ఆంధ్ర ప్రదేశ్

Andhra Pradesh: పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ పేలుడు, ధ్వంసమైన 10 ఇళ్లు, టపాసుల తయారీకి ఉపయోగించే పదార్థాల కారణంగా పేలుడు

Hazarath Reddy

ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం రాయకుదురులో ఒక ఇంట్లో భారీ పేలుడు (Explosive Material Blasted) సంభవించింది. పేలుడు దాటికి ఇల్లంతా ధ్వంసం అయ్యింది. అంతే కాకుండా చుట్టుపక్కల ఇళ్లు కూడా ధ్వంసం అయ్యాయి.

Tirumala Update: ఈ ఏడాది కూడా ఏకాంతంగానే స్వామివారి బ్రహ్మోత్సవాలు, ఆన్‌లైన్‌ సర్వదర్శనం టోకెన్ల జారీ సమస్యను త్వరలో పరిష్కరిస్తామని తెలిపిన టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

Hazarath Reddy

శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణపై తిరుమల తిరుపతి దేవస్థానం శుక్రవారం క్లారిటీ ఇచ్చింది. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది కూడా ఏకాంతంగానే స్వామివారి బ్రహ్మోత్సవాలను (Srivari Brahmotsavam) నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి (TTD Chairman YV Subbareddy) ప్రకటించారు.

AP MPTC, ZPTC Counting: ఈ నెల 19వ తేదీన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌, నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీ ఎస్ఈసీ, ఎన్నికల కౌంటింగ్‌ నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఏపీ హైకోర్టు

Hazarath Reddy

దాదాపు ఆరు నెలల అనంతరం గురువారం ఉదయం హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఎన్నికల కౌంటింగ్‌ (AP MPTC, ZPTC Counting) నిర్వహించేందుకు అనుమతించడంతో 19వ తేదీన కౌంటింగ్‌ జరపనున్నట్టు ఎన్నికల కమిషనర్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Justice Kanagaraj’s Posting Row: జస్టిస్‌ కనగరాజ్‌ నియామకంపై 4 వారాల పాటు స్టే విధించిన హైకోర్టు, సంబంధిత అధికారులు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు

Hazarath Reddy

ఏపీ రాష్ట్ర పోలీస్‌ కంప్‌లైంట్‌ అథారిటీ చైర్మన్‌గా విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ కనగరాజ్‌ను నియమిస్తూ (Justice Kanagaraj’s Posting Row) ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల అమలును హైకోర్టు 4 వారాల పాటునిలుపుదల చేసింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శి, ఏపీ పోలీస్‌ కంప్‌లైంట్‌ అథారిటీ చైర్మన్‌లతో పాటు జస్టిస్‌ కనగరాజ్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్‌ 21వ తేదీకి వాయిదా వేసింది.

Advertisement

AP Cabinet Decisions: గృహ రుణాలకు పేదలకోసం వన్ టైమ్ సెటిల్మెంట్, వైఎస్ఆర్ ఆసరా పథకానికి ఆమోదం, మైనార్టీ వర్గాలకు సబ్ ప్లాన్; ఏపి కేబినేట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇలా ఉన్నాయి

Team Latestly

COVID19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో 70 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తి; రాష్ట్రంలో కొత్తగా 1,367 కోవిడ్ కేసులు నమోదు, 1,248 మంది రికవరీ, 15 వేలకు కాస్త దిగువకు ఆక్టివ్ కేసులు

Team Latestly

రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. ఇప్పటివరకు రాష్ట్రంలోని మొత్తం జనాభాలో 70.05 శాతం మందికి కనీసం ఒక్క డోస్ వ్యాకిన్ అందగా, ఇందులో 31.6 శాతం మందికి రెండు డోసులు పూర్తయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది...

Corona in AP: ఏపీలో కొత్తగా 1,445 మందికి కరోనా, తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 274 కేసులు నమోదు, ప్రస్తుతం రాష్ట్రంలో 14,603 యాక్టివ్ కేసులు

Hazarath Reddy

ఏపీలో గత 24 గంటల్లో 62,252 మంది శాంపిల్స్ పరీక్షించగా 1,445 మందికి కరోనా నిర్ధారణ అయింది. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 274, కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 11 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వల్ల 11 మంది మృతి చెందారు.

