ఆంధ్ర ప్రదేశ్

Telugu States Lockdown: తెలుగు రాష్ట్రాల్లో లాక్‌డౌన్, రెండు వారాలు పొడిగించాలన్న కేసీఆర్, రెడ్‌జోన్ల వరకు పరిమితం చేయాలన్న జగన్, ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌లో ఇరు రాష్ట్రాల సీఎంలు

Hazarath Reddy

లాక్‌డౌన్ (India Lockdown) 21 రోజులు గడువు ఏప్రిల్ 14తో పూర్తి అవుతున్న నేపథ్యంలో దాన్ని పొడిగించాలా వద్దా అనే విషయంపై ఈ రోజు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ (PM Modi Video conference) నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మెజార్టీ ముఖ్యమంత్రులు (chief ministers) లాక్‌డౌన్ పొడిగించాలని కోరారు.

AP Red Zone Areas: ఏపీలో రెడ్ జోన్లుగా 133 ప్రాంతాలు, రెడ్‌ జోన్, హాట్‌ స్పాట్లు ఇకపై పోలీసుల వలయంలో.., ఆంక్షలు ఉల్లంఘిస్తే కేసుల నమోదు

Hazarath Reddy

ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ (coronavirus in AP) విజృంభిస్తూనే ఉంది. రోజు రోజుకు కొత్త కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఏపీ ప్రభుత్వం మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. లాక్ డౌన్ పకడ్బందిగా నిర్వహించాలని సీఎం జగన్ (CM Jagan) ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో 133 ప్రాంతాలను రెడ్ జోన్లుగా (AP Red Zones) రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

Justice V Kanagaraj: ఏపీకి నయా ఎస్‌ఈసీ, నూతన ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ కనగరాజ్‌, నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ విరమణ, కనగరాజ్ పూర్తి ప్రొపైల్ గురించి ఓ సారి తెలుసుకోండి

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ నూతన ఎన్నికల కమిషనర్‌(ఎస్‌ఈసీ)గా (AP new State Election commissioner) రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ కనగరాజ్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ నూతన ఎస్‌ఈసీగా జస్టిస్‌ కనగరాజ్‌ ( Justice V. KanagaRaj) శనివారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్‌ జడ్జిని (Retired Justice) నియమించాలని ఏపీ ప్రభుత్వం (AP Govt) నిన్న (శుక్రవారం) ఆర్డినెన్స్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆర్డినెన్స్ మేరకు జస్టిస్ కనగరాజ్‌ను ఎస్‌ఈసీగా ప్రభుత్వం నియమించింది

Electricity Bills in AP: గత నెల కరెంట్ బిల్లే ఈ నెల కట్టండి, స్పష్టం చేసిన ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి, లాక్‌డౌన్‌ వేళ ఇంటింటికీ వెళ్లి విద్యుత్‌ బిల్లులు తీయడం సాధ్యం కాదన్న డిస్కమ్‌లు

Hazarath Reddy

మార్చి నెలలో వచ్చిన విద్యుత్‌ బిల్లులే (Electricity bills) ఏప్రిల్‌ నెలకూ వర్తిస్తాయని ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (APERC) స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. కరోనాతో రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ (COVID-19 Lockdown) కొనసాగుతున్నందున సిబ్బంది ఇంటింటికీ వెళ్లి విద్యుత్‌ బిల్లులు తీయడం సాధ్యం కాదని రాష్ట్ర డిస్కమ్‌లో కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లాయి.

Advertisement

Nimmagadda Ramesh Kumar: ఎస్‌ఈసీ నిమ్మగడ్డకు భారీ షాక్, ఆయన పదవీ కాలాన్ని మూడేళ్లకు తగ్గిస్తూ కొత్త ఆర్డినెన్స్, నిబంధనలను సవరించిన ఏపీ ప్రభుత్వం, రాష్ట్ర ఈసీగా హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి

Hazarath Reddy

ఏపీ ప్రభుత్వం (AP Govt) సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా (State Election Commissioner) ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ (Nimmagadda Ramesh Kumar) ను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని వార్తలు వస్తున్నాయి. మీడియాకు అందుతున్న సమాచారం ప్రకారం.. దీనికి సంబందించి నిబంధనలు సవరిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. దీనికి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ (Governor Bhusan Haricchandan) ఆమోదం తెలిపారు. ఎస్.ఇ.సి.పదవి కాలాన్ని మూడేళ్లకు కుదించింది. ఆర్డినెన్స్ కు ఆమోదం తెలపడంతో ఆ వెంటనే ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

