ఆంధ్ర ప్రదేశ్
Water Tussle: ఏపీ సీఎం జగన్ చర్యపై టీఎస్ సీఎం కేసీఆర్ ఆగ్రహం, ఎత్తిపోతల పథకంపై ఏపీ నిర్ణయం తీవ్ర అభ్యంతరకరం అని వ్యాఖ్య, వెంటనే కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేయాలని అధికారులకు ఆదేశం
Team Latestlyగతంలో ఉన్న వివాదాలను, విభేదాలను పక్కన పెట్టి రెండు రాష్ట్రాల రైతుల ప్రయోజనాలు కాపాడడమే లక్ష్యంగా నదీ జలాలను వినియోగించుకుందామని తెలంగాణ ప్రభుత్వం ఏపికి స్నేహహస్తం అందించింది, అయినప్పటికీ....
Corona in Telangana: మహమ్మారి ఎంతకాలం ఉంటుందో తెలియదు.. కరోనాతో కలిసే సాధారణ జీవితం సాగేలా పక్కా వ్యూహం రూపొందించాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు
Team Latestlyకరోనాతో పోరాడుకుంటూనే ఇతరత్రా కూడా సిద్ధం కావాల్సి ఉంది. ఆర్థిక కార్యకలాపాలు సాగాలి. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో కొన్ని సడలింపులు అమలవుతున్నాయి. కొన్ని పనులు జరుగుతున్నాయి. ఈ పరిస్థితిలో భవిష్యత్తులో సడలింపులను ఎలా అమలు చేయాలి....
Telugu States CMs with PM: రైళ్లను నడపవద్దన్న కేసీఆర్, ప్రజల్లో భయాన్ని తొలగించాలన్న వైయస్ జగన్, ప్రధాని మోదీతో ముగిసిన రాష్ట్రాల ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్
Hazarath Reddyమే 17తో మూడవ దశ లాక్‌డౌన్‌ (Lovkdown 3.0) ముగుస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ (pm modi's vc interactions with cms) నిర్వహించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుని కలిసి పనిచేయాలని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) పిలుపునిచ్చారు. వలస కార్మికులు సురక్షితంగా ఇంటికి చేరేలా సాయపడాలని విజ్ఞప్తి చేశారు. ఇంటికి వెళ్లాలనుకోవడం మానవుడి సహజ లక్షణం అని, వలస కార్మికుల తరలింపు ప్రక్రియలో రాష్ట్రాలు సమన్వయం చేసుకుంటూ సహకరించుకోవాలని కోరారు.
AP Corona Report: కరోనా నుంచి కోలుకుంటున్న కర్నూలు, ఏపీలో 998 మంది పేషెంట్లు డిశ్చార్జ్, 975 యాక్టివ్ కేసులు, 24 గంటల్లో 74 మంది పేషెంట్లు రికవరీ
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో పాజిటివ్ కేసుల సంఖ్య (AP Corona Report) 2000 దాటింది. గత 24 గంటల్లో కొత్తగా మరో 38 పాజిటివ్ కేసులు నమోదవడంతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్-19కేసుల సంఖ్య (COVId-19 Cases in AP) సోమవారం ఉదయం నాటికి 2018కు చేరింది. 7,409 సాంపిల్స్ ని పరీక్షిస్తే కేవలం 38 మంది మాత్రమే కోవిడ్19 (COVID-19) పాజిటివ్ గా నిర్దారింపబడ్డారని ప్రభుత్వం (AP Govt) తెలిపింది. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య నేడు ఏమీ నమోదు కాలేదు. 45 మంది కరోనా వల్ల మరణించారు. మొత్తం మీద ఇప్పటివరకు 998 మంది డిశ్చార్జ్ కాగా 975 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గత 24 గంటల్లో 74 మంది పేషెంట్లు రికవరీ అయ్యారు.
AP CM Review: ఏపీలో షాపుల ఓపెన్‌కు గ్రీన్ సిగ్నల్, ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు దుకాణాలు తెరిచేందుకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం, సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష
Hazarath Reddyఏపీలో లాక్‌డౌన్ తర్వాత కేంద్ర మార్గదర్శకాల ప్రకారం అనుమతి ఉన్న ప్రాంతాల్లో ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు దుకాణాలను తెరిచేందుకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) నిర్ణయించింది. కోవిడ్‌–19 నియంత్రణ చర్యలు (coronavirus prevention), లాక్‌డౌన్‌ (AP Lockdown) అనంతరం రాష్ట్రాల మధ్య రాకపోకలపై అనుసరించాల్సిన విధానాలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jaganmohan Reddy) ఆదివారం తన నివాసంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో 2000కు చేరువైన కోవిడ్-19 బాధితుల సంఖ్య, గత 24 గంటల్లో రాష్ట్రంలో 50 పాజిటివ్ కేసులు, మరో కరోనా మరణం నమోదు, వైరస్ నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష
Team Latestlyరోజురోజుకు ఈ కోవిడ్-19 నుంచి కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అవుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఫలితంగా రాష్ట్రంలో పాజిటివ్ కేసులు 2 వేలకు చేరువయినప్పటికీ అందులో సగం మాత్రమే ఆక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో డిశ్చార్జ్‌లు పెరుగుతున్న తరుణంలో మరింత శ్రద్ధ వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్మోహన్ రెడ్డి‌ అధికారులకు సూచించారు....
