ఆంధ్ర ప్రదేశ్
Anantapur Shocker: హిజ్రా గొంతు కోసి చంపేశాడు, పెట్రోల్ పోసి నిప్పంటించాడు, అనంతపురంలో దారుణ ఘటన, విజయనగరం జిల్లా ర్సీపట్నంలో రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్న వెల్పేర్‌ అసిస్టెంట్‌
Hazarath Reddyఏపీలోని అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అనంతపురం (Anantapur Shocker) పట్టణ సమీపంలోని కొట్నూరు జాతీయ రహదారిపై ట్రాన్స్‌జెండర్‌ నిహారిక శుక్రవారం రాత్రి దారుణ హత్యకు గురైంది.
Covid Updates: మళ్లీ కరోనా విశ్వరూపం..ఒక్కరోజే 197 మంది మృతి, తెలంగాణలో స్కూళ్లు, కాలేజీల్లో కరోనా కల్లోలం, దేశంలో తాజాగా 43,846 కొత్త కేసులు, తెలంగాణలో 394 కొత్త కోవిడ్ కేసులు నమోదు, ఏపీలో 380 మందికి కోవిడ్ పాజిటివ్, మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాకరేకు కరోనా
Hazarath Reddyదేశంలో గ‌త‌ 24 గంట‌ల్లో 43,846 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... కొత్త‌గా 22,956 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,15,99,130కు( Coronavirus in India) చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 197 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,59,755కు (Covid Deaths in India) పెరిగింది.
Guntur Shocker: ఇద్దరు చిన్నారులపై అత్యాచారం, చంపి మళ్లీ రేప్ చేసిన కామాంధుడు, నిందితుడిని అరెస్ట్ చేసిన తాడేపల్లి పోలీసులు, గుంటూరు అమానుష ఘటన కేసు వివరాలను వెల్లడించిన అర్బన్‌ ఎస్పీ ఆర్‌ఎన్‌ అమ్మిరెడ్డి
Hazarath Reddyగుంటూరులో ఇద్దరు చిన్నారుల హత్యకేసు మిస్టరీ వీడింది.అభం, శుభం తెలియని ఇద్దరు బాలురపై సైకోలా మారి అత్యాచారం చేసి ఆపై కిరాతకంగా హత్య చేసిన నిందితుడిని తాడేపల్లి పోలీసులు అరెస్ట్‌ (Tadepalli police Arrested) చేశారు. తాడేపల్లి మండలంలోని మెల్లెంపూడి, వడ్డేశ్వరం గ్రామాల్లో కలకలం రేపిన కేసు (Child Assassination Case) వివరాలను గుంటూరులో శుక్రవారం జరిగిన విలేకర్ల సమావేశంలో అర్బన్‌ ఎస్పీ ఆర్‌ఎన్‌ అమ్మిరెడ్డి (Urban SP RN Ammireddy) వెల్లడించారు.
AP's COVID Bulletin: ఆంధ్రప్రదేశ్‌లో విస్తరిస్తోన్న కరోనా మహమ్మారి, కొత్తగా మరో 246 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 1900 దాటిన కోవిడ్19 ఆక్టివ్ కేసుల సంఖ్య
Team Latestlyచిత్తూరు జిల్లా నుంచి ఎక్కువ కేసులు వస్తుండగా, ఈ జిల్లా నుంచి వైరస్ రాష్ట్రంలోని మరిన్ని జిల్లాలకు విస్తరిస్తోంది. అంతేకాకుండా ప్రజలు కోవిడ్ నిబంధనలను పూర్తిగా గాలికొదిలేసి మాస్కులు లేకుండా యదేచ్ఛగా తిరుగుతుండటం కూడా రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తికి కారణమవుతోంది.....
Chandrababu's CID Case Update: సీఐడి విచారణపై నాలుగు వారాల స్టే ఇచ్చిన ఏపి హైకోర్ట్, చంద్రబాబు మరియు నారాయణకు తాత్కాలిక ఊరట, అప్పుడే ఇంకా ఏం అయిపోలేదంటున్న ఆర్కే
Vikas Mandaప్రతిపక్షాల గొంతునొక్కడానికి అర్థంలేని కేసులు వేస్తున్నారని హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఎలాంటి ఆధారాలు లేని ఈ కేసును కొట్టివేయాలని కొట్టివేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. శుక్రవారం ఈ కేసుపై రాష్ట్ర హైకోర్ట్ విచారించింది. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్ట్ సీనియర్ లాయర్ సిద్ధార్థ్ లూథ్రా....
