ఆంధ్ర ప్రదేశ్
Telugu States CM’s Meeting Today: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ నేడే.. ప్రజాభవన్ వేదికగా సమావేశంకానున్న చంద్రబాబు, రేవంత్ రెడ్డి.. ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇరురాష్ట్రాల ప్రజలు.. ఏయే అంశాలపై చర్చ ఉండొచ్చంటే?
Rudraతెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు సీఎం రేవంత్ రెడ్డి, చంద్రబాబుల భేటీ నేడు జరుగనున్నది. హైదరాబాద్ లోని ప్రజాభవన్ వేదికగా ఇవాళ ఇరు రాష్ట్రాల సీఎంలు సమావేశం కాబోతున్నారు.
Chandrababu's Hyderabad Visit: వీడియో ఇదిగో, హైదరాబాద్‌కు చేరుకున్న చంద్రబాబు, ఘన స్వాగతం పలికిన తెలంగాణ టీడీపీ నేతలు, రేపు ఇద్దరు ముఖ్యమంత్రులు భేటీ
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌కు చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో ఆయనకు తెలంగాణ టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. కారులో నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలకు ఆయన అభివాదం చేశారు
Andhra Pradesh: టీడీపీ-జనసేన కూటమి ఖాతాలో మరో రెండు విజయాలు, శాసన మండలిలోనూ పెరుగుతున్న బలం
VNSఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల అభ్యర్థులు (MLCs) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీడీపీ తరుఫున, మాజీ మంత్రి రామచంద్రయ్య (Ramachandraiah), జనసేన తరుఫున హరిప్రసాద్ (Hari prasad) మంగళవారం నామినేషన్లు వేశారు.
Andhra Pradesh: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ, రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చలు
Hazarath Reddyఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మూడో రోజు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ రోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్టు సమాచారం. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని, కేంద్ర ప్రభుత్వం తగిన చేయూత ఇవ్వాలని కోరారు.
Sexual Harassment Case: యువతిపై లైంగిక వేధింపుల కేసు, వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌కు 14 రోజుల రిమాండ్
Hazarath Reddyఇంట్లో పనిచేస్తున్న యువతిపై లైంగిక వేధింపుల కేసులో కర్నూలు జిల్లా కోడుమూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత డాక్టర్ జరదొడ్డి సుధాకర్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయన ఓ యువతిపై గత మూడేళ్లుగా లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి.
Dwarampudi Chandrasekhar Reddy: వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై కేసు నమోదు, ఆయన అనుచరులతో సహా 24 మందిపై కేసు
Hazarath Reddyకాకినాడలో వైసీపీ మాజీ కార్పొరేటర్ నిర్మించిన బిల్డింగు అక్రమమంటూ అధికారులు కూల్చేస్తుండగా అడ్డుపడ్డ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని మున్సిపల్ అధికారుల విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదు చేశారు. చంద్రశేఖర్ రెడ్డితో పాటు మరో 24 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Palnadu Road Accident: వీడియో ఇదిగో, డిపో ఎదురుగా లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, అద్దాల నుంచి ముందుకు దూసుకొచ్చి కంటైనర్ కిందపడి డ్రైవర్ మృతి
Hazarath Reddyపల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిలకలూరిపేట ఆర్టీసీ డిపో ఎదురుగా జాతీయ రహదారిపై ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. డిపో ఎదురుగా ఆర్టీసీ బస్సు లారీని ఢీకొట్టింది. ఈ క్రమంలో ఎదురుగా వెళుతున్న నరసరావుపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంటైనర్ లారీ ఢీకొంది
Andhra Pradesh: వీడియో ఇదిగో, ప్రభుత్వ స్కూల్ ఉపాధ్యాయుడిపై చెప్పరాని బూతులతో రెచ్చిపోయిన టీడీపీ నేత, స్కూల్లో రేషన్ బియ్యం బస్తాలు దించొద్దని చెప్పడమే కారణం
Hazarath Reddyకోర్నపల్లె గ్రామంలో విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుంది, స్కూల్లో రేషన్ బియ్యం బస్తాలు దించొద్దని చెప్పిన టీచర్‌పై టీడీపీ నేత, డీలర్ విజయ్ భాస్కర్ బూతులతో రెచ్చిపోయాడు.
Shock to BRS: బీఆర్ఎస్ కు కోలుకోలేని దెబ్బ.. అర్ధరాత్రి కాంగ్రెస్ లోకి ఆరుగురు ఎమ్మెల్సీలు.. ఆషాఢ అమావాస్యకు ముందురోజు రాత్రే చేరికలు..
Rudraఅసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ఫలితాలతో కుదేలైన బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ పార్టీ ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
Jagan Warns Chandrababu : వీడియో ఇదిగో, రేపు మీ కార్యకర్తలకు ఇదే గతి, చంద్రబాబుకు మాస్ వార్నింగ్ ఇచ్చిన జగన్
Hazarath Reddyవైఎస్ జగన్ నెల్లూరు జిల్లాలో జైలులో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించారు. అనంతరం, వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ అధికార పార్టీపై మండిపడ్డారు. చంద్రబాబుని హెచ్చరిస్తున్నాము.. ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదు, మీ పాపాలు పండుతున్నాయి
Jagan Hits Out at Chandrababu: ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదు, చంద్రబాబుకు మాస్ వార్నింగ్ ఇచ్చిన జగన్, భవిష్యత్తులో మీ కార్యకర్తలకు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని వెల్లడి
Hazarath Reddyరాష్ట్రంలో టీడీపీకి ఓటు వేయలేదని ప్రజలు ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మండిపడ్డారు. శిశుపాలుని మాదిరిగా చంద్రబాబు పాపాలు పండుతున్నాయి.
