎందుకు చేసిందనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Video: చేపలు ఎదురీదుతున్న వీడియో చూశారా, శ్రీరామ్ సాగర్ జలాశయం వద్ద అద్భుతమైన దృశ్యం
Hazarath Reddyనిజామాబాద్ SRSP పునరుజ్జీవం పథకంలో భాగంగా నిర్మించిన ముప్కాల్ పంప్ హౌస్ వద్ద నీరు.. శ్రీరామ్ సాగర్ జలాశయంలో కలుస్తున్న ప్రదేశంలో ఎదురీదుతున్న చేపలు. వీడియో ఇదిగో..
MLC Kavitha Challenges Dharmapuri Arvind: అర్వింద్ నీకు 24 గంటల టైం ఇస్తున్నా, నాపై చేసిన అవినీతి ఆరోపణలను దమ్ముంటే నిరూపించాలని కవిత సవాల్
Hazarath Reddyబీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌(Dharmapuri Arvind)కు 24 గంటల సమయం ఇస్తున్నానని.. తనపై చేసిన అవినీతి ఆరోపణలను నిరూపించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) సవాల్‌ విసిరారు. నిరూపించకపోతే ఆయన ముక్కు నేలకు రాయాలని డిమాండ్‌ చేశారు.
IT Hub in Nizamabad: ఐటీ హబ్‌‌గా నిజామాబాద్, సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధికి కీలకం కాబోతుందని తెలిపిన ఎమ్మెల్సీ కవిత
Hazarath Reddyదేశ చరిత్రలో నిజామాబాద్ ప్రగతికి మరో మైలురాయి నిలవబోతుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. అత్యాధునిక సదుపాయాలతో నిజామాబాద్ ఐటీ హబ్ కేంద్రంగా మారబోతుందని ట్విట్టర్ వేదికగా తెలిపారు. 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో IT హబ్ ఆధునిక వ్యాపారాల అవసరాలను తీర్చడానికి సరికొత్త ఇన్‌ఫ్రా. సౌకర్యాలను కలిగి ఉందని అన్నారు.
Mega Job Mela in Nizamabad: నిజామాబాద్‌ జిల్లాలో మెగా జాబ్‌ మేళా, సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధికి ఇది కేంద్ర బిందువు అవుతుందని తెలిపిన ఎమ్మెల్సీ కవిత
Hazarath Reddyనిజామాబాద్‌లో శుక్రవారం తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ (టాస్క్‌) ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్‌ మేళాకు విశేష స్పందన లభించింది. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించిన ఐటీ హబ్‌లో ఉద్యోగాల భర్తీ కోసం నిర్వమించిన ఈ జాబ్‌ మేళాకు పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత హాజరైంది.
Telangana Rains: వీడియో ఇదిగో, తెలంగాణలో భారీగా వర్షాలకు అడవుల నుంచి బయటికి వచ్చిన జింకలు
Hazarath Reddyఓవైపు నైరుతి రుతుపవనాలు, మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం..ఇవి చాలవన్నట్టు ఉపరితల అవర్తనం వెరసి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి.
CM Jagan on Nara Lokesh: వీడియో ఇదిగో, బావాబామర్దులపై సెటైర్లు పేల్చిన సీఎం జగన్, అమ్మాయిలతో డ్యాన్సులు, కనిపిస్తే కడుపు,లేదా ముద్దులు అంటూ..
Hazarath Reddyలోకేష్ పట్టపగలు మందు తాగుతూ, స్విమ్మింగ్ పూల్ పక్కనే అమ్మాయిలతో డాన్సులు చేస్తుంటాడు.అమ్మాయి కనిపిస్తే ముద్దు అయినా పెట్టాలి, కడుపు అయినా చేయాలి అని బాలకృష్ణ అంటాడు.చంద్రబాబుకు 70 ఏళ్లు వచ్చాయి కానీ సిగ్గు లేదు. బావా నువ్వు సినిమాల్లోనే చేశావు కానీ నేను నిజ జీవితంలో చేశాను అంటాడు - సీఎం వైఎస్ జగన్
YSR Nethanna Nestham: వారికి రూ. 24 వేలు అకౌంట్లోకి వచ్చేశాయి, వైయస్సార్ నేతన్న నేస్తం ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం జగన్
Hazarath Reddyవెంకటగిరిలో వైఎ‍స్సార్‌ నేతన్న నేస్తం ఐదో విడత నిధులను సీఎం జగన్‌ విడుదల చేశారు. అర్హులై ఉండి స్వంత మగ్గం కలిగిన ప్రతీ చేనేత కుటుంబానికి ఏడాదికి రూ. 24 వేల ఆర్థిక సాయం జగన్‌ ప్రభుత్వం అందిస్తున్న సంగతి విదితమే.
