ఆంధ్ర ప్రదేశ్

Andhra Pradesh Elections 2024: ప్రజాశాంతి పార్టీకి కుండ గుర్తును కేటాయించిన ఈసీ, తనదైన స్టైల్లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన కేఏ పాల్

Hazarath Reddy

రానున్న ఎన్నికల్లో కే ఏ పాల్ అధ్యక్షుడుగా ప్రజాశాంతి పార్టీకి 'కుండ' గుర్తు ను కేటాయించింది ఎన్నికల సంఘం. ఈ నేపథ్యంలో తన పార్టీ కార్యాలయంలో 'కుండ' ను కేఏ పాల్ ప్రదర్శించారు. అలాగే ప్రజాశాంతి పార్టీ అధినేత ఈరోజు తనదైన శైలిలో తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాడు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Andhra Pradesh Rains: గుంటూరు జిల్లాలో భారీ వర్షం, తడిసి ముద్దయిన సీఎం జగన్ మేమంతా సిద్ధం బహిరంగ సభ వేదిక, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజలకు కాస్త ఉపశమనం దొరికింది. ఈ రోజు ఉదయం నుంచి ఎండ దంచికొట్టి ఒక్కసారిగా మారిన వాతావరణంతో.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా గుంటూరు సిటీ, తాడికొండ, ప్రత్తిపాడు, మేడికోండూరులోని పలు ప్రాంతాల్లో గంట పాటు భారీ వర్షం కురిసింది. దీంతో జిల్లా వ్యాప్తంగా వాతావరణ ఒక్కసారిగా చల్లబడింది.

Andhra Pradesh Road Accident: అనకాపల్లిలో ఇంజినీరింగ్ కాలేజీ బస్సు బీభత్సం, 12 ఏళ్ల బాలుడు మృతి, మరో 5 మందికి తీవ్ర గాయాలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

అనకాపల్లిలో ఇంజినీరింగ్ కాలేజీ బస్సు బీభత్సం స‌ృష్టించింది. అనకాపల్లి - కసింకోట మండలం బయ్యవరం సమీపంలో రోడ్డు పక్కన ఉన్న ఓ టిఫిన్ వాహనంపైకి ఓ ప్రైవేట్ కాలేజీ బస్సు ఒక్కసారిగా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 12 ఏళ్ల బాలుడి మృతి చెందగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.క్షతగాత్రులు అనకాపల్లిలో చికిత్స పొందుతున్నారు.

Andhra Pradesh Elections 2024: కొడుమూరులో టీడీపీకి షాక్, వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్ రెడ్డి, టీడీపీ సీనియర్ నేత కోట్ల హరిచక్రపాణిరెడ్డి

Hazarath Reddy

ఏపీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వలసలు జోరందుకున్నాయి. తాజాగా కోడుమూరు మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్ రెడ్డి, టీడీపీ సీనియర్ నేత కోట్ల హరిచక్రపాణిరెడ్డి వైసీపీలో చేరారు. వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థి ఆదిమూలపు సతీష్ పోటీ చేస్తున్న కొడుమూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా బొగ్గుల దస్తగిరి పోటీలో ఉన్నారు.

Advertisement

AP Inter Results 2024 Declared: ఏపీ ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదల, ఫెయిలైతే ఆందోళన చెందవద్దని కోరిన ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సౌరబ్ గౌర్, చెక్ చేసుకోవడానికి లింక్ ఇదిగో..

Hazarath Reddy

ఏపీ ఇంటర్ పరీక్షా ఫలితాలు(AP Inter Exams) విడుదల అయ్యాయి. ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సౌరబ్ గౌర్ ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఈ ఫలితాలను విడుదల చేశారు.

AP Intermediate Results Out: హుర్రే... ఏపీ ఇంట‌ర్ మొదటి, రెండో ఏడాది ఫ‌లితాలు విడుదల.. రిజల్స్ట్ ఎక్కడ చెక్ చేసుకోవాలంటే??

Rudra

ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష‌లు రాసిన విద్యార్థులకు శుభవార్త. ఏపీ ఇంటర్ బోర్డు కాసేపటి క్రితం ఇంటర్ మొదటి, రెండో ఏడాది ఫలితాలను ఒకేసారి విడుదల చేసింది.

