రాష్ట్రీయం

TSRTC Tracking APP: ఇక ఆర్టీసీ బస్సు ఎక్కడుందో లైవ్ లొకేషన్ తెలుసుకోవచ్చు! 3800 బస్సులకు ట్రాకింగ్ సిస్టమ్ అమలు చేస్తున్న తెలంగాణ ఆర్టీసీ

VNS

నగరంలోని బస్సు ప్రయాణికులకు మరిన్ని మెరుగైన సేవలు అందుబాటులోకి తీసుకురావడంపై ఆర్టీసీ (RTC) యాజమాన్యం దృష్టి సారించింది. ప్రైవేటు రవాణా నుంచి పబ్లిక్‌ రవాణా విధానంలోనే మెరుగైన సేవలు అందుబాటులో ఉన్నాయని, ప్రతి బస్సు ప్రయాణికులకు తెలిసేలా యాజమాన్యం నిర్ణయం తీసుకుంటుంది. అందులో భాగంగా నగర ప్రయాణికుల కోసం ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది.

Holidays For Schools: తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు, భారీ వర్షాల కారణంగా రెండు రోజుల పాటూ హాలిడే ప్రకటించిన ప్రభుత్వం

VNS

భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో విద్యాసంస్థలకు సెలవులు (Holiday) ప్రకటించింది విద్యాశాఖ. సీఎం కేసీఆర్ (Cm KCR) ఆదేశాల మేరకు రెండు రోజుల పాటూ సెలవులు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

Andhra Pradesh: ముస్లిం మత పెద్దలతో సీఎం జగన్ భేటీ, మీరు ఎలాంటి ఆందోళనకు, భయాలకు గురికావాల్సిన అవసరం లేదని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి

Hazarath Reddy

తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌లోని ముస్లిం పెద్దలు, మత గురువులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సమావేశమయ్యారు. ఈ భేటీలో ఉమ్మడి పౌరస్మృతి అంశంపై సీఎంకు తమ అభిప్రాయాలను మత పెద్దలు తెలిపారు.

Telangana: ఏసీబీ డైరెక్టర్‌గా ఏఆర్‌ శ్రీనివాస్‌, తెలంగాణలో ఐదుగురు ఐపీఎస్‌లు బదిలీ, డ్రగ్స్‌ కంట్రోల్‌ డైరెక్టర్‌గా కమలాసన్‌రెడ్డి

Hazarath Reddy

తెలంగాణలో ఐదుగురు ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏసీబీ డైరెక్టర్‌గా ఏఆర్‌ శ్రీనివాస్‌, డ్రగ్స్‌ కంట్రోల్‌ డైరెక్టర్‌గా కమలాసన్‌రెడ్డి, హోంగార్డు డీఐజీగా అంబారి కిషోర్‌, మేడ్చల్‌ డీసీపీగా శబరీస్‌, పర్సనల్‌ అడిషనల్‌ డీజీగా సౌమ్యామిశ్రా బదిలీ అయ్యారు.

Advertisement

Telangana: పొలంలో నాటు వేస్తుండగా పాత బోరు బావిలో ఇరుక్కుపోయిన మహిళ కాలు, బోరు గొయ్యి చుట్టూ గుంత తీసి కేసింగ్ పైపు కోసి రక్షించిన అధికారులు

Hazarath Reddy

యాదాద్రి - బొమ్మలరామారంలో సోలిపేటలో ఓ రైతు పొలంలో కూలీలు నాటు వేస్తుండగా పద్మ అనే మహిళ కాలు ప్రమాదవశాత్తు పాతబోరులో ఇరుక్కుపోయింది. ప్రొక్లెయిన్ సాయంతో బోరు గొయ్యి చుట్టూ గుంత తీసి కేసింగ్ పైపు కోసి ఆమెను సురక్షితంగా బయటకు తీశారు.

