ఆంధ్ర ప్రదేశ్
Mekapati Vikram Reddy: వీధికుక్కల ప్రచారం పట్టించుకోను, పార్టీ మార్పు వ్యాఖ్యలపై స్పందించిన మేకపాటి విక్రమ్‌రెడ్డి, మా కుటుంబం జగన్ వెంటేనని స్పష్టం
Hazarath Reddyపార్టీ మార్పు వార్తలపై ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి స్పందించారు. వీధికుక్కల ప్రచారం పట్టించుకోమని.. సీఎం జగన్‌ వెంటే తన ప్రయాణమని, వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని అన్నిస్థానాలను కైవసం చేసుకుని తీరతామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ మారబోతున్నట్లు వస్తున్న ప్రచారం ఉత్తదే. వీధి కుక్కల ప్రచారం నేను పట్టించుకోను.
Different Weather conditions in AP: ఆంధ్రప్రదేశ్‌లో భిన్నమైన వాతావరణం.. ఓవైపు ఠారెత్తిస్తున్న ఎండలు.. మరోవైపు అకాల వర్షాలు, రైతన్నలో ఆందోళన
Rudraఆంధ్రప్రదేశ్‌లో భిన్నమైన వాతావరణం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఓ వైపు ఎండలు మండిపోతుంటే, మరోవైపు అకాల వర్షాలు రైతులను కష్టాల్లోకి నెడుతున్నాయి. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితే ఉంది.
Vande Bharat Express: కేవలం 8.30 గంటల్లోనే సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి.. వందేభారత్‌ లో రయ్.. రయ్.. టైమింగ్స్‌ ప్రకటించిన రైల్వే శాఖ
Rudraతెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. తిరుపతి పుణ్యక్షేత్రానికి అత్యంత వేగంగా చేరుకునేందుకు హైదరబాద్ వాసుల కోసం వందేభారత్‌ రైలు అందుబాటులోకి వస్తోంది. ఏప్రిల్‌ 9న తిరుపతి నుంచి, 10న సికింద్రాబాద్‌ నుంచి వందేభారత్‌ పరుగులు పెట్టనుంది.
Andhra Pradesh: శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి, వేణుగోపాలస్వామి ఆలయంలో ఒక్కసారిగా ఎగసిన మంటలు, అగ్నికి ఆహుతైన చలువ పందిళ్లు
Hazarath Reddyతణుకు మండలం దువ్వ గ్రామంలో ఉన్న వేణుగోపాలస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్నాయి. వేడుకల సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. మంటల కారణంగా చలువ పందిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి.
Vontimitta Temple Bhramotsavam: నేటి నుంచి కోదండరాముని వార్షిక బ్రహ్మోత్సవాలు, ఏప్రిల్‌ 5న సీతారాములు కల్యాణోత్సవం
Hazarath Reddyఆంధ్రా భద్రాద్రిగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండరాముని వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి (మార్చి 30) నుంచి ప్రారంభం కానున్నాయి. పది రోజుల పాటు ఈ వేడుకలను అంగరంగ వైభవంగా జరిపేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అన్ని ఏర్పాటు చేస్తోంది
Duronto Express Collided Bolero: ఏపీలో ఘోర ప్రమాదం, బొలెరో వాహనాన్ని ఢీకొట్టిన దురంతో ఎక్స్‌ప్రెస్‌, ఇంజిన్ దెబ్బతినడంతో ఐదు గంటలకు పైగా నిలిచినపోయిన రైలు
Hazarath Reddyఏపీలో ఏలూరు జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్టణం వెళ్తున్న దురంతో ఎక్స్‌ప్రెస్ ఏలూరు జిల్లా భీమడోలు వద్ద బొలెరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో జరిగిందీ ఘటన.
Jagan Meets Amit Shah: పోలవరం నిధులను విడుదల చేయండి, కేంద్రహోంమంత్రి అమిత్‌ షాతో ఏపీ సీఎం జగన్ భేటీ, విభజన హామీలపై విజ్ఞప్తి
VNSపోలవరం ప్రాజెక్టుపై(Polavaram) చర్చించినట్లుగా తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టు కోసం ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వం 3 వేట కోట్లకు పైగా ఖర్చు చేసింది. ఆ నిధులను విడుదల చేసేలా చొరవ చూపాలని అమిత్ షాను జగన్ (Jagan Meets shah) కోరారు.
