ఆంధ్ర ప్రదేశ్

YSRCP MPs Protest in Parliament: ప్రత్యేక హోదాపై చర్చ చేపట్టాల్సిందే, రాజ్యసభ వెల్‌లోకి దూసుకెళ్లిన విజయసాయిరెడ్డి, రూల్‌ 267 కింద రాజ్యసభ చైర్మన్‌కు నోటీసు ఇచ్చిన వైసీపీ ఎంపీ, పోలవరంపై చర్చ చేపట్టాలని లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఆందోళన

Hazarath Reddy

లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఆందోళన (YSRCP MPs Protest in Parliament) కు దిగారు. పోలవరంపై చర్చకు వైఎస్సార్‌సీపీ ఎంపీలు (YSRCP MPs) పట్టుబట్టారు. వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ (Polavaram Project) సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని డిమాండ్‌ చేశారు. వాయిదా తీర్మానానికి ఎంపీ మిథున్ రెడ్డి నోటీసు ఇచ్చారు.

CM YS Jagan Review on Polavaram: 2022 జూన్‌ కల్లా రెండు కాల్వలకు లింక్ పనులు పూర్తి కావాలి, అధికారులకు సూచించిన ఏపీ సీఎం వైయస్ జగన్, పోలవరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

పోలవరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏరియల్‌ సర్వే ద్వారా పోలవరం ప్రాజెక్టు పనులను (CM YS Jagan Polavaram Tour) వీక్షించారు. అధికారులతో కలిసి సీఎం జగన్‌ క్షేత్రస్థాయిలో పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు పరిశీలనలో వెల్లడైన అంశాల ఆధారంగా మధ్యాహ్నం అధికారులతో సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష (CM YS Jagan Review on Polavaram) నిర్వహించారు

CM YS Jagan Polavaram Tour: పోలవరం పర్యటనలో ఏపీ ముఖ్యమంత్రి, గడువులోగా పోలవరం పనులు పూర్తిచేయాలని అధికారులకు దిశానిర్దేశం చేయనున్న వైయస్ జగన్, ఏరియల్ సర్వే ద్వారా స్పిల్‌వే, అప్రోచ్ ఛానల్‌ పనులు పరిశీలన

Hazarath Reddy

ఏపీ సీఎం వైయస్ జగన్ పోలవరం (CM YS Jagan Polavaram Tour) చేరుకున్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో సీఎం ఏరియల్‌ సర్వే చేశారు. పోలవరం ప్రాజెక్టు పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రాజెక్టు (Polavaram project) పురోగతిని తెలుసుకునేందుకు పోలవరం పరిసరాల్లో విహంగ వీక్షణం ద్వారా పనులను ఆయన పరిశీలించారు.

Corona in Andhra Pradesh: ఏపీలో ఆ ఐదు గ్రామాల్లో మళ్లీ కర్ఫ్యూ, తాజాగా 2,974 కేసులు నమోదు, 17 మంది మృతి, రాష్ట్రంలో ప్రస్తుతం 24,708 యాక్టివ్‌ కేసులు, నిన్న 3,290 మంది డిశ్చార్జ్

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో 1,05,024 మంది నమూనాలు పరీక్షించగా 2,974 కొత్త కేసులు (Corona in Andhra Pradesh) నమోదయ్యాయి. 17 మంది మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 3,290 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 24,708 యాక్టివ్‌ కేసులు (Active Cases) ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది.

Advertisement

AP Job Calendar: ఏపీలో భారీగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, త్వరలో 1,200కు పైగా పోస్టుల కోసం నోటిఫికేషన్లు జారీ, కసరత్తు చేస్తోన్న ఏపీ సర్కారు, ప్రభుత్వ ఉత్తర్వుల అనంతరం ఆగస్టులో నోటిఫికేషన్లు జారీచేస్తామని తెలిపిన ఏపీపీఎస్సీ సభ్యుడు ఎస్‌.సలాంబాబు

Hazarath Reddy

ఏపీలో త్వరలో కొలువుల జాతర రానుంది. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) ద్వారా 1,200కు పైగా పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు జారీకానున్నాయి. ఇందుకు సంబంధించి పోస్టుల సంఖ్యపై సీఎం జగన్ ప్రభుత్వం (CM Jagna Govt) కసరత్తు చేస్తోంది. త్వరలోనే సమగ్రంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి.

East Godavari Shocker: తూర్పుగోదావరి జిల్లాలో దారుణం, ఇంటి పక్క సందులో యువతిపై అత్యాచార యత్నం, ప్రతిఘటించడంతో దాడి చేసిన కామాంధుడు, ఆస్పత్రిలో బాధితురాలు, కేసు నమోదు చేసిన పోలీసులు

Hazarath Reddy

ఏపీలో తూర్పుగోదావరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ కామాంధుడు యువతిపై లైంగిక దాడికి (Young Man Try To Rape Young girl) ప్రయత్నం చేశాడు. యువతి ప్రతిఘటించడంతో ఆమెను గాయపరిచాడు.

