ఆంధ్ర ప్రదేశ్

Andhra Pradesh Shocker: కర్నూలు జిల్లాలో టిడిపి నేత దారుణ హత్య, మాజీ సర్పంచ్ భర్త శ్రీనివాసుని హతమార్చిన దుండగులు

Arun Charagonda

ఏపీలో హత్యారాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా కర్నూలు జిల్లాలో టిడిపి నేత దారుణ హత్యకు గురయ్యాడు. పత్తికొండ మండలం హోసూరులో మాజీ సర్పంచ్ వాకిటి శారద భర్త శ్రీనివాసుని హతమార్చారు దుండగులు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Visakhapatnam: గిన్నెలు కడగలేదని కూతురుపై తల్లి దాడి, బాలికకు తీవ్ర గాయాలు, ఆస్పత్రిలో చేరిక

Arun Charagonda

విశాఖపట్నంలో అమానుషం చోటు చేసుకుంది. గిన్నెలు కడగ లేదనే నెపంతో ఓ తల్లి దారుణానికి తెగబడింది. విశాఖపట్నం సింహాద్రి నగర్ లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 13 సంవత్సరాల బాలికపై తన తల్లి తీవ్రంగా దాడి చేయగా ఆసుపత్రిలో గాయాలతో చికిత్స పొందుతోంది బాలిక.

Fire Accident At Vishakapatnam Beach: విశాఖ బీచ్‌లో అగ్నిప్రమాదం, డైనో పార్కులో చెలరేగిన మంటలు, లక్షల రూపాయల ఆస్తి నష్టం

Arun Charagonda

విశాఖ బీచ్ రోడ్డులోని డైనో పార్క్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా పార్క్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగగా లక్షల్లో ఆస్తి నష్టం జరిగిందని నిర్వాహకులు వెల్లడించారు. మంటలు భారీగా ఎగిసిపడుతుండటంతో అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

Tungabhadra Dam: తుంగభద్ర డ్యామ్‌ను పరిశీలించిన కర్ణాటక సీఎం సిద్దరామయ్య, ఏపీ మంత్రులు, నిర్వహణ లోపంపై చర్చ

Arun Charagonda

భారీ వర్షాలకు తుంగభద్ర డ్యామ్‌లోని 19వ గేటు కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. చైన్ లింక్ తెగిపోవడంతో గేటు కొట్టుకుపోగా 70 ఏండ్ల డ్యామ్‌ చరిత్రలో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి. ఇక ఇవాళ తుంగభద్ర డ్యామ్‌ను పరిశీలించారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. అనంతరం ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

Advertisement

Andhra Pradesh Shocker: అనుమానంతో భార్యను కత్తితో నరికి చంపిన భర్త, పరారీలో నిందితుడు, పోలీసుల గాలింపు ముమ్మరం

Arun Charagonda

తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తపట్నంలో దారుణం చోటు చేసుకుంది. అనుమానంతో భార్యను కత్తితో నరికి చంపాడు భర్త. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పరారీలో ఉన్న నిందితుని గాలింపు చర్యలు చేపట్టారు.

Leopard Caught On Srisailam: వీడియో ఇదిగో.. శ్రీశైలంలో చిరుత పులి సంచారం, ఓ ఇంట్లో కుక్కను ఎత్తుకెళ్లిన చిరుత పులి, సీసీటీవీలో రికార్డు అయిన దృశ్యాలు

Arun Charagonda

శ్రీశైలంలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. పాతాళగంగ మార్గంలోని దేవస్థానం ఏఈఓ మోహన్ ఇంటి వద్ద చిరుత సంచారం సీసీ టీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఇంటి ప్రహరీ గోడ పై నడుచుకుంటూ వచ్చి కుక్కను ఎత్తుకెళ్లింది చిరుత పులి. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు

Jurala Dam: జూరాల డ్యామ్‌ లో లీకేజీలు... తుంగభద్ర గేట్ ఘటన నేపథ్యంలో జూరాల డ్యామ్ భద్రతపై అనుమానాలు.. ప్రవాహం తగ్గడంతో గేట్లు మూసివేత (వీడియో)

Rudra

తుంగభద్ర డ్యామ్ లో ఓ గేటు ఇటీవల కొట్టుకుపోవడం ఆ డ్యాం భద్రతపై అనుమానాలను రేకెత్తించింది. గేటు కొట్టుకుపోవడంతో భారీ ఎత్తున నీరు వృథాగా పోయింది. వేల ఎకరాల్లోని పంట నీట మునిగింది.