AP Intermediate Results: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. నేడే ఏపీ ఇంట‌ర్ మొదటి, రెండో ఏడాది ఫ‌లితాలు.. ఉద‌యం 11 గంట‌ల‌కు విడుద‌ల‌.. ప‌రీక్ష‌లు రాసిన దాదాపు 10 ల‌క్ష‌ల మంది విద్యార్థులు

Rudra

ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష‌లు రాసిన విద్యార్థులకు శుభవార్త. నేడు ఇంటర్ ఫ‌లితాలు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఏపీ ఇంటర్ బోర్డు వెల్ల‌డించింది. ఉద‌యం 11 గంట‌ల‌కు మొద‌టి, రెండో సంవ‌త్స‌రం ఫ‌లితాల‌ను ఒకేసారి విడుద‌ల చేస్తామ‌ని ఇంట‌ర్మీడియ‌ట్ విద్యామండ‌లి ప్ర‌క‌టించింది.

SPF Constable Suicide: షాకింగ్ వీడియో, గన్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న ఎస్పీఎఫ్ కానిస్టేబుల్, బ్యాంకు సీసీటివీలో ఘటన రికార్డ్

Hazarath Reddy

విశాఖపట్నం (Visakha)లో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఐఓబి బ్యాంకులో గన్ మాన్ గా విధులు నిర్వహిస్తున్న ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ శంకర్రావు గన్‌తో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు.

Advertisement

Andhra Pradesh Elections 2024: పవన్ కళ్యాణ్ గెలిచాక పిఠాపురం చూడటానికి ప్రపంచంలోని తెలుగువాళ్లంతా తండోపతండాలుగా వస్తారు, జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది సంచలన వ్యాఖ్యల వీడియో ఇదిగో..

Hazarath Reddy

తెలంగాణలో హైదరాబాద్ చూడడానికి ఎలా వస్తున్నారో.. పవన్ కళ్యాణ్ గెలిచాక పిఠాపురం చూడడానికి ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ ఒక టూర్ లాగా వస్తారు. పిఠాపురం ఎన్నికల ప్రచారంలో భాగంగా జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది సంచలన వ్యాఖ్యలు చేశారు.

Andhra Pradesh Elections 2024: వీడియో ఇదిగో, ఒంగోలులో ఘోరంగా కొట్టుకున్న వైసీపీ, టీడీపీ కార్యకర్తలు, ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే బాలినేని

Hazarath Reddy

ఒంగోలులో ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ, టీడీపీ కార్యకర్తలు నిన్న రాత్రి ఘోరంగా కొట్టుకున్నారు. అక్కడికి వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్థన్ చేరుకోగా.. మరోసారి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు ఇరుపార్టీల కార్య కర్తలను చెదరగొట్టి, గాయపడిన వారిని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. దీనిపై నారా లోకేష్ ట్వీట్ చేశారు.

Ugadi Tragedy in Andhra Pradesh: ఉగాది వేళ కర్నూలులో తీవ్ర విషాదం, రథం లాగుతుండగా 15 మంది చిన్న పిల్లలకు కరెంట్ షాక్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఉగాది పండగ వేళ కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఉగాది సందర్భంగా రథం లాగుతుండగా విద్యుత్ షాక్ కలకలం రేపింది. ఈ ప్రమాదంలో 15 మంది చిన్నారులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వీరందరికి కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

Andhra Pradesh Elections 2024: సీఎం జగన్ పాలన సూపర్ అంటున్న టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, వాలంటీర్ల వ్యవస్థ ప్రపంచంలోనే అత్యుత్తమం అంటూ కితాబు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఏపీలో ఎన్నికల వేళ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. తాజాగా టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి జగన్ పాలనపై ప్రశంసలు కురిపించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి వాలంటీర్, సచివాలయాల రూపంలో ప్రపంచంలోనే అత్యుత్తమ వ్యవస్థ‌ను తీసుకొచ్చారంటూ కితాబిచ్చారు. దీనికి సంబంధించిన వీడియోని వైఎస్సార్సీపీ తన ఎక్స్ లో షేర్ చేసింది. మళ్లీ వచ్చేది జగనే అంటూ క్యాప్షన్ జోడించింది.

Advertisement

APPSC Group 2 Results: ఉత్కంఠ‌కు తెర! గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫ‌లితాలు విడుద‌ల చేసిన ఏపీపీఎస్సీ, ఎల‌క్ష‌న్ కోడ్ కార‌ణంగా ఫ‌లితాలు వాయిదా ప‌డుతాయ‌ని ఊహాగానాలు

VNS

ఎట్టకేలకు గ్రూప్‌ 2 ఫలితాలపై సందిగ్ధత వీడింది. ప్రిలిమ్స్‌ ఫలితాలను (Prelims Exam Results) ఏపీపీఎస్సీ (APPSC) బుధవారం విడుదల చేసింది. రాష్ట్రంలోని 899 గ్రూప్‌ -2 పోస్టుల భర్తీ కోసం ఫిబ్రవరి 25న ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలకు 4,83,525 మంది దరఖాస్తు చేసుకోగా.. 4,04,037 మంది పరీక్షకు హాజరయ్యారు.