COVID-19 In Telugu States: తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కోవిడ్- 19 కేసులు, ఏపీలో 381కి చేరిన కరోనా కేసులు, తెలంగాణలో 487కు చేరిన కరోనావైరస్ కేసులు

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు (COVID-19 In Telugu States) రొజు రోజుకు పెరుగుతున్నాయి. కోవిడ్ 19 (COVID-19) కట్టడికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు (Telugu States CMs) ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కేసులు నియంత్రణ కావడం లేదు. రోజు రోజుకు సరికొత్త కేసులు నమోదవుతున్నాయి. లాక్ డౌన్ (Lockdown) పటిష్టంగా అమలు చేస్తున్నప్పటికీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం లేదు.

Rapid COVID-19 Test Kits in AP: కరోనా కట్టడికి ఏపీలో కీలక అడుగు, కోవిడ్‌–19 ర్యాపిడ్‌ టెస్టు కిట్లను ఆవిష్కరించిన ఏపీ సీఎం వైయస్ జగన్, ఈ కిట్ల ద్వారా 55 నిమిషాల్లోనే కరోనా ఫలితం

Hazarath Reddy

COVID-19 in AP: వైద్య సేవలందిస్తున్నవారికి సెల్యూట్, వారి సేవలు వెల కట్టలేనివంటూ కొనియాడిన ఏపీ సీఎం జగన్, కరోనా కట్టడిపై కలెక్టర్లు, వైద్య సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్‌

Hazarath Reddy

కరోనా మహమ్మారిపై (COVID-19) జరుగుతున్న యుద్దంలో వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది, నర్సులు, పారిశుద్ధ్య సిబ్బంది అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి (AP CM YS Jagan) కొనియాడారు. ప్రతి జిల్లాలోని కోవిడ్‌ ఆస్పత్రులు, క్రిటికల్‌ ఆస్పత్రుల్లో వీరంతా చాలా కష్టపడి పనిచేస్తున్నారని పేర్కొన్నారు. కరోనా చర్యలపై కలెక్టర్లు, వైద్య సిబ్బందితో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ (AP CM YS Jagan Video conference) ద్వారా మాట్లాడారు.

Advertisement

AP Coronavirus Cases: ఏపీలో కరోనాతో ఆరుమంది మృతి, 363కి చేరిన కోవిడ్ 19 పాజిటివ్ కేసుల సంఖ్య, మర్కజ్‌ నిజాముద్దీన్ సదస్సుకు వెళ్లినవారివే అత్యధికం, ప్రత్యేక ఫోకస్ పెట్టిన వైయస్ జగన్ సర్కారు

Hazarath Reddy

ఏపీలో రోజు రొజుకు కరోనావైరస్ కేసులు (AP Corona Cases) తగ్గుముఖం పట్టినట్లే పట్టి పెరుగుతున్నాయి. మొన్న ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంతో ఊపిరిపీల్చుకునే లోపు మళ్లీ కొత్తగా 15 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య (Corona Positive Cases in AP) 363కి చేరింది. బుధవారం రాత్రి 9 గంటల నుంచి గురువారం రాత్రి 8 వరకు 674 శాంపిళ్లు పరీక్షించగా 15 కేసులు పాజిటివ్‌గా వచ్చాయి. ఒక్క ప్రకాశం జిల్లాలోనే 11 కొత్త కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 2, తూర్పు గోదావరి, కడప జిల్లాలో ఒక్కొక్క కేసు చొప్పున నమోదయ్యాయి.

COVID19 Emergency Package: కోవిడ్-19పై పోరాటానికి రాష్ట్రాలకు రూ. 15 వేల కోట్ల అత్యవసర నిధులను మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ సహా దేశంలోని 9 రాష్ట్రాలకు కేంద్రం నుంచి ప్రత్యేక బృందాల తరలింపు

Vikas Manda

ఈ నిధులను ప్రధానంగా కరోనావైరస్ నిర్ధారణ పరీక్షలు, కోవిడ్ -19 చికిత్సకు సౌకర్యాల కల్పన, వైద్య పరికరాలు మరియు చికిత్సకు అవసరమయ్యే ఔషధాల ఉత్పత్తి, భవిష్యత్తు అవసరాల కోసం ముందస్తుగా సిద్ధంగా ఉండేలా ఆరోగ్య వ్యవస్థలను అభివృద్ధి పరచటానికి ఉపయోగించనున్నారు......

