ఆంధ్ర ప్రదేశ్
Jagananna Chedodu: మీ బిడ్డగా తలెత్తుకుని చెబుతున్నా, 52 నెలల పరిపాలనలో ప్రతీది మీ ఇంటికే నేరుగా చేరింది, జగనన్న చేదోడు పథకం నిధులు విడుదల కార్యక్రమంలో సీఎం జగన్
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ విడిపోయాక ఇప్పటి వరకు రెండు ప్రభుత్వాలు రాష్ట్రాన్ని పాలించాయని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. గత ప్రభుత్వానికి తమ ప్రభుత్వానికి తేడా గురించి చెబుతూ.. గతానికి ఇప్పటికి రాష్ట్రం మారలేదు, బడ్జెట్ మారలేదని అన్నారు. రాష్ట్రంలో మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి మాత్రమేనని పేర్కొన్నారు.
Skill Development Case: చంద్రబాబుకు ఎదురుదెబ్బ, నవంబర్‌ 1 వరకు రిమాండ్‌ను పొడిగించిన ఏసీబీ కోర్టు, ఏపీ హైకోర్టులో బెయిల్‌పై కొనసాగుతున్న విచారణ
Hazarath Reddyస్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు జ్యుడీషియల్‌ రిమాండ్‌ను ఏసీబీ కోర్టు పొడిగింది. గతంలో విధించిన రిమాండ్‌ నేటితో ముగియడంతో జైలు అధికారులు చంద్రబాబును వర్చువల్‌గా కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచారు
Inner Ring Road Case: ఇన్నర్‌రింగ్‌ రోడ్డు కేసు విచారణ వచ్చే నెల 7కి వాయిదా, బాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ విచారణ జరిపిన ఏపీ హైకోర్టు
Hazarath Reddyఇన్నర్‌రింగ్‌ రోడ్డు కేసు విచారణను ఏపీ హైకోర్టు వచ్చే నెల 7కు వాయిదా వేసింది. అమరావతి రింగ్‌రోడ్డు కేసులో TDP అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్ వేశారు. ఈ కేసులో ఇవాళ్టి వరకు అరెస్టు చేయవద్దని గతంలో హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.
Fibernet Case: ఫైబర్ నెట్ కేసు, చంద్రబాబుపై సీఐడీ వేసిన పీటీ వారెంట్‌పై నిర్ణయం 20కి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు
Hazarath Reddyఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఐడీ వేసిన పీటీ వారెంట్‌పై నిర్ణయాన్ని ఏసీబీ న్యాయస్థానం 20వ తేదీకి (ఎల్లుండి శుక్రవారం) వాయిదా వేసింది. ఈ రోజు చంద్రబాబును ఏసీబీ కోర్టులో హాజరుపరచవలసి ఉండటంతో సీఐడీ మెమో దాఖలు చేసింది.
Congress Vijayabheri Sabha: రాజకీయంగా నష్టమని తెలిసినా తెలంగాణ ఇచ్చాం, కాని ఇప్పుడు కేసీఆర్ మీ ఆశలు ఆవిరి చేశాడు, కాంగ్రెస్‌ విజయభేరి సభలో గర్జించిన ప్రియాంకా గాంధీ
Hazarath ReddyBRS పాలనలో ప్రజలు ఆనందంగా లేరు. తెలంగాణ ఏర్పడినా సామాజిక న్యాయం దక్కలేదు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆశయాలు నెరవేరాలంటే కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలి.ములుగులో నిర్వహించిన కాంగ్రెస్‌ విజయభేరి సభలో ప్రియాంకా గాంధీ పాల్గొని ప్రసంగించారు
Dussehra Holiday in AP: ఈ నెల 24వ తేదీని దసరా సెలవుగా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం, అక్టోబరు 14 నుంచి 24 వరకూ దసరా సెలవులు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Hazarath Reddyఈ నెల 24వ తేదీని దసరా సెలవుగా ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఏపీలోని పాఠశాలలకు అక్టోబరు 14 నుంచి 24 వరకూ దసరా సెలవులను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
Skill Development Case: చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వు, మధ్యంతర బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు, తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా
Hazarath Reddyస్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో సుప్రీం కోర్టును ఆశ్రయించిన మాజీ సీఎం చంద్రబాబు నాయుడికి ఊరట దక్కలేదు. టీడీపీ అధినేత దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై నేడు వాదనలు ముగిశాయి. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.