Kodali Nani on TDP: అప్పుడు 23 మందిని ఇప్పుడు నలుగురిని లాక్కున్నారు, వచ్చే ఎన్నికల్లో టీడీపీకి వచ్చేది నాలుగే సీట్లు, ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyపేద ప్రజల శ్రేయస్సు కోసం ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపించారని మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ‘‘దివంగత ఎన్టీఆర్‌ను అన్ని వర్గాల ప్రజలు ఆదరించారు. ఎన్టీఆర్‌ చనిపోయిన తర్వాత కూడా ఆయన పేరును ప్రజలంతా స్మరిస్తున్నారు.
AP Special Status Row: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ, పార్లమెంటులో విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రం సమాధానం
Hazarath Reddyఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న కేంద్ర ప్రభుత్వ హామీ పరిస్థితి ఏమిటి? అంటూ రాజ్యసభలో బుధవారం వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. పార్లమెంటులో కేంద్రం లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది.
Andhra Pradesh: ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో 162 స్పెషలిస్ట్‌ వైద్యుల పోస్టులు భర్తీ, 14 స్పెషాలిటీల్లో 162 పోస్టులను భర్తీ చేసిన అధికారులు
Hazarath Reddyఏపీ వైద్య విధాన పరిషత్‌ (ఏపీవీవీపీ) ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్‌ వైద్యుల నియామకానికి చేపట్టిన వాక్‌–ఇన్‌ ఇంటర్వ్యూలు ముగిశాయి. ఈ నెల 23 నుంచి మంగళవారం వరకూ నిర్వహించిన ఇంటర్వ్యూల్లో 14 స్పెషాలిటీల్లో 162 పోస్టులను భర్తీ చేశారు
Andhra Pradesh Shocker: అనంతపురంలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడి దారుణ హత్య, స్థానిక టమాటా మార్కెట్‌లో గొడవ పడిన ఇరువురు
Hazarath Reddyఅనంతపురం జిల్లాలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడు శ్రీనివాస్‌ను దుండగులు హత్య చేసిన దారుణ ఘటన చోటుచేసుకుంది . స్థానిక యువకుడు వంశీ అతని అనుచరుల దాడిలో శ్రీనివాస్ మృతి చెందినట్లు సమాచారం.
Mock G20 Conclave: వీడియో ఇదిగో, జి-20 రెండో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వర్కింగ్‌ గ్రూప్‌ సమావేశానికి హాజరైన సీఎం వైయస్ జగన్, జీ-20 ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడిన ముఖ్యమంత్రి
Hazarath Reddyజి-20 రెండో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వర్కింగ్‌ గ్రూప్‌ సమావేశానికి హాజరైన సీఎం శ్రీ వైయస్ జగన్. జీ-20 ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడిన ముఖ్యమంత్రి. ఏపీ ప్రభుత్వం కేంద్రం సహకారంతో నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జీ-20 సన్నాహాక సదస్సు.. నేటితో రెండో రోజుకి చేరింది.
New Industrial Policy: ఏపీ నూతన పారిశ్రామిక అభివృద్ధి విధానం 2023 ఆవిష్కరించిన ఐటీ మంత్రి, YSR AP One యాప్, పోర్టల్‌ ఆవిష్కరణ
Hazarath Reddyఒకే వేదికపై 23 శాఖల నుంచి 96 క్లియరెన్స్‌లతో పాటు, ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల స్థాపన కోసం ఎదురుచూసే వారికి భూమిని కేటాయించేందుకు నూతన పారిశ్రామిక అభివృద్ధి విధానం 2023 దోహదపడుతుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఉద్ఘాటించారు.
