ఆంధ్ర ప్రదేశ్
EPFO Interest Rate: ఊరిస్తారో.. ఉసూరుమనిపిస్తారో?? ఈపీఎఫ్ఓ వడ్డీపై బోర్డు నేడు కీలక నిర్ణయం.. వడ్డీరేటు కొంత పెంచాలని కార్మిక సంఘాలు డిమాండ్‌.. అయితే, 2021-22 మాదిరిగానే 2022-23 ఆర్థిక సంవత్సరానికి 8.1% వడ్డీరేటును లేదా 8% వడ్డీరేటును కొనసాగించే అవకాశం
Rudraఉద్యోగుల భవిష్యనిధి(ఈపీఎఫ్‌) ఖాతాల్లో నిల్వలపై వడ్డీరేటు మంగళవారం ఖరారు కానుంది. 2021-22 మాదిరిగానే 2022-23 ఆర్థిక సంవత్సరానికి వడ్డీరేటును 8.1% లేదా 8 శాతంగా నిర్ణయించే అవకాశం ఉంది. 2022-23 ఆదాయాల ఆధారంగా EPFO ఫైనాన్స్ ఇన్వెస్ట్‌మెంట్, ఆడిట్ కమిటీ దీనిని సిఫార్సు చేసింది.
TTD Divya Darshan Tokens: తిరుమల కొండ పైకి నడిచి వచ్చే భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్, దారిలోనే దివ్య దర్శన టోకెన్లు జారీ, విఐపీ టికెట్లు భారీగా తగ్గింపు
Hazarath Reddyభక్తుల కోరిక మేరకు తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ (TTD) శుభవార్త చెప్పింది. అలిపిరి నడక దారిలో వచ్చే వారికి దివ్య దర్శన టోకెన్లు జారీ చేయనున్నట్లు TTD ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి ప్రయోగాత్మకంగా వారం రోజుల పాటు రోజూ 10 వేల టోకెన్లు (Divya Darshan tokens) జారీ చేయనున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy) వెల్లడించారు.
Vontimitta Brahmotsavam 2023: ఏప్రిల్‌ 5న శ్రీసీతారామ కల్యాణ మహోత్సవం, సీఎం జగన్‌కు టీటీడీ ఆహ్వానం, మార్చి 30వ తేదీ నుంచి ఏప్రిల్‌ 09 తేదీ వరకు ఒంటిమిట్ట శ్రీరామనవమి ఉత్సవాలు
Hazarath Reddyఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తన నివాసంలో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డిలు కలిశాఉ. శ్రీకోదండరామస్వామి కళ్యాణ మహోత్సవ ఆహ్వాన శుభ పత్రికను సీఎం జగన్‌కు టీటీడీ చైర్మన్‌, ఈవోలు అందజేశారు.
Viveka Murder Case: వివేకా హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు, తక్షణమే విచారణ అధికారిని మార్చేయాలని తెలిపిన అత్యున్నత ధర్మాసనం
Hazarath Reddyవైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వివేకా హత్య కేసులో (Viveka Murder Case) సీబీఐ దర్యాప్తు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అత్యున్నత ధర్మాసనం.. విచారణ అధికారిని తక్షణమే మార్చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
Tirumala Special Darshan Tickets: ఏప్రిల్ నెల శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు నేడు విడుదల.. ఈ ఉదయం 11 గంటలకు ఆన్ లైన్ లో.. ఆన్ లైన్ ద్వారానే బుక్ చేసుకోవాలన్న టీటీడీ
Rudraతిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. ఏప్రిల్ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను నేడు విడుదల చేయనున్నారు. రూ.300 విలువ చేసే ఈ టికెట్లను ఈ ఉదయం 11 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో ఉంచనుంది.
