ఆంధ్ర ప్రదేశ్
Special Trains: సంక్రాంతికి మరో 30 ప్రత్యేక రైళ్లు.. సికింద్రాబాద్ నుంచి ఆంధ్రాలో పలు నగరాలకు రాకపోకలు
Rudraసంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్లే వారి కోసం సికింద్రాబాద్ నుంచి అదనంగా 30 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్ తో సహా నాంపల్లి, కాచిగూడ, వికారాబాద్ ల నుంచి నర్సాపూర్, మచిలీపట్నం, కాకినాడ నగరాలకు వీటిని నడపనున్నట్లు పేర్కొంది.
Jagan Tributes To Modi’s Mother: మోదీ మాతృమూర్తి హీరాబెన్ కన్నుమూత.. మోదీకి సానుభూతిని ప్రకటించిన జగన్, చంద్రబాబు, కేసీఆర్
Rudraభారత ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్ మోదీ తుదిశ్వాస విడిచిన నేపథ్యంలో మోదీకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ఏపీ సీఎం జగన్ అన్నారు. తల్లిని కోల్పోవడం ఎవరికైనా అత్యంత బాధాకరమని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు.
Polavaram Project: పోలవరం ప్రాజెక్టుపై కేంద్రానికి సుప్రీం నోటీసులు, ప్రాజెక్ట్ కోసం పర్యావరణ అనుమతుల్లో ఉల్లంఘనలు జరిగాయని ఆరోపణలు, నాలుగు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు
Hazarath Reddyపోలవరం బహుళ ప్రయోజన నీటిపారుదల ప్రాజెక్టుకు (Polavaram Project) పర్యావరణ అనుమతుల్లో ఉల్లంఘనలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్‌పై కేంద్రంతో పాటు సంబంధిత రాష్ట్రాల స్పందనను (Supreme Court Seeks Centre's Response) సుప్రీంకోర్టు కోరింది
Stampede at TDP Road Show: చంద్రబాబు అతి వల్లే ఈ ఘోర ప్రమాదం, టీడీపీ అధినేతపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కెఎ పాల్, ఘటనపై స్పందించిన హోం మంత్రి తానేటి వనిత
Hazarath Reddyటీడీపీ అధినేత చంద్రబాబు కందుకూరు సభలో జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది మంది దుర్మరణం చెందడంపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గ్రౌండ్ లో పెట్టుకోవాల్సిన సభ రోడ్డు మీదకు రావడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని అన్నారు.
Crime Rate in Telugu states: తెలుగు రాష్ట్రాల్లో క్రైమ్ రేటు వివరాలు ఇవే, తెలంగాణలో పెరిగిన క్రైమ్, ఏపీలో తగ్గిపోయిన క్రైమ్‌ రేటు
Hazarath Reddyఏపీలో క్రైమ్‌ రేటు తగ్గిందని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి వెల్లడించారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మెరుగైన పోలీసింగ్‌తో నేరాలు తగ్గించగలిగామన్నారు. లోక్‌ అదాలత్‌ ద్వారా పెద్ద ఎత్తున కేసులు పరిష్కరిస్తున్నాం. 1.08 లక్షల కేసులు పరిష్కరించాం. చోరీ కేసుల్లో రికవరీ శాతం బాగా పెరిగిందని డీజీపీ పేర్కొన్నారు.
Stampede at TDP Roadshow: చంద్రబాబు రోడ్ షో ప్రమాద ఘటనపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి, మృతులకు రూ.2 లక్షలు, గాయపడ్డ వారికి రూ.50వేల చొప్పున పరిహారం అందించాలని ఆదేశాలు
Hazarath Reddyనెల్లూరు జిల్లా కందుకూరు ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు సీఎం వైయస్‌.జగన్‌ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. మృతులకు రూ.2 లక్షలు, గాయపడ్డ వారికి రూ.50వేల చొప్పున పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు.
