ఆంధ్ర ప్రదేశ్

Andhra Pradesh Floods 2021: ఏపీలో మూడు జిల్లాల్లో వరద విలయం, ప్రమాదంలో ఉంటే పోలీస్‌ డయల్‌ 100కుగాని, 63099 13960 నెంబరుకు ఫోన్‌ చేయండి, పోలీస్‌ వాట్సాప్‌ నెంబరు 9440900005 నెంబరుకు సమాచారం ఇవ్వాలని తెలిపిన పోలీసులు

Hazarath Reddy

నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం తీరం దాటినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాల మధ్య పుదుచ్చేరి - చెన్నై సమీపంలో జవాద్ సైక్లోన్ తీరం దాటిందని తెలిపింది. అయితే, వాయు గుండం ప్రభావంతో.. నేడు దక్షిణ కోస్తా, రాయలసీమ సమీపంలో విస్తారంగాను, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Depression Makes Landfall: తీరం దాటిన వాయుగుండం, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ల్లో భారీ వర్షాలు, రంగంలోకి ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు

Naresh. VNS

బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తీరం దాటింది. పుదుచ్చేరి-చెన్నై మధ్య ఈ తెల్లవారుజామున 3-4 గంటల మధ్య వాయుగుండం తీరం దాటినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో తమిళనాడు, ఏపీల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రపదేశ్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. వాయుగుండం ప్రభావంతో రాయలసీమలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి.

Tirumala Rains: తిరుమల, తిరుపతిలో వర్షం బీభత్సం, విరిగిపడ్డ కొంచరియలు, ఉగ్రరూపం దాల్చిన కపిలతీర్థం, చెన్నైలోనూ ఎడతెరిపి లేకుండా వర్షాలు

Naresh. VNS

ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడుల్లో కుండపోత వానలు పడుతున్నాయి. ముఖ్యంగా తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలిపిరి నడకమార్గం, కనుమదారుల్లో వరద నీటితో పోటెత్తుతున్నది. అటవీప్రాంతం భారీగా వస్తున్న వరద ఉధృతంగా ప్రవహిస్తున్నది. నీటి ప్రవాహంతో మెట్లమార్గం జలపాతంలా కనిపిస్తున్నది. వైకుంఠం క్యూలైన్‌లోని సెల్లార్లలోకి నీరు చేరింది. వర్షానికి మాడవీధులు జలమయమయ్యాయి.

Jawad Cyclone : నేడు తీరం దాటనున్న జవాద్ తుఫాన్, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు రెడ్ అలెర్ట్, రెండు రోజులు భారీ వర్షాలు..

Krishna

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని జవాద్‌ తుపాన్‌ ముప్పు వణికిస్తోంది. దక్షిణ అండమాన్ సమీపంలో ఇవాళ అల్పపీడన ద్రోణి ఏర్పడనుంది. ఇది ఆగ్నేయ, తూర్పు బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది. నేడు ఈ తుఫాను తీరం దాటనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది.

Advertisement

Heavy Rains in Andhra Pradesh: ఏపీలో భారీ వర్షాలు, 2 రోజుల పాటు వార్నింగ్ ఇచ్చిన వాతావరణ శాఖ, సీఎం జగన్ సమీక్ష

Krishna

17, 18 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. భారీ వర్షాలు కురుస్తున్న నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు.

Mohanbabu: మోహన్ బాబు ఇంట్లో విషాదం, కన్నీటి సంద్రంలో మునిగిపోయిన మంచు విష్ణు, మంచు లక్ష్మి, ఏం జరిగిందంటే..?

Krishna

ప్రముఖ సీనియర్​ నటుడు మోహన్​బాబు సోదరుడు రంగస్వామి(63) తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు నివాళులు అర్పిస్తున్నారు. తిరుపతిలో ఉండే ఆయన సోదరుడు రంగస్వామి నాయుడు(63) గుండెపోటుతో కన్నుమూశారు.

AP Municipal Elections Result: మున్సిపల్ పోరులో వైఎస్సార్సీపీదే జోరు, టీడీపీ చేతిలోంచి జారిన కుప్పం, సీఎం జగన్ ఆసక్తికర ట్వీట్...

Krishna

నెల్లూరు కార్పొరేషన్ ఫలితాల విషయానికి వస్తే మొత్తం కార్పొరేషన్ లో 54 స్థానాలు ఉంటే.. అందులో 8 ఏక గ్రీవం అయ్యాయి. మిగిలిన చోట్ల కూడా వైసీపీదే విజయం అయ్యింది. మొత్తం కార్పొరేషన్ ను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈ ఫలితాలపై సీఎం జగన్ సైతం స్పందిస్తూ ట్వీట్ చేశారు..

