ఆంధ్ర ప్రదేశ్
Temperatures Soar In Telugu States: నిప్పుల కొలిమిలో తెలుగు రాష్ట్రాలు, రాజమండ్రిలో అత్యధికంగా 49 డిగ్రీల ఉష్ణోగ్రత, మరో 3 రోజులు బయటకు రావొద్దని హెచ్చరికలు
Hazarath Reddyతెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. మరో మూడు రోజులపాటు ఇదే తీవ్రతతో కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. పగటిపూటే కాదు.. రాత్రి పూట ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయని చెబుతోంది.
Vijayawada: వీడియో ఇదిగో, విజయవాడలో ఎండ దెబ్బకు కాలిపోయిన సెల్ టవర్, మంటల్లో చిక్కుకున్న గీతా నగర్ ఐడిఎఫ్ ఐడియాస్ బ్యాంకుపై గల సెల్ టవర్
Hazarath Reddyఏపీని ఎండలు ఠారెత్తిస్తున్నాయి. తాజాగా విజయవాడలో ఎండకు సెల్ టవర్ కాలిపోయింది. గీతా నగర్ ఐడిఎఫ్ ఐడియాస్ బ్యాంకుపై గల సెల్ టవర్ మంటల్లో చిక్కుకుంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
AP Road Accident: రోడ్డు ప్రమాదంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డికి తీవ్ర గాయాలు, మార్కాపురం నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ప్రమాదం
Hazarath Reddyరోడ్డు ప్రమాదంలో ప్రకాశం జిల్లా మార్కాపురం టీడీపీ ఇన్‌ఛార్జ్‌, మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. మార్కాపురం నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా యర్రగొండపాలెం సమీపంలోని గురిజేపల్లి మూలమలుపు వద్ద ఆయన కారు బోల్తా పడింది
YSR Matsyakara Bharosa: వైఎస్సార్‌ మత్స్యకార భరోసా నిధులు విడుదల చేసిన సీఎం జగన్, నేను మంచిని నమ్ముకున్నా.. ప్రజలను నమ్ముకున్నానని వెల్లడి
Hazarath Reddyమొత్తం 1,23,519 మంది మత్స్యకార కుటుంబాలకు మత్స్యకార భరోసా కింద రూ.123.52 కోట్లతో పాటు ఓఎన్‌జీసీ పైపులైన్‌ ఏర్పాటుతో జీవనోపాధి కోల్పోయిన 23,458 మంది మత్స్యకారులకు కూడా రూ.108 కోట్ల ఆర్థిక సాయాన్ని సీఎం జగన్ జమ చేశారు.
YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు, నేడు సీబీఐ విచారణకు హాజరుకాలేనని తెలిపిన వైఎస్ అవినాష్ రెడ్డి, 4 రోజుల తర్వాత హాజరవుతానని వెల్లడి
Hazarath Reddyమాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Viveka Case) కడప ఎంపీ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy) ఈరోజు సీబీఐ ముందుకు విచారణకు హాజరుకావాల్సి ఉంది.అయితే ఈరోజు సీబీఐ ముందు విచారణకు హాజరుకాలేకపోతున్నానని అవినాశ్ రెడ్డి తెలిపారు.
Andhra Pradesh Politics: పవన్ కళ్యాణ్ తన శీలాన్ని చంద్రబాబుకు అమ్మేశాడు, సంచలన వ్యాఖ్యలు చేసిన నల్లపరెడ్డి ప్రసన్నకుమార్
Hazarath Reddyనన్ను ప్యాకేజ్ స్టార్ అంటే చెప్పుతో కొడతా అంటున్నాడు. నేను అంటున్నా నువ్వు ప్యాకేజ్ స్టార్ వే. కొవ్వూరు సెంటర్ లో నిలబడతా, నీకు ధైర్యం ఉంటే నన్ను కొట్టు చూద్దామని ప్రసన్నకుమార్ సవాల్ విసిరారు. వీడియో ఇదిగో..
Andhra Pradesh: వీడియో ఇదిగో, అమ్మ తెల్ల చొక్కా ఇవ్వలేదని టవల్ కట్టుకుని పోలీస్ స్టేషన్‌లో బాలుడి ఫిర్యాదు, ఏలూరు జిల్లాలో ఘటన
Hazarath Reddyస్నేహితుడి పుట్టిన రోజు వేడుకకు హాజరుకావాలని తెల్ల చొక్కా అగిడితే అమ్మ ఇవ్వనంటోంది. ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటూ ఓ పదేళ్ల బుడతడు మదనపడ్డాడు.
