రాష్ట్రీయం

Hyderabad Road Accident: వీడియో ఇదిగో, వరంగల్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా, పలువురు ప్రయాణికులకు గాయాలు

Hazarath Reddy

ఈరోజు తెల్లవారుజామున బీబీనగర్ మండలంలో మరో వాహనాన్ని ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో బెంగళూరు నుంచి హైదరాబాద్ మీదుగా వరంగల్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడటంతో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.

Sai Chand Dies: సాయిచంద్‌ భౌతికకాయానికి నివాళులర్పించిన సీఎం కేసీఆర్‌, తెలంగాణ సమాజం ఒక గొప్ప గాయకున్ని కోల్పోయిందని తెలిపిన కేసీఆర్

Hazarath Reddy

తెలంగాణ ఉద్యమ గాయకుడు, ప్రజా కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ (Sai Chand) ఇవాళ అక‌స్మాత్తుగా గుండెపోటుతో మృతిచెందాడు. ఆయ‌న భౌతికకాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) నివాళులు అర్పించారు.

Jithender Reddy on Bandi Sanjay: తెలంగాణ బీజేపీలో అంతర్గత కుమ్ములాట, వివాదాస్పద వీడియోతో బండి సంజయ్‌ను ట్రోల్ చేసిన జితేందర్ రెడ్డి

Hazarath Reddy

తెలంగాణలో అధికారంలోకి రావాలంటే రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఇలాంటి ట్రీట్‌మెంట్ అవసరం అంటూ బీజేపీ నేషనల్ ఎక్జిక్యూటివ్ మెంబర్ ఏపీ జితేందర్ రెడ్డి ట్వీట్ చేశారు. ఈ వీడియోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీడియో ఇదిగో..

Huge Rush at Tirumala Temple: తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ, దర్శనం కోసం 16 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు

Hazarath Reddy

తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ పెరిగింది. తొలి ఏకాదశి పర్వదినం కావడంతో స్వామివారి దర్శనం కోసం భక్తులు భారీగానే క్యూ కట్టారు. దర్శనం కోసం 16 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 15 గంటలు, ప్రత్యేక దర్శనానికి 3గంటలు సమయం పడుతోంది.

Advertisement

Outer Ring Rail: ఔటర్ రింగ్‌రోడ్డుకు సమాంతరంగా మరో ప్రాజెక్టు, సర్వేకోసం రూ.14 కోట్లు కేటాయింపు, తెలంగాణలో ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టుకు ప్లాన్‌

VNS

ఇక దీనికి తోడు ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ (Outer Ring rail) ప్రారంభించేందుకు రైల్వేశాఖ (Railway) కసరత్తు ప్రారంభించింది. ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ సర్వేకు కేంద్రం సిద్ధంగా ఉందని, తొలిసారి దేశంలో ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ ఏర్పడబోతోందని అధికారులు తెలిపారు.

Singer Sai Chand Died: గాయకుడు సాయిచంద్ హఠాన్మరణం, 39 ఏళ్లకే గుండెపోటుతో మృతి చెందిన తెలంగాణ ఉద్యమగాయకుడు, తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్

VNS

తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ వీ. సాయిచంద్‌ (Sai Chand) హఠాన్మరణం చెందారు. 39 ఏండ్ల సాయిచంద్‌.. బుధవారం సాయంత్రం తన కుటుంబ సభ్యులతో కలిసి నాగర్‌కర్నూల్ (Nagarkurnool) జిల్లా కారుకొండలోని తన ఫామ్‌హౌస్‌కు వెళ్లారు. అయితే అర్ధరాత్రి వేళ గుండెపోటు (Heart attack) రావడంతో.. చికిత్స నిమిత్తం నాగర్‌కర్నూల్‌లోని ఓ దవాఖానకు తీసుకెళ్లారు.