Stampede at TDP Roadshow: చంద్రబాబు రోడ్ షో ప్రమాద ఘటనపై ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతి, మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలకు ఎక్స్‌గ్రేషియా, ఘటనపై కేసు నమోదు చేసిన కందుకూరు పోలీసులు
Hazarath Reddyఏపీలోని నెల్లూరు జిల్లా కందుకూరులో నిర్వహించిన టీడీపీ సభలో తొక్కిసలాట జరిగి 8 మంది మృతి చెందడంపై ప్రధాని నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనతో ప్రధాని తీవ్రంగా కలత చెందినట్లు ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్‌ చేసింది. మృతుల కుటుంబాలకు మోదీ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Andhra Pradesh: ఇరుకు సందే కొంప ముంచింది, రోడ్డు చిన్నగా ఉండటంతో భారీగా తరలివచ్చిన కార్యకర్తలతో తోపులాట, విషాదంగా మారిన చంద్రబాబు రోడ్ షో, ఏడు మంది మృతి
Hazarath Reddyచంద్రబాబు కందుకూరు రోడ్ షోలో తీవ్ర విషాదం చోటు చేసుకున్న సంగతి విదితమే. ఈ మీటింగ్ కు (Chandrababu's TDP Meeting) కార్యకర్తలు భారీగా తరలి రావడంతో తోపులాట జరిగి కొందరు కార్యకర్తలు డ్రైనేజీలో పడిపోయారు. అప్రమత్తమైన టీడీపీ నేతలు గాయపడిన కార్యకర్తలను వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఏడుగురు మృతి (7 Dead in Stampede) చెందినట్టుగా వార్తలు వస్తున్నాయి.
Andhra Pradesh: చంద్రబాబు నాయుడు రోడ్ షోలో అపశృతి, డ్రైనేజీలో పడిపోయిన కార్యకర్తలు, ఏడుమంది మృతి, మరికొందరికి గాయాలు, మృతుల కుటుంబాలకు టీడీపీ పార్టీ తరఫున రూ.10లక్షల ఆర్థిక సాయం
Hazarath Reddyటీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్న నెల్లూరు జిల్లా కందుకూరు సభలో అపశృతి చోటు చేసుకుంది. కార్యకర్తలు భారీగా తరలి రావడంతో తోపులాట జరిగి కొందరు కార్యకర్తలు డ్రైనేజీలో పడిపోయారు. అప్రమత్తమైన తెదేపా నేతలు గాయపడిన కార్యకర్తలను వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఏడుగురు మృతి చెందినట్టు సమాచారం.
TS SSC Exam Time Table 2023: ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు, ఆరు పేపర్ల పరీక్ష విధానాన్ని తీసుకువచ్చిన ప్రభుత్వం
Hazarath Reddyతెలంగాణ ప్రభుత్వం పరీక్ష విధానంలో సంస్కరణలు తీసుకువచ్చింది. 9, 10 తరగతి పరీక్షల్లో ఆరు పేపర్ల పరీక్ష విధానాన్ని ముందుకు తీసుకువచ్చింది. విద్యా విధానంలో సంస్కరణలో భాగంగా 9, 10వ తరగతి పరీక్ష విధానంలో విద్యాశాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది.
Andhra Pradesh: ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయండి, కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌కు విన్నవించిన సీఎం జగన్
Hazarath Reddyఢిల్లీ పర్యటనలో భాగంగా.. బుధవారం ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. కేంద్ర అటవీ పర్యావరణశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌తో భేటీ అయ్యారు. సుమారు గంటపాటు జరిగిన ఈ సమావేశంలో.. ఏపీకి సంబంధించిన ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు మంజూరుతో పాటు పలు కీలక అంశాలపైనా కేంద్రమంత్రికి విన్నవించారు.
CM Jagan Meets PM Modi: ప్రధాని మోదీ ముందు సీఎం జగన్ ఉంచిన సమస్యలు ఇవే, ప్రధానంగా విభజన చట్టంలో సమస్యలు పరిష్కరించాలని వినతి
Hazarath Reddyఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనలో భాగంగా.. దేశ ప్రధాని నరేంద్ర మోదీతో బుధవారం మధ్యాహ్నాం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలకాంశాలపై ప్రధాని మోదీతో చర్చించారు సీఎం జగన్‌. ముందుగా.. కోవిడ్‌ తాజా పరిణామాల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నట్లు ఆయన ప్రధానికి వివరించారు.
CM Jagan Meets PM Modi: ప్రధాని మోదీతో ముగిసిన సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ, ఇరువురి మధ్య దాదాపు గంటపాటు సమావేశం, ఏపీకి రావాల్సిన నిధులు, పెండింగ్‌ బకాయిలు, పోలవరం సహా పలు అంశాలపై చర్చలు
Hazarath Reddyప్రధాని మోదీతో సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ ముగిసింది. ఇరువురి మధ్య దాదాపు గంటపాటు సమావేశం కొనసాగింది. ఏపీకి రావాల్సిన నిధులు, పెండింగ్‌ బకాయిలు, పోలవరం సహా పలు అంశాలపై సీఎం జగన్‌ ప్రధానితో చర్చించారు.
