ఆంధ్ర ప్రదేశ్
Andhra Pradesh: చిన్నారిపై కామాంధుడి పైశాచికం, బుగ్గలు, తొడల భాగంలో గోళ్లతో రక్కుతూ వికృతానందం, ఆ పాప తల్లితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఆ దారుణానికి పాల్పడిన యువకుడు
Hazarath Reddyవిజయనగరం జిల్లాలోని కొత్తపేట పరిధిలోని శాలువపేటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. చిన్నా అనే యువకుడు రెండు సంత్సరాల నాలుగునెలల పాపపై పైశాచికత్వం (Man held for torturing two-year baby ) ప్రదర్శించాడు. బుగ్గలు, తొడల భాగంలో గోళ్లతో రక్కేశాడు. చిన్నారి ఏడుస్తున్నా విడిచిపెట్టకుండా పైశాచిక అనందం పొందాడు.
Chittoor Road Accident: ఘోర రోడ్డు ప్రమాదాలు, ఎనిమిది మంది మృతి, చిత్తూరు జిల్లాలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు, నలుగురు అక్కడికక్కడే మృతి, అదిలాబాద్, నాగర్‌ కర్నూల్‌ జిల్లా రోడ్డు ప్రమాదాల్లో మరో నలుగురు మృతి
Hazarath Reddyఏపీలో చిత్తూరు జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం (Chittoor Road Accident) చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టిన ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. విశాఖ నుంచి కాణిపాకం వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
Andhra Pradesh: న్యాయవ్యవస్థను కాపాడకుండా ఈ దిగజారుడు పోస్టులు ఏంటీ? న్యాయవాదులపై మండిపడిన ఏపీ హైకోర్టు, సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యల కేసు ఈ నెల 21కి వాయిదా
Hazarath Reddyన్యాయవ్యవస్థ హుందాతనాన్ని కాపాడాల్సిన న్యాయవాదులే ప్రతిష్ఠను దిగజార్చేలా వ్యాఖ్యలు చేయడమేంటని హైకోర్టు ప్రశ్నించింది. ఎవరు పడితే వారు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం, వీడియోలు అప్‌లోడ్‌ చేయడాన్ని అంగీకరించేది లేదని (AP High Court outraged Two senior lawyers ) తేల్చిచెప్పింది. న్యాయవ్యవస్థపై, న్యాయమూర్తులపై అభ్యంతరకర వ్యాఖ్యలు, పోస్టులను అసలు సహించబోమని హెచ్చరించింది.
Trujet: మూసివేత దిశగా రామ్ చరణ్ విమానయాన సంస్థ! జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉందంటూ ప్రచారం, క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్, కంపెనీ ప్రతినిధులు
Naresh. VNSమెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నడిపిస్తున్న ట్రూజెట్ విమానయాన సేవలు నిలిచిపోయాయా? సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ట్రూజెట్ ఉందా? గత నవంబర్ నుంచి ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదని వస్తున్న వార్తలపై ఆ సంస్థ క్లారిటీ ఇచ్చింది. ట్రూజెట్ కొంత నష్టాల్లో ఉన్న మాట వాస్తవమే కానీ, సంస్థను మూసివేయడం లేదని ప్రకటించింది.
Andhra Pradesh: ఏపీలో 51 ప్రాజెక్టులకు ముందడుగు, కీలక ప్రాజెక్టులపై కేంద్రమంత్రి గడ్కరీతో సీఎం జగన్‌ చర్చలు, సీఎం జగన్‌ గొప్ప ఆశయం ఉన్న నాయకుడని ప్రశంసించిన కేంద్ర మంత్రి
Hazarath Reddyఏపీలో పూర్తయిన పలు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనల తర్వాత కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ నేరుగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నివాసానికి చేరుకున్నారు. కేంద్ర మంత్రి గౌరవార్ధం ఆయనకు సీఎం (AP CM YS Jagan) విందు ఇచ్చారు.
TTD Board Meeting: రూ.3,096 కోట్లతో టీటీడీ బడ్జెట్‌కు ఆమోదం, తిరుమల కొండపై ఇకపై ప్రైవేట్ హోటల్స్ ఉండవు!, టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు ఇవే
Naresh. VNSతిరుమల కొండపై ప్రైవేట్ హోటల్స్ ( private hotels) గురించి కీలక నిర్ణయం తీసుకుంది టీటీడీ (TTD) పాలకమండలి. త్వరలోనే కొండపై ప్రైవేటు హోటళ్లను తొలగించాలని పాలక మండలి నిర్ణయం తీసుకుంది. గురువారం జరిగిన పాలకమండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. బోర్డు మీటింగ్‌(TTD Board) లో పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.