Padmavati Express Derailed At Tirupati: తిరుపతిలో పట్టాలు తప్పిన పద్మావతి ఎక్స్‌ప్రెస్

kanha

పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ బుధవారం పట్టాలు తప్పింది. తిరుపతి రైల్వే స్టేషన్ 6 వ ప్లాట్‌ ఫారంలో ఎక్స్‌ప్రెస్‌లోని ఒక భోగి పట్టాలు తప్పడంతో గుర్తించిన సిబ్బంది అధికారులను అప్రమత్తం చేశారు. సత్వర చర్యలు చేపట్టిన అధికారులు సమస్యను పరిష్కరించారు. షంటింగ్ చేస్తుండగా బోగీ పట్టాలు తప్పిందని వెల్లడించారు. ఈ కారణంగా పలు రైళ్లు ఆలస్యంగా బయలుదేరనున్నాయి.

Godavari Water Level Rising: భద్రాచలం వద్ద ఉగ్రరూపం దాల్చిన గోదావరి, భక్తులు స్నానాలు చేసే సమయంలో లోతుకు వెళ్లవద్దని హెచ్చరికలు

Hazarath Reddy

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. మంగళవారం సాయంత్రం 320 అడుగులు ఉన్న నీటిమట్టం బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు 28.9 అడుగులకు చేరుకుంది.

Telangana Assembly Polls: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ షురూ.. ఎన్నికల అధికారులను నియమించిన ఈసీ 

Hazarath Reddy

తెలంగాణలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. అదే విధంగా 33 జిల్లాలకు డిస్ట్రిక్‌ ఎలక్టోరల్‌ అధికారులను సైతం నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

AP Weather Update: రేపే బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీలో నాలుగు రోజుల పాటు ఉరుములతో కూడిన భారీ వర్షాలు, అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరిక

Hazarath Reddy

వాయవ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరానికి ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రేపు అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేస్తోంది.

Rains in Telangana: తెలంగాణలో నేడు రేపు భారీ వర్షాలు, స్కూల్స్ మూతపడే అవకాశం, పలు ప్రాంతాలకు ఐఎండీ రెడ్ అలర్ట్

Hazarath Reddy

ఒడిశాను ఆనుకొని ఉన్న జార్ఖండ్‌ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉప రితల ఆవర్తనం కొనసాగు తోంది. దీని ప్రభావంతో తెలంగాణలో బుధ, గురువారా ల్లో అనేకచోట్ల భారీనుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశ ముందని హైదరాబాద్‌ వాతా వరణ కేంద్రం తెలిపింది.

AP Shocker: ఏపీలో దారుణం, గిరిజన యువకుడి నోట్లో పురుషాంగం పెట్టి మూత్రం పోసిన దుండగులు

Hazarath Reddy

ఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒంగోలులో గిరిజన యువకుడి నోట్లో దుండగులు మూత్రం పోశారు. మోటా నవీన్, మన్నె రామాంజనేయులు అలియాస్ అంజి ఇద్దరూ దొంగతనాలు చేసే పాత నేరస్థులు. వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తగా నవీన్‌ను.. అంజి మద్యం తాగుదామని కిమ్స్ ఆసుపత్రి వెనకాల వైపు తీసుకువెళ్ళాడు.

BRS Party: బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ, మహేశ్వరం మాజీ శాసనసభ్యుడు తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరికకు రంగం సిద్ధం

kanha

బీఆర్ఎస్ కీలక నేత, మహేశ్వరం మాజీ శాసనసభ్యుడు తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. తన కోడలు, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనితారెడ్డితో కలిసి తీగల కృష్ణారెడ్డి హస్తం గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో తీగల కృష్ణారెడ్డి సమావేశమయ్యారు.

Advertisement

Jr NTR Vs Nara Lokesh: ఒంగోలులో Next CM జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఫ్లెక్సీల కలకలం, లోకేష్ పాదయాత్ర నేపథ్యంలో వివాదంగా మారిన ఫ్లెక్సీ వార్..

kanha

ఒంగోలులో నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఫ్లెక్సీల కలకలం, జిల్లాలో నారా లోకేష్ పర్యటన సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల ఏర్పాటుతో చర్చనీయాంశంలా వ్యవహారం.

Andhra Pradesh Shocker: తోటికోడలు తిట్టిందని సెల్ టవర్ ఎక్కిన మహిళ, ఆందోళనలో గ్రామ ప్రజలు, వీడియో చూస్తే షాక్ తినాల్సిందే...

kanha

ప్రకాశం - కంభంలో తోటికొడలు తిట్టిందని జియో సెల్ టవర్ ఎక్కి ఓ మహిళ నిరసనకు దిగింది. తోడికోడలు స్వగ్రామమైన పెద్దారవీడులో లక్ష్మీబాయిపై కేసు పెట్టగా విచారణకు పెద్దారవీడు పోలీసులు పిలిచారు.