Andhra Pradesh: వైయస్ జగన్ బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేసిన సీబీఐ కోర్టు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దుకు నిరాకరించిన న్యాయస్థానం, రఘురామ పిటిషన్‌ను కొట్టేసిన సీబీఐ స్పెషల్ కోర్టు

Hazarath Reddy

సీబీఐ కోర్టులో సీఎం జగన్‌కు రిలీఫ్‌ దొరికింది. జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌ను (Ys Jagan Bail Revocation Petition) సీబీఐ కోర్టు కొట్టివేసింది. అక్రమాస్తుల ఆరోపణల కేసులో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్‌ రద్దుకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం (CBI Special Court) నిరాకరించింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దుకూ సీబీఐ కోర్టు నిరాకరించింది

Advertisement

CM YS Jagan Review: వైఎస్సార్ చేయూత, ఆసరా పథకాలపై సీఎం జగన్ సమీక్ష, ఆరోగ్యశ్రీకి పెద్దపీట వేయాలని అధికారులను ఆదేశించిన ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం తాడేపల్లి సీఎం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్సార్ చేయూత, ఆసరా పథకాలపై సమీక్ష (CM YS Jagan Review) చేపట్టారు. సమీక్ష సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

AP PGECET 2021: ఏపీ పీజీ సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల, నిర్వహణా బాధ్యతలు చేపట్టిన కడప యోగి వేమన యూనివర్సిటీ, నేటి నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ పీజీ కోర్సులలో ప్రవేశ పరీక్షలకి ఉన్నత విద్యా మండలి పీజీ సెట్ (AP PGECET 2021) నిర్వహిస్తోంది. కడప యోగి వేమన యూనివర్సిటీ పీజీ సెట్‌ను నిర్వహణా బాధ్యతలు చేపట్టింది. అందులో భాగంగా ఏపీ పీజీ సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల (AP PGECET 2021 Notification released) చేసింది.

Andhra Pradesh Shocker: మిద్దె మీదకు తీసుకువెళ్లి.. ఇద్దరు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడు, చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

Hazarath Reddy

ఏపీలో దారుణం చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా బీ కొత్తపేట మండలంలో ఇద్దరు చిన్నారులపై ఓ కామాంధుడు (Andhra Pradesh Shocker) అత్యాచారానికి పాల్పడ్డాడు. మిద్దె మీదకు తీసుకువెళ్లి కామాంధుడు ఇద్దరు చిన్నారులపై ఈ అఘాయిత్యానికి (Two Child Girls molested) ఒడిగట్టాడు.

AP's COVID19 Report: వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి ఉండకూడదు, వైద్యారోగ్య శాఖ సమీక్షలో సీఎం జగన్; ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 1,125 కోవిడ్ కేసులు నమోదు, 1107 మంది రికవరీ

Team Latestly

హెల్త్‌హబ్స్‌ ద్వారా ఏర్పాటయ్యే ఆస్పత్రుల్లో కనీసం యాభై శాతం బెడ్లను ఆరోగ్యశ్రీ పేషెంట్లకు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎవరెక్కువ బెడ్లను ఆరోగ్యశ్రీకి కేటాయిస్తే వారికి హెల్త్‌హబ్స్‌లో ప్రాధాన్యత ఇచ్చేలా చూడాలని సీఎం పేర్కొన్నారు...

Advertisement

Nellore Shocker: రౌడీగా మారిన కొడుకు..తట్టుకోలేక కర్రతో కొట్టి చంపేసిన తండ్రి, నెల్లూరు జిల్లాలో ఘటన, అనంతపురం జిల్లాలో ఒంటరితనం భరించలేక ఆత్మహత్య చేసుకున్న ఆర్మీ డాక్టర్

Hazarath Reddy

నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కుడితిపాళెంలో రౌడీ షీటర్ అశోక్ దారుణ హత్యకు (Nellore Shocker) గురయ్యాడు. కుమారుడి ఆగడాలను భరించలేక తండ్రే హతమార్చాడు. గ్రామంలో అరాచకాలకు పాల్పడుతున్న అశోక్.. మద్యం మత్తులో నిత్యం తండ్రితో గొడవ పడేవాడు.