CM Jagan Full Speech in Kurupam: దత్తపుత్రుడిలా నలుగురిని పెళ్లి చేసుకుని భార్యను మార్చలేం, ఆ నాలుగు కోతులంటూ ప్రతిపక్షాలపై మండిపడిన సీఎం జగన్

Hazarath Reddy

పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో నిర్వహించిన జగనన్న అమ్మ ఒడి నిధుల విడుదల కార్యక్రమ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. నన్ను గుండెల్లో పెట్టుకున్న ప్రతీ ఒక్కరికి నిండు మనసుతో.. హృదయపూర్వక కృతజ్ఞతలంటూ ఆయన తన ప్రసంగం ప్రారంభించారు.

Udayagiri Politics: మేకపాటి కుటుంబానికే ఉదయగిరి టికెట్, రాజగోపాల్ రెడ్డిని వైసీపీ ఇన్‌చార్జ్‌గా ప్రకటించిన అధిష్ఠానం, చంద్రశేఖర్ రెడ్డికి చెక్ పెట్టేలా వ్యూహం

Hazarath Reddy

అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నెల్లూరు జిల్లా పెట్టని కోట. ఈ జిల్లాలో 2019 ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. 2014లోనూ మెజారిటీ సీట్లు కైవసం చేసుకుంది. అయితే ఈ మధ్య జిల్లాలో తిరుగుబాటు పరిణామాలు జగన్ ని కలవరపెడుతున్నాయి. అసమ్మతితో ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీకి దూరం అయ్యారు.

Advertisement

Navaratnalu Pedalandariki Illu: గుడ్ న్యూస్, జూలై 8న అమరావతిలో 47వేల గృహాలకు శంకుస్థాపన, నిరుపేదల సొంతింటి కల సాకారం చేయనున్న జగన్ సర్కారు

Hazarath Reddy

నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద పెద్ద ఎత్తున గృహ నిర్మాణాలను చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం త్వరలో మరో గుడ్ న్యూస్ చెప్పనుంది.సీఆర్‌డీఏ పరిధిలో ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన నిరుపేదల సొంతింటి కల సాకారం దిశగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.

Ammavodi: జగనన్న అమ్మ ఒడి నిధులు విడుదల, ఈ ఏడాది రూ.6,392.94 కోట్లు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన జగన్ సర్కారు, 4 ఏళ్లలో రూ. 26,067.28 కోట్ల విడుదల

Hazarath Reddy

వరుసగా నాలుగో ఏడాదీ 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి ‘జగనన్న అమ్మ ఒడి’ (Ammavodi) అమలు కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) నేడు శ్రీకారం చుట్టారు. పది రోజులపాటు పండుగ వాతావరణంలో రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమం నిర్వహించి 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,392.94 కోట్లు జమ చేశారు.

Amma Vodi Scheme: ఇవాళ తల్లుల ఖాతాల్లోకి అమ్మ ఒడి, పార్వతీపురం జిల్లాలో విడుదల చేయనున్న సీఎం వైయస్ జగన్, 42లక్షల మంది ఖాతాల్లోకి రూ.6వేల కోట్లు

VNS

ఏపీలోని విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ కానుంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మఒడి పథకం (amma vodi scheme) కు సంబంధించి నగదును సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM JaganMohan Reddy) బటన్ నొక్కడం ద్వారా జమ చేయనున్నారు.

Traffic Restrictions: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు, బక్రీద్ సందర్భంగా ఈ ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు నిలిపివేతలు, ప్రత్యామ్నాయ మార్గాలేవంటే?

VNS

బక్రీద్‌ (Bakrid) సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని (Hyderabad) పాత నగరంలోని (Old city) పలు ప్రాంతాల్లో గురువారం (ఈనెల 29న) పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు (Traffic Restrictions) విధించారు.

Advertisement

Eatala Rajender's Wife Jamuna: వీడియో ఇదిగో, నా భర్త హత్యకు భారీ కుట్ర జరుగుతోంది, ఈటెల రాజేందర్ భార్య జమున సంచలన ఆరోపణలు

Hazarath Reddy

Huzurabad MLA Eatala Rajender's wife, Huzurabad MLA, Eatala Rajender's wife, kill, husband, Eatala Rajender's wife Latest, Eatala Rajender's wife Press Meet, Eatala Rajender's wife Jamuna

NTR Fan Shyam's Selfie Video: జాబ్ చేయాలని ఇంట్రస్ట్ లేక ఆత్మహత్య, ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ సూసైడ్‌కు ముందు సెల్ఫీ వీడియో ఇదిగో..

