ఆంధ్ర ప్రదేశ్

No Confidence Motion: అవిశ్వాస తీర్మానంపై విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు, అంతా సవ్యంగా సాగుతున్నప్పుడు అవిశ్వాస తీర్మానం ఎందుకని వెల్లడి

Hazarath Reddy

అంతా సవ్యంగా సాగుతున్నప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టాల్సిన అవసరం ఎక్కడిదని.. ఆ తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నామని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.

Kuppam Politics: భరత్‌ను కుప్పంలో ఎమ్మెల్యేగా గెలిపిస్తే సీఎం చేస్తాం, పొరపాటున నోరు జారిన మంత్రి పెద్దిరెడ్డి, వీడియో ఇదిగో..

Hazarath Reddy

కుప్పం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి భరత్‌ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే సీఎం చేస్తాం అంటూ మంత్రి పెద్దిరెడ్డి నోరుజారారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Andhra Pradesh: 80 రూపాయల బిర్యానీ కోసం వెళ్లి 4 లక్షలు పోగొట్టుకున్న యువకులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

భీమవరంలో 80 రూపాయల బిర్యానీ కోసం వెళ్లి 4 లక్షలు పోగొట్టుకున్న యువకులు. భీమవరం పట్టణంలోని సీతయ్య హోటల్ వద్ద స్కూటీ డిక్కీలో ఉన్న 4 లక్షల రూపాయలను దొంగ ఎత్తుకు పోయాడు.

IMD Weather Forecast: నేడు వాయుగుండంగా మారనున్న అల్పపీడనం, తీరప్రాంతంలో గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు, మత్స్యకారులు చేపలవేటకు వెళ్లొద్దని హెచ్చరిక

Hazarath Reddy

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నిన్న తీవ్ర పీడనంగా మారింది. మరి కొద్ది గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఒడిశాలోని గోపాల్‌పూర్ వాతావరణశాఖ తెలిపింది. ఇది దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరానికి చేరువ అవుతోందని, దీనికి అనుబంధంగా సముద్ర ఉపరితలంలో 7.6 కిలోమీటర్ల ఎత్తులో మరో తుపాను ఆవర్తనం కొనసాగుతున్నట్టు పేర్కొంది.

Advertisement

Video: విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై లారీలో భారీగా మంటలు, కిందకు దూకి ప్రాణాలు దక్కించుకున్న డ్రైవర్

Hazarath Reddy

మంగళవారం నాడు ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల సమీపంలో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై లారీలో భారీ మంటలు చెలరేగడంతో డ్రైవర్ తృటిలో తప్పించుకున్నాడు, మంటలను చూసి డ్రైవర్ వాహనాన్ని ఆపి లారీ నుండి దూకాడు.

Andhra Pradesh: డ్రైవింగ్ చేస్తూ ఇయర్ ఫోన్స్,హెడ్‌సెట్ పెట్టుకుంటే రూ. 20,000 జరిమానా, ఏపీలో రూల్స్ త్వరలో అమల్లోకి రానున్నట్లుగా వార్తలు..

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇకపై బైక్ మీద కానీ కారులో కానీ ఆటోలో కానీ ఇయర్ ఫోన్స్ లేదా హెడ్సెట్ పెట్టుకుంటే రూ. 20,000 జరిమానా వేయనుంది.

IMD Weather Forecast: అల్ప పీడనంపై ఐఎండీ తాజా అలర్ట్ ఇదిగో, రాగల 24 గంటల్లో వాయుగుండంగా బలపడనున్న అల్పపీడనం

Hazarath Reddy

బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం, అలాగే తాజా వాతావరణ పరిస్థితులపై భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) ఈ సాయంత్రం బులెటిన్ విడుదల చేసింది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలను అనుకుని పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతోందని ఐఎండీ వెల్లడించింది.

Vizag Knife Attack Case: జగన్‌పై కత్తి దాడి కేసు, ఆగస్టు 1న విచారిస్తామని తెలిపిన విజయవాడ ఎన్ఐఏ కోర్టు, కుట్రకోణంపై లోతుగా దర్యాఫ్తు చేయాలన్న పిటిషన్ ను కొట్టివేసిన ధర్మాసనం

Hazarath Reddy

తనపై 2018లో విశాఖలో జరిగిన దాడి కేసులో కుట్రకోణంపై మరింత లోతుగా దర్యాఫ్తు చేయాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తరఫు లాయర్ దాఖలు చేసిన పిటిషన్ ను విజయవాడ ఎన్ఐఏ న్యాయస్థానం కొట్టివేసింది.

Advertisement

Chiranjeevi: చిరంజీవిపై నమోదైన కేసును కోట్టేసిన ఏపీ హైకోర్టు, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నేతగా కోడ్ ఉల్లంఘించారని గుంటూరులో కేసు నమోదు

Hazarath Reddy

గుంటూరులో నిర్ణీత సమయంలో సభ ముగించకపోవడంతో ట్రాఫిక్‌ సమస్యలు వచ్చాయని, ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారంటూ అప్పట్లో కాంగ్రెస్‌ నేతగా ప్రచారంలో పాల్గొన్న చిరంజీవిపై కేసు నమోదు చేశారు

Kotamreddy Sridhar Reddy: నెల్లూరు రూరల్ టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్‌గా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉత్తర్వులు జారీ చేసిన తెలుగుదేశం పార్టీ

Hazarath Reddy

తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇంఛార్జిగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఆ పార్టీ నియమించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు మంగళవారం ఓ ప్రకటనలో విడుదల చేశారు.