Andhra Pradesh: రైతు కన్నీటి కథ ఇదిగో, కూలీ ఖర్చులు రాలేదని 4 టన్నుల మామిడికాయలను ఫ్రీగా పంచిన రైతు
Hazarath Reddyమార్కెట్లో గిట్టుబాటు ధర రాకపోవడంతో ఆవేదనతో నూజివీడు సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద 4 టన్నుల మామిడికాయలను దారినపోయే వారికి పంచిపెట్టిన రైతు బెక్కం రాజగోపాల్.
Secunderabad-Tirupati Vande Bharat Express: సికింద్రాబాద్ - తిరుపతి ‘వందేభారత్ ఎక్స్ ప్రెస్’లో అదనపు సీట్లు.. అలాగే టైమింగ్స్ మార్పు.. పూర్తి వివరాలు ఇవే!
Rudraరైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ కు సంబంధించి రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ రైలు బయల్దేరే సమయంలో స్వల్ప మార్పు చేసారు. అంచనాలకు మించి ఆదరణ కనిపిస్తుండటంతో రైలుకు కోచ్ లను రెట్టింపు చేసారు.
Telugu Student Record: అనకాపల్లి యువకుడికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. అరుదైన ఫీట్ సాధించిన రుత్తల రేవంత్.. ప్రస్తుతం రైల్వేలో ట్రైనీ మేనేజర్‌గా శిక్షణ పొందుతున్న యువకుడు
Rudraనేటి కాలంలో ఉద్యోగం దొరకడమే కష్టం. అదీ ప్రభుత్వ ఉద్యోగం.. అందులో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అంటే గగనమే. ఒకవేళ ఎవరైనా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించారంటే అతను తోపే. అయితే, ఓ విద్యార్థి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు కేంద్ర ప్రభుత్వోద్యోగాలు సంపాదించాడు.
Generic Medicines: రోగులకు జనరిక్ మందులనే రాసివ్వండి.. బ్రాండెడ్ ఔషధాలు రాయవద్దు.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులకు కేంద్రం హెచ్చరిక.. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరిక
Rudraకేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న హాస్పిటల్స్, సీజీహెచ్ఎస్ వెల్‌నెస్ కేంద్రాల్లోని వైద్యులకు కేంద్రం తాజాగా హెచ్చరిక చేసింది. తమ వద్దకు వచ్చే రోగులకు ప్రభుత్వ వైద్యులు తక్కువ ధరకు లభించే జనరిక్ మందులనే రాసి ఇవ్వాలని స్పష్టం చేసింది.
Andhra Pradesh: ఫ్రెండ్ పుట్టిన రోజుకు తెల్ల చొక్కా ఇవ్వలేదని సవతి తల్లిపై బాలుడు ఫిర్యాదు, అర్థనగ్నంగా రోడ్డు మీద నడుచుకుంటూ స్టేషన్‌కు వెళ్లిన బాలుడు
Hazarath Reddyతన స్నేహితుడి బర్త్‌డే పార్టీకి ధరించడానికి తెల్ల చొక్కా ఇవ్వనందుకు సవతి తల్లిపై ఆంధ్రప్రదేశ్‌లోని ఓ మైనర్ బాలుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు, ఎంపీ అవినాష్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు, రేపు విచారణకు హజరుకావాలని స్పష్టం
Hazarath Reddyవైఎస్ వివేకానంద హత్య కేసులో వైసీపీ ఎంపీ ఎంపీ అవినాష్ రెడ్డికి కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) మరోసారి నోటీసులు జారీ చేసింది. రేపు హైదరాబాద్ (Hyderabad) లో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఎంపీ అవినాశ్‌రెడ్డిని ఇంతకుముందు కూడా సీబీఐ విచారించిన విషయం తెలిసిందే.
Amaravati Scam: అమరావతి స్కాం, ఆస్తుల ఎటాచ్‌మెంట్‌పై తదుపరి చర్యల కోసం కోర్టును ఆశ్రయించనున్న ఏపీ సీఐడీ
Hazarath Reddyఅమరావతి స్కాంలో దర్యాప్తు కొనసాగిస్తున్న ఏపీ సీఐడీ (క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌) ఆస్తుల ఎటాచ్‌మెంట్‌పై తదుపరి చర్యల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించనుంది. ఈ మేరకు ఇవాళ(సోమవారం) విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో పిటిషన్‌ వేయనుంది.