Corona in AP: ఏపీలో అత్యంత దిగువకు పడిపోయిన కేసులు, గత 24 గంటల్లో 528 మందికి కరోనా, అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 101 కొత్త కేసులు నమోదు
Hazarath Reddyఏపీలో గడచిన 24 గంటల్లో 22,339 కరోనా పరీక్షలు నిర్వహించగా, 528 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 101 కొత్త కేసులు నమోదు కాగా, పశ్చిమ గోదావరి జిల్లాలో 92, గుంటూరు జిల్లాలో 73, కృష్ణా జిల్లాలో 57 కేసులు వెల్లడయ్యాయి.
Benz Circle flyover-II Inauguration: విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ ఫ్లైఓవర్‌ ప్రారంభం, ఏపీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని తెలిపిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి
Hazarath Reddyవిజయవాడ బెంజ్‌ సర్కిల్‌ ఫ్లైఓవర్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ కలిసి ప్రారంభించారు. కేంద్రమంత్రి గడ్కరీతో (Union Minister Nitin Gadkari and AP CM YS Jaga) కలిసి జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ నిర్మించిన 20 రహదారులు, ఇతర ప్రాజెక్టులను ప్రారంభించారు. 31 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ( National Highway Projects to Nation) భూమిపూజ చేశారు.
Andhra Prdesh: ఆంధ్రప్రదేశ్‌కు పాకిన హిజాబ్ వివాదం, విజయవాడలోని ఆంధ్ర లయోల కాలేజ్‌లో హిజాబ్ ధరించిన విద్యార్థినిలను అడ్డుకున్న కాలేజీ యాజమాన్యం
Hazarath Reddyహిజబ్ వివాదం (Hijab Controversy) ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ముఖ్యంగా కర్ణాటకలో ఈ వివాదం ప్రకంపనలు రేపుతోంది. కర్ణాటకలోని మొదలైన హిజాబ్ వివాదం ఆంధ్రప్రదేశ్‌కు పాకింది. విజయవాడలోని ఆంధ్ర లయోల కాలేజ్‌లో హిజాబ్ వివాదం నెలకొంది.
Benz Circle Flyover Inauguration: విజయవాడ బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్-2 ప్రారంభించిన కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ, సీఎం జగన్‌తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న కేంద్ర మంత్రి
Hazarath Reddyకేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ విజయవాడ బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్-2 (vijayawada benz circle flyover 2 ) ప్రారంభించారు. కేంద్ర మంత్రి గడ్కరీతో పాటుగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా ప్రారంభోత్సవానికి (vijayawada benz circle flyover 2 inauguration) విచ్చేశారు. ముందుగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర మంత్రికి రాష్ట్రప్రభుత్వం తరపున మంత్రి శంకర్ నారాయణ ,ఎంపీ బాలశౌరి స్వాగతం పలికారు.
Sawang Appointed as APPSC Chairman: ఏపీపీఎస్‌సీ ఛైర్మన్‌గా మాజీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
Hazarath Reddyమాజీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ను ఏపీ ప్రభుత్వం ఏపీపీఎస్‌సీ ఛైర్మన్‌గా నియమించింది. ఈ మేరకు గురువారం ప్రకటన వెలువడింది. రెండు రోజుల క్రితమే డీజీపీ పోస్టు నుంచి సవాంగ్‌ బదిలీ అయ్యారు. గ‌త రెండు రోజుల క్రితం గౌత‌మ్ స‌వాంగ్ డీజీపీ హోదా నుండి బ‌దిలీ అయ్యారు. ఐదేళ్ల పాటు గౌత‌మ్ స‌వాంగ్ కొన‌సాగ‌నున్నారు. రిటైర్డు అయినా పదవిలో కొనసాగనున్నారు
Corona in AP: ఏపీలో తగ్గిపోయిన రోజు వారీ కేసులు, గత 24 గంటల్లో 675 మందికి కరోనా, తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 143 కేసులు
Hazarath Reddyఏపీలో గత 24 గంటల్లో 675 కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 143 కేసులు వెలుగుచూశాయి. ఇదే సమయంలో మహమ్మారి కారణంగా ముగ్గురు మృతి చెందారు. మొత్తం 2,414 మంది కరోనా నుంచి కోలుకున్నారు
Andhra Pradesh: టీచర్ హత్యకు కారణమైన దండుపాళ్యం సినిమా, కదిరిలో ఉపాధ్యాయురాలిని దారుణంగా చంపిన కిరాతకుడు, ఎట్టకేలకు అరెస్ట్ చేసిన పోలీసులు
Hazarath Reddyఅనంతపురం జిల్లాలో టీచర్ హత్య కేసు మిస్టరీ వీడింది. దండుపాళ్యం సినిమా స్ఫూర్తితో తీవ్రమైన నేరానికి పాల్పడిన నిందితున్ని (Anantapur Police arrests accused) పోలీసులు పట్టుకున్నారు. గత ఏడాది నవంబర్ లో అనంతపురం జిల్లా కదిరిలో టీచర్ ఉషారాణి హత్య (teacher's murder case ) జరిగింది.