Governor Harichandan Health Update: ఏపీ గవర్నర్‌కు తీవ్ర అస్వస్థత, ఊపిరితిత్తుల సమస్యలతో ఏఐజీ ఆస్పత్రిలో చేరిన బిశ్వభూషన్ హరిచందన్, న్యూఢిల్లీ పర్యటన తరువాత దగ్గు, జలుబుతో బాధపడుతున్న హరిచందన్

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ విశ్వభూషణ్‌ (Vishwa Bhushan) హరిచందన్‌ తీవ్ర అస్వస్థతకు (Governor Harichandan Health Update) గురయ్యారు. బుధవారం ఉదయం తీవ్ర అనారోగ్యానికి గురవడంతో ఆయన్ను హుటాహుటిన ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించారు.

Advertisement

Kuppam Municipality: కుప్పం మున్సిపాలిటీ వైసీపీ కైవసం, బీటలువారిన చంద్రబాబు కంచుకోట, మెజార్టీ వార్డులను కైవసం చేసుకుని చైర్మన్ పదవి చేజిక్కించుకున్న అధికార వైసీపీ పార్టీ

Hazarath Reddy

25 వార్డుల్లో ఇప్పటికి వెలువడిన ఫలితాల ప్రకారం 17 వార్డులకు గాను 15 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. టీడీపీ రెండు స్థానాల్లో గెలిచింది. హైకోర్టు ఆదేశాలతో కుప్పంలో కౌంటింగ్‌ ప్రక్రియ సజావుగా సాగుతోంది. ప్రత్యేక అధికారి ప్రభాకర్‌ ఆధ్వర్యంలో కౌంటింగ్‌ ప్రక్రియను అధికారులు కొనసాగిస్తున్నారు.

AP Municipal Election Results 2021: కుప్పంలో చంద్రబాబుకు భారీ షాక్, ఇప్పటికే పది వార్డుల్లో అధికార పార్టీ ఘన విజయం, మున్సిపాలిటీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ దిశగా వైసీపీ అడుగులు, కొనసాగుతున్న కౌంటింగ్

Hazarath Reddy

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్వస్థలమైన కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అక్కడ మొత్తం 25 వార్డులకు గానూ 24 వార్డుల ఓట్ల లెక్కింపు జరుతున్నది. ఇప్పటికే ఒక వార్డు ఏకగ్రీవమైంది. బాబు కంచుకోటగా ఉన్న కుప్పంలో వైసీపీ ఖాతా తెరించింది.

AP MPTC, ZPTC Elections 2021: కుప్పంలో ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికలు, 72.19 శాతం పోలింగ్‌ నమోదైందని తెలిపిన ఎస్ఈసీ నీలం సాహ్ని, ముగిసిన జడ్పీటీసీ ఎంపీటీసీ పోలింగ్, ఈ నెల 18న ఓట్ల లెక్కింపు

Hazarath Reddy

రాష్ట్రంలో 10 జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల పోలింగ్‌ (AP MPTC ZPTC Elections 2021) సాయత్రం 5 గంటలకు ముగిసింది. ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. క్యూలైన్లలో ఉన్న ఓటర్లకు ఓటు వేసే అవకాశం కల్పిస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు.

Corona in AP: ఏపీలో కొత్తగా 191 మందికి కరోనా, అత్యధికంగా కృష్ణా జిల్లాలో 41 కొత్త కేసులు నమోదు, గత 24 గంటల్లో 416 మంది డిశ్చార్జ్

Hazarath Reddy

ఏపీలో కరోనా రోజువారీ కేసుల సంఖ్య బాగా తగ్గింది. గడచిన 24 గంటల్లో 26,514 కరోనా పరీక్షలు నిర్వహించగా, 191 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 41 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 37 కేసులను గుర్తించారు.

Advertisement

MLC Elections in AP: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి, 11 ఎమ్మెల్సీ స్థానాలకు ఈసీ నోటిఫికేషన్ జారీ, డిసెంబరు 10న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

Hazarath Reddy

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల సంఘం నేడు నోటిఫికేషన్ విడుదల చేసింది. 11 ఎమ్మెల్సీ స్థానాలకు ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. విశాఖ జిల్లాలో 2, గుంటూరు జిల్లాలో 2, కృష్ణా జిల్లాల్లో 2, అనంతపురం జిల్లాలో 1, తూర్పు గోదావరి జిల్లాలో 1, ప్రకాశం జిల్లాలో 1, విజయనగరం జిల్లాలో 1, చిత్తూరు జిల్లాలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.