Skill Development Scam: చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ ఈ నెల 19కి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు, టీడీపీ అధినేత ఆరోగ్య పరిస్థితిపై ఏసీబీ కోర్టు విచారణ
Hazarath Reddyస్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. తదుపరి విచారణను కోర్టు ఈ నెల 19కి వాయిదా వేసింది. మరోవైపు చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై విజయవాడ ఏసీబీ కోర్టు విచారణ చేపట్టింది. చంద్రబాబు తరఫు లాయర్ల పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించింది.
Andhra Pradesh Shocker: మార్కాపురంలో దారుణం, పెళ్లి చేయడం లేదని కన్నతండ్రి గొంతు కోసి చంపిన కొడుకు, అనంతరం అదే కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్య
Hazarath Reddyప్రకాశం జిల్లా మార్కాపురం మండల పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తనకు పెళ్లికాకుండా అడ్డుకుంటున్నాడనీ, పెళ్లి చేయడం లేదని ఆగ్రహించి ఓ కొడుకు కన్నతండ్రిని కత్తితో గొంతుకోసి దారుణంగా చంపేశాడు.
CM Jagan Visakhapatnam Tour: త్వరలోనే నేను విశాఖకు షిప్ట్‌ అవుతున్నా, సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు, విశాఖ ఐటీ హబ్‌గా మారబోతోందని వెల్లడి
Hazarath Reddyఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నం పర్యటన కొనసాగుతోంది. విశాఖలో పలు అభివృద్ధి పనులకు సీఎం జగన్‌ శంకుస్థాపనలు చేశారు. ఇన్ఫోసిస్‌ కార్యాలయాన్ని ప్రారంభించారు. అలాగే రెండు ఫార్మా యూనిట్లకు శంకుస్థాపన చేశారు. దీని ద్వారా ప్రత్యక్షంగా 4160 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.
Atchannaidu Sensational Comments: చంద్రబాబుకు ప్రాణహాని ఉంది! అరెస్టు వెనుక భారీ కుట్ర ఉందంటూ అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు
VNSస్కిల్ కేసులో (Skill Scam) ఒక్క రూపాయి అవినీతి చేశారని నిరూపించలేకపోయారు. కనీసం ఒక్క ఆధారం కూడా చూపలేకపోయారు. అరెస్ట్ వెనుక పెద్ద కుట్ర ఉంది. ఆఖరికి ప్రాణాహాని కూడా ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. ప్రతి ఒక్కరూ చంద్రబాబు అరెస్ట్ (CBN Arrest) ను ఖండిస్తున్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసి మొత్తం దేశాన్ని చీకట్లోకి నెట్టారు.
Skill Development Scam: చంద్రబాబును బుక్‌ చేద్దామని ఆ ఫైల్స్ మాయం చేశారా? స్కిల్ డెవలప్ మెంట్ స్కాంపై మాజీ ఎంపీ ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు, జగన్-మోదీ కలిసే పనిచేస్తున్నారంటూ ఆరోపణ
VNSజగన్ ప్రభుత్వం వచ్చినప్పుడు చంద్రబాబును బుక్ చేద్దామని ఈ ఫైల్స్ మాయం చేశారా అని ప్రశ్నించారు. అవినీతి విషయంలో చంద్రబాబు మిగతా వాళ్లకంటే జాగ్రత్తగా ఉంటాడని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ల డబ్బులు ఏమైనా చంద్రబాబు దగ్గరికి వెళ్లాయా అని అడుగుతున్నారు ఎవరి దగ్గరికి వెళ్లలేదన్నారు.
CBN Gets AC in Jail: రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుకు భారీ ఊరట, ఏసీ ఏర్పాటు చేసేందుకు అనుమతిచ్చిన కోర్టు, లంచ్ మోషన్ పిటీషన్ పై ఉత్తర్వులు
VNSరాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊరట లభించింది. ఆయన ఆరోగ్యంపై కుటుంబ సభ్యుల ఆందోళనతో కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. చంద్రబాబు జైల్లో ఉంటున్న గదిలో ఏసీ ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఆయన ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు తీవ్ర ఆందోళనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు తరఫు న్యాయవాదులు విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు.