Visakha MLC By Elections: సీఎం చంద్రబాబు వెనకడుగు, విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటికి దూరం, వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఎన్నిక ఏకగ్రీవమే!

Arun Charagonda

అంతా ఉహించిందే జరిగింది. బలం లేని చోట పోటీ చేసి పరువు పొగొట్టుకోవడం కంటే పోటీ చేయకపోవడమే ఉత్తమమని భావించారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇవాళ మధ్యాహ్నంతో నామినేషన్ గడువు ముగస్తుండగా పోటీ చేయట్లేదని ప్రకటించారు చంద్రబాబు. ఇందుకు సంబంధించి విశాఖ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. బలం లేకుండా పోటీ చేయడం సరికాదని కేడర్‌కు తేల్చి చెప్పారు చంద్రబాబు.

Advertisement

Sagar, Srisailam Gates Closed: తగ్గిన వరద.. శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయం అన్ని గేట్లు మూసివేత.. చేపల వేటకు మత్స్యకారులు

Rudra

ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గిన నేపథ్యంలో శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలకు వరద ప్రవాహం తగ్గింది. దీంతో అన్ని గేట్లను అధికారులు మూసి వేస్తున్నారు.

ACB Raids in Jogi Ramesh Residence: మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు.. ఉదయం 5 గంటల నుంచి తనిఖీలు.. అగ్రి గోల్డ్ భూములకు సంబంధించే ఈ దాడులు

Rudra

మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో మంగళవారం తెల్లవారుజామున నుంచి ఏసీబీ సోదాలు చేస్తోంది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని రమేష్ నివాసంలో 15 మంది అధికారుల బృందం రంగంలోకి దిగి సోదాలు చేపట్టింది.

Vangalapudi Anitha On YS Jagan: జగన్‌ను జైల్లో వేయాలి, భద్రత తొలగింపుపై అన్నీ అబద్దాలే, తప్పు చేసిన వారు జైలుకు వెళ్లాల్సిందేనన్న ఏపీ హోంమంత్రి అనిత

Arun Charagonda

మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌ను జైలులో వేయాలన్నారు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత. మీడియాతో మాట్లాడిన అనిత..తన భద్రత కుదింపుపై జగన్ అనవసరంగా ఆందోళన చెందుతున్నారన్నారు. గతంలో జగన్ 950 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేసుకున్నారని అది ఒక గ్రామం ఓటింగ్‌తో సమానమని ఇప్పుడు అంతమంది పోలీసులు లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారన్నారు.

Botsa Satyanarayana Files Nomination: విశాఖ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స నామినేషన్, రాజకీయాలను వ్యాపారం చేశారని సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు

Arun Charagonda

విశాఖపట్నం ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు మాజీ మంత్రి, వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు బొత్స. రాజకీయాలను టీడీపీ నేతలు వ్యాపారంగా మార్చారని తెలిపారు.

Advertisement

Nellore: కుటుంబ కలహాలు, పట్టాలపై పడుకొని ఆత్మహత్యయత్నం, కాపాడిన కానిస్టేబుల్..వీడియో వైరల్

Arun Charagonda

పట్టాలపై పడుకొని ఆత్మహత్యాయత్నం చేసుకోబోయాడు ఓ యువకుడు. నెల్లూరు - రంగనాయకులపేటకి చెందిన రాజశేఖర్ రెడ్డి అనే యువకుడు కుటుంబ కలహాలతో రైలు పట్టాలపై పడుకొని ఆత్మహత్యకు యత్నించాడు. ఇది గమనించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ పి.చెన్నయ్య ఆ వ్యక్తిని కాపాడాడు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Duvvada Srinivas: దువ్వాడ ఫ్యామిలీ డ్రామా, నాలుగో రోజు దువ్వాడ శ్రీనివాస్ ఆఫీస్‌ ముందు వాణి ఆందోళన, మాధురిపై కేసు నమోదు చేసిన పోలీసులు

Arun Charagonda

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్ రోజుకో టర్న్ తీసుకుంటుంది. దువ్వాడ శ్రీనివాస్ - వాణి మధ్యలో మాధురి, ఇదే ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. మా నాన్న మాకు కావాలి అంటూ శ్రీనివాస్ కుమార్తెలు మీడియా ముందుకు రావడంతో రెండు సంవత్సరాలుగా ఇంట్లోనే రగులుతున్న విషయం కాస్త బయటకు వచ్చింది.