Andhra Pradesh: సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన కొత్త పోలీస్ బాస్ రాజేంద్రనాథ్‌రెడ్డి, రాష్ట్ర డీజీపీగా రాజేంద్రనాథ్‌ రెడ్డికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించిన ఏపీ ప్రభుత్వం
Hazarath Reddyఏపీకి నూతన డీజీపీగా నియమితులైన కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్‌ రెడ్డి సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ డీజీగా ఉన్న రాజేంద్రనాథ్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో సీఎంతో ఆయన సమావేశమయ్యారు.
Sajjala on YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసుపై సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు, సీబీఐ చార్జిషీట్‌ను కచ్చితంగా చాలెంజ్‌ చేస్తామని తెలిపిన ఏపీ ప్రభుత్వ సలహాదారు
Hazarath Reddyమాజీ మంత్రి, సీఎం జగన్ బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి, హత్య కేసు అంశానికి సంబంధించి ఎల్లో మీడియా అంతా పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala on YS Viveka Murder Case) మండిపడ్డారు.
Ali Meets CM YS Jagan: తాను పదవి కోసం పార్టీలోకి రాలేదు, మా ఆవిడ జగన్‌తో ఒక్క ఫోటో దిగాలని ఎప్పటి నుంచో కోరుతోంది, ఏపీ సీఎం జగన్‌తో భేటీ అయిన సినీ నటుడు ఆలీ
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రముఖ నటుడు అలీ (Ali Meets Cm Ys Jagan) సమావేశమయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆలీ సీఎం జగన్‌తో భేటీ అయ్యారు.
Corona in AP: ఏపీలో బారీగా తగ్గిపోయిన కేసులు, గడచిన 24 గంటల్లో 615 మందికి కరోనా, అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 134 కొత్త కేసులు
Hazarath Reddyఏపీలో కరోనా వ్యాప్తి కనిష్టస్థాయిలో కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 22,267 శాంపిల్స్ పరీక్షించగా, 615 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 134 కొత్త కేసులు నమోదు కాగా, తూర్పు గోదావరి జిల్లాలో 103, కృష్ణా జిల్లాలో 102 కేసులు వెల్లడయ్యాయి.
Andhra Pradesh: జగన్ సర్కారు గుడ్ న్యూస్, 5,97,311 మంది రైతుల ఖాతాల్లోకి రూ.542.06 కోట్లు, భారీ వర్షాలు, వరదలతో పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ అందించిన ఏపీ ప్రభుత్వం
Hazarath Reddyగతేడాది నవంబర్‌లో భారీ వర్షాలు, వరదలతో పంట నష్టపోయిన రైతన్నల ఖాతాల్లో ప్రభుత్వం మంగళవారం ఇన్‌పుట్‌ సబ్సిడీని జమ చేశారు. వర్షాలు, వరదలతోపాటు నేల కోత, ఇసుక మేటల కారణంగా పంటలు నష్టపోయిన 5,97,311 మంది రైతన్నల ఖాతాలో మొత్తం రూ.542.06 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని (Rs 534-crore crop loss subsidy to farmers ) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (Andhra Pradesh CM YS Jagan Mohan Reddy ) మంగళవారం నేరుగా జమ చేశారు.
AP Film Ticket Price Issue: సీఎం జగన్‌ను కలవనని తేల్చి చెప్పిన బాలకృష్ణ, సినిమా టికెట్ రేట్లు తక్కువగా ఉన్నప్పుడే అఖండ హిట్ కొట్టిందని వెల్లడి
Hazarath Reddyప్రముఖ సినీనటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఏపీలో సినిమా టికెట్ల ధరలపై స్పందించారు. ఈ విషయంలో (AP Film Ticket Price Issue) ఏపీ సీఎం జగన్‌తో కలువనని స్పష్టం చేశారు. ఇటీవల చిరంజీవి బృందం సభ్యులు సీఎంతో చర్చించేందుకు తనను కూడా ఆహ్వానించారని అయితే తాను రాననే చెప్పానని వెల్లడించారు.
Kasi Reddy V.R.N Reddy: ఏపీ కొత్త డీజీపీగా రాజేంద్రనాథ్‌ రెడ్డి, గౌతమ్ సవాంగ్‌పై బదిలీవేటు, గతంలో విజయవాడ, విశాఖపట్నం పోలీస్ కమిషనర్ గా రాజేంద్రనాథ్ రెడ్డి
Hazarath Reddyఏపీ కొత్త డీజీపీగా కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్‌ రెడ్డి నియమితులయ్యారు. 1992 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి అయిన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రస్తుతం ఇంటెలిజెన్స్‌ డీజీగా పనిచేస్తున్నారు. గతంలో విజయవాడ, విశాఖ, పోలీస్‌ కమిషనర్‌గా ఆయన పనిచేశారు.