Corona Virus Video Conference: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.... నేడు రాష్ట్రాలతో కేంద్రం వీడియో కాన్ఫరెన్స్
Rudraదేశంలో గత కొన్ని వారాలుగా కరోనా పాజిటివ్ కేసులతో పాటు మరణాలు కూడా సంభవిస్తుండడం కలవరపరుస్తోంది. రోజువారీ కొత్త కేసుల సంఖ్య 1000కి పైగా నమోదవుతుండడంతో కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో, నేడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలతో కేంద్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది.
PM Modi Hyderabad Visit: ఏప్రిల్ 8న హైదరాబాద్ కు ప్రధాని మోదీ రాక... సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన.. సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలుకు ప్రారంభోత్సవం.. జింఖానా గ్రౌండ్స్‌ లో బహిరంగ సభ!
Rudraప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 8న హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలుకు పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు.
MLC Kavitha: కవిత పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. కేవియెట్ దాఖలు చేసిన ఈడీ.. నేడు ఇరువర్గాల వాదనలు విననున్న సుప్రీం ధర్మాసనం
Rudraఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తనపై ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ నేడు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఇప్పటికే కవిత పిటిషన్ పై ఈడీ కేవియెట్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో, ఇరువురి వాదనలు విన్న తర్వాత సుప్రీం ధర్మాసనం ఉత్తర్వులు ఇవ్వనుంది.
Rains Alert In Telugu States: రానున్న మూడు రోజుల్లో వర్షాలు.. తెలుగు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ.. రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
Rudraఓవైపు ఎండలు.. మరోవైపు వానలతో తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. రానున్న ద్రోణి ప్రభావంతో తెలంగాణలో రెండు రోజుల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.
AP CM Jagan: ప్రకాశం, విజయవాడ, విశాఖలో సీఎం జగన్ రెండ్రోజుల పర్యటన.. నేడు వైసీపీ నేత అశోక్ బాబు తల్లికి నివాళి.. సాయంత్రం గవర్నర్ తో భేటీ.. రేపు విశాఖలో జీ20 ప్రతినిధులతో సమావేశం
Rudraఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెండ్రోజుల పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఖరారైంది. ఇవాళ, రేపు ప్రకాశం, విజయవాడ, విశాఖలో పర్యటించనున్నారు.
ISRO LVM-3 Rocket: ఇస్రో ఎల్వీఎం-3 రాకెట్ ప్రయోగం విజయవంతం.. వాణిజ్య ప్రయోజనాల కోసం ఎల్వీఎం-3 రాకెట్ కు రూపకల్పన.. 36 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టిన ఎల్వీఎం-3
Rudraభారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో రాకెట్ ప్రయోగంలో విజయవంతమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి ఎల్‌వీఎం-3 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది.
Leopard Spots At Tirumala Ghat Road: తిరుమల మొదటి కనుమ దారిలో చిరుత కలకలం.. 35వ మలుపు వద్ద కనిపించిన పులి.. హడలిపోయిన వాహనదారులు.. వీడియో వైరల్
Rudraతిరుమల మొదటి ఘాట్ రోడ్డులో చిరుతపులి మళ్లీ కనిపించింది. మొదటి కనుమ దారిలో 35వ మలుపు వద్ద చిరుత కనిపించడంతో తిరుపతికి వెళుతున్న వాహనదారులు హడలిపోయారు.
Pradhan Mantri Ujjwala Yojana: గ్యాస్ వినియోదారులకు పెద్ద ఊరట.. ఉజ్వల యోజన మరో ఏడాదిపాటు రూ.200ల సబ్సిడీ
Rudraగ్యాస్ వినియోదారులకు పెద్ద ఊరట కలిగించే వార్త ఇది. ఉజ్వల యోజన కింద ప్రతి సంవత్సరం 12 గ్యాస్ సిలిండర్లపై అందుతున్న సబ్సిడీని ఉజ్వల యోజన లబ్ధిదారులకు మరో ఏడాది పాటు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. దేశంలోని 9.5 కోట్ల మందికిపైగా వినియోగదారులు ప్రతి నెలా గ్యాస్ సిలిండర్‌పై రూ.200 ప్రయోజనం పొందనున్నారు.