Andhra Pradesh: అప్పటిదాకా కూల్చివేతలు చేపట్టవద్దు, వైసీపీ కార్యాలయాల కూల్చివేతపై హైకోర్టు కీలక తీర్పు, స్టేటస్ కో కొనసాగిస్తూ ఆదేశాలు జారీ
Hazarath Reddyవైఎస్సార్‌సీపీ కార్యాలయాల కూల్చివేతపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. అధికారులు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని.. వైఎస్సార్‌సీపీ వివరణ తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. స్టేటస్ కో కొనసాగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. చట్ట నిబంధనలు అనుసరించాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది.
CM Chandrababu Meets PM Modi: వీడియో ఇదిగో, ప్రధాని మోదీతో ముగిసిన చంద్రబాబు భేటీ, రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఇద్దరి మధ్యా చర్చలు
Hazarath Reddyఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది.ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రానికి ఆర్థికసాయం, ఇతర అంశాలపై సుమారు అరగంటపాటు ప్రధానితో చర్చించారు.
YS Jagan To Meet Pinnelli Ramakrishna Reddy: వీడియో ఇదిగో, నెల్లూరు చేరుకున్న జగన్, ఘన స్వాగతం పలికిన అభిమానులు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించనున్న వైసీపీ అధినేత
Hazarath Reddyవైసీపీ అధినేత వైఎస్ జగన్ కొద్దిసేపటి క్రితం నెల్లూరుకు చేరుకున్నారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో హెలికాప్టర్ దిగిన జగన్ అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా నెల్లూరు సెంట్రల్ జైలుకు వెళ్లారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించనున్నారు. ఈవీఎం ధ్వంసం కేసుతో పాటు మరో మూడు కేసుల్లో పిన్నెల్లి నిందితుడిగా ఉన్నారు.
Gautam Sawang Resign: ఏపీపీఎస్సీ ఛైర్మన్ పదవికి గౌతమ్ సవాంగ్ రాజీనామా, పదవీ విరమణకు రెండేళ్ల ముందే నిర్ణయం, గ్రూప్ 2 మెయిన్స్ కూడా వాయిదా
VNSఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ (Gautam Sawang) తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ఆయన గవర్నర్ అబ్దుల్ నజీర్ కు (Abdul Nazeer) అందజేయగా ఆయన ఆమోదించారు. వైసీపీ ప్రభుత్వంలో 2019 మే నుంచి 2022 ఫిబ్రవరి వరకు ఈయన డీజీపీగా పని చేశారు. ఆ తర్వాత ఏపీపీఎస్సీ ఛైర్మన్ (APPSC Chairman) అయ్యారు.
Telugu States CMs in Delhi: ప్రధాని మోదీతో భేటీకానున్న చంద్రబాబు, రేవంత్ రెడ్డి, విభజన సమస్యలపై తెలుగురాష్ట్రాల సీఎంల సమావేశానికి ముందు కీలక పరిణామం
VNSప్రధానమంత్రి నరేంద్ర మోదీతో (Narendra modi) ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు (Chandrababu), రేవంత్ రెడ్డి (Revanth reddy) విడివిడిగా సమావేశం కానున్నారు. ఉదయం 10.15 గంటలకు ప్రధానితో చంద్రబాబు భేటీ అవుతారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రధానితో రేవంత్ రెడ్డి సమావేశం అవుతారు.
Free Sand Policy in Andhra Pradesh: ఏపీలో మళ్లీ ఉచిత ఇసుక విధానం అమల్లోకి, చంద్రబాబు సర్కారు కీలక నిర్ణయం, వైసీపీ అక్రమాలపై విచారణ..
Hazarath Reddyత్వరలో ప్రజలకు ఉచితంగా ఇసుక ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఉచిత ఇసుక విధానానికి సంబంధించిన విధివిధానాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని మంత్రి తెలిపారు
Andhra Pradesh: అమరావతిని చూస్తే ఎంతో బాధ కలుగుతోంది, నా కష్టం అంతా జగన్ వృథా చేశాడని మండిపడిన చంద్రబాబు, శ్వేతపత్రం విడుదల చేసిన ఏపీ ముఖ్యమంత్రి
Hazarath Reddyరాజధాని అమరావతిపై ఏపీ సీఎం చంద్రబాబు బుధవారం శ్వేతపత్రం విడుదల చేశారు.ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... అమరావతి కోసం తాము పడిన కష్టం అంతా వృథా అయిందన్నారు. అయిదేళ్ల తర్వాత అమరావతిని చూసినప్పుడు తనకు ఎంతో బాధ కలుగుతోందన్నారు.
Gaur Found in Nallamala: 150 ఏళ్ల తర్వాత నల్లమల అడవుల్లో తొలిసారి కనిపించిన అడవి దున్న, వీడియో ఇదిగో
Hazarath Reddyనల్లమల అటవీ ప్రాంతంలో దాదాపు 150 ఏళ్ల తర్వాత అడవి దున్న కనిపించడంతో అటవీశాఖ అధికారులు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు అటవీ డివిజన్ లో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో ఈ అడవి దున్న కనిపించిందని అటవీ శాఖ అధికారులు తెలిపారు.
Pawan Kalyan Greets Little Boy: జనసేన జెండాతో రోడ్డుపై చిన్నారి, కాన్వాయ్ ఆపి దగ్గరకు వెళ్లి పలకరించిన పవన్ కళ్యాణ్, వీడియో ఇదిగో..
Hazarath Reddyఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మార్గం మధ్యలో రోడ్డుపై కాన్వాయ్ ఆపిన చిన్నారి అభిమానిని పలకరించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఉప్పాడలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన వెళుతుండగా ఓ చిన్నారి జనసేన జెండాతో రోడ్డుపై స్వాగతిస్తూ కనిపించారు.