రాష్ట్రీయం

Flyover Ramp Collapse: ఎల్బీనగర్‌లో ఘోర ప్రమాదం, నిర్మాణం మధ్యలోనే కుప్పకూలిన ఫ్లై ఓవర్, 10మందికి గాయాలు, నలుగురి పరిస్థితి విషమం

VNS

ప్లై ఓవర్ పిల్లర్ల మధ్య ఇనుప ర్యాంప్ ఏర్పాటు చేస్తుండగా ఒక్కసారిగా అది కూలిపోయింది(Flyover Ramp Collapse). ఈ ఘటనలో 10మందికి గాయాలయ్యాయి. వారిని హుటాహుటీని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే గాయపడిన కార్మికులంతా బీహార్‌కు చెందిన వారిగా తెలుస్తోంది.

Southwest Monsoon: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ చల్లని కబురు, రాగల మూడు రోజుల్లో రెండు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు

Hazarath Reddy

ఈ నెల 11 నుంచి కర్ణాటక-ఏపీ సరిహద్దుల వద్ద నిలిచిపోయిన రుతుపవనాల్లో కదలిక ప్రారంభమైంది. మంగళవారం ఏపీలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయి. దీని ప్రభావంతో ఏపీలోని పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.

Hyderabad: నెలకి రూ.300 బిల్లు వచ్చే ఇంటికి రూ. 8 లక్షలు కరెంట్ బిల్లు వేసిన అధికారులు, లబోదిబోమంటూ తలలు పట్టుకున్న ఇంటి యజమాని

Hazarath Reddy

ఉప్పల్ పరిధిలోని హైకోర్టు కాలనీలో ఓ ఇంటి కరెంట్ బిల్లు ఏకంగా ఏడు లక్షల తొంబై ఏడువేల ఐదువందల డెభై ఆరు రూపాయలు రావడంతో ఆ యజమాని గుండె గుభేల్లుమంది. గ్రౌండ్ ఫ్లోర్లో ఖాళీగా ఉన్న పోర్షన్ కి ప్రతి నెల మూడువందల లోపు కరెంట్ బిల్లు వచ్చేది.

Man Sets His Bike on fire: పెండింగ్ చలాన్ కట్టమన్నందుకు బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, పోలీసులను దుర్భాషలాడి మరీ నిప్పు..

Hazarath Reddy

శంషాబాద్ బెంగుళూరు జాతీయ రహదారిపై ట్రాఫిక్ పోలీసులు ఆపి పెండింగ్ చాలన్ కట్టాలని చెప్పడంతో వాగ్వాదానికి దిగిన ఫసియుద్దీన్ అనే యువకుడు. ట్రాఫిక్ పోలీసులను దుర్భాషలాడి తన యాక్టివా బండికి నిప్పు పెట్టిన యువకుడు.

Advertisement

Vijayawada Rain Video: వీడియో ఇదిగో, విజయవాడను కుమ్మేసిన భారీ వర్షం, రెండు గంటల నుంచి ఏకధాటిగా కురుస్తున్న వాన

Hazarath Reddy

భగ భగ మండే ఎండల నుంచి ఏపీ ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. విజయవాడలో మంగళవారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురుస్తోంది. దాదాపు రెండు గంటలుగా భారీ వర్షం కురుస్తుండటంతో నగర వాసులకు ఊరట లభించింది. భారీ వర్షం నేపథ్యంలో నగరంలోని పలు రోడ్లు జలమయ్యాయి.

Telangana: మళ్లీ అధికారం మనదే, హ్యట్రిక్ కొట్టబోతున్నామని తెలిపిన సీఎం కేసీఆర్, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేసి తీరుతామని స్పష్టం

Hazarath Reddy

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని తుమ్మలూరులో నిర్వహించిన హరితోత్సవంలో సీఎం కేసీఆర్‌ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటే పాలమూరు పూర్తి కావాల్సిందని, పుణ్యాత్ములు కాంగ్రెసోళ్ల వల్లే ఆలస్యమైందని తెలిపారు.

Jai Telugu Party: ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ, జై తెలుగు పేరుతో పార్టీని ప్రారంభించిన సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్టం

Hazarath Reddy

ఏపీలో ఎటువంటి చడీ చప్పుడు లేకుండా కొత్త పార్టీ ఆవిర్భవించింది. తెలుగు భాషా పరిరక్షణ కోసం అంటూ జై తెలుగు పార్టీని కవి, సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు ప్రారంభించారు.