Chandrababu Health Update: చంద్రబాబు కేజీ బరువు పెరిగి ఆరోగ్యంగా ఉన్నారు, క్లారిటీ ఇచ్చిన ఏపీ జైళ్లశాఖ డీఐజీ రవి కిరణ్‌, ఆయన ఆరోగ్యంపై ఎవరేమన్నారంటే..
Hazarath Reddyస్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్ట్ అయి రిమాండ్ ఖైదీగా రాజమండ్రి జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్న సంగతి విదితమే. చంద్రబాబు ఆరోగ్యం విషయంలో ఆందోళన కలుగుతుందంటూ టీడీపీ నేతలు చెబుతున్నారు. అయితే దీనిపై ఏపీ జైళ్లశాఖ డీఐజీ రవి కిరణ్‌ క్లారిటీ ఇచ్చారు.
Skill Development Scam Case: సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణ మంగళవారానికి వాయిదా, వాడీవేడిగా కొనసాగిన వాదనలు
Hazarath Reddyస్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్ట్ అయి రిమాండ్ ఖైదీగా రాజమండ్రి జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు శుక్రవారం వాడీవేడిగా కొనసాగాయి. ఈ కేసులో సెక్షన్‌ 17ఏ వర్తిస్తుందని చంద్రబాబు తరఫు న్యాయవాది వాదించగా.. ఆ సెక్షన్‌ వర్తించదని సీఐడీ తరఫు న్యాయవాది వాదించారు
Dasara Holidays in AP: ఏపీ పాఠశాలలకు రేపటి నుంచి దసరా సెలవులు, అక్టోబరు 14 నుంచి 24 వరకూ 11 రోజుల పాటు హాలీడేస్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
Hazarath Reddyఏపీలోని పాఠశాలలకు శనివారం నుంచి దసరా సెలవులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబరు 14 నుంచి 24 వరకూ దసరా సెలవులను ఖరారు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. తిరిగి అక్టోబరు 25న పాఠశాలలు తెరుచుకుంటాయని పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది.
Andhra Pradesh: విశాఖ రాజధానిగా ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు, కృష్ణాబోర్డు కార్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం, నార్త్‌కోస్ట్‌ సీఈ కార్యాలయం ప్రాంగణంలోకి ఆఫీస్ షిఫ్టింగ్
Hazarath Reddyకృష్ణాబోర్డు కార్యాలయాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అన్ని వసతులతో కూడిన భవనాన్ని సిద్ధం చేసింది. తక్షణమే హైదరాబాద్‌ నుంచి విశాఖకు కార్యాలయాన్ని తరలించాలని బోర్డు చైర్మన్‌ శివ్‌­నందన్‌కుమార్‌కు జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ లేఖ రాశారు.
Angallu Rioting Case: అంగళ్లు కేసులో చంద్రబాబుకు ఊరట, ముందస్తు బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు
Hazarath Reddyఅంగళ్లు ఘటనలో అన్నమయ్య జిల్లా ముదివేడు పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు తీర్పును వెలువరించింది.ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది.
Chandrababu Health Update: చంద్రబాబు హెల్త్ లేటెస్ట్ అప్‌డేట్ ఇదిగో, డీహైడ్రేషన్‌తో పాటు స్కిన్ అలర్జీతో బాధపడుతున్న టీడీపీ అధినేత, ఎటువంటి ఆందోళన అవసరం లేదని తెలిపిన వైద్యులు
Hazarath Reddyస్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్‌ జైలులో జ్యుడిషియల్‌ రిమాండ్‌ అనుభవిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు డీహైడ్రేషన్‌తో పాటు స్కిన్ అలర్జీతో బాధపడుతున్నారు.ఆయన చర్మంపై పలు చోట్ల దద్దుర్లు, ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు సమాచారం.
Vinod Reddy Resigns Janasena: నెల్లూరులో జనసేనకు భారీ షాక్, పార్టీకి కేతంరెడ్డి వినోద్‌రెడ్డి రాజీనామా, సీటు లేదని తేల్చి చెప్పడంతో కీలక నిర్ణయం
Hazarath Reddyజనసేనకు తాను రాజీనామా చేస్తున్నానని ఆ పార్టీ నేత కేతంరెడ్డి వినోద్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జనసేన కోసం నగరంలో ఎంతో కృషి చేశానని, నెల్లూరు నగర నియోజకవర్గానికి అభ్యర్థిగా నారాయణను టీడీపీ మూడు నెలల క్రితం ప్రకటించిందని పేర్కొన్నారు.