Bulking 'Quarantine' Meal in AP: కరోనావైరస్ రోగ నిరోధక శక్తికి 'జగనన్న గోరుముద్ద', విజయవాడలోని క్వారైంటైన్ కేంద్రంలో డ్రై ఫ్రూట్స్ మరియు గుడ్లతో పౌష్టికాహారం, రాష్ట్రవ్యాప్తంగా ఇదే మెనూ అమలు పరచాలని ప్రభుత్వం ఆదేశాలు

Vikas Manda

రాష్ట్రంలోని విజయవాడ, గన్నవరం తదితర క్వారైంటైన్ కేంద్రాలలో 'జగనన్న గోరుముద్ధ' పథకం కింద అందించే ఆహారంలో జీడిపప్పు, బాదాం, ఖర్జూరం, గుడ్లు, అరటిపండ్లు శక్తివంతమైన ఆహారాన్ని అందిస్తున్నామని రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన 'ఆరోగ్య ఆంధ్ర' విభాగం తెలిపింది......

Mahesh Babu Salutes Police: సెల్యూట్ తెలంగాణ పోలీస్ అంటున్న సూపర్ స్టార్ మహేశ్, కఠిన సమయాల్లో దేశ ప్రజల కోసం అవిశ్రాంతంగా, నిస్వార్థంగా శ్రమిస్తున్న పోలీసులకు సెల్యూట్ అంటూ ట్వీట్

Vikas Manda

ఇంతటి కఠిన సమయాల్లో మా ప్రాణాలను, మా కుటుంబాల ఆరోగ్యాన్ని మా కాపాడుతున్న తెలంగాణ పోలీసులకు అపారమైన కృతజ్ఞతలు. ఈ దేశం పట్ల, దేశంలోని ప్రజల పట్ల మీరు ప్రదర్శిస్తున్న నిస్వార్థమైన అంకితభావానికి నా సెల్యూట్" #TelanganaPolice #StayHomeStaySafe అంటూ మహేశ్ ట్వీట్....

Advertisement

Andhra Pradesh: గుడ్ న్యూస్! ఆంధ్రప్రదేశ్‌లో ఈరోజు నమోదు కాని కరోనావైరస్ కేసులు, గత 12 గంటల్లో నమోదైన కేసుల సంఖ్య 0, రాష్ట్రంలో కేసులు తగ్గుముఖం పడుతున్నాయన్న అధికారులు

Vikas Manda

రాష్ట్రంలో బుధవారం ఒక్కరోజే సాయంత్రం వరకు 34 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 348గా ఉంది. అయితే ఇందులో 9 మంది ఇప్పటికే పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.....

India Lockdown: ఒక్కసారిగా లాక్‌డౌన్ ఎత్తివేయలేం, కోవిడ్-19 సంక్షోభం తర్వాత మునిపటిలా జీవితం ఉండకపోవచ్చు, అఖిలపక్షం సమావేశంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు, 11న సీఎంలతో టెలి కాన్ఫరెన్స్

Vikas Manda

ఇప్పటికే చాలా రాష్ట్రాలు లాక్డౌన్ పొడగింపుపై కోరుతున్నాయి. దీనిపై రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంప్రదింపులు జరుపుతామని ప్రధాని తెలిపారు. ఏదేమైనా లాక్డౌన్ ముగించే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఏప్రిల్ 11న మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. అనంతరం లాక్డౌన్ కొనసాగింపుపై కేంద్రం నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

COVID-19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో 15 కొత్త కేసులు నమోదు, రాష్ట్రంలో 329కి చేరిన కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య, ఇకపై గంటలోపే వైరస్ నిర్ధారణ ఫలితాలు తెలిసేలా అందుబాటులోకి టెస్టింగ్ కిట్లు

Vikas Manda

విశాఖపట్నంలోని మెడ్ టెక్ జోన్ (Med Tech Zone) కరోనావైరస్ నిర్ధారణ కిట్లను (Testing Kits) అతి త్వరలో అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపింది. సుమారు 500 టెస్టింగ్ కిట్ లను సీఎం జగన్ చేతుల మీదుగా లాంచ్ చేయనున్నట్లు తెలిపింది.....