Jagananna Animutyalu: విద్యార్థులకు భరోసా, మీకు జగన్‌ మామ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపిన సీఎం జగన్, టాపర్లకు బహుమతులు ప్రదానం చేసిన ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

మంగళవారం జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమం కింద టాపర్స్‌ను విజయవాడలో సన్మానించే కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగించారు. ఏపీ ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. మట్టి నుంచి గట్టిగా పెరిగిన ఈ మొక్కలు.. మహావృక్షాలై.. రేపు ప్రపంచానికి ఫలాలు అందించాలని ఆకాంక్షించారు ప్రభుత్వం గర్వంగా చెప్పుకోదగ్గ బ్రైట్‌ మైండ్స్‌.. షైనింగ్‌ స్టార్‌, ఫ్యూచర్‌ ఆఫ్‌ ఏపీ మనదని ఉద్ఘాటించారు.

Advertisement

Double Bedroom Houses: ఈనెల జూన్ 22న కేసీఆర్ చేతుల మీదుగా 15,660 డబుల్ బెడ్ రూం ఇళ్ళ పంపిణీ

Hazarath Reddy

ఈనెల జూన్ 22న కేసీఆర్ చేతుల మీదుగా కొల్లూరులోని 15,660 డబుల్ బెడ్ రూం ఇళ్ళ పంపిణీ ప్రారంభం కానుంది. ఇప్పటికే అక్కడ ఇళ్ల నిర్మాణం పూర్తి అయింది.

Ajit Pawar on CM KCR: కేసీఆర్‌కు మహారాష్ట్రలో అంత సీన్ లేదు, ఎన్సీపీ నేత అజిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు, ఆ ప్రచార డబ్బంతా ఎక్కడిది అంటూ విమర్శలు

Hazarath Reddy

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్రలో తన స్థావరాన్ని విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, ఆ రాష్ట్రంలో అడుగుపెట్టేందుకు ఆయన సఫలం కాలేడని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) నేత అజిత్ పవార్ (Ajit Pawar on CM KCR) సోమవారం అన్నారు

Mahesh Bank Case: కోర్టు ధిక్కరణ కేసులో ఆర్‌బీఐ గవర్నర్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు, జులై 7లోపు వివరణ ఇవ్వాలని ఆదేశాలు

Hazarath Reddy

మహేష్ బ్యాంకు కోర్టు ధిక్కరణ కేసులో ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గతంలో జారీ చేసిన కోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదంటూ ఏపీ మహేశ్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ వాటాదారులు కోర్టుకు వెళ్లారు.

Mudragada Letter to Pawan Kalyan: లెటర్ ఇదిగో, ఇప్పటి వరకు ఎంత మంది తాట తీశావో చెప్పు, పవన్ కళ్యాణ్‌కి ఘాటు లేఖ రాసిన ముద్రగడ పద్మనాభం

Hazarath Reddy

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఘాటు లేఖ రాశారు. పార్టీ పెట్టిన తర్వాత 10 మందితో ప్రేమించబడేలా ఉండాలని... వీధి రౌడీలా మాట్లాడటం ఎంత వరకు సబబని లేఖలో ఆయన ప్రశ్నించారు. మీ ప్రసంగాల్లో తాట తీస్తా, నార తీస్తా, గుండు గీయిస్తా, కింద కూర్చోబెడతా, చెప్పుతో కొడతా అంటూ పదేపదే అంటున్నారని... ఇప్పటి వరకు ఎంత మందిని ఇలా చేశారో చెప్పాలని అన్నారు.

Advertisement

Kalyanam at Yellamma Devasthanam: కన్నుల పండువగా బల్కంపేట్‌ ఎల్లమ్మ కల్యాణం.. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన సీఎం కేసీఆర్ సతీమణి శోభ, కుమార్తె కవిత.. వీడియో ఇదిగో

Rudra

తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బల్కంపేట్‌ ఎల్లమ్మ కల్యాణం నేడు. ఈ సందర్భంగా మంగళ, బుధవారాల్లో ఆలయం పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్‌ అదనపు సీపీ సుధీర్‌బాబు వివరించారు. మంగళవారం కల్యాణోత్సవం, బుధవారం రథోత్సవ కార్యక్రమాలుంటాయని తెలిపారు. కళ్యాణం సందర్భంగా సీఎం కేసీఆర్ సతీమణి శోభ, కుమార్తె కవిత ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

Andhra Pradesh Shocker: పదిహేనేండ్ల బాలికపై రెండేళ్లుగా పూర్ణానంద స్వామీజీ అత్యాచారం.. బాలికను గొలుసులతో తన గదిలో బంధించి అఘాయిత్యం.. పనిమనిషి సాయంతో ఆశ్రమం నుంచి తప్పించుకున్న బాలిక.. అర్ధరాత్రి స్వామీజీ అరెస్ట్

Rudra

విశాఖపట్టణంలోని జ్ఞానానంద ఆశ్రమ నిర్వాహకుడు పూర్ణానంద స్వామీజీకి సంబంధించి సంచలన ఘటన కలకలం సృష్టిస్తుంది. అత్యాచారం ఆరోపణలపై స్వామీజీ అరెస్టయ్యారు. స్వామీజీ తనపై రెండేళ్లుగా అత్యాచారం చేస్తున్నారన్న రాజమహేంద్రవరానికి చెందిన అనాథ బాలిక (15) ఫిర్యాదుపై గత అర్ధరాత్రి స్వామీజీని పోలీసులు అరెస్ట్ చేశారు.

