ఆంధ్ర ప్రదేశ్

High Sterile Zone: ఈ ఏరియాలో ప్రవేశం నిషిద్ధం, కరోనా ప్రభావిత ప్రాంతాల్లో బోర్డులను ఏర్పాటు చేసిన ఏపీ పోలీసులు, వైద్య సిబ్బంది, అంబులెన్స్‌లకు మాత్రమే ఆ ప్రాంతాల్లో అనుమతి

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఏపీ పోలీసులు కరోనా వైరస్ ప్రభావిత ప్రాంతంలో పెద్ద పెద్ద బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ ప్రదేశాల్లోకి ఎంట్రీ లేదని చెప్పేశారు. ఇది హై స్టెరిల్ జోన్ అని ఇక్కడ కేసులు ఉన్న నేపథ్యంలో ఎవరికీ అనుమతి లేదని కేవలం వైద్య సిబ్బందికి మాత్రమే అనుమతి ఉందని తెలిపారు.

Guntur Shocker: మహిళ స్నానం చేస్తుండగా వీడియో, అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే వీడియో బయటపెడతామంటూ బంధువుల బెదిరింపులు, తట్టుకోలేక నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్న వివాహిత, గుంటూరులో దారుణ ఘటన

Hazarath Reddy

గుంటూరులో దారుణం చోటు చేసుకుంది. వివాహిత స్నానం చేస్తుండగా బంధువులు వీడియో తీసి డబ్బులు డిమాండ్ చేయడంతో (Relatives Harassment In Guntur) వేధింపులు తట్టుకోలేక ఆ మహిళ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య (Woman Ends Life) చేసుకుంది.

AP Covid Update: ఏపీలో కొత్త స్ట్రెయిన్ లేదు, N440K వేరియంట్ న్యూస్ అంతా అబద్దం, సోషల్ మీడియా వార్తలపై స్పందించిన ఆరోగ్యశాఖ, అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి కరోనా కొత్త స్ట్రెయిన్‌ లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. ప్రస్తుతమున్న స్ట్రెయిన్‌ గతేడాది జూలై నుంచే రాష్ట్రంలో ఉందన్నారు. సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) కూడా కొత్త స్ట్రెయిన్‌ గురించి ఇంకా అధికారికంగా ప్రకటించలేదని చెప్పారు.

AP Coronavirus: గుడ్ న్యూస్..ఏపీలో తగ్గుముఖం పడుతున్న కేసులు, తాజాగా 18,972 మందికి కరోనా, 71 మంది కోవిడ్19తో మృతి, ఈ నెల 5 నుంచి పాక్షిక కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 1,15, 275 మంది శాంపుల్స్ ను పరీక్షించగా 18,972 మందికి పాజిటివ్ గా (AP Coronavirus) నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 11,61,099కు చేరింది. నిన్న 71 మంది కోవిడ్19తో మృతి చెందారు,

Advertisement

Sabbam Hari Dies: మాజీ ఎంపీ సబ్బం హరి కరోనాతో కన్నుమూత, గత నెల 15న కరోనా బారిన పడిన టీడీపీ నేత, కరోనాతో పాటుగా పలు ఇన్ఫెక్షన్లు సోకడంతో చికిత్స పొందుతూ కన్నుమూత

Hazarath Reddy

కరోనా మహమ్మారి బారినపడి మరో రాజకీయ ప్రముఖుడు తిరిగిరాని లోకాలకు (Sabbam Hari Dies) తరలి వెళ్లారు.మాజీ ఎంపీ సబ్బం హరి విశాఖలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 15 రోజులుగా కరోనాతో చికిత్స పొందుతూ తుదిశ్వాస (Sabbam Hari Death) విడిచారు. గత నెల 15న ఆయన కరోనా బారిన పడ్డారు.

Oxygen Shortage in Hindupur: హిందూపురంలో ఆక్సిజన్ అందక ఎనిమిది మంది మృతి, ఆందోళన చేపట్టిన మృతుల బంధువులు, పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చిన పోలీసులు, ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే బాలకృష్ణ

Hazarath Reddy

ఆక్సిజన్ కొరత రోగుల ప్రాణాలను తీసేస్తోంది. తాజాగా హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక (Oxygen Shortage in Hindupur) ఎనిమిది మంది మృతి చెందారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ప్రాణాలు కోల్పోయారంటూ బాధితుల బంధువులు ఆందోళనకు దిగారు. కాగా హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలోని ( Hindupur Government Hospital) 6-కెఎల్ లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంక్ ఖాళీ కావడంతో ఆక్సిజన్ లేకపోవడం వల్ల ఎనిమిది మంది వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది.

Day Time Curfew in AP: ఏపీలో మే 5 నుంచి డే కర్ప్యూ, రెండు వారాల పాటు కర్ఫ్యూ అమల్లోకి, ఉదయం 6 నుంచి 12 గంటల వరకే వ్యాపార కార్యకలాపాలు

Hazarath Reddy

కరోనా నియంత్రణకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఈ నెల 5 నుంచి పాక్షిక కర్ఫ్యూ (Daytime Curfew in AP) విధిస్తున్నట్లు ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మాత్రమే దుకాణాలకు అనుమతి ఇచ్చింది.