Andhra pradesh: మానవత్వం చాటుకున్న మదనపల్లె సీఐ, ఫిర్యాదు ఇవ్వడానికి స్టేషన్‌కువచ్చిన బాధితురాలికి అస్వస్థత, తన వాహనంలో ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించిన సీఐ

Arun Charagonda

మానవత్వం చాటుకున్న మదనపల్లె సీఐ చాంద్‌బాషా మంచి మనసు చాటుకున్నారు. ఫిర్యాదు ఇవ్వడానికి అర్ధరాత్రి స్టేషన్‌కి వచ్చిన బాధితురాలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో తన వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి.. వైద్యం చేయించారు. దీంతో సీఐ చాంద్‌బాషాని అభినందించింది పోలీస్ శాఖ.

Rammohan Naidu: నాగార్జున సాగ‌ర్ వ‌ద్ద త్వ‌ర‌లోనే విమానాశ్ర‌యం, మ‌రికొన్ని ప్రాంతాల్లోనూ కొత్త ఎయిర్ పోర్టులు నిర్మిస్తామ‌న్న రామ్మోహ‌న్ నాయుడు

VNS

నాగార్జున సాగర్‌తో(Nagarjuna Sagar) పాటు మరికొన్ని విమానాశ్రయాల (Airports )ఏర్పాటుకు కేంద్రం ఆలోచిస్తుందని కేంద్ర విమానాయానశాఖ మంత్రి కింజరపు రామ్మోహన్‌ నాయుడు(Minister Rammohan Naidu) వెల్లడించారు. వీటితో పాటు శ్రీకాకుళం, దగదర్తిలో, కుప్పం వద్ద కూడా విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు.

Advertisement

YS Jagan Tweet: పంట బీమా ఎప్పుడు చెల్లిస్తారు! సీఎం చంద్రబాబు అల‌స‌త్వంతో వేలాది మంది రైతులు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని వైఎస్ జ‌గ‌న్ ఫైర్

VNS

ఏపీ రైతుల పట్ల చంద్రబాబు (CM Chandra Babu) నిర్లక్ష్యం వహిస్తుందని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి (YS Jagan) ధ్వజమెత్తారు. సకాలంలో నిర్ణయాలు తీసుకోకపోవడంతో రైతులకు నష్టం వాటిల్లుతుందని ఆరోపించారు.

Duvvada Srinivas - Madhuri: బిగ్ ట్విస్ట్.. మరోసారి మాధురి ఆత్మహత్య యత్నం, ఆగి ఉన్న కారును ఢీకొట్టిన మాధురి, తీవ్ర గాయాలు

Arun Charagonda

దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీలో నెలకొన్న విభేదాలు తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. రెండు సంవత్సరాలుగా జరుగుతున్న గోడవలు రచ్చకెక్కగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఇక తన భార్య వాణి, కూతుళ్లపై ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు దువ్వాడ. అనంతరం వాణితో జరుగుతున్న పరిణామాలపై వివరణ ఇచ్చారు.

Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్ ఎఫెక్ట్..మిగితా రాజకీయ నాయకులకు కనువిప్పే, ఎందుకో తెలుసా?

Arun Charagonda

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఒక్కోసారి తాము మాట్లాడిన మాటలే తమ మెడకే చుట్టుకుంటాయి. ఇది సరిగ్గా దువ్వాడ శ్రీనివాస్‌ ఎపిసోడ్ చూస్తే తెలిసిపోతుంది. ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడిన దువ్వాడ తీవ్ర విమర్శలు చేశారు. హిందు సంప్రదాయం, మూడు పెళ్లిళ్లు అంటూ పవన్ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు.

Andhra Pradesh Rains: ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు, ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

Arun Charagonda

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షం ముప్పు పొంచి ఉంది. రానున్న మూడు రోజుల్లో తెలంగాణ , ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.ఇప్పటికే కురిసిన భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దవగా మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలకు భయాందోళనకు గురవుతున్నారు.

Advertisement
Advertisement