IRCTC Suspends Bookings: ఐఆర్‌సీటీసీ కీలక నిర్ణయం, ఏప్రిల్ 30 వరకు రైల్వే టికెట్ల ఆన్‌లైన్‌ బుకింగ్ రద్దు, రైల్వే నిర్ణయంతో లాక్‌డౌన్ పొడిగింపుపై పరోక్ష సంకేతాలు వచ్చినట్లేనా..?

Hazarath Reddy

దేశంలో కరోనావైరస్ (Coronavirus) విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం (Central Govt) దాని కట్టడికి చర్యలను తీసుకుంది. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది. మార్చి 24 నుంచి 21 రోజుల పాటు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ (India Lockdown) విధించిన సంగతి తెలిసిందే. అది ఈ నెల 15తో ముగిసిపోనుంది. ఆ తర్వాత రైళ్లు, విమానాలు తిరుగుతాయని భావిస్తున్నవారికి ఇండియన్ రైల్వే (Indian Railways) ఝలక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

Advertisement

AP CM YS Jagan Review: ఏపీలో కరోనా కేసులు తగ్గే అవకాశం, కరోనా నివారణ చర్యలపై సమీక్షలో సీఎంకి తెలిపిన అధికారులు, ర్యాండమ్‌ పరీక్షలపై దృష్టి పెట్టాలని తెలిపిన ఏపీ సీఎం జగన్

Hazarath Reddy

రాష్ట్రంలో కరోనావైరస్ (coronavirus on AP) ఆందోళనకరంగా మారుతున్న నేపథ్యంలో కరోనా నివారణా చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (Chief Minister YS Jagan Mohan Reddy) మంగళవారం సమీక్ష నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి (Special Chief Secretary KS Jawahar Reddy), ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సంధర్భంగా రాష్ట్రంలో నమోదైన పాజిటివ్‌ కేసుల వివరాలను అధికారులు సీఎంకు అందించారు.

COVID-19 Under YSR Aarogyasri: ఉచితంగా మెరుగైన వైద్యం, ఆరోగ్యశ్రీ పరిధిలోకి కరోనా, మొత్తం 15 రకాల చికిత్సలు ఆరోగ్యశ్రీ పరిధిలోకి.., ఏపీలో 304కి చేరిన కరోనా కేసులు

Hazarath Reddy

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కరోనా మహమ్మారి ( Coronavirus in Andhra Pradesh) రోజురోజుకు విస్త‌రిస్తోన్న నేప‌థ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ (AP CM YS jagan) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి (YSR Aarogyasri) కరోనా వైద్య సేవ‌ల‌ను తీసుకొస్తూ ఏపీ స‌ర్కార్ (AP Govt) సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

COVID-19 in India: దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 354 కొత్త కోవిడ్-19 కేసులు నమోదు, భారతదేశంలో 4,421 దాటిన కరోనావైరస్ పాజిటివ్ కేసులు, ఇప్పటివరకు 114 మరణాలు నమోదైనట్లు వెల్లడి

Vikas Manda

భారతదేశంలోనే మొట్టమొదటి కరోనావైరస్ కేసులను నమోదు చేసి, గత వారం వరకు కూడా మహారాష్ట్రతో సరి సమానంగా నిలిచిన కేరళ రాష్ట్రం ఇప్పుడు పరిస్థితులను కొంతవరకు మెరుగుపరుచుకుంది. ఇక్కడ కొత్తగా వచ్చే COVID-19 కేసుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. ఇప్పటివరకు కేరళలో 387 కేసులు నమోదయ్యాయి. అటు తరువాత తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ఉత్తర ప్రదేశ్ మరియు రాజస్థాన్.....

Corona Cases in AP: మళ్లీ 14 కొత్త కేసులు, ఏపీలో 266కి చేరుకున్న కరోనావైరస్ కేసులు, ఇద్దరు మృతి, ఐదుగురు రికవరీ

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) తాజాగా మరో 14 కరోనావైరస్‌ పాజిటివ్‌ కేసులు (Corona Cases in AP) నమోదయ్యాయి. దీంతో సోమవారం ఉదయం నాటికి రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 266కు చేరింది. కొత్తగా నమోదైన 14 కేసుల్లో విశాఖలో 5, అనంతపురంలో 3, కర్నూలులో 3, గుంటూరులో 2, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక కేసు నమోదైంది. ఇప్పటి వరకు ఐదుగురు కరోనా మహమ్మారి నుంచి కోలుకోగా, ఇద్దరు మృతి (Coronavirus Deaths) చెందారు.

Advertisement
Advertisement