ఆంధ్ర ప్రదేశ్

AP Govt Covid 19 New Guidelines: ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం, ఒమిక్రాన్ నేపథ్యంలో కఠిన నిబంధనలు జారీ, మాస్క్‌ లేకుండా రానిస్తే రూ.10 వేల నుంచి రూ. 25 వేల వరకు జరిమానా

Krishna

కరోనా కట్టడిలో భాగంగా ఏపీ ప్రభుత్వం నిబంధనలు మరింత కఠినతరం చేసింది. మాస్క్‌ లేకుండా తిరిగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Cheddi Gang in Vijayawada: బెజవాడను వణికిస్తున్న చెడ్డీ గ్యాంగ్, రాత్రయితే చాలు భయంతో వణుకుతున్న ప్రజలు, పది రోజుల్లో 5 చోట్ల దొంగతనాలు...

Krishna

మొన్నటి వరకూ హైదరాబాద్‌లో దడ పుట్టించిన చెడ్డీ గ్యాంగ్ (Cheddi Gang ) తాజాగా ఆంధ్రప్రదేశ్‌ ను హడలెత్తిస్తోంది. తాజాగా కృష్ణా, గుంటూరు జిల్లాలను చెడ్డి గ్యాంగ్ వణికిస్తోంది. పది రోజుల వ్యవధిలో చడ్డీ గ్యాంగ్ ఐదుచోట్ల దొంగతనాలకు పాల్పడింది,

Ex-Sarpanch Killed in Guntur: గుంటూరులో పట్టపగలే మాజీ సర్పంచ్ దారుణ హత్య, భగ్గుమన్న పాతకక్షలు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పిడుగురాళ్ల రూరల్‌ పోలీసులు

Hazarath Reddy

గుంటూరులో మళ్లీ పాతకక్షలు భగ్గుమన్నాయి. ఈ కక్షలతో పట్టపగలే మాజీ సర్పంచ్‌ దారుణ హత్యకు (Ex-Sarpanch Killed in Guntur) గురయ్యారు. ఈ దుర్ఘటన రాజుపాలెం మండలంలోని పెదనెమలిపురి గ్రామంలో (Pedanemalipuri Village) బుధవారం జరిగింది

Nellore Road Accident:గుడిలో నిద్ర చేయడానికి వెళ్తూ శాశ్వత నిద్రలోకి...నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం, వాగులో కొట్టుకుపోయిన ఆటో, ఐదుగురు గల్లంతు

Naresh. VNS

నెల్లూరు(Nellore) జిల్లాలో గురువారం రాత్రి ఘోర ప్రమాదం(Accident) జరిగింది. సంగం సమీపంలోని బీరాపేరు(beeraperu) వాగులో ఆటో కొట్టుకుపోయిన ఘటనలో ఐదుగురు గల్లంతయ్యారు. మరో ఏడుగురిని స్థానికులు కాపాడారు.

Advertisement

MP Vijayasai Reddy Meets PM Modi: ప్రధాని మోదీతో విజయసాయి రెడ్డి భేటీ, రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై చర్చ

Hazarath Reddy

ప్రధాని నరేంద్ర మోదీని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గురువారం కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై ప్రధానితో విజయసాయిరెడ్డి చర్చించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో లేవనెత్తిన ముఖ్యమైన అంశాలపై సుదీర్ఘంగా చర్చించామని విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో వెల్లడించారు.

Corona in AP: ఏపీలో కొత్తగా 193 మందికి కరోనా పాజిటివ్, చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 35 మందికి కోవిడ్

Hazarath Reddy

గత 24 గంటల్లో ఏపీలో 31,101 మంది శాంపిల్స్ ని పరీక్షించగా 193 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వీరిలో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 35 మంది కరోనా బారిన పడ్డారు. కర్నూలు జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఇదే సమయంలో 164 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు.

Andhra Pradesh: సాయి తేజ్ కుటుంబానికి అండగా మంచు కుటుంబం, ఇద్దరు పిల్లలకు ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తానని తెలిపిన హీరో మంచు విష్ణు

Hazarath Reddy

సైనికుడు సాయి తేజ్ కుటుంబానికి మంచు మోహన్‌ బాబు కుటుంబం అండగా నిలిచింది. లాన్స్‌ నాయక్‌ సాయి తేజ ఇద్దరు పిల్లలను ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తానని హీరో మంచు విష్ణు వెల్లడించారు. త్వరలోనే చిత్తూరుకు వచ్చి సాయి తేజ కుటుంబాన్ని కలుస్తానని పేర్కొన్నారు. కాగా సాయితేజ అంత్యక్రియలు శుక్రవారం చిత్తూరు జిల్లా రేగడిపల్లిలో నిర్వహించనున్నారు.