COVID in AP: కరోనాతో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం; ఏపిలో కొనసాగుతున్న కోవిడ్ వ్యాప్తి, కొత్తగా మరో 218 పాజిటివ్ కేసులు నమోదు
Team Latestlyధినిర్వహణలో ఉంటూ కరోనా కారణంగా చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకునేందుకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియాను అందించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది....
Amaravati Land Scam: భూదందా కేసులో హైకోర్టుకు చంద్రబాబు, తనపై నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని పిటిషన్, భూములు కాజేసిన వారికి శిక్ష తప్పదంటున్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి, బాబును ఈ నెల 23న విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చిన సీఐడీ
Hazarath Reddyఅమరావతిలో భూ దందా జరిగిందని, చంద్రబాబు హయాంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ చోటు చేసుకుందన్న ఆరోపణలపై నిన్న సీఐడీ నోటీసులు ఇవ్వడం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నారు. సీఐడీ నోటీసుల అంశంపై న్యాయనిపుణుల సలహాలు తీసుకున్న చంద్రబాబు... రేపు హైకోర్టులో పిటిషన్ వేయనున్నారు. అమరావతి భూముల అంశంలో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని పిటిషన్ లో కోరనున్నారు.
CBSE Education Policy: ఏపీలో సీబీఎస్‌ఈ విద్యా పాలసీ, 2021–22 విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 8వ తరగతి వరకు సీబీఎస్‌ఈ విద్యా విధానం, స్పందన రివ్యూలో ఏపీ సీఎం వైయస్ జగన్, కార్యక్రమంలో హైలెట్స్ పాయింట్స్ ఇవే
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో 2021 – 22 విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 8వ తరగతి వరకు సీబీఎస్‌ఈ (సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌) విద్యా విధానానికి (CBSE Education Policy) శ్రీకారం చుడుతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) తెలిపారు.
MLC Election Results: తెలుగు రాష్ట్రాల్లో మొదలైన ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు, తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ, ఏపీలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ, ఫలితాలు ఆలస్యం అయ్యే అవకాశం
Hazarath Reddyరెండు తెలుగు రాష్ట్రాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు (MLC Election Results) ప్రారంభమైంది. తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు, ఏపీలో రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఓట్ల లెక్కింపు మొదలైంది. సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గం ఓట్ల లెక్కింపునకు (MLC Election Result 2021) ఏర్పాట్లు చేశారు. వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ స్థానానికి సంబంధించిన ఓట్లను నల్లగొండ పట్టణంలోని మార్కెట్‌ శాఖ గిడ్డంగిలో లెక్కిస్తున్నారు.
Bye-Elections 2021: తిరుపతిలో జెండా పాతేదెవరు, సాగర్‌లో గెలుపెవరిది?, రెండు లోక్‌సభ, 14 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్నికల కమిషన్, ఏప్రిల్‌ 17న పోలింగ్‌, మే 2న ఫలితాలు
Hazarath Reddyదేశంలో మళ్లీ ఎన్నికల సందడి మొదలు కానుంది. రెండు పార్లమెంటరీ నియోజకవర్గాలకు, 14 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్‌ను (Bye-Elections 2021) కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఏప్రిల్ 17 పోలింగ్ నిర్వహించనున్నట్లు భారత ఎన్నికల సంఘం (Election Commission) మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.
ZPTC & MPTC Polls: ఏకగ్రీవాలపై దర్యాప్తు చేసే అధికారం మీకు లేదు, ఏకగ్రీవంగా ఎన్నికైన ఎంపీటీసీ, జడ్పీటీసీలకు తక్షణమే డిక్లరేషన్‌ ఇవ్వండి, ఎస్‌ఈసీకి ఆదేశాలు జారీ చేసిన ఏపీ హైకోర్టు
Hazarath Reddyరాష్ట్ర ఎన్నికల సంఘానికి మరోసారి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఏకగ్రీవాలపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఏకగ్రీవాలపై దర్యాప్తు చేసే అధికారం ఎస్‌ఈసీకి ( state election commission) లేదని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ఏకగ్రీవంగా ఎన్నికైన ఎంపీటీసీ, జడ్పీటీసీలను తక్షణమే అధికారికంగా ప్రకటించాలని హైకోర్టు (AP Highcourt) ఎస్‌ఈసీని ఆదేశించింది.