Hazarath Reddy

శ్యామ్ ఆత్మహత్య కేసులో ఎన్టీఆర్ అభిమానులు అనుమానం వ్యక్తం చేశారు. తాజాగా ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ సెల్ఫీ వీడియో విడుదల అయింది. అమ్మా నాన్న నన్ను క్షమించండి, నాకు జాబ్ చేయాలని ఇంట్రస్ట్ లేదు అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నా అంటూ శ్యామ్ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Pawan Kalyan Health Update: అస్వస్థతకు గురైన పవన్ కల్యాణ్, భీమవరం నేతల భేటీ అనారోగ్యం కారణంగా వాయిదా

Hazarath Reddy

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అవిశ్రాంతంగా వారాహి యాత్ర కొనసాగిస్తుండటంతో స్వల్పంగా ఇబ్బంది పడుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

CM KCR in Maharashtra: మహారాష్ట్రలో గులాబీ తీర్థం పుచ్చుకున్న పలువురు నాయకులు, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం కేసీఆర్ వీడియో ఇదిగో..

Hazarath Reddy

షోలాపూర్‌లోని సర్కోలీలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సమక్షంలో మహారాష్ట్రకు చెందిన పలువురు నాయకులు బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

Advertisement

Telangana Shocker: దారుణం, పదవ తరగతి బాలికపై స్నేహితులు అత్యాచారం, ప్రియుడుతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు చూపి బ్లాక్ మెయిల్

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడితో పదవ తరగతి బాలిక సన్నిహితంగా ఉన్నప్పుడు రహస్యంగా ఫొటోలు, వీడియోలు తీసిన అతని స్నేహితులు.. వాటిని చూపి ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు.

Weather Forecast: రానున్న రెండ్రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు, ఐఎండీ చల్లటి కబురు ఇదిగో..

Hazarath Reddy

గత కొద్ది రోజుల నుంచి భానుడి సెగలతో ఉక్కిరిబిక్కిరి అయిన తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రానున్న రెండ్రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఈ నేపథ్యంలో వేసవి తాపం, మండే ఎండలు, వడగాడ్పుల నుంచి తెలుగు ప్రజలకు కాస్త ఉపశమనం దొరకనుంది

CM KCR in Maharashtra: వీడియో ఇదిగో, శ్రీవిట్టల్‌ రుక్మిణీ ఆలయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు, అనంతరం స‌మీప గ్రామంలోని పార్టీ కార్యకర్తల‌తో సమావేశం

Hazarath Reddy

మహారాష్ట్రలోని షోలాపూర్‌లోని పండర్‌పూర్‌లోని శ్రీ విఠల్ రుక్మిణి ఆలయంలో తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు పూజలు చేశారు. వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. దేశంలో రైతులంతా క్షేమంగా ఉండాలని ఈ సందర్భంగా సీఎం ప్రార్థించారు.

Sanjay Raut on CM KCR: వీడియో ఇదిగో, కేసీఆర్ ఆడే డ్రామాలకు తెలంగాణ కూడా పోతుంది, మహారాష్ట్ర ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

మహారాష్ట్ర రాజకీయాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రభావం ఉండదు. కేసీఆర్ ఇలా డ్రామా చేస్తే తెలంగాణ కూడా పోతుంది. నష్టం భయంతో ఆయన మహారాష్ట్రకు వచ్చారు కానీ ఆయన 12-13 మంది మంత్రులు/ఎంపీలు నిన్న కాంగ్రెస్‌లో చేరారు. ఇది కేసీఆర్, కాంగ్రెస్ మధ్య పోరు. మహారాష్ట్రలో ఎంవీఏ బలంగా ఉంది: ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఎంపీ సంజయ్ రౌత్

Advertisement
Advertisement