Coronavirus in AP: ఏపీలో కొత్తగా 181 మందికి కరోనా పాజిటివ్, ప్రస్తుతం రాష్ట్రంలో 2,011 యాక్టివ్ కేసులు

Hazarath Reddy

ఏపీలో గత 24 గంటల్లో 31,957 మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా 181 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇదే సమయంలో 176 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,011 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Advertisement

Andhra Pradesh: వైసీపీ ఎమ్మెల్సీలుగా 10 మంది ప్రమాణం స్వీకారం, మరో నేత సత్య ఉదయ భాస్కర్‌ త్వరలో ప్రమాణ స్వీకారం

Hazarath Reddy

ఏపీ శాసన మండలికి నూతనంగా ఎంపికైన 11 మంది సభ్యులలో పది మంది బుధవారం ప్రమాణ స్వీకారం (Newly elected YCP MLCs) చేశారు. బుధవారం అమరావతి అసెంబ్లీ ప్రాంగణంలో (legislative council office) జరిగిన కార్యక్రమంలో మండలి అధ్యక్షులు కొయ్యే మోషేనురాజు ఎనిమిది మంది సభ్యులతో వేదికపై ప్రమాణ స్వీకారం చేయించారు.

IAF Helicopter Crash: చిట్టి తల్లిని చూడాలని ఉందంటూ భార్యకు ఫోన్, వీడియో కాల్ చేస్తానంటూ.. కొద్ది గంటలకే హెలికాఫ్టర్ ప్రమాదంలో తెలుగు తేజం సాయితేజ్ మృతి, సంతాపం తెలిపిన ఏపీ సీఎం జగన్

Hazarath Reddy

భార్యకు ఫోన్ చేసిన సాయితేజ్... నా గారాల పట్టి దర్శిని ఏం చేస్తోంది.. బాబు మోక్షజ్ఞ స్కూల్‌కు వెళ్లాడా.. చిట్టితల్లిని చూడాలని ఉంది. వీడియో కాల్‌ చేస్తా’ అంటూ భార్య శ్యామలతో లాన్స్‌నాయక్‌ బి.సాయితేజ బుధవారం ఉదయం 8.45 గంటలకు మాట్లాడారు.

Andhra Pradesh: భర్త లింగమార్పిడి..వేరొకరితో సంబంధం పెట్టుకున్న భార్య, ప్రియుడితో బైక్ మీద వెళుతుండగా రోడ్డు ప్రమాదం, ఆ తరువాత ఇద్దరూ మృతి

Hazarath Reddy

ఏలూరులో యువతి రోడ్డు ప్రమాదంలో మృతి (Woman dies) చెందగా వెంటనే ఆ యువతితో సహజీవనం చేసిన ప్రియుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు (Lover Committed Suicide) పాల్పడ్డాడు. ఏపీలోని ఏలూరు బీడీ కాలనీలో ఈ ఘటన మూడు రోజుల క్రితం జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Somu Veerraju: నాకు సీఎం అవ్వాలని లేదు, 2024 తర్వాత రాజకీయాల్లో ఉండను, ఏపీలో బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వండి, సంచలన వ్యాఖ్యలు చేసిన ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు

Hazarath Reddy

ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు సంచలన ప్రకటన చేశారు. పోలవరం, ఇతర అంశాలపై ఏపీ సర్కార్‌పై విమర్శలు గుప్పించిన సోము వీర్రాజు (Somu Veerraju) రాజకీయా జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఏనాడూ పదవుల కోసం ఎదురు చూడలేదన్నారు. 2024 తర్వాత తాను రాజకీయాలలో ఉండను అన్నారు.

Advertisement

Coronavirus in AP: ఏపీలో ఒమిక్రాన్ కేసులు లేవని తెలిపిన ఆరోగ్యశాఖ, కొత్తగా 184 మందికి కరోనా పాజిటివ్, కృష్ణా జిల్లాలో అత్యధికంగా 34 కొత్త కేసులు నమోదు

Hazarath Reddy

ఏపీలో గడచిన 24 గంటల్లో 30,747 శాంపిల్స్ పరీక్షించగా 184 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కృష్ణా జిల్లాలో అత్యధికంగా 34 కొత్త కేసులు నమోదు కాగా, శ్రీకాకుళం జిల్లాలో 22, విశాఖ జిల్లాలో 20 కేసులు వెల్లడయ్యాయి. కర్నూలు జిల్లాలో కొత్తకేసులేవీ నమోదు కాలేదు.