COVID-19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో మరో 43 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 1930కు చేరిన కోవిడ్-19 బాధితుల సంఖ్య, నేడు ఏపీకి రానున్న కేంద్ర ఆరోగ్య బృందం
Team Latestlyఆదివారం నుంచి వారం రోజుల పాటు వీరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ బృందంలో ఆలిండియా ఇస్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌ డా.‌ మధుమిత, మరియు ప్రొఫెసర్‌ డా. సంజయ్ ‌కుమార్ ముఖ్యులుగా‌ ఉన్నారు. కర్నూలు, నంద్యాల సహా తదితర ప్రాంతాలను వీరు సందర్శించనున్నారు......
Vizag Gas Leak Tragedy: రూ. 50 కోట్లు నష్ట పరిహారం కింద డిపాజిట్ చేయండి, ఎల్జీ పాలిమ‌ర్స్‌కు నోటీసులు జారీ చేసిన ఎన్జీటీ, మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఆర్థిక సాయం ప్రకటించిన ఏపీ సీఎం
Hazarath Reddyవిశాఖ‌ప‌ట్ట‌ణంలోని ఎల్జీ పాలిమ‌ర్స్‌లో స్టైరిన్ గ్యాస్ లీకేజీ (Vizag Gas Leak Tragedy) దుర్ఘ‌టన‌లో మొత్తం 12 మంది మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే. ఆ ప్ర‌మాదంలో సుమారు వెయ్యి మందికిపై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ ఘ‌ట‌న ప‌ట్ల నేష‌న‌ల్ గ్రీన్ ట్రిబ్యున‌ల్ స్పందించింది. ఎల్జీ పాలిమ‌ర్స్ సంస్థ‌కు ఎన్జీటీ నోటీసులు ఇచ్చింది. ఎన్జీటీతో పాటు ప‌ర్యావ‌ర‌ణ‌, అడవుల మంత్రిత్వ‌శాఖ‌, సెంట్ర‌ల్ పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డు(సీపీసీబీ)లు (Central Pollution Control Board (CPCB)) కూడా ఎల్జీ పాలిమ‌ర్స్ సంస్థ‌కు (LG Polymers Plant) నోటీసులు ఇచ్చాయి. అయితే ప్రాథ‌మికంగా న‌ష్ట‌ప‌రిహారం కింద‌ 50 కోట్లు డిపాజిట్ చేయాల‌ని ఎల్జీ పాలిమ‌ర్స్‌కు ఎన్జీటీ నోటీసులు జారీ చేసింది.
AP Coronavirus Report: ఏపీలో 842 మంది డిశ్చార్జ్, 1004 యాక్టివ్ కేసులు, తాజాగా 54 కేసులు నమోదు, కోవిడ్‌–19 కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపిన ఆర్థికమంత్రి బుగ్గన
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh Coronavirus) శుక్రవారం కొత్తగా 54 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో (AP Coronavirus) మొత్తం కేసుల సంఖ్య 1,887కి చేరుకుంది. గడచిన 24 గంటల్లో కరోనా వల్ల ముగ్గురు మృతి చెందారు. కర్నూలులో ఇద్దరు, విశాఖలో ఒకరు చనిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ 41 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 1004 మంది కరోనా రోగులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కోవిడ్‌-19 నుంచి కోలుకొని 842 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ శుక్రవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.
Vizag Gas Tragedy: గ్యాస్ లీకేజీ ఘటనలో 12కు చేరిన మృతుల సంఖ్య, ఐదు గ్రామాల ప్రజలను ఖాళీ చేయించిన అధికారులు, వదంతులు నమ్మవద్దన్న విశాఖ పోలీసు కమిషనర్ ఆర్కే మీనా
Hazarath Reddyవిశాఖపట్నం ఎల్‌జీ పాలిమర్స్‌లో (LG Polymers) విషవాయువు లీకైన్‌ ఘటనలో (Vizag Gas Leak) మరో ఇద్దరు మృతిచెందారు. దీంతో మొత్తం ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య (Vizag Gas leak death toll) 12కు చేరింది. అలాగే విషవాయువు పీల్చి అస్వస్థతకు గురైనవారికి విశాఖలోని (Visakhapatnam) పలు ఆస్పత్రుల్లో చికిత్స కొనసాగుతోంది. కేజీహెచ్ ఆస్పత్రిలో మూడు వార్డుల్లో 193 మంది చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్నవారిలో 47 మంది చిన్నారులు ఉన్నారు. వారందరికి డాక్టర్లు మెరుగైన వైద్యం అందిస్తున్నారు.