Temple Management System in AP: ఇకపై దేవాలయాల్లో అవినీతికి తావు లేదు, టెంపుల్ మేనేజ్ మెంట్ సిస్టమ్‌ను ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం, అన్ని దేవాలయాలు ఒకే వ్యవస్థ కిందకు, పారదర్శకతతో కూడిన వ్యవస్థలు ఉండాలని తెలిపిన సీఎం వైయస్ జగన్
Hazarath Reddyపరిపాలనలో దూసుకుపోతున్న ఏపీ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర దేవాదాయ శాఖ పరిధిలో వున్న అన్ని దేవాలయాలను ఒకే వ్యవస్థ కిందికి తీసుకువచ్చేందుకు జగన్ సర్కారు సంకల్పించింది. ఇందులో భాగంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో టెంపుల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను (Temple Management System in AP) ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రారంభించారు.
AP Shocker: భార్యను చంపి లోయలో పడేసిన దుర్మార్గపు భర్త, ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన నిందితుడు, సాలూరు కోర్టులో నిందితులను ప్రవేశపెట్టిన సీఐ అప్పలనాయుడు
Hazarath Reddyభార్యను హత్య చేసి కొండల్లోని లోయల్లో పడేసి పరారైన దుర్మార్గపు భర్త ఎట్టకేలకు (AP Shcoker) అరెస్టయ్యాడు. రామభద్రపురం రావివలస పంచాయతీ (Raviwalasa panchayat) పరిధిలోని మూలసెగాం గ్రామానికి చెందిన ఎన్నికల ఎర్రమ్మ (30)ను భర్త పెంటయ్య గత నెలలో హత్య చేసి కొండల్లో లోయలో పడేసి పరారయిన సంగతి విదితమే. ఈ కేసును పోలీసులు చేధించారు. నిందితుడితోపాటు అతనికి సహకరించిన వ్యక్తిని అరెస్ట్‌ చేశారు.
CID Notices to CBN: రాజధాని భూ అక్రమాల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ సిఐడి నోటీసులు, విచారణకు హాజరుకావాలని సూచన
Team Latestlyఅమరావతి భూ అవకతవకలపై ఆంధ్రప్రదేశ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ విభాగం ఏపి ప్రతిపక్షనేత, టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడుకు నోటీసులు జారీ చేసింది. మంగళవారం ఉదయం సిఐడి అధికారులు హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి చేరుకుని నోటీసులు ఇచ్చారు. మార్చి 23 న విచారణకు హాజరు కావాలని కోరారు.....
AP Coronavirus: ఏపీలో మెల్లిగా పెరుగుతున్న కరోనా కేసులు, తాజాగా 147 మందికి కోవిడ్ పాజిటివ్, అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని
Hazarath Reddyఏపీలో కరోనా గత 24 గంటల్లో 22,604 మందికి కరోనా టెస్టులను నిర్వహించగా 147 మందికి పాజిటివ్ నిర్ధారణ (AP Coronavirus) అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 35 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా ప్రకాశం, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కో కేసు వంతున నిర్ధారణ అయ్యాయి. కర్నూలు జిల్లాలో ఒకరు మృతి చెందారు.
