ఆంధ్ర ప్రదేశ్

Jagan Slams Chandrababu: 5 నెలలు దాటినా సూపర్ సిక్స్ లేదు, దోచుకో.. పంచుకో.. తినుకో.. ఇదే చంద్రబాబు పాలన అంటూ మండిపడిన వైఎస్ జగన్

Hazarath Reddy

ఏపీలో ఇసుక పాలసీపై తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ శుక్రవారం మాట్లాడారు. చంద్రబాబు పాలనలో డీపీటీ మాత్రమే కనిపిస్తుందని వైఎస్సార్‌సీపీ అధినేత ధ్వజమెత్తారు. కూటమి పాలనలో డీపీటీ అంటే దోచుకో.. పంచుకో.. తినుకో అన్న చందంగా మారిందని మండిపడ్డారు.

YS Sharmila: ఉచిత బస్సు అమలు ఏది?, సీఎం చంద్రబాబును ప్రశ్నించిన వైఎస్ షర్మిల, బస్సులో ప్రయాణించిన ఏపీ కాంగ్రెస్ చీఫ్

Arun Charagonda

ఏపీ సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. బస్సులో ప్రయాణించిన షర్మిల...ఏపీ లో బాబు అధికారం లోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్నా ఉచిత బస్సు అమలు లేదంటూ ప్రశ్నించారు.

Borugadda Anil Arrest: రాజమండ్రి సెంట్రల్ జైలుకు బొరుగడ్డ అనిల్, కోర్టు 14 రోజులు రిమాండ్ విధించిందని తెలిపిన గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్

Hazarath Reddy

రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఏపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌ బొరుగడ్డ అనిల్ కుమార్ నీ అరెస్టు చేశామని,రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపుతున్నామని గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. అతనికి 14 రోజులు రిమాండ్ విదించడం జరగింది

New Liquor Policy in AP: ఏపీలో ఇక రూ.99ల క్వార్టర్ బాటిల్ వచ్చేసింది, ఈ నెలలో కోటి ఇరవై లక్షల సీసాలు రెడి అవుతున్నట్లు వెల్లడించిన ఎక్సైజ్ అధికారి నిశాంత్ కుమార్

Hazarath Reddy

రాష్ట్ర ఎక్సైజ్ అధికారి మందు బాబులకు గుడ్ న్యూస్ అందిస్తూ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విధంగా రూ.99లకు క్వార్టర్ బాటిల్ మద్యం అందుబాటులోకి వచ్చిందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ సంచాలకులు నిశాంత్ కుమార్ తెలిపారు.

Advertisement

Andhra Pradesh Shocker: హైదరాబాద్‌లో ప్రేమ పుట్టింది, గుంటూరులోని రైల్వే పట్టాలపై విషాదంగా ముగిసింది, రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్యలో కీలక విషయాలు

Hazarath Reddy

గుంటూరు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రేమజంట రైలుకింద పడి ఆత్మహత్య చేసుకుంది. మృతులను పెదకాకాని గ్రామానికి చెందిన దానబోయిన మహేశ్ (22), నందిగామ మండలం రుద్రవరానికి చెందిన నండ్రు శైలజ (21)లుగా గుర్తించారు.

Andhra Pradesh: ములకల చెరువులో ఆంజనేయ స్వామి ఆలయాన్ని ధ్వంసం చేసింది వీళ్లే, మీడియా ముందు ప్రవేశపెట్టిన జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు

Hazarath Reddy

అన్నమయ్య జిల్లా మొలకల చెరువు సమీపంలోని కనుగొండ అటవీ ప్రాంతంలో ఉన్న అభయహస్త ఆంజనేయ స్వామి ఆలయాన్ని ఈనెల 14వ తేదీన ధ్వంసం చేసిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని మీడియా ముందు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ప్రవేశపెట్టారు.

Guntur Shocker: గుంటూరులో దారుణం, రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని మృతదేహాలు, ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసుల అనుమానం!

