రాష్ట్రీయం

Srivari Pushkarini to be Closed: శ్రీవారి భక్తులకు అలర్ట్, నెలరోజుల పాటు తిరుమల శ్రీవారి పుష్కరిణి మూసివేత, భారీ వర్షాలకు తగ్గిన భక్తుల రద్దీ

Hazarath Reddy

తిరుమ‌లలో శ్రీ‌వారి ఆల‌యం వద్ద గల పుష్కరిణిని నెలరోజుల పాటు మూసివేస్తున్నామని టీటీడీ అధికారులు వెల్లడించారు. పుష్కరిణీలో ఉన్న నీటిని తొలగించి పైపులైన్ల మరమ్మతులు, సివిల్ పనులు చేపట్టేందుకు ఆగస్టు 1 నుంచి 31వ తేదీ వరకు పుష్కరిణిని మూసివేస్తున్నామని తెలిపారు.

BJP Workers Protest Against MP Arvind: ఎంపీ ధర్మపురి అరవింద్‌ ఏకపక్ష నిర్ణయంపై భగ్గుమన్న బీజేపీ క్యాడర్, ఆందోళనకు దిగిన నిజామాబాద్ బీజేపీ కార్యకర్తలు

Hazarath Reddy

తెలంగాణలో గందరగోళంగా రాష్ట్ర బీజేపీ పరిస్థితి తయారైంది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు వ్యతిరేకంగా నిజామాబాద్ బీజేపీ నేతల ఆందోళన చేపట్టారు. నాంపల్లి పార్టీ కార్యాలయంలో ఆందోళనకు దిగిన నిజామాబాద్ బీజేపీ కార్యకర్తలు.

No Confidence Motion: అవిశ్వాస తీర్మానంపై విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు, అంతా సవ్యంగా సాగుతున్నప్పుడు అవిశ్వాస తీర్మానం ఎందుకని వెల్లడి

Hazarath Reddy

అంతా సవ్యంగా సాగుతున్నప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టాల్సిన అవసరం ఎక్కడిదని.. ఆ తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నామని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.

Kuppam Politics: భరత్‌ను కుప్పంలో ఎమ్మెల్యేగా గెలిపిస్తే సీఎం చేస్తాం, పొరపాటున నోరు జారిన మంత్రి పెద్దిరెడ్డి, వీడియో ఇదిగో..

Hazarath Reddy

కుప్పం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి భరత్‌ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే సీఎం చేస్తాం అంటూ మంత్రి పెద్దిరెడ్డి నోరుజారారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Andhra Pradesh: 80 రూపాయల బిర్యానీ కోసం వెళ్లి 4 లక్షలు పోగొట్టుకున్న యువకులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

భీమవరంలో 80 రూపాయల బిర్యానీ కోసం వెళ్లి 4 లక్షలు పోగొట్టుకున్న యువకులు. భీమవరం పట్టణంలోని సీతయ్య హోటల్ వద్ద స్కూటీ డిక్కీలో ఉన్న 4 లక్షల రూపాయలను దొంగ ఎత్తుకు పోయాడు.

Hyderabad Rains: హైదరాబాద్‌లో ఈ ఏరియాలకు రెడ్ అలర్ట్‌, అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక

Hazarath Reddy

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నిన్న తీవ్ర పీడనంగా మారింది. మరి కొద్ది గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఒడిశాలోని గోపాల్‌పూర్ వాతావరణశాఖ తెలిపింది. ఇది దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరానికి చేరువ అవుతోందని, దీనికి అనుబంధంగా సముద్ర ఉపరితలంలో 7.6 కిలోమీటర్ల ఎత్తులో మరో తుపాను ఆవర్తనం కొనసాగుతున్నట్టు పేర్కొంది.