Andhra Pradesh: ఉద్యమ బాట పట్టిన ఏపీ ఉద్యోగులు, పీఆర్సీ అమలు సహా 71 డిమాండ్లు పరిష్కరించే వరకు ఉద్యమిస్తామని వెల్లడి, నిరసనలకు దూరంగా ఉంటామని తెలిపిన ఏపీ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ ఫోరం, ఏపీ ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్

Hazarath Reddy

తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు. గత కొన్నాళ్లుగా ప్రధాన కార్యదర్శికి తమ సమస్యలను విన్నవించినా పట్టించుకోకపోవడంతో గత్యతంతరం లేని పరిస్థితిలో ఉద్యమానికి దిగాల్సి వచ్చిందని ఏపీ ఉద్యోగులు జేఏసీ (AP employees JAC), ఏపీ జేఏసీ అమరావతి వెల్లడించాయి.

Andhra Pradesh: జీఎస్టీ నష్టపరిహారం కింద ఏపీకి రూ. 543 కోట్లు ఇచ్చాం, రాజ్యసభలో వెల్లడించిన ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌధరి

Hazarath Reddy

గత నవంబర్‌ 3న రాష్ట్రాలకు జీఎస్టీ (GST) నష్టపరిహారం కింద 17 వేల కోట్లు విడుదల చేయగా అందులో ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) వాటా కింద 543 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌధరి వెల్లడించారు. రాజ్యసభలో మంగళవారం వైఎస్సార్సీపీ సభ్యులు వి. విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు.

AP Floods: ఏపీ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రూ. కోటి సాయాన్ని ప్రకటించిన ప్రభాస్, వరదబాధిత కుటుంబాలకు అండగా నిలిచిన రెబల్ స్టార్

Hazarath Reddy

రెబల్ హీరో ప్రభాస్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ వరద బాధితులను (Andhra pradesh Floods) ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. వరదల్లో నష్టపోయిన వారిని ఆదుకునేందుకు ఏపీ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు (AP CM Relief Fund) రూ. కోటి విరాళంగా ప్రకటించాడు. దీనికి సంబంధించిన చెక్కును త్వరలో సీఎం కార్యాలయానికి పంపనున్నాడు.

Advertisement

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం, నమిలే పొగాకు, గుట్కా, తంబాకు, పాన్‌ మసాలాపై నేటి నుంచి ఏడాది పాటు నిషేధం, నిరుపేదల గృహాల కోసం 5 శాతం భూమి పంపిణీ

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నమిలే పొగాకు, గుట్కా, తంబాకు, పాన్‌ మసాలాపై (Tobacco Products in AP) నేటి నుంచి ఏడాది పాటు నిషేధం విధిస్తూ కుటుంబ సంక్షేమ,ఆహార భద్రత శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు.

Coronavirus in AP: ఏపీలో గడచిన 24 గంటల్లో 122 మందికి పాజిటివ్, అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 31 కొత్త కేసులు నమోదు

Hazarath Reddy

ఏపీలో గడచిన 24 గంటల్లో 18,788 కరోనా పరీక్షలు నిర్వహించగా, 122 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 31 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 18, గుంటూరు జిల్లాలో 18 కేసులు వెల్లడయ్యాయి. ప్రకాశం జిల్లాలో కొత్త కేసులేవీ నమోదు కాలేదు

Parliament Session 2021: రఘురామ సీబీఐ కేసులు తెరపైకి, వేల కోట్ల రుణాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేసిన వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి, లోక్ సభలో వైసీపీ ఎంపీల మధ్య ముదిరిన వార్

Hazarath Reddy

నేటి పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా వైసీపీ ఎంపీల మధ్య వార్ నడిచింది. లోక్‌సభలో రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలను వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి (YSRCP MP Mithun Reddy) తిప్పికొట్టారు. బ్యాంకులను మోసం చేసి ప్రజాధనాన్ని కొల్లగొట్టిన రఘురామకృష్ణంరాజుపై (MP Raghu Rama Krishna Raju) రెండు సీబీఐ కేసులు ఉన్నాయని గుర్తుచేశారు.

Cyclone Jawad Update: ఊపిరి పీల్చుకున్న ఉత్తరాంధ్ర, వచ్చే పదిరోజులు ఏపీలో సాధారణ వాతావరణం, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ వైపు కదిలిన జవాద్ తుపాను

Hazarath Reddy

బంగాళాఖాతంలో ఏర్పడిన జవాద్‌ తుపాను ఆదివారం సాయంత్రానికి వాయుగుండంగా బలహీనపడింది. ప్రస్తుతం వాయవ్య బంగాళాఖాతం పరిసరాల్లో పూరి తీరం వైపు 18 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది

Advertisement
Advertisement