Vande Bharat Express: శ్రీవారి భక్తులకు శుభవార్త.. వచ్చేనెలలో సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలు.. ఏప్రిల్ 8న ప్రారంభమయ్యే అవకాశాలు.. సికింద్రాబాద్-తిరుపతి మార్గంలో భారీగా ప్రయాణికుల రద్దీ.. వందేభారత్ తో తిరుమల భక్తులకు మరింత ఉపయుక్తం
Rudraతిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుకు మరో రైలు జత కూడనున్నది. వచ్చే నెలలో సికింద్రాబాద్-తిరుపతి నగరాల మధ్య వందే భారత్ రైలు ప్రారంభం కానుంది.
Mekapati Chandrasekhar Reddy: పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ఎంతో ఆనందంగా ఉంది, కావాలంటే ఇప్పుడే రాజీనామా చేస్తానని తెలిపిన ఉదయగిరి ఎమ్మెల్యే
Hazarath Reddyఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడినందుకు ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలపై సస్పెన్షన్ వేటు వేసింది. తనపై పార్టీ హైకమాండ్ తీసుకున్న నిర్ణయం పట్ల మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు
Mekapati Chandrasekhara Reddy: వీడియో ఇదిగో, మేకపాటి చంద్రశేఖరరెడ్డిని సస్పెండ్ చేసినందుకు వ్యతిరేక వర్గం సంబరాలు
Hazarath Reddyఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేసినందుకు పార్టీలో ఆయనకు వ్యతిరేకవర్గం వింజమూరు లోని పాత బస్టాండ్ సెంటర్ లో సంబరాలు చేసుకున్నారు.
MLA Sridevi's Office Attacked: వీడియో ఇదిగో, ఉండవల్లి శ్రీదేవి కార్యాలయంపై దాడి, పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేసిన పోలీసులు
Hazarath Reddyగుంటూరులో ఉండవల్లి శ్రీదేవి కార్యాలయంపై దాడి జరిగింది. అక్కడి ఫ్లెక్సీలు, బ్యానర్లు ధ్వంసం చేశారు. పార్టీ పట్ల ద్రోహానికి పాల్పడిన ఎమ్మెల్యే అంటూ నినాదాలు చేశారు. దాంతో శ్రీదేవి కార్యాలయం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది.
AP Budget 2023: రెండు కీలక తీర్మానాలకు ఏపీ అసెంబ్లీ ఆమోదం, బోయ, వాల్మీకి కులాలు ఎస్టీల్లోకి, దళిత క్రిస్టియన్లు ఎస్సీల జాబితాలోకి, ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ 9వ రోజు బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా..రెండు కీలక తీర్మానాలకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఈ రెండు తీర్మానాలనూ కేంద్రానికి పంపుతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు
kotamreddy Giridhar Reddy Joins TDP: టీడీపీలో చేరిన కోటంరెడ్డి తమ్ముడు గిరిధర్ రెడ్డి, వచ్చే ఎన్నికల్లో 10 అసెంబ్లీ స్థానాలను టీడీపీ గెలుస్తుందని వెల్లడి
Hazarath Reddyనెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు, వైసీపీ నేత గిరిధర్ రెడ్డి నేడు టీడీపీలో చేరారు. పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ తీర్థం పుచుకున్నారు. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి పసుపు కండువా కప్పిన చంద్రబాబు పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు
Kotamareddy on Suspension: ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతం, సస్పెన్సన్‌పై స్పందించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
Hazarath Reddyఏపీలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారంటూ వైసీపీ అధినాయకత్వం సస్పెండ్ చేసిన నలుగురు ఎమ్మెల్యేలలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉన్నారు. పార్టీ హైకమాండ్ నిర్ణయంపై ఆయన మీడియాతో మాట్లాడారు.