Mock G20 Conclave in Visakha: విశాఖ జీ-20 సన్నాహాక సదస్సు, రెండో రోజు పట్టణీకరణ అంశంపై ప్రతినిధులతో చర్చలు, పెట్టుబడులకు అవకాశాలు, ప్రత్యేకతలపై ప్రదర్శనలు
Hazarath Reddyవిశాఖపట్నం వేదికగా జరుగుతున్న జీ20 సన్నాహక సదస్సు మూడు రోజుల పాటు జరుగుతున్న సంగతి విదితమే. ఏపీ ప్రభుత్వం కేంద్రం సహకారంతో నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జీ-20 సన్నాహాక సదస్సు.. నేటితో రెండో రోజుకి చేరింది.
TDP 41st Foundation Day: తెలుగుదేశం 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుక నేడు, నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో బహిరంగ సభ, తరలిరానున్న పార్టీ నేతలు, కార్యకర్తలు
Hazarath Reddyటీడీపీ 41వ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో భాగంగా నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో నేడు సాయంత్రం 4గంటలకు బహిరంగ సభ నిర్వహించనున్నారు. దివంగత నేత , మహా నటుడు ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఓ ప్రభంజనాన్ని సృష్టించింది.
Amaravati Capital Case: జులై 11 నుంచి అమరావతి కేసు విచారణ, ఒకే కేసు పూర్తి కానిదే మరో కేసు విచారించలేమని తెలిపిన సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుపై స్టేకు నిరాకరణ
Hazarath Reddyసుప్రీం కోర్టులో ఇవాళ(మంగళవారం) అమరావతి కేసు (Amaravati capital case) విచారణ జరిగింది. ఏపీ రాజధాని అమరావతి అంశంపై దాఖలైన పిటిషన్ ను సత్వరమే విచారించాలన్న ఏపీ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
Group-1 Mains Postponed: ఏపీ గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్ష వాయిదా, జూన్ 3 నుంచి 9 వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపిన విద్యాశాఖ
Hazarath Reddyఏపీ గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది. ఏప్రిల్ 23 నుంచి 29 వరకు జరగాల్సిన గ్రూప్-1 మెయిన్స్‌ను జూన్ మొదటి వారానికి వాయిదా వేసింది ఏపీపీఎస్సీ. జూన్ 3 నుంచి 9 వరకు ఈ పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది.
TTD: తిరుమల వడ్డీ కాసుల వాడికి రూ. 4.31 కోట్ల ఫైన్‌ విధించిన ఆర్బీఐ, విదేశీ కరెన్సీ వివరాలు ఇవ్వకుండా FCRA violationకు టీటీడీ పాల్పడిందని తెలిపిన RBI
Hazarath Reddyతిరుమల తిరుపతి దేవస్థానంకు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ రూ.4.31 కోట్ల జరిమానా విధించింది. రూ.1.14 కోట్లు ఒకసారి, రూ.3.19 కోట్లు ఒకసారి ఫైన్‌ వేసింది
Nallapareddy Prasanna Kumar Reddy: చివరి దాకా జగన్‌తోనే, పార్టీ మార్పు ఊహాగానాలపై క్లారిటీ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి
Hazarath Reddyపార్టీ మారాల్సిన అవసరం తనకు లేదని, చివరి రక్తపు బొట్టు వరకు సీఎం జగన్‌తోనే ఉంటానని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. కావాలనే తాను పార్టీ మారుతున్నట్లు కొందరు అసత్య ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు.
AP Assembly Speaker Fake Degree Issue: నకిలీ డిగ్రీ సర్టిఫికెట్‌తో లా అడ్మిషన్ తీసుకున్నారు.. ఏపీ స్పీకర్ తమ్మినేనిపై సంచలన ఆరోపణలు చేస్తూ.. రాష్ట్రపతికి కూన రవికుమార్ ఫిర్యాదు
Rudraఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాంపై టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే కూన రవికుమార్ సంచలన ఆరోపణలు చేశారు. లా కోర్సులో చేరాలంటే డిగ్రీ, లేదంటే అందుకు సమానమైన కోర్సు పూర్తి చేసి ఉండాలని, కానీ తమ్మినేని డిగ్రీ కానీ, అలాంటి మరే కోర్సు కానీ చదవలేదని అన్నారు.