Ration Card in DigiLocker: రేషన్ కార్డును మీరు ఇక తీసుకువెళ్లనవసరం లేదు, DigiLocker ద్వారా రేషన్ కార్డును జారీ చేస్తున్న ఏపీ ప్రభుత్వం, డిజిలాకర్ యాప్‌ డౌన్ లోడ్ లింక్ ఇదే..
Hazarath Reddyఇప్పుడు #రేషన్ కార్డ్ యొక్క ఒరిజినల్ కాపీని మీరు రేషన్ షాపుకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు! వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం & పౌర సరఫరాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు #DigiLocker ద్వారా రేషన్ కార్డును జారీ చేస్తోంది. యాప్‌ని ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి ఈ లింక్ ద్వారా..
Guntur Couple Dies in America: అమెరికా మంచు తుపానులో చిక్కుకుని గుంటూరు దంపతులు మృతి, కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు
Hazarath Reddyఅమెరికా సహా కెనడాలో మంచు తుపాను (bomb cyclone) బీభత్సం సృష్టిస్తోంది. తీవ్రమైన చలిగాలులతో ఇప్పటి వరకు 60 మంది వరకు మృతి చెందారు. తాజాగా గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పాలపర్రు గ్రామానికి చెందిన ముద్దన నారాయణ, హరిత దంపతులు అమెరికాలో న్యూజెర్సీలో విహారయాత్రకు వెళ్లి (AP Couple Dies in America) గల్లంతయ్యారు.
Andhra Pradesh Shocker: మదనపల్లెలో తల లేని మృత దేహం కలకలం, మృతుడిని రమేష్‌గా గుర్తించిన పోలీస్ అధికారులు, కేసు త్వరిత గతిన పూర్తి చేయాలని జిల్లా ఎస్.పి ఆదేశాలు
Hazarath Reddyఅన్నమయ్య జిల్లా మదనపల్లెలోని బెంగుళూరు రోడ్, జవుకుపల్లి తోపు సమీపంలో తల లేని మృత దేహం గురించి తెలియగా సంఘటనా స్థలానికి పరిశీలించిన జిల్లా ఎస్.పి వి.హర్షవర్ధన్ రాజు. మృతుడిని రమేష్‌గా గుర్తించారు.
Tirumala: తిరుమలలో జనవరి 1 నుంచి సర్వదర్శనం టోకెన్ల జారీ, 36 గంటలకు పైగా పడుతున్న శ్రీవారి దర్శనం, తిరుపతిలో టోకెన్లు జారీ చేసే ప్రదేశాలు ఇవే..
Hazarath Reddyతిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది.శ్రీవారి సర్వదర్శనానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 36 గంటలకు పైగా సమయం ( Waiting time for devotees) పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
Unstoppable with NBK: బాలకృష్ణని హగ్ చేసుకున్న పవన్ కళ్యాణ్, అన్‌స్టాపబుల్‌-2 ఎపిసోడ్‌కి విచ్చేసిన జనసేనాధినేత, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్
Hazarath Reddyపవన్‌ తొలిసారిగా అన్‌స్టాపబుల్ షోకు వచ్చారు.దీంతో ప్రేక్షకులలో క్యూరియాసిటీ పెరిగింది. పవన్‌ను, బాలయ్య ఎలాంటి ప్రశ్నలు అడుతాడా? అని అందరిలోనే ఆసక్తి నెలకొంది. ఈ షోకు పవన్‌తో పాటు దర్శకులు త్రివిక్రమ్‌, క్రిష్‌ రానున్నారు. తాజాగా అన్‌స్టాపబుల్‌ సెట్స్‌లో NBK with PSPK అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.
Andhra Pradesh: పెన్షన్లు తీసేస్తున్నారని విష ప్రచారం చేస్తున్నారు, లబ్దిదారుల ఖాతాల్లో మూడేళ్లలో రూ.1.85 లక్షల కోట్లు జమ చేశామని తెలిపిన సీఎం జగన్, తాజాగా రూ.590.91 కోట్లు విడుదల
Hazarath Reddyఏపీలో అర్హులైనప్పటికీ ఏ కారణం చేతనైనా లబ్ధి పొందని వారికి మరో అవకాశం కల్పిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 2,79,065 మందికి రూ.590.91 కోట్లను సీఎం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి ఖాతాల్లో జమ చేశారు.