AP Covid Update: గుంటూరులో కరోనా కల్లోలం, ఒక్కరోజే 48 కేసులు, ఏపీలో తాజాగా 298 మందికి కరోనా, ఇద్దరు మృతితో 7,184కి చేరిన కోవిడ్ మరణాల సంఖ్య
Hazarath Reddyఏపీలో గడచిన 24 గంటల్లో ఏపీలో 45,664 కరోనా పరీక్షలు నిర్వహించగా 298 మందికి పాజిటివ్ అని నిర్ధారణ (AP Coronavirus) అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 90 కొత్త కేసులు నమోదు కాగా, గుంటూరు జిల్లాలో 48 మందికి కరోనా సోకినట్టు గుర్తించారు. తూర్పు గోదావరి జిల్లాలో 32, కృష్ణా జిల్లాలో 32, విశాఖ జిల్లాలో 32 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 3, నెల్లూరు జిల్లాలో 3 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
AP Municipal Election Results: జగన్ పాలనకే ప్రజలు పట్టం, వైసీపీ ఖాతాలోకి 11 కార్పోరేషన్లు, 73 మున్సిపాలిటీల్లో జగన్ సర్కారు విజయకేతనం, రెండు స్థానాలతో సరిపెట్టుకున్న టీడీపీ, ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాల పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి
Hazarath Reddyఏపీలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లో (AP Municipal Election Results) వైఎస్సార్‌సీపీ సరికొత్త రికార్డ్‌ సృష్టించింది. అన్ని జిల్లాల్లోనూ వైఎస్సార్‌సీపీ తన హవా కొనసాగించింది. ఫ్యాన్‌ దూకుడుకు టీడీపీ, బీజేపీ, జనసేన అడ్రస్ గల్లంతయ్యాయి. మొత్తం 11 కార్పొరేషన్లు వైఎస్‌ఆర్‌సీపీ (YSRCP) కైవసం చేసుకుంది.
AP Municipal Election Results 2021: ఫ్యాన్ హోరులో కొట్టుకుపోయిన టీడీపీ, బీజేపీ-జనసేన, జగన్ సర్కారుకు ఏకపక్ష విజయాన్ని కట్టబెట్టిన ఓటర్లు, విజయవాడ, గుంటూరు, విశాఖ, కర్నూలు, ఇంకా పలు జిల్లాల్లో వైసీపీదే ఆధిక్యం
Hazarath Reddyమున్సిపల్‌ ఎన్నికల చరిత్రలో వైఎస్సార్‌సీపీ ఏకపక్ష విజయాన్ని సాధించింది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం ( AP Municipal Election Results 2021) కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో అన్ని చోట్ల విజయభేరి మోగించింది. అన్ని జిల్లాల్లోనూ వైఎస్సార్‌సీపీ హవా కొనసాగుతుంది. ఫ్యాన్‌ దూకుడును అందుకోలేక టీడీపీ, బీజేపీ, జనసేన వెనుకబడిపోయాయి.
YSRCP MLA Ambati Rambabu: ప్రజలు మూడు రాజధానులకు జై కొట్టారు, ప్రతిపక్షాలకు ఇక పనే లేదు, మునిసిపల్ ఎన్నికల ఫలితాలపై స్పందించిన వైసీపీ పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు
Hazarath Reddyదత్త పుత్రుడు పవన్ కళ్యాణ్, సొంత పుత్రుడు లోకేష్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. పంచాయతీల్లో, మున్సిపాలిటీల్లో టీడీపీ తుక్కు తుక్కుగా ఓడిపోయిందని, రాష్ట్రంలో ఈ దెబ్బతో టీడీపీ కనుమరుగైపోయిందని అంబటి రాంబాబు తెలిపారు.
AP Municipal Poll Results 2021: గుంటూరులో వైసీపీదే హవా, విజయవాడ కార్పొరేషన్‌లో 19 డివిజన్లలో వైసీపీ విజయం, ఒంగోలుతో సహా 5 కార్పోరేషన్లు అధికార పార్టీ కైవసం, తాడిపత్రి ఫలితాలపై పెరుగుతున్న ఉత్కంఠ, ఏపీ మునిసిపల్ పోలింగ్ లైవ్ అప్‌డేట్స్ కోసం క్లిక్ చేయండి
Hazarath Reddyఏపీ మున్సిపల్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించే దిశగా దూసుకువెళుతోంది. చాలా చోట్ల కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో క్లీన్‌స్వీప్‌ దిశగా అధికార పార్టీ ముందుకు వెళుతోంది. అన్ని జిల్లాల్లోనూ వైఎస్సార్‌సీపీ తన హవా కొనసాగిస్తోంది. ఇక ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న గుంటూరులోనూ అధికార పార్టీనే ఆధిపత్యం సాధించింది.