ఆంధ్ర ప్రదేశ్

Chandrababu Slams CM Jagan Ruling: ఈ స్థాయిలో అక్రమాలు నా 40 ఏళ్ళ జీవితంలో ఎప్పుడూ చూడలేదు, సీఎం జగన్ పాలనపై మండిపడిన చంద్రబాబు నాయుడు

Hazarath Reddy

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి పులివర్తి నానీని పరామర్శించారు. దొంగ ఓట్ల అంశంపై నిరాహార దీక్ష చేపట్టిన పులివర్తి నాని అస్వస్థతకు గురికావడంతో ఆయనను స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు.

Gidugu Rudra Raju Resigns: ఏపీ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా, వైఎస్ షర్మిల నియామకంపై లైన్ క్లియర్ అయినట్లేనా...

Hazarath Reddy

ఏపీ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు (Gidugu Rudraraju) రాజీనామా చేశారు. సోమవారం పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రుద్రరాజు... రాజీనామా లేఖను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు (AICC Chief Mallikarjuna Kharge) అందజేశారు.

Andhra Pradesh Elections 2024: వైసీపీ నాలుగో జాబితాపై వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు, పండుగ తర్వాతనే ఫైనల్ లిస్టు విడుదలవుతుందని తెలిపిన వైవీ

Hazarath Reddy

ఏపీలో మరో మూడు నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు (Andhra Pradesh Elections 2024) జరగనున్న నేపథ్యంలో అధికార పార్టీ వైసీపీ ఎన్నికల వ్యూహంలో బిజీగా ఉంది. ఇందులో భాగంగానే ఇప్పటికే మూడు జాబితాలు ప్రకటించిన జగన్ సర్కారు నాలుగో జాబితాపై కసరత్తు చేస్తోంది.

Pongal Wishes: నేడే పెద్ద పండుగ సంక్రాంతి.. ఈ పర్వదినం సందర్భంగా మీ బంధువులు, మిత్రులకు లేటెస్ట్ లీ అందించే గ్రీటింగ్ కార్డ్స్ ద్వారా విషెస్ తెలియజేయండి.

Rudra

తెలుగు వాళ్ళు అత్యంత ఘనంగా జరుపుకునే పండుగ సంక్రాంతి. అచ్చమైన తెలుగుదనానికి ప్రతీకగా నిలిచే పెద్ద పండుగ సంక్రాంతి.

Advertisement

Yatra 2: యాత్ర‌-2 మూవీలో ప‌వ‌న్ క‌ల్యాణ్, నారా లోకేష్, షర్మిల పాత్ర‌ల‌పై క్లారిటీ, వ్యూహం త‌ర‌హాలో ఉండ‌బోద‌న్న మూవీ టీం

VNS

యాత్ర 2 ఫిబ్రవరి 8న గ్రాండ్‌గా విడుదలవుతుంది. ప్రజా సంక్షేమం కోసం తండ్రి ఆశయ సాధన కోసం వైఎస్‌ జగన్ చేసిన వాగ్దానాలను ఎలా నిలబెట్టుకున్నారనే నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ‘యాత్ర 2లో వై.ఎస్.భారతి రోల్‌లో కేతికా నారాయణన్ నటిస్తోండగా.. టీడీపీ చీఫ్‌ చంద్రబాబు పాత్రలో బాలీవుడ్ డైరెక్టర్‌ కమ్‌ యాక్టర్‌ మహేశ్ మంజ్రేకర్‌నటిస్తున్నాడు.

CBN Meets Pawan Kalyan: చంద్ర‌బాబు ఇంటికి భోజనానికి వెళ్లిన ప‌వ‌న్ క‌ల్యాణ్, టీడీపీ-జ‌న‌సేన ఉమ్మ‌డి కార్యాచ‌ర‌ణ దాదాపు ఖ‌రారైన‌ట్లే

VNS

త్వ‌ర‌లో ఏపీ అసెంబ్లీ, లోక్‌స‌భ ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో (Pawan kalyan) చంద్ర‌బాబు డిన్న‌ర్ భేటీకి హాజ‌ర‌య్యారు. ఈ భేటీలో జ‌న‌సేన సీనియ‌ర్ నేత నాదేండ్ల మ‌నోహ‌ర్ కూడా పాల్గొన్నారు. సుదీర్ఘంగా సాగిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ మధ్య చ‌ర్చ‌ల్లో త్వ‌ర‌లో అభ్య‌ర్థుల తొలి జాబితా విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.

SCR Special Trains: సంక్రాంతికి ట్రైన్ టికెట్లు దొర‌క‌లేదా? మీకోస‌మే ప్ర‌త్యేక రైళ్లు న‌డిపిస్తున్న ద‌క్షిణ మ‌ధ్య రైల్వే, స్పెష‌ల్ ట్రైన్స్ షెడ్యూల్ ఇదే!