IMD Weather Forecast: నేడు వాయుగుండంగా మారనున్న అల్పపీడనం, తీరప్రాంతంలో గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు, మత్స్యకారులు చేపలవేటకు వెళ్లొద్దని హెచ్చరిక

Hazarath Reddy

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నిన్న తీవ్ర పీడనంగా మారింది. మరి కొద్ది గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఒడిశాలోని గోపాల్‌పూర్ వాతావరణశాఖ తెలిపింది. ఇది దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరానికి చేరువ అవుతోందని, దీనికి అనుబంధంగా సముద్ర ఉపరితలంలో 7.6 కిలోమీటర్ల ఎత్తులో మరో తుపాను ఆవర్తనం కొనసాగుతున్నట్టు పేర్కొంది.

Viral Video: భారీ వర్షాలకు ఇంట్లోకి పాము, అధికారులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోకోవడంతో జీహెచ్ఎంసీ ఆఫీసుకి పాముని పట్టుకుపోయిన యువకుడు

Hazarath Reddy

హైదరాబాద్ - భారీ వర్షాలకు అల్వాల్ ప్రాంతంలో సంపత్ కుమార్ అనే యువకుడి ఇంట్లోకి వరద నీరుతో పాటు పాము వచ్చింది. జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసి 6 గంటలు గడిచినా ఎలాంటి స్పందన లేకపోవడంతో.. ఓపిక నశించి అల్వాల్ జీహెచ్ఎంసీ వార్డు ఆఫీసుకు పామును తీసుకొచ్చి టేబుల్ మీద పామును పెట్టి నిరసన తెలిపాడు.

Advertisement

Video: విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై లారీలో భారీగా మంటలు, కిందకు దూకి ప్రాణాలు దక్కించుకున్న డ్రైవర్

Hazarath Reddy

మంగళవారం నాడు ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల సమీపంలో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై లారీలో భారీ మంటలు చెలరేగడంతో డ్రైవర్ తృటిలో తప్పించుకున్నాడు, మంటలను చూసి డ్రైవర్ వాహనాన్ని ఆపి లారీ నుండి దూకాడు.

Telangana Floods:భారీ వరదలు, శవ దహనం కోసం ప్రాణాలు అర చేతిలో పెట్టుకొని వాగు దాటిన సిద్దిపేట గ్రామస్థులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

సిద్దిపేట - చేర్యాల మండలంలో భారీ వర్షాల వల్ల వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. శవ దహనం కోసం ప్రాణాలు అర చేతిలో పెట్టుకొని గ్రామస్థులు వాగు దాటిన కార్యక్రమం పూర్తి చేశారు. వీడియో ఇదిగో..

Telangana Shocker: సోషల్ మీడియాలో రీల్స్‌తో పాపులర్ అవుతుందని చెల్లిని రోకలి బండతో కొట్టి చంపేసిన అన్న, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదకర ఘటన

Hazarath Reddy

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం రాజీవ్‌నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. చెల్లెలు సోషల్‌ మీడియాలో వీడియోలు పెడుతోందని ఆగ్రహించిన అన్న ఆమెను రోకలిబండతో మోది హత్య చేశాడు. అనంతరం రాయి తగిలి చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేయగా.. గ్రామస్థులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు విషయం బయటపడింది.

Andhra Pradesh: డ్రైవింగ్ చేస్తూ ఇయర్ ఫోన్స్,హెడ్‌సెట్ పెట్టుకుంటే రూ. 20,000 జరిమానా, ఏపీలో రూల్స్ త్వరలో అమల్లోకి రానున్నట్లుగా వార్తలు..

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇకపై బైక్ మీద కానీ కారులో కానీ ఆటోలో కానీ ఇయర్ ఫోన్స్ లేదా హెడ్సెట్ పెట్టుకుంటే రూ. 20,000 జరిమానా వేయనుంది.

Advertisement

Video: వీడియో ఇదిగో, భారీ వర్షాలకు కృష్ణానదిలోకి భారీగా కొట్టుకువచ్చిన మొసళ్లు, నది దగ్గరకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. గత వారం రోజుల నుంచి జన జీవనం స్థంభించి పోయింది. భారీ వర్షాలకు మొసళ్లు సైతం వాగులో కొట్టుకుంటూ వచ్చాయి. తాజాగా నారాయణపేట - మక్తల్ మండలం పసుపుల గ్రామ కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షానికి వాగులో మొసళ్ళు కొట్టుకొచ్చాయి. వీడియో ఇదిగో.