Corona in AP: ఏపీలో 25 వేలకు పడిపోయిన యాక్టివ్ కేసులు, తాజాగా 2,672 మందికి కరోనా, 2,467 మంది కొత్తగా డిశ్ఛార్జ్, ప్రైవేటు ఆస్పత్రుల్లో మిగిలిపోయిన టీకాలను మాకు అందించాలని ప్రధానికి ఏపీ సీఎం జగన్ విజ్ఞప్తి

Hazarath Reddy

ఏపీలో గడచిన 24 గంటల్లో 91,594 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,672 మందికి పాజిటివ్ (Corona in AP) అని నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 504 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 372, ప్రకాశం జిల్లాలో 315, పశ్చిమ గోదావరి జిల్లాలో 292 కేసులు వెల్లడయ్యాయి.

Y. V. Subba Reddy: టీటీడీ ఛైర్మన్‌గా మరోసారి నియమితులైన వై.వి.సుబ్బారెడ్డి, కార్పొరేషన్, చైర్మన్ పదవులు పొందేందుకు ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వని ఏపీ ముఖ్యమంత్రి, పార్టీ కోసం కష్టపడుతున్న వారికే అధిక ప్రాధాన్యత

Hazarath Reddy

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి (Y. V. Subba Reddy) మరోసారి నియమితుయ్యారు. టీటీడీ ఛైర్మన్ గా ఇటీవలే ఆయన పదవీకాలం ముగిసింది. అయితే టీటీడీ ఛైర్మన్ గా (TTD Chairman) ఉండటం వల్ల ప్రత్యక్ష రాజకీయాలకు ఆయన దూరంగా ఉండాల్సి వస్తోంది. దీంతో, ప్రత్యక్ష రాజకీయాల్లో మళ్లీ కీలకంగా మారాలని అనుకుంటున్నానని ఇటీవల సుబ్బారెడ్డి ప్రకటించారు.

Advertisement

AP Nominated Posts 2021: ఏపీలో నామినేటెడ్‌ పోస్టులు భర్తీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 56 శాతం పదవులు,135 పోస్టుల్లో మహిళలకు 68, పురుషులకు 67 పదవులు, పోస్టుల వివరాలను ప్రకటించిన మంత్రులు మేకతోటి సుచరిత, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్‌ పోస్టుల వివరాలను (AP Nominated Posts 2021) మంత్రులు మేకతోటి సుచరిత, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ శనివారం ప్రకటించారు.పోస్టుల భర్తీలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 56 శాతం పదవులు కేటాయించారు. 135 పోస్టుల్లో మహిళలకు 68, పురుషులకు 67 పదవులు ఇచ్చారు.

Shobha Hymavathi Quits TDP: టీడీపీకి మరో షాక్‌, మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి రాజీనామా, పార్టీలో తగిన గుర్తింపు లేదంటూ ఆవేదన

Hazarath Reddy

Prakasam Shocker: కన్నతండ్రి కాదు కామాంధుడు..తాగిన మత్తులో 7 నెలల నుంచి 14 ఏళ్ల కూతురిపై అత్యాచారం, బాలిక గర్భం దాల్చడంతో అమానుష ఘటన వెలుగులోకి, అవ్వ, తాతలతో కలిసి బేస్తవారిపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన బాధిత బాలిక

Hazarath Reddy

కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రే కన్నకూతురి పాలిట కామాంధుడయ్యాడు. మద్యం మత్తులో ఏడు నెలలుగా తన శారీరక వాంఛ (Drunk man rapes, impregnates daughter) తీర్చుకుంటున్నాడు. ఇప్పుడు ఆ బాలిక (14 ) ఐదు నెలల గర్భిణి దాల్చింది.

​​Visakhapatnam Shocker: విశాఖలో విషాదం, తల్లితో పాటు ముగ్గురు పిల్లలు అనుమానాస్పద మృతి, కేసు దర్యాప్తు చేస్తున్న విశాఖ అరకు పోలీసులు

Hazarath Reddy

విశాఖపట్నంలో విషాదం చోటు చేసుకుంది. పిల్లలన బుజ్జగించి లాలించాల్సిన తల్లే పిల్లల పాలిట యమపాశంలా మారినట్లు ఘటన బట్టి తెలుస్తోంది. పిల్లలను చంపేసి తాను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా (Mother and three children are Ends their Life ) వార్తలు వస్తున్నాయి.

Advertisement

South Central Railway: దక్షిణ మధ్య రైల్వే తీపి కబురు, తెలుగు రాష్ట్రాల మధ్య ప్యాసింజర్ రైళ్లు పునరుద్ధరణ, ఈ నెల 19 నుంచి విడతల వారీగా 82 రైళ్లు పట్టాలెక్కుతాయని తెలిపిన దక్షిణమధ్య రైల్వే జీఎం గజానన్ మాల్య

Hazarath Reddy

రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్తే. కరోనావైరస్ కారణంగా ఆగిపోయిన రైళ్ల సేవలు మళ్లీ మొదలవనున్నాయి. ఈ నెల 19 నుంచి విడతల వారీగా 82 రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు దక్షిణమధ్య రైల్వే (South Central Railway) ప్రకటించింది. అయితే ఇందులో 66 ప్యాసింజర్ రైళ్లే కావడం (Several train services to be restored) గమనార్హం.