Telangana Govt. Hikes DA: తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 2.73 శాతం డీఏ మంజూరు.. పెంచిన డీఏ 2022 జనవరి నుండి అమల్లోకి... 7.28లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి

Rudra

ఉద్యోగులకు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏను విడుదల చేసింది. ఉద్యోగుల మూల వేతనం, పెన్షన్‌పై 2.73 శాతం డీఏ పెరగనుంది. ఉద్యోగుల డీఏను పెంచుతూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ నెల నుండి డీఏను పెంచింది.

Ramcharan Upasana Blessed With Baby Girl: మెగా ఇంట సంబరాలు.. అమ్మానాన్నలైన రామ్‌ చరణ్‌-ఉపాసన దంపతులు.. నేడు తెల్లవారుజామున పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఉపాసన.. మెగా ఇంట మిన్నంటిన సంబరాలు, యువరాణి వచ్చిందంటూ మెగా ఫ్యామిలీ ప్రకటన

Rudra

మెగా ఫ్యామిలీ ఇంట సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. మెగా కుటుంబం, మెగాభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అద్భుతమైన క్షణం రానే వచ్చింది. రామ్ చరణ్, ఉపాసన అమ్మానాన్నలు అయ్యారు. జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో మంగళవారం తెల్లవారుజామున ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు.

Advertisement

National Water Awards to AP: ఆంధ్రప్రదేశ్‌కు నాలుగు జాతీయ జల అవార్డులు, అధికారులను అభినందించిన సీఎం జగన్‌

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌కు నాలుగు జాతీయ జల అవార్డులు (నేషనల్ వాటర్‌ అవార్డ్స్‌ 2022) దక్కించుకోవడంపై మంత్రి అంబటి రాంబాబు, అధికారులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు.

Hyderabad Shocker: తెలంగాణలో ఘోర విషాదాలు, చిన్న పిల్లల్ని ముందు చంపి తరువాత ఆత్మహత్య చేసుకున్న తల్లిదండ్రులు

Hazarath Reddy

సికింద్రాబాద్ బన్సీలాల్ పేట్ డివిజన్ జివై రెడ్డి బస్తీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ తల్లి తన పిల్లలిద్దరినీ భవనంపై నుంచి తోసిపడేసి అనంతరం తాను దూకి ఆత్మహత్య చేసుకుంది. గత కొన్ని రోజులుగా మహిళ భర్త అదనపు కట్నం కోసం వేధింపులు మొదలుపెట్టాడు

Heatwave in AP: ఏపీలో 300 మండలాలకు వడగాల్పుల హెచ్చరిక, అవసరమైతేనే బయటకు రావాలని సూచన, రెండు రోజుల తర్వాత ఏపీలో రుతుపవనాల ప్రభావం

Hazarath Reddy

వచ్చే వారం నుండి హీట్‌వేవ్స్ తగ్గుముఖం పట్టవచ్చని IMD-అమరావతి అంచనా వేసినందున, ఆంధ్రప్రదేశ్ సోమవారం (జూన్ 20) నుండి హీట్‌వేవ్ పరిస్థితుల నుండి ఉపశమనం పొందే అవకాశం ఉంది .

Indonesia Open 2023: ఇండోనేసియా ఓపెన్‌ టైటిల్‌ గెలిచిన సాత్విక్‌-చిరాగ్‌ శెట్టి జోడీకి సీఎం జగన్ అభినందనలు, ట్వీట్ ఇదిగో..

Hazarath Reddy

ఇండోనేసియా ఓపెన్‌ టైటిల్‌ గెలిచిన సాత్విక్‌-చిరాగ్‌ శెట్టి జోడీని సీఎం జగన్‌ ట్విటర్‌ వేదికగా మరోసారి అభినందించారు. మన తెలుగు కుర్రాడు సాత్విక్‌సాయిరాజ్‌తో పాటు అతనికి జోడీగా టైటిల్‌ నెగ్గిన శెట్టి చిరాగ్‌కు సైతం సీఎం జగన్‌ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు

Advertisement
Advertisement