Justice Dhiraj Singh Thakur: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, ఆమోద ముద్ర వేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ను నియమించాలన్న సుప్రీంకోర్టు కొలిజియం సిఫార్సుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌ రాం మేఘ్వాల్‌ సోమవారం రాత్రి ట్వీట్‌ చేశారు

IRCTC Down: ఐఆర్సీటీసీ యాప్, వెబ్ సైట్ లో సాంకేతిక సమస్యలు.. ట్విట్టర్ లో వెల్లడించిన ఐఆర్సీటీసీ

Rudra

రైళ్లలో వెళ్లే ప్రయాణికులకు ఐఆర్సీటీసీ ముఖ్య సూచన చేసింది. టికెట్ కొనుగోలు విషయంలో యాప్, వెబ్ సైట్ లో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు ట్విట్టర్ ద్వారా పేర్కొంది. దీని కారణంగా టికెట్ చెల్లింపులు జరపడం కష్టంగా మారిందని.. దీనికి ప్రత్యామ్నయంగా ఆస్క్ దిశాను సంప్రదించాల్సిదిగా కోరారు.

Advertisement

Ambulance in Fire: డివైడర్ ను ఢీ కొట్టడంతో అంబులెన్స్ లో మంటలు.. డ్రైవర్ మృతి.. మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్ లో ఘోర ప్రమాదం

Rudra

హైదరాబాద్ లో మంగళవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. డివైడర్ ను ఢీ కొట్టి బోల్తా పడడంతో అంబులెన్స్ లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. నగరంలోని వనస్థలిపురంలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

IITH Student Case: విషాదాంతంగా మారిన ఐఐటీ హైదరాబాద్‌ విద్యార్థి కథ.. విశాఖ సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకున్న కార్తీక్.. ఈ ఉదయం వైజాగ్ సముద్రం ఒడ్డున మృతదేహం గుర్తింపు

Rudra

ఐఐటీ హైదరాబాద్ (ఐఐటీహెచ్) విద్యార్థి కార్తీక్ అదృశ్యం ఘటన విషాదంగా ముగిసింది. నగరం నుంచి విశాఖపట్టణం చేరుకున్న విద్యార్థి సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Hyderabad Rains: కుతుబ్ షాహీ మసీద్ పై పడిన పిడుగు.. బీటలు వారిన మినార్.. భారీ వర్షాలతో హైదరాబాద్ అతలాకుతలం.. పొద్దున్నే మళ్లీ మొదలైన వాన

Rudra

భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం అస్తవ్యస్తంగా మారిపోయింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం నగరవాసులను వణికించింది. నిన్నటి వర్షానికి కుతుబ్ షాహీ మసీద్ పై పిడుగు పడటంతో మినార్ బీటలు వారింది. సంఘటనా స్థలంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.

IMD Weather Forecast: వచ్చే 24 గంటల్లో ఉత్తరాంధ్రకు సమీపంలో అల్పపీడనం, ఈ నెల 26 నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం, తెలుగు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్

Hazarath Reddy

దక్షిణ ఒడిస్సా - ఉత్తర ఆంధ్రప్రదేశ్ దగ్గరలోని వాయువ్య బంగాళాఖాతం, పరిసరాల్లోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని తెలిపింది. ఈ అల్పపీడనం జూలై 26వ తేదీన వాయుగుండంగా మారుతుందని అంచనా వేసింది.

Advertisement

Gannavaram Politics: వల్లభనేని వంశీ దారెటు, గన్నవరం నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేసిన వైసీపీ నేత యార్లగడ్డ వెంకటరావు

Hazarath Reddy

గన్నవరం రాజకీయాలు మళ్లీ చర్చల్లోకి వచ్చాయి. తాజాగా వచ్చే ఎన్నికల్లో గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని వైసీపీ నేత యార్లగడ్డ వెంకటరావు ప్రకటించారు. గన్నవరం రాజకీయాల్లోనే తాను కొనసాగుతానని స్పష్టంచేశారు

Polavaram Project: పోలవరంపై రాజ్యసభలో కేంద్రం కీలక ప్రకటన, తొలిదశ పూర్తికి రూ.12,911 కోట్లు మంజూరుకు గ్రీన్ సిగ్నల్, దశల వారీగానే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని సూచన

Hazarath Reddy

పోలవరంపై పార్లమెంటు (Parliament) సాక్షిగా కేంద్రం కీలక వివరాలు వెల్లడించింది. దశల వారీగానే పోలవరం ప్రాజెక్టు (Polavaram project) నిర్మాణం అంటూ తేల్చి చెప్పింది.

Andhra Pradesh: ఇకపై అమరావతి మనందరి అమరావతి, సీఆర్డీఏ పరిధిలోని జోన్‌-5లో ఇళ్ల నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన

Hazarath Reddy

నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం కింద నేడు రాజధాని అమరావతిలోని జోన్‌-5లో ఇళ్ల నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఇప్పటికే 50 వేలకుపైగా ఇళ్ల పట్టాలను లబ్ధిదారులకు ఇచ్చారు. సీఆర్డీఏ పరిధిలోని 1,402.58 ఎకరాల్లో 25 లేఅవుట్లు వేసి 50,793 మందికి ఇళ్లు మంజూరు చేశారు

Ramachandrapuram Politics: ఆయన నాకు గురువుతో సమానం, బోస్ వ్యాఖ్యలకు స్పందించిన మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, వేణుకి టికెట్ ఇస్తే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని తెలిపిన ఎంపీ

Hazarath Reddy

రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్ (Pilli Subhash Chandrabose) చేసిన వ్యాఖ్యలపై మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ స్పందించారు. సుభాష్ చంద్రబోస్ తనకు గురువుతో సమానమని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలపై ఏమీ మాట్లాడబోనని వేణు చెప్పారు.

Advertisement
Advertisement