Vizag LG Polymers Gas Leak: గ్యాస్ లీకయిన వెంటనే రంగంలోకి ఎన్డీఆర్‌ఎఫ్‌, ఇండియన్ నేవీ బృందాలు, లేకుంటే భారీ ప్రాణ నష్టం జరిగేది, మీడియాతో ఎన్డీఆర్‌ఎఫ్‌ డీజీ ఎస్‌ఎన్‌ ప్రధాన్‌
Hazarath Reddyవిశాఖ ఎల్‌జీ పాలీమర్స్‌ కంపెనీలో గ్యాస్‌ లీకైన (Vizag LG Polymers Gas Leak) వెంటనే సహాయక చర్యలు చేపట్టినట్లు ఎన్డీఆర్‌ఎఫ్‌ డీజీ ఎస్‌ఎన్‌ ప్రధాన్‌ (NDRF chief SN Pradhan) తెలిపారు. ఈ విషాద ఘటనపై ఆయన మీడియాతో మాట్లాడుతూ... సమాచారం అందుకున్న వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్‌ బలగాలు (National Disaster Relief Force) రంగంలోకి దిగి గ్యాస్‌ లీక్‌ ఘటన ప్రాంతంలో ప్రజలను ఖాళీ చేయించామని తెలిపారు. ఇంటింటికి వెళ్లి బాధితులను ఆస్పత్రులకు తరలించినట్లు తెలిపారు. 500 మందికి పైగా ప్రజలను ఖాళీ చేయించినట్లు చెప్పారు. గ్యాస్‌ లీక్‌ ప్రమాదంలో (Vizag Gas Leak) ఇప్పటివరకు 11 మంది చనిపోయారన్నారు. 200 మందికి పైగా వైద్యసాయం పొందుతున్నారన్నారు.
#VizagGasTragedy: వైజాగ్ గ్యాస్ లీక్ విషాదం, మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఆర్థిక సాయం, తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య, ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని తెలిపిన ఏపీ సీఎం
Hazarath Reddyఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో (Vizag Gas Leak) ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ముఖ్యమంత్రి జగన్ (Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy) అన్నారు. అస్వస్థతకు గురైన వారు, అపస్మారక స్థితిలో ఉన్నవారు కోలుకుంటున్నారని చెప్పారు. మల్టీ నేషనల్ కంపెనీలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని అన్నారు. ఈ ఘటనపై విచారణ చేయాలని జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ ను ఆదేశించామని చెప్పారు.
Vizag Gas Leak Tragedy: కింగ్‌ జార్జ్‌ ఆస్పత్రిలో బాధితులను ఓదార్చిన ఏపీ సీఎం వైయస్ జగన్, ఆ వదంతులు నమ్మవద్దన్న డీజీపీ గౌతం సవాంగ్, ఘటనపై స్పందించిన ఎల్‌జీ కెమ్ యాజమాన్యం
Hazarath Reddyఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి (AP CM YS Jagan) ప్రత్యేక హెలికాప్టర్‌లో విశాఖపట్నంలోని కింగ్‌ జార్జ్‌ ఆస్పత్రికి చేరుకున్నారు. గ్యాస్‌ లీక్‌ ప్రమాదంలో (Vizag Gas Leak Tragedy) అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. విశాఖ కేజీహెచ్‌లో (KGH hospital) 187 మంది, అపోలో ఆస్పత్రిలో 48 మంది, సెవెన్‌హిల్స్‌ ఆస్పత్రిలో 12 మంది చికిత్స పొందుతున్నారు. సీరియస్‌గా ఉన్నవారిని జీజీహెచ్‌కు తరలిస్తున్నారు.
AP Corona Report: ఆ మూడు జిల్లాల్లో 1200కు పైగా కేసులు, విజయనగరం జిల్లాలోకి ఎంటరయిన కరోనా, ఏపీలో 1,833కి చేరిన కేసుల సంఖ్య, 780 మంది డిశ్చార్జి
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) తాజాగా 56 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య (AP Corona Report) 1,833కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ గురువారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 8,087 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 56 మందికి కరోనా (Coronavirus) నిర్దారణ అయినట్టు పేర్కొంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,49,361 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు వెల్లడించింది.