AP Covid Report: సెకండ్ వేవ్ కల్లోలం, ఏపీలో తాజాగా 23,920 మందికి కరోనా, 83 మంది మృతితో 8,136కి చేరుకున్న మరణాల సంఖ్య, కొత్తగా 11,411 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కల్లోలం ఆగడం లేదు. నిత్యం వేల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు (AP Covid Report) నమోదువుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 23,920 పాజిటివ్‌ కేసులు (APNew Covid Cases) నమోదయ్యాయి. 83 మంది ప్రాణాలు కోల్పోయారు.

Advertisement

AP Inter Exams 2021 Postponed: ఏపీలో ఇంటర్‌ పరీక్షలు వాయిదా, తదుపరి తేదీలను త్వరలో ప్రకటిస్తామని తెలిపిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, కరోనా వ్యాప్తి నేపథ్యంలో కీలక నిర్ణయం

Hazarath Reddy

ఏపీలో కరోనా మహమ్మారి ఉద్ధృతంగా వ్యాపిస్తున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ పరీక్షలను వాయిదా (AP Inter Exams 2021 Postponed) వేసింది. వాస్తవానికి, ఏపీ ప్రభుత్వం ఈ నెల 5 నుంచి ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమైంది.

Tirupati By Elections Results 2021: తిరుపతిలో 2019 రికార్డు బ్రేక్, 2 లక్షల 70 వేల 584 ఓట్ల మెజార్టీతో గెలిచిన వైసీపీ అభ్యర్థి గురుమూర్తి, ఫ్యాన్ ధాటికి రెండు, మూడు స్థానాలకే పరిమితం టీడీపీ, బీజేపీ-జనసేన

Hazarath Reddy

తిరుపతి ఉప ఎన్నికలో అధికార వైయస్సార్సీపీ ఘన విజయం సాధించింది. వైసీపీ నుంచి బరిలో నిలిచిన గురుమూర్తి (YCP Candidate Gurumurthy) సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మీపై 2 లక్షల 70 వేల 584 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కాగా 2019లో అధికార వైసీపీ అభ్యర్థి 2.28 లక్షల ఓట్ల మెజార్టీని సాధించగా ఈ ఉప ఎన్నికలో (Tirupati By Elections Results 2021) అది క్రాస్ అయింది.

Tirupati Lok Sabha Bypoll Results 2021: రెండు లక్షల 30 వేలు దాటిన వైసీపీ మెజార్టీ, ఇంకా కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు, కౌంటింగ్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తున్న నలుగురు పరిశీలకులు

Hazarath Reddy

తిరుపతి ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ తిరుగులేని ఆధిక్యత ప్రదర్శిస్తోంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ (Tirupati Lok Sabha Bypoll Results 2021) ప్రారంభమైనప్పటి నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గురుమూర్తి ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. పోస్ట్ బ్యాలెట్ల నుంచి.. సాధారణ ఓట్ల లెక్కింపులోనూ వైఎస్సార్‌సీపీ హవా కొనసాగిస్తోంది.

Amara Raja Batteries: ఏపీలో అమర రాజా బ్యాటరీస్‌ పరిశ్రమల మూసివేత, ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, ఇప్పటికే జువారి సిమెంట్‌ పరిశ్రమ మూసివేతకు ఉత్తర్వులు

Hazarath Reddy

కాలుష్యాన్ని వెదజల్లుతున్నపరిశ్రమలపై ఏపీ రాష్ట్ర కాలుష్య నియంత్రణ (ఏపీపీసీబీ) (Andhra Pradesh Pollution Control Board (APPCB) మండలి కొరడా ఝళిపిస్తోంది. వైఎస్సార్‌ జిల్లా యర్రగుంట్లపల్లి మండలంలో కాలుష్యాన్ని వెదజల్లుతున్న జువారి సిమెంట్‌ పరిశ్రమ మూసివేతకు గత నెల 24న ఉత్తర్వులు జారీ చేసిన కాలుష్య నియంత్రణ మండలి.. తాజాగా అమర రాజా బ్యాటరీస్‌కు (Amara Raja Batteries) చెందిన రెండు పరిశ్రమల మూసివేతకు ఆదేశాలిచ్చింది.

Advertisement

Tirupati By Poll Result 2021: భారీ ఆధిక్యంలో వైసీపీ, వెనుకంజలో టీడీపీ, కనపడని బీజేపీ-జనసేన ప్రభావం, పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో వైసీపీదే ఆదిక్యం, నెల్లూరు జిల్లాలో కొనసాగుతున్న వైసీపీ హవా

Hazarath Reddy

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక ( tirupati lok sabha Bypoll) కౌంటింగ్‌లో వైసీపీ దూసుకెళ్తోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగుతుండగా.. ఇందులో వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి ఆధిక్యంలో ఉన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో వైసీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది.