Arun Charagonda

గుంటూరు పెద్దకాకాని రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ట్రాక్ పై గుర్తించారు స్థానికులు. ఆత్మహత్య చేసుకున్న వారిని ప్రేమ జంటగా అనుమానించగా ఘటన స్థలి సమీపంలో ద్విచక్ర వాహనం మరియు లగేజీ బ్యాగులు లభ్యం అయ్యాయి. చనిపోయిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.

Weather Forecast: ఏపీకి వాతావరణ శాఖ మరో హెచ్చరిక, బంగాళాఖాతంలో అక్టోబర్ 22న అల్పపీడనం, ఇప్పటికే భారీ వర్షాలతో విలవిల

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని భారీ వర్షాలు వీడటం లేదు. ఇప్పటికే వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు, రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు దంచికొట్టాయి. తడ వద్ద వాయుగుండం తీరం దాటింది, ఈ ముప్పు వీడిందని ప్రజలు భావిస్తుండగా, వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది.

Advertisement

Visakhapatnam: విశాఖపట్నంలో 150 కేజీల గంజాయి సీజ్, కారులో తరలిస్తుండగా ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు, కారు సీజ్

Arun Charagonda

అక్రమంగా తరలిస్తున్న 150 కేజీల గంజాయిని పట్టుకున్నారు పడమట సీఐ పవన్ కిషోర్. తమిళనాడుకు చెందిన రమేష్ వినేష్ కుమార్, కుమరన్ మేరీ మూర్తి, అనే ఇద్దరు వ్యక్తుల దగ్గర సుమారు 150 కిలోలు గంజాయిని సిఐ పవన్ కిషోర్ స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం నుండి చెన్నైకి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Pottel Movie Promotion in Plane: విమానంలో ‘పొట్టేల్‌’ మూవీ ప్రమోషన్.. పాల్గొన్న నటి అనన్య నాగళ్ల (వైరల్ వీడియో)

Rudra

యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల లీడ్‌ రోల్స్‌ చేస్తున్న చిత్రం ‘పొట్టేల్‌’. సాహిత్‌ మోత్ఖూరి దర్శకుడు. నిశాంక్‌ రెడ్డి కుడితి, సురేష్‌ కుమార్‌ సడిగె నిర్మాతలు.

Weather Update in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న వర్షాలు.. వచ్చే వారం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా

Rudra

తెలుగు రాష్ట్రాలపై వరణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు, రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు, తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.

Atla Tadde 2024: అట్ల తద్దె 2024 తేదీ, శుభ సమయాలు ఇవిగో, వివాహిత స్త్రీలు జరుపుకునే సాంప్రదాయ పండుగ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోండి

Vikas M

అట్ల తద్ది అనేది తెలుగు ప్రజల సాంప్రదాయ పండుగ.ఆశ్వయుజ మాసం బహుళ తదియ రోజున అట్ల తద్ది (Atla Tadde 2021) అని పిలుస్తారు. ముఖ్యంగా ఈ రోజు ఆడపడుచులు అందరు ఓ చోటకు చేరి చెట్లకు ఊయల కట్టి ఊగుతారు. "అట్ల తద్ది ఆరట్లు..ముద్దపప్పు మూడట్లు" అంటూ పాటలు పాడుతూ ఆడపడుచులకు, బంధువులకు, ఇరుగుపొరుగు వారికి వాయినాలిస్తారు.

Advertisement

CPI Narayana: వీడియో ఇదిగో, క్వార్టర్ రూ.99 అని చెప్పి 180 రూపాయలకి అమ్ముతారా, వైన్స్ షాపుకి వెళ్లి ధరలను అడిగి తెలుసుకున్న సీపీఐ నారాయణ

Hazarath Reddy

సరసమైన ధరలు.. నాణ్యమైన సారాయి.. సారాయే పనికిమాలినది. అందులో నాణ్యత ఏముంటుంది? అంటూ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సెటైర్లు విసిరారు. విజయవాడ దుర్గాపురంలోని వైన్ షాపును పరిశీలించిన నారాయణ..