Visakhapatnam Gas Leak: ఎనిమిదికి చేరిన మృతుల సంఖ్య, గ్యాస్ లీక్‌పై ప్రధాని మోదీ అత్యవసర భేటీ, హాజరయిన అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ తదితరులు
Hazarath Reddyవిశాఖపట్నంలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురంలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ ( LG Polymers industry) నుంచి గ్యాస్‌ లీకైన ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ అత్యవసర సమావేశంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి, ఎన్డీఆర్‌ఎఫ్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Vizag Gas Leak Tragedy: కాసేపట్లో విశాఖకు చేరుకోనున్న ఏపీ సీఎం, కేజీహెచ్‌ ఆస్పత్రిలో బాధితులను పరామర్శించనున్న వైయస్ జగన్, గ్యాస్ లీక్ దుర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి
Hazarath Reddyఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan) విశాఖకు బయలుదేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరిన ఆయన కాసేపట్లో విశాఖకు చేరుకోనున్నారు. అంతకు ముందు విశాఖ ఎల్జీ పాలీమర్స్ ఫ్యాక్టరీ నుంచి గ్యాస్‌ లీక్‌ (Vizag Gas Leak Tragedy) ఘటనపై అధికారులతో ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.
Visakhapatnam Gas Leak: ఇదొక దురదృష్టకర సంఘటన, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన తెలంగాణ సీఎం కేసీఆర్, దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన ఐటీ మంత్రి కేటీఆర్
Hazarath Reddyవిశాఖపట్నంలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురంలో ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి గ్యాస్‌ లీకైన (Visakhapatnam Gas Leak) ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (Telangana CM KCR), ఐటీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ ఘటన గురించి తెలుసుకుని దిగ్భ్రాంతికి గురైనట్లు కేసీఆర్ తెలిపారు. విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన దురదృష్టకరమని ఆయన అన్నారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నానని చెప్పారు.
Vizag Gas Leak: ఘటనపై ఏపీ సీఎంకు ప్రధాని మోదీ ఫోన్, కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలు ఉంటాయని వెల్లడి, ఎన్‌డీఎంఏతో అత్యవసర సమావేశం
Hazarath Reddyఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని వైజాగ్‌లో ఎల్‌జీ పాలిమర్స్‌లో (LG Polymers industry) రసాయన వాయువు లీకేజీ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi ) స్పందించారు. ఈ దుర్ఘటనపై (Visakhapatnam Gas Leak) ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి (AP Chief Minister YS Jagan Mohan Reddy)ఫోన్‌ చేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలు ఉంటాయని ప్రధాని మోదీ భరోసా ఇచ్చి‍నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది. మరోవైపు గ్యాస్‌ లీకేజీ ఘటనపై ప్రధాని ట్విటర్‌ వేదికగా విచారం వ్యక్తం చేశారు.
#VizagGasLeak: గ్యాస్ దుర్ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి, విషాద ఘటనపై ఎంహెచ్‌ఏ, ఎన్‌డిఎంఎ అధికారులతో మాట్లాడిన ప్రధాని, విశాఖకు ఎన్టీఆర్ఎఫ్ బృందాలు
Hazarath Reddyవిశాఖపట్టణంలో ఈ తెల్లవారుజామున సంభవించిన గ్యాస్ దుర్ఘటనపై (Visakhapatnam Gas Leak) ప్రధానమంత్రి మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో పరిస్థితులకు సంబంధించి MHA (హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ), NDMA (జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ) అధికారులతో మాట్లాడారు. విశాఖపట్నంలో ప్రతి ఒక్కరి భద్రత మరియు శ్రేయస్సు కోసం నేను ప్రార్థిస్తున్నాను అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ (PM Modi Tweet) చేశారు.
Vizag LG Polymers Gas Leak: పెరుగుతున్న మృతుల సంఖ్య, విశాఖకు రానున్న ఏపీ సీఎం వైయస్ జగన్, అందర్నీ రక్షించుకుంటామని తెలిపిన ఐటీ మంత్రి గౌతం రెడ్డి, ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన చంద్రబాబు
Hazarath Reddyవిశాఖపట్టణం, ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమలో జరిగిన కెమికల్ గ్యాస్ లీక్ (Vizag LG Polymers Gas Leak) ఘటనలో మృతి చెందినవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దాదాపు 8 మంది మృతి చెందారని వార్తలు అందుతున్నాయి. మరికాసేపట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (AP Chief Minister YS Jagan Mohan Reddy) నగరానికి రానున్నారు. ప్రత్యేక విమానంలో 11:45 గంటలకు విశాఖ చేరుకోనున్న జగన్ బాధితులను కలిసి పరామర్శించనున్నారు. గ్యాస్ లీకైన ప్రాంతం నుంచి దాదాపు ఐదు కిలోమీటర్ల పరిధిలోని ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.