Covid in AP: ఏపీని వణికిస్తున్న సెకండ్ వేవ్, తాజాగా 19 వేల 412 మందికి కరోనా, ఒక్కరోజే 61 మంది మృతి, గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 98 వేల 214 శాంపిల్స్ సేకరణ, తాజాగా 11,579 మంది డిశ్చార్జ్

Hazarath Reddy

ఏపీలో గత 24 గంటల వ్యవధిలో 19 వేల 412 మందికి (Corona In Andhrapradesh) కరోనా సోకింది. ఒక్కరోజే 61 మంది మృతి చెందారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో 98 వేల 214 శాంపిల్స్ పరీక్షించగా..19 వేల 412 మంది కరోనా బారిన (Covid Report in AP) పడ్డారు.

Oxygen Shortage in Kurnool: కర్నూలులో దారుణం, ఆక్సిజన్‌ అందక అయిదుగురు కరోనా పేషెంట్లు మృతి, అనుమతి లేకుండా ప్రైవేట్ ఆస్పత్రిలో కోవిడ్ చికిత్స చేస్తున్నట్లు నిర్ధారణ, సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

కర్నూలులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో విషాదం చోటుచేసుకుంది. కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నఅయిదుగురు కరోనా పేషెంట్లు ఆక్సిజన్‌ అందక మృతి ( 5 COVID-19 patients died due to oxygen shortage) చెందారు. ఈ సంఘటనపై ఏపీ ప్రభుత్వం (AP Govt) ఆగ్రహం వ్యక్తం చేసింది.

Prakasam Shocker: అనుమానం..బ్లేడు, కత్తిపీటతో భార్య గొంతు కోసి చంపేసిన భర్త, ప్రకాశం జిల్లాలో దారుణం, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న గిద్దలూరు పోలీసులు

Hazarath Reddy

ప్రకాశం జిల్లాలో దారుణం చోటు (Prakasam Shocker) చేసుకుంది. జిల్లాలోని బేస్తవారిపేట మండలం గలిజేరుగుళ్ల గ్రామంలో భార్యపై అనుమానంతో ఓ భర్త ఆమెను హత్య ( husband killed his wife on suspicion) చేశాడు. అనంతరం ఆ ఇంటికి తాళం వేసి పరారయ్యాడు.

Advertisement

Tirupati By-Election Row: తిరుపతి ఉప ఎన్నిక రద్దు పిటిషన్ కొట్టివేత, వ్యాజ్యాలకు విచారణ అర్హత లేదని తెలిపిన ఏపీ హైకోర్టు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల వ్యాజ్యాలపై విచారణ మే 3వ తేదీకి వాయిదా

Hazarath Reddy

తిరుపతి లోక్‌సభ నియోజకవర్గానికి గత నెల 17న నిర్వహించిన ఉప ఎన్నికను (Tirupati by-election) రద్దుచేసి రీ పోలింగ్‌ నిర్వహించాలని కోరుతూ బీజేపీ అభ్యర్థి రత్నప్రభ, తెలుగుదేశం అభ్యర్థి పనబాక లక్ష్మి వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు (Andhra Pradesh High Court) శుక్రవారం కొట్టేసింది. ఈ వ్యాజ్యాలకు విచారణ అర్హత లేదని పేర్కొంది.

COVID19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా నమోదైన కోవిడ్ కేసులు, ఒక్కరోజులోనే 17,354 మందికి పాజిటివ్, 64 మంది మృతి, 1 లక్షా 23 వేలకు చేరువలో ఆక్టివ్ కేసులు, 8 వేలకు చేరువగా కోవిడ్ మరణాలు

Team Latestly

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 86,494 మంది శాంపుల్స్ ను పరీక్షించగా 17,354 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇప్పటివరకు ఏపి ఒకరోజులో నమోదు చేసిన కోవిడ్ కేసుల్లో ఇదే అత్యధికం....

Inter Exams 2021: పరీక్షల విషయంలో వెనక్కి తగ్గేదేలే! షెడ్యూల్ ప్రకారమే ఏపిలో ఇంటర్ పరీక్షలు, గురువారం నుంచే హాల్ టికెట్ల డౌన్‌లోడ్, విద్యార్థుల భవిష్యత్ కోసమేనని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పునరుద్ఘాటన

Team Latestly

విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పరీక్షల నిర్వహణకు సంబంధించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి తెలిపారు. గురువారం సాయంత్రం 6 గంటల నుండి విద్యార్థులు హాల్ టికెట్లను bie.ap.gov.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు....

AP Politics: 'జగన్ ప్రభుత్వానికి మానవత్వమే లేదు.. అక్రమ కేసులపై కోర్టులో పోరాడతాం'! సీఐడి విచారణకు హాజరైన ఏపి మాజీ మంత్రి దేవినేని ఉమ, వైకాపా ప్రభుత్వంపై విమర్శలు

Team Latestly

తాను జైలుకెళ్లినా తన గొంతునొక్కలేరని, జగన్ అక్రమాలపై తాను ప్రశ్నిస్తూనే ఉంటానని దేవినేని ఉమ అన్నారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ అస్తవ్యస్తంగా ఉందని విమర్శించారు. ధూళిపాల్ల నరేంద్ర చేసిన తప్పేంటని నిలదీశారు.....

Advertisement
Advertisement