VNS

ఈ నేపథ్యంలో మరిన్ని రైళ్లను పట్టాలెక్కించింది. సికింద్రాబాద్‌-తిరుపతి, సికింద్రాబాద్‌-కాకినాడ, సికింద్రాబాద్‌-నర్సాపూర్‌ మధ్య ప్రత్యేక రైళ్లను (Special Trains) నడుపుతున్నట్లు తెలిపింది. సికింద్రాబాద్‌ -తిరుపతికి (07489) ప్రత్యేక రైలు 15న సోమవారం రాత్రి 20.10 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 9 గంటలకు తిరుపతి చేరుకుంటుంది

MP Balashauri Resign: ఎంపీ బాలశౌరి వైసీపీకి రాజీనామా..టిక్కెట్ రాదనే మనస్తాపమే కారణం..జనసేన వైపు అడుగులు..

sajaya

మచిలిపట్నం వైసీపీ పార్లమెంట్‌ సభ్యుడు బాలశౌరి పార్టీకి రాజీనామా చేశారు. సీఎం వైఎస్‌ జగన్‌ చేపట్టిన సీట్ల మార్పుల కారణంగా టికెట్‌ రాని వారు నిరాశతో వైసీపీకి రాజీనామా చేస్తున్నారు. తనకు రెండోసారి పోటీకి వైసీపీ అవకాశం ఇవ్వడం లేదన్న సమాచారంతో మనస్తాపానికి గురై పార్టీకి రాజీనామా చేశానని, తాను జనసేన పార్టీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు.

Advertisement

YS Sharmila Meets Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబుతో వైఎస్ షర్మిల భేటీ, కుమారుడి వివాహానికి రమ్మని ఆహ్వానం...గంట సేపుపైగా ఏకాంతంగా చర్చలు..

sajaya

కాంగ్రెస్ నాయకురాలు వై.ఎస్.షర్మిల శనివారం టీడీపీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబు నాయుడుని ఆయన నివాసంలో కలిసి వచ్చే నెలలో జరిగే తన కుమారుడి వివాహానికి ఆహ్వానించారు. షర్మిల ఇక్కడి జూబ్లీహిల్స్‌లోని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి ఆహ్వానం పలికారు. ఆమె కుమారుడు వై.ఎస్.రాజా రెడ్డి తన ప్రియురాలు అట్లూరి ప్రియతో ఫిబ్రవరి 17న వివాహం చేసుకోనున్నారు.

Madras High Court About Porn Videos: అశ్లీల చిత్రాలను వ్యక్తిగతంగా చూడడం తప్పేమీ కాదు.. మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. వీడియోలు చూసినవారిపై నిందలు మానేసి వారిని ఆ వ్యసనం నుంచి బయటపడే మార్గాలు చూడాలని హితవు

Rudra

స్మార్ట్ ఫోన్‌ లో చిన్నారుల పోర్న్ వీడియోలను చూసినట్టు నమోదైన ఓ కేసులో మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసును విచారించిన న్యాయస్థానం వ్యక్తిగతంగా అశ్లీల చిత్రాలు చూడడం నేరం కాదని స్పష్టం చేసింది.

Aadudham Andhra: ఆడుదాం ఆంధ్రాలో తన్నుకున్న కబడ్డీ ప్లేయర్లు, నందికొట్కూరు కళాశాల మైదానంలో ఘర్షణ, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఆడుదాం ఆంధ్రా టోర్నమెంట్‌ 2023 ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన సంగతి విదితమే. అయితే అక్కడక్కడా క్రీడాకారుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు కళాశాల మైదానంలో కబడ్డీ మైదానంలో లెట్స్ ప్లే ఆంధ్రా లెట్స్ ఫైట్ ఆంధ్రగా మారింది.

Andhra Pradesh Elections 2024: అనూహ్య మార్పులతో వైసీపీ మూడో జాబితా విడుదల, పెడన నుంచి పెనమలూరుకు మారిన జోగి రమేష్, కర్నూలు ఎంపీ అభ్యర్థిగా గుమ్మనూరు జయరాం

Hazarath Reddy

మొత్తం 175కు 175 సీట్ల గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్న వైసీపీ పార్టీ తాజాగా మూడో జాబితాను విడుదల చేసింది. మొదటి జాబితాలో 11, రెండో జాబితాలో 27 స్థానాలకు ఇన్‌ఛార్జిలను ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. మూడో జాబితాలో ఆరు పార్లమెంట్‌ స్థానాలకు.. 15 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 21 మంది ఇన్‌ఛార్జిల పేర్లను ప్రకటించింది.