Kurnool: భార్య డ్యూటీ నుంచి ఇంటికి రాగానే.. ఫ్యానుకు వేలాడుతూ కనిపించిన భర్త, అనారోగ్య సమస్యలతో ఆత్మహత్య చేసుకున్న నంద్యాల డిప్యూటీ తహసీల్దార్, బోరున విలపించిన భార్య, కుటుంబ సభ్యులు

Hazarath Reddy

కర్నూలు జిల్లా బనగానపల్లె పట్టణంలో డిప్యూటీ తహసీల్దార్ అనారోగ్య సమస్యలతో ఆత్మహత్య (deputy tahsildar ends life) చేసుకున్నారు. సోమవారం విధులకు హాజరుకాకుండా ఉన్న ఆయన.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బలవన్మరణానికి పాల్పడ్డారు.

Andhra Pradesh: రైతుల కోసం జగన్ సర్కారు మరో ముందడుగు, ప్రకృతి విపత్తులతో నష్టపోయిన రైతులకు ఏ సీజన్ పరిహారం ఆ సీజన్‌లో అందేలా నిర్ణయం, రబీలో నష్టపోయిన మొత్తం 34,586 మంది రైతుల అకౌంట్లలో రూ.22 కోట్లు జమ

Hazarath Reddy

రైతుల శ్రేయస్సే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఏపీ ప్రభుత్వం తాజాగా మరో ముందడుగు (Input subsidy for rain-hit ryots) వేసింది. ప్రకృతి విపత్తులతో నష్టపోయిన రైతులకు అదే సీజన్‌లో పరిహారం అందించేలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (Andhra Pradesh CM Jagan Mohan Reddy) నిర్ణయం తీసుకున్నారు.

Andhra Pradesh: విశాఖలో ప్రేమోన్మాది మృతి, యువతిపై పెట్రోల్‌తో దాడి చేసి నిప్పంటించి..ఆ తర్వాత ఆత్మహత్యాయత్నం చేసిన నిందితుడు చికిత్స పొందుతూ మృతి, యువతి పరిస్థితి విషమం

Hazarath Reddy

విశాఖపట్నంలోని ఓ లాడ్జీలో యువతిపై పెట్రోల్‌తో దాడిచేసి, ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు హర్షవర్ధన్‌ కేజీహెచ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మరణించాడు.

Advertisement

AP MPTC And ZPTC Elections 2021: కర్నూలు జిల్లాలో ఎంపీటీసీ ఎన్నికల్లో ఘర్షణ, ఆందోళనకు దిగిన సీపీఐ నాయకులు, రాష్ట్రవ్యాప్తంగా 10 జెడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు కొనసాగుతున్న పోలింగ్

Hazarath Reddy

ఏపీలో వివిధ కారణాలతో నిలిచిపోయిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు (AP MPTC And ZPTC Elections 2021) ఇవాళ మరోసారి ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 10 జెడ్పీటీసీ స్థానాలకు, 123 ఎంపీటీసీ స్థానాలకు (AP MPTC And ZPTC Elections) మంగళవారం ఎన్నికలు జరుగుతున్నాయి.

Cyclone Alert In Andhra Pradesh: ఏపీకి తప్పిన తుఫాను ముప్పు, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే చాన్స్..

Krishna

ఏపీపై విరుచుకు పడుతుందనుకున్న తుఫాన్ బలహీన పడినట్లు తెలుస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా తుఫాన్ ముప్పు తప్పినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.ఐతే తఫాన్ ముప్పు తప్పినా భారీ వర్షాలు మాత్రం రాష్ట్రాన్ని ముంచెత్తనున్నాయి.

AP Municipal Election 2021: ముగిసిన 'పుర' పోలింగ్, ఈ నెల 17న ఫలితాలు, ఆసక్తికరంగా మారిన కుప్పం, నెల్లూరు మున్సిపాలిటీ ఫలితాలు

Hazarath Reddy

ఏపీలో గతంలో వివిధ కారణాలతో ఆగిపోయిన పలు మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ (AP Municipal Election 2021) పూర్తి అయింది. నెల్లూరు నగరపాలక సంస్థకు, 12 మున్సిపాలిటీలకు, పలు నగర పంచాయతీలకు పోలింగ్ నిర్వహించారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. సాయంత్రం 5 గంటల సమయానికి క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు.

Corona in AP: ఏపీలో బాగా తగ్గిపోయిన కేసులు, కొత్తగా 117 మందికి మత్రమే కరోనా, అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 24 కొత్త కేసులు

Hazarath Reddy

ఏపీలో కరోనా రోజువారీ కేసుల సంఖ్య బాగా తగ్గింది. గడచిన 24 గంటల్లో 21,360 కరోనా పరీక్షలు నిర్వహించగా, 117 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 24 కొత్త కేసులు నమోదు కాగా, గుంటూరు జిల్లాలో 19 కేసులను గుర్తించారు.

Advertisement
Advertisement