Gudiseva Shyam Prasad: సీఎం జగన్‌ను కలిసిన విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ గుడిసేవ శ్యామ్‌ప్రసాద్‌, ఏపీ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ హైపవర్‌ కమిటీ చైర్మన్‌ బాధ్యతలు స్వీకరించిన ప్రసాద్

Hazarath Reddy

APPSC Recruitment 2021: ఇకపై నో ప్రిలిమ్స్, గ్రూప్ 1 మినహా ఏపీపీఎస్సీ నియామకాలకు ఒకే పరీక్ష, త్వరగా పోస్టులు భర్తీ కోసం ప్రిలిమ్స్ రద్దు చేయాలని నిర్ణయించామని తెలిపిన ఏపీపీఎస్సీ సభ్యుడు షేక్‌ సలాంబాబు

Hazarath Reddy

ఏపీలో గ్రూప్ 1 మినహాయించి మిగిలిన ఏ నోటిఫికేషన్‌కూ (APPSC Recruitment 2021) ఇకపై ప్రిలిమ్స్ ఉండదని ఏపీపీఎస్సీ సభ్యుడు షేక్‌ సలాంబాబు తెలిపారు. ఇకపై ఏపీపీఎస్సీ నియామకాలకు ఒకే పరీక్ష నిర్వహించి ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు.

AP's COVID Status: వ్యాక్సినేషనే కరోనా నివారణకు సరైన పరిష్కారం.. ప్రధానితో ఏపి సీఎం జగన్; ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 2,345 కోవిడ్ కేసులు మరియు 16 మరణాలు నమోదు

Team Latestly

. రాష్ట్ర విభజన వల్ల వైద్యపరంగా మౌలిక సదుపాయాల సమస్యను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై లాంటి నగరాల్లో ఉన్నట్లుగా ఏపీలో లేవని ప్రధానికి వివరించారు. అయినా సరే కోవిడ్‌ను ఎదుర్కోవడంలో చెప్పుకోదగ్గ పనితీరు కనబరిచామని జగన్ పేర్కొన్నారు...

Advertisement

Water Allocation: ఇకపై కృష్ణా, గోదావరి ప్రాజెక్టులపై పూర్తి అధికారం బోర్డులదే, గెజిట్ విడుదల వివరాలను వెల్లడించిన కేంద్ర జలశక్తి అధికారులు, ఇరు రాష్ట్రాల అవసరాల మేరకు నీటి కేటాయింపులు

Team Latestly

ఇకపై కృష్ణా, గోదావరి నదులకు సంబంధించిన ప్రాజెక్టులన్నీ ఆయా బోర్డుల పరిధిలోకి రానున్నాయి. వీటిపై పూర్తి పెత్తనం, నిర్ణయాధికారం బోర్డుకే ఉంటుంది, ప్రాజెక్టుల నీటి పంపకాలు, విద్యుదుత్పత్తి బోర్డులే చూసుకుంటాయి....

COVID19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 2,526 కోవిడ్ కేసులు, 24 మరణాలు నమోదు; నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు కర్ఫ్యూ సడలింపులు అమలు

Team Latestly

రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ సడలింపులు జూలై 15 నుండి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సడలింపు లభించనుంది. రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు యధావిధిగా కర్ఫ్యూ అమలు కొనసాగుతుంది....

Corona in Andhra Pradesh: ఏపీలో 26 వేల దిగువకు పడిపోయిన యాక్టివ్ కేసులు, తాజాగా 2,591 కేసులు నమోదు, 3,329 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్, ప్రస్తుతం రాష్ట్రంలో 25,957 మందికి కొనసాగుతున్న చికిత్స

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 90,204 పరీక్షలు నిర్వహించగా.. 2,591 కేసులు నిర్ధారణ (Corona in Andhra Pradesh) అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,29,579 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల 15 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,057కి చేరింది.

Rains in Andhra Pradesh: భారీ వర్షాలతో ఉగ్రరూపం దాల్చిన గోదావరి, నీట మునిగిన గండి పోచమ్మ ఆలయం, బెంబేలెత్తుతున్న నదీ పరీవాహక గ్రామాల ప్రజలు, రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు

Hazarath Reddy

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో నైరుతీ రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు (Rains in Andhra Pradesh) కురుస్తున్నాయి. అనేక చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరుగా, అక్కడక్కడా భారీ వర్షాలు కురిస్తున్నాయి. రెండు రోజుల నుంచి ఉభయగోదావరి జిల్లాల్లో (East and west Godavari) జోరుగా వర్షాలు కురుస్తున్నాయి.

Advertisement
Advertisement