Advertisement

Andhra Pradesh Elections 2024: ఇది ఆరంభమేనంటూ టీడీపీకి చురకలు అంటించిన కేశినేని నాని, వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే స్వామిదాసుకు విషెస్

Hazarath Reddy

వైఎస్సార్‌సీపీలో చేరిన తిరువూరు మాజీ ఎమ్మెల్యే స్వామిదాసుకు ఆయన ఎక్స్‌(ట్విట్టర్‌) ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఇది ఆరంభం మాత్రమేనంటూ టీడీపీకి చురకలు అంటించారు. మనల్ని అవమానించిన వాళ్లకు గుణపాఠం చెబుదాం అంటూ స్వామిదాసును ఉద్దేశించి కేశినేని ట్వీట్‌ చేశారు.

Andhra Pradesh Elections 2024: విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా కేశినేని నాని, వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జ్‌ల మూడో జాబితా ఇదిగో..

Hazarath Reddy

రానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024 నేపథ్యంలో అసెంబ్లీ, పార్లమెంట్‌ నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పులో భాగంగా వైఎస్సార్‌సీపీ పార్టీ మూడో జాబితాను విడుదల చేసింది. ఆరు పార్లమెంట్‌ స్థానాలకు.. 15 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 21 మంది ఇన్‌ఛార్జిల పేర్లను ప్రకటించింది.

MP Raghurama Petition in High Court: నన్ను అరెస్ట్ చేయకుండా ఏపీ పోలీసులకు ఆదేశాలు ఇవ్వండి, ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు, ప్రభుత్వ న్యాయవాది ఏం చెప్పారంటే..

Hazarath Reddy

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ( MP Raghuramakrishna Raju ) ఏపీ హైకోర్టు ( AP High Court ) లో తాజాగా పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ సంక్రాంతికి మా ఊరు వెళ్తానని నాకు రక్షణ కల్పించాలని కోరుతూ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు.

Andhra Pradesh Elections 2024: తిరువూరులో టీడీపీకి భారీ షాక్, వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్‌

Hazarath Reddy

ఎన్టీఆర్‌ జిల్లాలో తెలుగు దేశం పార్టీకి మరో దెబ్బ తగిలింది. తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్‌ టీడీపీని వీడారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. గురువారం సాయంత్రం సీఎం క్యాంప్‌ కార్యాలయంలో స్వామిదాస్‌కు కండువా కప్పి వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించారు సీఎం జగన్‌.

Advertisement

Andhra Pradesh: నిమ్మకాయ మింగి తొమ్మిది నెలల చిన్నారి మృతి, అనంతపురం జిల్లాలో విషాదకర ఘటన

Hazarath Reddy

అనంతపురం జిల్లా మల్లేనిపల్లి గ్రామానికి చెందిన సకీదీప, గోవిందరాజు దంపతులకి ఏడేళ్ల తర్వాత పుట్టిన కుమార్తె జశ్విత(9నెలలు) ఇంట్లో ఆడుకుంటూ నిమ్మకాయను మింగింది.. గమనించిన తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు.

Adudam Andhra: వీడియో ఇదిగో, ఆడుదాం ఆంధ్రా క్రీడల్లో తన్నుకున్న యువకులు, నరసన్నపేటలో కబడ్డీ పోటీల్లో క్రీడాకారుల మధ్య ఘర్షణ

Hazarath Reddy

ఆడుదాం ఆంధ్రా క్రీడలు యువకుల మధ్య వివాదానికి కారణమయ్యాయి. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మండల స్థాయి పోటీలు నిర్వహిస్తుండగా.. కబడ్డీ పోటీల్లో క్రీడాకారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

Makar Sankranti 2024: ఊరెళ్లే ప్రయాణికులకు రైల్వేశాఖ శుభవార్త, సంక్రాంతికి మరికొన్ని ప్రత్యేక రైళ్లు, అదనపు కోచ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన

Hazarath Reddy

సంక్రాంతి పండుగకు ఊరెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్తను తెలిపింది. రద్దీ నేపథ్యంలో ఇప్పటికే పలు రైళ్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే తాజాగా మరో నాలుగు రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.

New Trains in Andhra Pradesh: ఏపీలో రేపటి నుంచి మూడు కొత్త రైళ్లు ప్రారంభం, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేతుల మీదుగా పట్టాలు ఎక్కనున్న ట్రైన్స్

Hazarath Reddy

ఏపీలో కొత్తగా మూడు రైళ్లు శుక్రవారం గుంటూరు స్టేషన్‌ నుంచి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేతుల మీదుగా పట్టాలు ఎక్కనున్నాయి. హుబ్బల్లి - నర్సాపూర్, విశాఖపట్టణం - గుంటూరు, నంద్యాల - రేణిగుంట రైళ్లను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభిస్తారు. రేపటి నుంచే ప్రయాణికులకు ఈ రైళ్ల సేవలు అందుబాటులోకి రానున్నాయి.

Advertisement
Advertisement