రాష్ట్రీయం
Andhra Pradesh: నడిరోడ్డుపై బ్యాటరీ బైక్ దగ్ధం.. పార్కింగ్ చేసి దుకాణం వద్దకు వెళ్లగా అంతలోనే పేలిన బైక్, వీడియో ఇదిగో
Arun Charagondaనడిరోడ్డుపై బ్యాటరీ బైక్ దగ్ధం అయిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంది. కోనసీమ జిల్లా రావులపాలెంలో సత్తి పెద్దిరెడ్డి అనే వ్యక్తి బ్యాటరీ బండిని రోడ్డుపై పార్కింగ్ చేసి ఒక దుకాణం వద్దకు వెళ్ళగా ఈలోపు పేలి తగలబడిపోయింది.
Andhra Pradesh: శేషాచలం అడవుల్లో అరుదైన పిల్లి హల్‌చల్.. వెటర్నరీ హాస్పిటల్‌కు తీసుకువెళ్లి చికిత్స అందించి అడవిలో వదిలేసిన అధికారులు, వీడియో
Arun Charagondaఆంధ్రప్రదేశ్‌లో అరుదైన పిల్లి హల్ చల్ చేసింది. ఎక్కువగా తిరుమల శేషాచలం అడవుల్లో సంచరించే పునుగు పిల్లి ప్రస్తుతం గుంటూరు జిల్లా తాడేపల్లిలో ప్రత్యక్షమైంది.
Telangana:మోడీ సానుభూతితో ఉంటే.. కిషన్ రెడ్డి పగతో ఉన్నాడు.. ఆయన బాధెంటో అర్థం కావడం లేదన్న సీఎం రేవంత్ రెడ్డి
Arun Charagondaతెలంగాణ పట్ల మోడీ సానుభూతితో ఉంటే కిషన్ రెడ్డి మాత్రం పగతో ఉన్నాడు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన చీకటి మిత్రుడు కేసీఆర్ దిగిపోయాడని కిషన్ రెడ్డి దుఃఖంలో ఉన్నాడు అన్నారు.
Telangana: వీరంగం సృష్టించిన గంజాయి స్మగ్లర్లు.. చెక్పోస్ట్ వద్ద కానిస్టేబుల్ని బైక్తో ఢీ కొట్టి పరారైన గంజాయి స్మగ్లర్లు, గతంలో ఇదే చెక్‌పోస్ట్ వద్ద ఘటన
Arun Charagondaగంజాయి స్మగ్లర్లు వీరంగం సృష్టించారు . చెక్పోస్ట్ వద్ద కానిస్టేబుల్ని బైక్తో ఢీ కొట్టి పరారయ్యారు గంజాయి స్మగ్లర్లు. కొద్ది రోజుల క్రితం ఇదే చెక్పోస్ట్ దగ్గర కానిస్టేబుల్ను ఢీ కొట్టారు గంజాయి స్మగ్లర్లు.