Amaravati R-5 Zone Case: అమరావతి ఆర్‌-5 జోన్ కేసులో కీలక మలుపు, హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు, కేసును రాజధాని కేసు విచారణ చేస్తున్న బెంచ్‌కు బదిలీ చేయాలని తీర్పు
Hazarath Reddyఅమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాల కేసుపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ ముగిసింది. ఆర్‌-5 జోన్ కేసులో హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ కేసును రాజధాని కేసు విచారణ చేస్తున్న బెంచ్‌కు బదిలీ చేయాలని పేర్కొంది.
AP Legislative Council: ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు, వీరితో ప్రమాణం చేయించిన మండలి ఛైర్మన్ మోషేన్ రాజు
Hazarath Reddyఏపీ స్థానిక సంస్థల కోటాలో గెలిచిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేశారు. మండలి ఛైర్మన్ మోషేన్ రాజు వీరితో ప్రమాణం చేయించారు. నర్తు రామారావు, కుడిపూడి సూర్యనారాయణ, కవురు శ్రీనివాస్, వంకా రవీంద్రనాథ్, అలంపూర్‌ మధుసూదన్, సిపాయి సుబ్రహ్మణ్యం, మేరుగు మురళీధర్, రామసుబ్బారెడ్డి ప్రమాణం చేశారు.
Jagan Govt Attaches Babu's Guest House: చంద్రబాబు గెస్ట్‌హౌస్‌ను అటాచ్‌ చేసిన జగన్ సర్కారు, క్రిమినల్‌ లా అమెండ్మెంట్‌ 1944 చట్టం ప్రకారం అటాచ్‌ చేయాలని ప్రభుత్వాన్ని కోరిన సీఐడీ
Hazarath Reddyటీడీపీ అధినేత చంద్రబాబుకు భారీ షాక్‌ తగిలింది. కరకట్టపై ఆయన గెస్ట్‌హౌస్‌ను ఏపీ ప్రభుత్వం అటాచ్‌ చేసింది. క్రిమినల్‌ లా అమెండ్మెంట్‌ 1944 చట్టం ప్రకారం అధికారులు చర్యలు తీసుకున్నారు.సీఎంగా ఉన్న సమయంలో చంద్రబాబు, మంత్రిగా ఉన్నప్పుడు నారాయణ తమ పదవులను దుర్వినియోగం చేసి క్విడోప్రోకోకు పాల్పడ్డారన్న కేసుల విచారణ నేపథ్యంలో అధికారులు చర్యలు తీసుకున్నారు.
Heat Waves In AP: పెనంలా మారిన ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలు.. ఎండలకు తోడైన వడగాల్పులు.. నేడు, రేపు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు
Rudraఆంధ్రప్రదేశ్ లోని కోస్తా ప్రాంతంలో మండే ఎండలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఎర్రటి ఎండలకు వడగాలులు తోడవడంతో నిన్న కోస్తాంధ్ర కుతకుత ఉడికిపోయింది. ఎండలకు తట్టుకోలేని జనం ఇళ్లకే పరిమితమయ్యారు.
Naked Worship In Guntur: గుప్త నిధులతో ఎర.. నగ్నంగా పూజల్లో కూర్చుంటే లక్ష రూపాయలు ఇస్తామని ఆఫర్.. యువతులతో నగ్న పూజలు.. అనంతరం లైంగిక దాడికి యత్నం.. పూజారి సహా 12 మంది అరెస్ట్.. గుంటూరులో గగుర్పాటుకు గురిచేసే ఘటన
Rudraవ్యాపారంలో నష్టపోయిన మహిళకు సులభంగా డబ్బు సంపాదించేందుకు సాయపడుతామని, దానికోసం యువతులతో నగ్నంగా క్షుద్రపూజలు చేయించిన ఘటన గుంటూరులో జరిగింది. వివరాల్లోకి వెళ్తే, తాటికొండ మండలం పొన్నేకల్లుకు చెందిన పూజారి నాగేశ్వరరావు తరుచూ పూజలు చేస్తూ ఉంటాడు.