Corona in AP: కరోనా నుంచి కోలుకుంటే రెండు డోసుల వ్యాక్సిన్ తప్పనిసరి, స్పష్టం చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ, ఏపీలో తాజాగా 864 మందికి కరోనా, 12 మంది మృతి

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 38,746 పరీక్షలు నిర్వహించగా 864 కొవిడ్‌ కేసులు (Corona in AP) నిర్ధారణయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 20,30,849 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

Andhra Pradesh: కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రికి లేఖ రాసిన ఏపీ సీఎం వైయస్ జగన్, బహ్రెయిన్‌లో ఇబ్బందులు పడుతున్న వారిని వెంటనే వెనక్కు తీసుకురావాలని లేఖలో వినతి

Hazarath Reddy

కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌. జైశంకర్‌కి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ (AP CM YS Jagan writes letter) రాశారు. బహ్రెయిన్‌లో ఓ ప్రైవేట్‌ సంస్థ యాజమాన్యం చేతిలో చాలా మంది భారతీయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిలో చాలా మంది ఏపీకి చెందిన వారు ఉన్నారన్నారు.

Corona in AP: చిత్తూరు జిల్లాలో పెరిగిన కేసులు, ఏపీలో తాజాగా 1,190 మందికి కరోనా, గత 24 గంటల్లో 1,226 మంది డిశ్చార్జ్, రాష్ట్రంలో ప్రస్తుతం 15,110 యాక్టివ్ కేసులు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో ఏపీలో 45,533 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,190 మందికి కరోనా పాజిటివ్‌గా (Corona in Andhra Pradesh) నిర్ధారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 11 మంది (Covid Deaths) మృత్యువాతపడ్డారు.

Advertisement

Andhra Pradesh Shocker: గుంటూరులో భర్తను కట్టేసి భార్యపై గ్యాంగ్ రేప్, నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు

Hazarath Reddy

గుంటూరు జిల్లాలో రెండు రోజుల క్రితం దారుణ ఘటన చోటు చేసుకున్న సంగతి విదితమే. సత్తెనపల్లి మండలానికి చెందిన దంపతులు.. గుంటూరు నగరంలో ఓ వివాహానికి హాజరై బైక్‌పై తిరిగి వెళ్తుండగా.. మేడికొండూరు క్రాస్ రోడ్ సమీపంలో దుండగులు అడ్డగించి భర్తపై దాడి చేశారు.

AP Weather Report: వాయుగుండంగా మారనున్న అల్పపీడనం, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే సూచన, అలర్ట్ మెసేజ్ జారీ చేసిన వాతావరణ శాఖ

Hazarath Reddy

ఏపీలో రానున్న రెండు రోజలు పాటు ఓ మాదిరి నుంచి భారీ వర్షాలు (Moderate rain) కురవనున్నాయి. తూర్పు మధ్య, ఈశాన్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో శనివారం ఏర్పడిన అల్పపీడనం ఉత్తర ఒడిశా–పశ్చిమబెంగాల్‌ తీరం వైపు కదులుతున్నట్లు వాతావరణ శాఖ (India Meteorological Department) తెలిపింది.

Corona in AP: తూర్పుగోదావరిలో మళ్లీ పెరిగిన కేసులు, ఏపీలో తాజాగా 1,145 మందికి కరోనా, గత 24 గంటల్లో 17 మంది మృత్యువాత, జిల్లాల వారీగా కేసులు వివరాలు ఓ సారి తెలుసుకోండి

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో ఏపీలో 49,581 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,145 మందికి కరోనా పాజిటివ్‌గా (Corona in Andhra Pradesh) నిర్ధారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 17 మంది (Covid Deaths) మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 13,987 కు చేరింది.

YS Viveka Murder Case: వివేకా హత్య కేసులో మరొకరు అరెస్ట్, పొలం పనులు చూసే జగదీశ్వర్‌రెడ్డి సోదరుడు ఉమా శంకర్‌రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ, 14 రోజులపాటు రిమాండ్‌ విధించిన కోర్టు

Hazarath Reddy

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Viveka Murder Case) మరో కీలక నిందితుడిని సీబీఐ గురువారం అరెస్టు చేసింది. 95వ రోజు కొనసాగిన విచారణలో కడప కేంద్ర కారాగారంలోని గెస్ట్‌హౌస్‌లో సీబీఐ అధికారులు మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి అనుచరుడు, అనుమానితుడు, పులివెందుల కు చెందిన పాలవ్యాపారి గజ్జల ఉమాశంకర్‌ రెడ్డిని, పత్రికా విలేకరి భరత్‌యాదవ్‌ను విచారించి పలు కీలక అంశాలను సేకరించారు.

Advertisement
Advertisement