SBI ATM Heist: ఏటీఎంలో చోరీ.. రూ.30 లక్షలు ఎత్తుకెళ్లిన దొంగలు, రంగారెడ్డి జిల్లా ఎస్‌బీఐ ఏటీఎంలో దొంగతనం, 4 నిమిషాల్లోనే చోరీ, పరార్
Arun Charagondaఏటీఎంలో చోరీ.. రూ.30 లక్షలు ఎత్తుకెళ్లారు దొంగలు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాలలోని SBI ఏటీఎంలో దొంగతనం జరిగింది
CM Revanth Reddy: వనపర్తి వెంకటేశ్వర స్వామి ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, వివరాలివే
Arun Charagondaవనపర్తిలోని వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
Hyderabad: హైదరాబాద్ సరూర్‌నగర్‌లో 10 మంది ట్రాన్స్‌జెండర్లు అరెస్ట్.. అర్ధరాత్రి రోడ్ల పైకి భయబ్రాంతులకు గురిచేస్తున్నారని స్థానికుల ఫిర్యాదు, పోలీస్ కేసు నమోదు
Arun Charagondaహైదరాబాద్ సరూర్‌నగర్‌లో 10 మంది ట్రాన్స్‌జెండర్లను అరెస్ట్ చేశారు పోలీసులు. సరూర్‌నగర్ P&T కాలనీలో నివాసం ఉంటూ రెడ్ లైట్ ఏరియాగా మార్చారు ట్రాన్స్‌జెండర్లు
Bhatti Vikramarka: ఇకపై ప్రతి ఏటా భక్త రామదాసు జయంతి ఉత్సవాలు.. ప్రజా ప్రభుత్వం కళలను ప్రోత్సహిస్తుందన్న భట్టి విక్రమార్క, ఉగాదికి గద్దర్ అవార్డులు ఇస్తామని వెల్లడి
Arun Charagondaతెలంగాణలో ప్రతి ఏటా భక్త రామదాసు జయంతి ఉత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka).హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన శ్రీ భక్త రామదాసు జయంతి ఉత్సవాల కార్యక్రమంలో మాట్లాడారు భట్టి.
Karimnagar: పెళ్లికి నిరాకరించిందని యువతి తల్లిపై యువకుడు దాడి.. గొంతు నులిమి హత్య చేసేందుకు ప్రయత్నం, రక్షించిన స్థానికులు, వీడియో ఇదిగో
Arun Charagondaపెళ్లికి నిరాకరించిందని యువతి తల్లిపై ఓ యువకుడు దాడి చేసిన సంఘటన కరీంనగర్‌లో చోటు చేసుకుంది. రామడుగు మండలం వన్నారానికి చెందిన రాజ్ కుమార్ అదే గ్రామానికి ఓ యువతిని పెళ్లిచేసుకుంటానని వెంట పడ్డాడు.
Andhra Pradesh: ఏపీ ఉమెన్ ఎంపవర్‌మెంట్ బ్రాండ్ అంబాసిడర్‌గా హీరోయిన్ మీనాక్షి చౌదరి.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Arun Charagondaఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ఉమెన్ ఎంపవర్‌మెంట్ బ్రాండ్ అంబాసిడర్‌గా హీరోయిన్ మీనాక్షి చౌదరి(Actress Meenakshi Chaudhary)ని నియమించింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
Tattoos May Cause HIV, Cancer: పచ్చ బొట్లతో హెచ్‌ఐవీ, క్యాన్సర్ వచ్చే ప్రమాదం.. కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం
Rudraపచ్చ బొట్లతో చర్మ వ్యాధులు, చర్మ క్యాన్సర్, హెపటైటిస్-బీ, సీ, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌తో పాటు హెచ్‌ఐవీ కూడా సంక్రమించే ప్రమాదముందని కర్ణాటక ప్రభుత్వవర్గాలు చెప్తున్నాయి.
Telangana: భర్తను వదిలేసి ప్రియుడితో భార్య జంప్.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు ప్రయత్నించిన భర్త, బస్ ఎక్కి పరారైన జంట, వీడియో ఇదిగో
Arun Charagondaభర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి సోషల్ మీడియాలో పరిచయమైన ప్రియుడితో పారిపోయింది వివాహిత . మేడ్చల్ జిల్లా పేట్ బాషీరాబాద్ పీయస్ పరిధిలో గతనెల 5న తన భార్య సుకన్య(35) కనిపించడం లేదంటూ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు భర్త జయరాజ్.
Medak Horror: పరీక్షల భయంతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. మెదక్ లో ఘటన
Rudraపరీక్షల భయంతో ఇంటర్మీడియట్ చదువుతున్న ఓ విద్యార్థి ఫ్యాన్ కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
SLBC Tunnel Collapse Update: ఎస్‌ఎల్‌బీసీ సొరంగం వద్దకు నేడు సీఎం రేవంత్ రెడ్డి.. పూర్తి వివరాలు ఇవిగో..!
Rudraఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది సజీవంగా ఉన్నారా? లేదా? అనే విషయమై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టన్నల్ లో చిక్కుకున్న వారిని బయటకు తీసే సహాయక చర్యలు గత 8 రోజులుగా కొనసాగుతున్నాయి.
Fancy Number Auction In Hyderabad: రంగారెడ్డి రవాణా శాఖ కార్యాలయంలో ఫ్యాన్సీ నెంబర్ల వేలం.. ఒక్క రోజులోనే రవాణా శాఖకు రూ.37 లక్షల ఆదాయం
Rudraవాహనాల ఫ్యాన్సీ నంబర్లు రవాణా శాఖకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఫ్యాన్సీ నంబర్ల కోసం ఎంత ధర అయినా సరే కొనాల్సిందే అంటున్నారు పలువురు ఆశావహులు.
Tamil Nadu Horror: చర్చి పండుగలో విషాదం… కరెంట్ షాక్ తో నలుగురు యువకులు మృతి.. తమిళనాడులో ఘటన (వీడియో)
Rudraతమిళనాడులోని కన్యాకుమారి ప్రాంతంలో ఘోరం జరిగింది. చర్చి పండుగలో పెను విషాదం చోటుచేసుకుంది. ఎనాయం పుత్తేంతురైలో సెయింట్ ఆంథోనీ చర్చిలో ఉత్సవాలు జరుగుతుండగా కరెంట్ షాక్ తగిలి నలుగురు యువకులు ఘటనా స్థలంలోనే మృత్యువాతపడ్డారు.
Ramadan 2025 Wishes: నేటి నుంచి రంజాన్ మాసం... ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్, లోకేశ్
Rudraముస్లిం సోదరులు పరమ పవిత్రంగా భావించే రంజాన్ మాసం నేటి నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు పలువురు నేతలు శుభాకాంక్షలు తెలిపారు.
Warangal Airport: నిత్యం రద్దీగా ఉండేలా వరంగల్ ఎయిర్‌పోర్టు డిజైన్, భూసేకరణ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ ఆదేశం
VNSమామునూరు విమానాశ్రయం (Warangal Airport) అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎయిర్‌పోర్టుపై సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) శనివారం సమీక్ష నిర్వహించారు. భూసేకరణ, పెండింగ్ పనుల వివరాలు ఆరా తీశారు. కేరళలోని కొచ్చి విమానాశ్రయం తరహాలో మామునూరు విమానాశ్రయం ఉండాలని సూచించారు.
KCR Wishes To Muslims: రేపటి నుంచే పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం, శుభాకాంక్షలు తెలిపిన మాజీ సీఎం కేసీఆర్
VNSరేపట్నుంచి పవిత్ర రంజాన్ మాసం (Ramzan Month) ప్రారంభవుతున్న సందర్భంగా ముస్లిం సోదరులకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ (KCR) శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్ మాసంలో ఆచరించే కఠోర ఉపవాసం, దైవ ప్రార్థనలు ఆధ్యాత్మికతను, జీవిత పరమార్థాన్ని ఎరుకపరిచి, క్రమశిక్షణను పెంపొదిస్తామని అన్నారు.
NTR Bharosa Pension Distribution: ఏసీ గదుల్లో కూర్చుంటే కష్టాలు తెలియవు.. అధికారులకు చంద్రబాబు హెచ్చరిక, రూ.200 పెన్షన్‌ని రూ.4వేలు చేశామని వెల్లడి
Arun Charagondaఏసీ గదుల్లో కూర్చుంటే పేదల సమస్యలు, కష్టాలు తెలియవు అని వెల్లడించారు ఏపీ సీఎం చంద్రబాబు(AP CM Chandrababu). క్షేత్రస్థాయిలో తిరిగితేనే అధికారులకు ప్రజల బాధలు తెలుస్తాయి అన్నారు.