Posani Comments on CBN: జ‌య‌ప్ర‌ద జీవితాన్ని చంద్ర‌బాబు నాశ‌నం చేశాడు! సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన పోసాని కృష్ణ‌ముర‌ళి

VNS

వాలంటీర్ల వ్యవస్థపై టీడీపీ అధినేత చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని ఏపీ ఎఫ్‌డీసీ చైర్మన్‌ పోసాని కృష్ణమురళి (Posani Krishnamurali) అన్నారు. అందుకే నిమ్మగడ్డతో (Nimmagadda) ఫిర్యాదు చేయించి వాలంటీర్ల వ్యవస్థను అడ్డుకున్నారని మండిపడ్డారు. విజయవాడలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మీడియాతో పోసాని మాట్లాడారు.

Andhra Pradesh Elections 2024: హిందూపురంలో వైసీపీకి షాక్, టీడీపీలో చేరిన ఎమ్మెల్సీ మహమ్మద్‌ ఇక్బాల్‌

Hazarath Reddy

వైసీపీ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలోబుధవారం టీడీపీలో చేరారు. ఇక్బాల్ కు కండువా కప్పి చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు.

Andhra Pradesh Elections 2024: వాలంటీర్ల పేర్లు వింటే చంద్రబాబు గుండెల్లో రైళ్లు పెరిగెడుతున్నాయి, పల్నాడు మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ స్పీచ్ హైలెట్స్ ఇవిగో..

Hazarath Reddy

మనం సిద్దం సిద్ధం.. అంటే.. వారికి యుద్ధంగా ప్రతిధ్వనిస్తోందన్నారు.ప్రతిపక్షాలు జిత్తులమారి పార్టీలు మోసాలు, కుట్రలు చేస్తున్నాయంటూ సీఎం మండిపడ్డారు. జిత్తుల మారి చంద్రబాబు కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

Advertisement

Andhra Pradesh Elections 2024: వీడియో ఇదిగో, జై చంద్రబాబు అనకుండా జై జగన్ అనేసిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, ఒక్కసారిగా షాక్ తిన్న తెలుగుదేశం కార్యకర్తలు

Hazarath Reddy

కర్నూలు జిల్లా పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గౌరు చరితారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు. రోడ్ షోలో కార్యకర్తల్ని ఉద్దేశించి ప్రసంగించారు..చివర్లో ఓట్లు వేయాలని అభ్యర్థించి జై చంద్రబాబు అనబోయి జై జగన్ అనేశారు. తర్వాత పొరపాటును గమనించి సరిదిద్దుకున్నారు

AP Inter Results 2024: ఏపీ ఇంటర్‌ పరీక్షల ఫలితాల వెల్లడి తేదీపై అప్‌డేట్, ఒకేసారి ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదలయ్యే అవకాశం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది నిర్వహించిన ఇంటర్ పరీక్షల ఫలితాల విడుదలకు (AP Inter Results 2024) రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఇంటర్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి కాగా.. వాటి పునఃపరిశీలనతో పాటు మార్కుల నమోదు ప్రక్రియ చివరి దశకు చేరుకుంది.

Andhra Pradesh Elections 2024: వైసీపీలో చేరిన రాయచోటి మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో బుధవారం ఉదయం రాయచోటి మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి, పోతిన మహేష్‌ వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరి ముగ్గురికి పార్టీ జెండా కప్పి వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించారు

Andhra Pradesh Elections 2024: వైసీపీలో చేరిన పోతిన మహేష్, విజయవాడ వెస్ట్‌లో జనసేనకు బిగ్ షాక్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

జనసేన ఆవిర్భావం నుంచి పవన్ కళ్యాణ్ వెంట నడిచిన విజయవాడ వెస్ట్ ఇంఛార్జ్ పోతిన మహేష్ ఈరోజు జగన్ సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. కండువా కప్పి సీఎం జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. జనసేనకు షాక్‌ ఇస్తూ పశ్చిమ నియోజకవర్గ జనసేన ఇంఛార్జి పదవికి పోతిన వెంకట మహేష్‌ ఆ పదవికి, పార్టీకి రాజీనామా చేసిన సంగతి విదితమే.

Advertisement
Advertisement