BRS vs Congress: ఎన్నికలయ్యే వరకు రేవంత్ రెడ్డే పీసీసీ అధ్యక్షుడిగా ఉండాలి. ఆయన ఉంటే BRS 100 సీట్లు గెలుస్తుంది - నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

kanha

ఎన్నికలయ్యే వరకు రేవంత్ రెడ్డే పీసీసీ అధ్యక్షుడిగా ఉండాలి. ఆయన ఉంటే మేము 100 సీట్లు గెలుస్తాం - నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి

YS Viveka Murder Case: వివేకా హత్య కేసు విచారణ సెప్టెంబర్ 2వ వారానికి వాయిదా, బెయిల్‌ వ్యవహారాలు ఆచితూచి ఉంటాయని తెలిపిన సుప్రీంకోర్టు

Hazarath Reddy

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వివేకా హత్య కేసు చాలా కీలకమైన అంశమని తెలిపిన ధర్మాసనం... వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలనే పిటిషన్ ను సెప్టెంబర్ 2వ వారానికి వాయిదా వేసింది.

Advertisement

Jagananna Thodu: జగనన్న తోడు నిధులు విడుదల చేసిన సీఎం జగన్, చిన్న వ్యాపారులకు రూ.549.70 కోట్ల వడ్డీ లేని రుణాలు, సకాలంలో రుణాన్ని చెల్లించిన వారికి రూ.11.03 కోట్ల వడ్డీలు

Hazarath Reddy

రాష్ట్రవ్యాప్తంగా చిరువ్యాపారులకు చేయూతనందించడానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన ‘జగనన్న తోడు’ ఏడో విడత నిధులను పంపిణీ చేశారు. చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి రూ. 549.70 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించారు. గతంలో తీసుకున్న రుణాన్ని చెల్లించిన వారికి రూ. 11.03 కోట్ల వడ్డీ డబ్బు వారి ఖాతాల్లో సీఎం జగన్ జమ చేశారు.

Weather Forecast: హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో అతి భారీ వర్షాలు, ఉత్తర తెలంగాణకు రెడ్‌ అలర్ట్‌, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక

Hazarath Reddy

నేడు, రేపు తెలంగాణలో అతిభారీ వర్షాలు కురవనున్నాయి. నైరుతి రుతుపవనాల నేపథ్యంతో వాతావరణ శాఖ ఉత్తర తెలంగాణకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది.అలాగే దక్షిణ తెలంగాణకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్‌ జారీ చేసింది. 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేయడం జరిగింది.

Revanth Reddy: వీడియో ఇదిగో, రాజీవ్ గాంధీ భార్య ఇందిరా గాంధీ అంటూ నోరు జారిన రేవంత్ రెడ్డి, సెటెర్లు వేస్తున్న బీఆర్ఎస్ నేతలు

Hazarath Reddy

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నోరు జారారు. రాజీవ్ గాంధీ భార్య ఇందిరా గాంధీ.. ప్రధాన మంత్రి, రాష్ట్రపతి పదవులను త్యజించి త్యాగానికి మారు పేరుగా నిలబడిందంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ తల్లి అనే సంగతి మరచి భార్య అని సంబోధించడం ఆయనకే చెల్లిందంటూ బీఆర్ఎస్ నేతలు ఘాటుగా సెటైర్లు వేస్తున్నారు.

Andhra Pradesh: వీడియో ఇదిగో, గోదావరిలోకి దూకి యువతి ఆత్మహత్య, పోలీసులకు క్లూ అందించిన యజమాని పెంపుడు కుక్క

Hazarath Reddy

ఏపీలో ఓ యువతి యానాం - ఎదుర్లంక బ్రిడ్జి మీద చెప్పులు వదిలి గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆమె పెంచుకున్న కుక్క యజమాని ఎంతకు తిరిగిరాకపోయేసరికి ఆమె చెప్పుల వద్దే తిరుగుతూ అక్కడే ఎదురు చూస్తూ గడిపింది.

Advertisement
Advertisement