CM Jagan on Pawan Kalyan Comments: అమ్మాయిల్ని లోబర్చుకునే ఆ వ్యక్తి వలంటీర్ల గురించి నీచంగా మాట్లాడుతున్నాడు, ప్రతిపక్షాలను ఏకిపారేసిన సీఎం జగన్
Hazarath Reddyవెంకటగిరిలో వైఎ‍స్సార్‌ నేతన్న నేస్తం ఐదో విడత నిధులను సీఎం జగన్‌ విడుదల చేశారు. తిరుపతి వెంకటగిరిలో నేతన్న నేస్తం నిధుల జమ కార్యక్రమంలో సీఎం జగన్‌ ప్రసంగిస్తూ.. వలంటీర్‌ వ్యవస్థపై పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలతో పాటు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపైనా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
CM Jagan on Pawan Kalyan: వీడియో ఇదిగో, పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు, అమ్మాయిలతో అక్రమ సంబంధం పెట్టుకునే నీవా వలంటీర్ల గురించి మాట్లాడేది అంటూ ఫైర్
Hazarath Reddyసీఎం మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ అమ్మాయిలను లోబర్చుకుని, వారిని పెళ్లి చేసుకొని, నాలుగేళ్లు కాపురం చేసి వదిలేయడం. పైగా ఒకరితో వివాహబంధంలో ఉంటూ ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంటాడు. ఇతను వాలంటీర్ల గురించి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.
Telangana Floods: గోదావరి నది వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక, భద్రాచలం వద్ద ముంపుకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు
Hazarath Reddyగోదావరి నది పరీవాహక ప్రాంతం ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తున్నందున ప్రభుత్వం మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. ఈ నేపథ్యంలో చేపట్టవలసిన అత్యవసర చర్యల కోసం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి పలు ఆదేశాలు జారీ చేశారు.
Viveka Murder Case: వివేకా హత్య కేసులో ఫైనల్ చార్జీషీట్‌ను సమర్పించిన సీబీఐ, ఆగస్టు 14న విచారణకు రావాలని అవినాష్ రెడ్డికి సీబీఐ సమన్లు
Hazarath Reddyమాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఫైనల్ చార్జీషీట్ ను కోర్టుకు సీబీఐ సమర్పించింది. సీబీఐ కోర్టుకు సమర్పించిన తుది ఛార్జీషీట్ లో కీలక విషయాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో అత్యంత కీలకమైన ఆధారం గూగుల్‌ టేక్‌ అవుట్‌ గురించి తుది చార్జ్‌షీట్‌లో ఉన్నట్లు సమాచారం
Margadarsi Chit Fund Scam: మార్గదర్శి చిట్స్‌ ఫండ్స్‌పై ఛీటింగ్ కేసు నమోదు, సక్రమంగా వాయిదాలు చెల్లించినా నగదు ఇవ్వడం లేదని న్యాయవాది శ్రీనివాస్‌ ఫిర్యాదు
Hazarath Reddyమార్గదర్శి చిట్స్‌ ఫండ్‌లో మోసాలపై ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌లో గురువారం చీటింగ్‌ సహా ఇతర సెక్షన్లతో కేసు నమోదయింది.
Warning about Manholes: మ్యాన్‌ హోళ్లు తెరిస్తే క్రిమినల్‌ కేసులు.. భారీ వర్షాల నేపథ్యంలో జలమండలి వార్నింగ్‌
Rudraగడిచిన మూడురోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ జలమండలి అప్రమత్తమైంది. భారీ వర్షాలతో ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టింది.
Kishan Reddy: చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు.. అభిమానులు ఇచ్చిన ఖడ్గం ఎత్తి చూపిన కేంద్ర మంత్రి.. నేడు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్న కిషన్ రెడ్డి
Rudraకేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నా రు. ఈ నేపథ్యంలో ఆయన ఈ ఉదయం చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
Heavy Rains in Telangana: తెలంగాణలో నేడు, రేపు అతిభారీ వర్షాలు.. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దంటున్న వాతావరణశాఖ.. 24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఈ నెల 26 వరకు జోరువానలే
Rudraభారీ వర్షాలతో తెలంగాణ అతలాకుతలం అవుతున్నది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మాదిరి వర్షం కురిసే అవకాశం ఉంది.