No-Confidence Motion: మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన బీఆర్ఎస్, కాంగ్రెస్, నోటీసును పరిగణనలోకి తీసుకోవాలని స్పీకర్‌కు విన్నపం

Hazarath Reddy

మణిపూర్‌పై వివాదం మధ్య, కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్, బీఆర్‌ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు లోక్‌సభలో మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. లోయర్ హౌస్ స్పీకర్ ఈరోజు పార్లమెంటులో నోటీసును పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది.

Video: వీడియో ఇదిగో, రద్దీ రోడ్డులో ఒక్కసారిగా పేలిన కారు టైరు, ఈడ్చుకుంటూ వెళ్లిన లారీ, తప్పిన భారీ ప్రమాదం

Hazarath Reddy

హైదరాబాద్ - మైలార్ దేవ్‌పల్లి పరిధిలోని దుర్గానగర్లో ఆల్టో కారు టైర్ ఒక్కసారిగా పేలడంతో పక్కన వెళుతున్న లారీని ఢీకొట్టింది. కారును లారీ ఈడ్చుకుంటూ వెళ్లడంతో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. వీడియో ఇదిగో..

Telangana Schools Closed for 2 Days: రేపు,ఎల్లుండి స్కూళ్లకు సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్‌ సహా 8 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

Hazarath Reddy

భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో రేపు, ఎల్లుండి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.హైదరాబాద్‌ సహా 8 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ను వాతావరణ శాఖ జారీ చేసింది.

Advertisement

IMD Weather Forecast: అల్ప పీడనంపై ఐఎండీ తాజా అలర్ట్ ఇదిగో, రాగల 24 గంటల్లో వాయుగుండంగా బలపడనున్న అల్పపీడనం

Hazarath Reddy

బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం, అలాగే తాజా వాతావరణ పరిస్థితులపై భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) ఈ సాయంత్రం బులెటిన్ విడుదల చేసింది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలను అనుకుని పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతోందని ఐఎండీ వెల్లడించింది.

Vizag Knife Attack Case: జగన్‌పై కత్తి దాడి కేసు, ఆగస్టు 1న విచారిస్తామని తెలిపిన విజయవాడ ఎన్ఐఏ కోర్టు, కుట్రకోణంపై లోతుగా దర్యాఫ్తు చేయాలన్న పిటిషన్ ను కొట్టివేసిన ధర్మాసనం

Hazarath Reddy

తనపై 2018లో విశాఖలో జరిగిన దాడి కేసులో కుట్రకోణంపై మరింత లోతుగా దర్యాఫ్తు చేయాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తరఫు లాయర్ దాఖలు చేసిన పిటిషన్ ను విజయవాడ ఎన్ఐఏ న్యాయస్థానం కొట్టివేసింది.

Chiranjeevi: చిరంజీవిపై నమోదైన కేసును కోట్టేసిన ఏపీ హైకోర్టు, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నేతగా కోడ్ ఉల్లంఘించారని గుంటూరులో కేసు నమోదు

Hazarath Reddy

గుంటూరులో నిర్ణీత సమయంలో సభ ముగించకపోవడంతో ట్రాఫిక్‌ సమస్యలు వచ్చాయని, ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారంటూ అప్పట్లో కాంగ్రెస్‌ నేతగా ప్రచారంలో పాల్గొన్న చిరంజీవిపై కేసు నమోదు చేశారు

Kotamreddy Sridhar Reddy: నెల్లూరు రూరల్ టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్‌గా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉత్తర్వులు జారీ చేసిన తెలుగుదేశం పార్టీ

Hazarath Reddy

తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇంఛార్జిగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఆ పార్టీ నియమించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు మంగళవారం ఓ ప్రకటనలో విడుదల చేశారు.

Advertisement
Advertisement