Andhra Pradesh: వీడియో ఇదిగో, గుడివాడలో ఇళ్ళ మధ్య లిక్కర్ షాపు పెట్టిన నిర్వాహకులు, వెంటనే తీసేయాలంటూ రోడ్డెక్కిన మహిళలు

Hazarath Reddy

నివాసాల మధ్య వైన్ షాప్ పెట్టడాన్ని నిరసిస్తూ రోడ్డుపై ధర్నా నిర్వహించిన గ్రామస్తులు. గుడివాడ బేతవోలు సెంటర్లోని గుడివాడ విజయవాడ ప్రధాన రహదారి ప్రక్కనే ఉన్న ఒక షాపులో ఈరోజు ఉదయం నూతనంగా మద్యం షాపును ఏర్పాటు చేశారు.వైన్ షాపు ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ స్థానికులు రోడ్డుపై ధర్నా నిర్వహించారు .

Sajjala Ramakrishna Reddy: టీడీపీ ఆఫీస్‌పై దాడి జరిగిన రోజు నేను అక్కడ లేను, మంగళగిరి పీఎస్‌లో విచారణకు హాజరైన సజ్జల రామకృష్ణారెడ్డి

Hazarath Reddy

టీడీపీ కూటమి కక్ష సాధింపు చర్యలకు దిగిందని వైఎస్సార్‌సీపీ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని.. ఇష్టానుసారం సంఖ్యను పెంచుకుంటూ పోతున్నారంటూ ఆ పార్టీ సీనియర్‌ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.

YS Jagan Slams CM Chandrababu: 4 నెలల్లోనే ఈ ప్రభుత్వం వద్దు బాబు అంటున్నారు, దేశంలోకెల్లా నంబర్‌ వన్‌ పార్టీగా మనం ఎదుగుతామంటూ వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

జగన్‌ మాట్లాడుతూ.. అధికారం ఈరోజు ఉండొచ్చు.. లేకపోవచ్చు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలన్నారు అధికారం కోసం చంద్రబాబు అబద్ధాలకు రెక్కలు కట్టారని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం టీడీపీ నేతలు ప్రజల్లోకి వెళ్లే పరిస్థితులు లేవన్నారు.

Advertisement

Andhra Pradesh Rains: ఉప్పాడ తీరంలో సముద్రం అల్లకల్లోలం, పలు తీరాల్లో పెద్ద ఎత్తున ఎగసిపడుతున్న రాకాసి అలలు, భారీ వర్షాలతో ఏపీ విలవిల

Hazarath Reddy

వాయుగుండం ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి జిల్లా తడ వద్ద వాయుగుండం తీరాన్ని దాటినట్లు వాతావరణశాఖ వెల్లడించింది. గడిచిన 6 గంటలుగా 22 కి.మీ వేగంతో కదిలి తీరాన్ని తాకినట్లు తెలిపింది.

Kuppam TDP Leader Khadar Basha: మరో టీడీపీ నేత రాసలీలలు వీడియో ఇదిగో, పింఛన్ ఇప్పిస్తానంటూ గాజుల ఖాదర్‌ బాషా నన్ను లైంగికంగా అనుభవించాడంటూ వీడియో ద్వారా తెలిపిన యువతి

Hazarath Reddy

ఏపీలో మరో టీడీపీ నేత రాసలీలలకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్‌ బాషా రాసలీలలు బహిర్గతమయ్యాయి. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, కుప్పం టీడీపీ పరిశీలకుడిగా ఉన్న గాజుల ఖాదర్‌ బాషా అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో యువతిపై లైంగిక దాడికి పాల్పడిన విషయం బయటకు వచ్చింది.

Andhra Pradesh: ప్రత్తిపాడులో చంద్రబాబుకు షాక్, వైసీపీలో చేరిన టీడీపీ కీలక నేత ముదునూరి మురళీకృష్ణంరాజు

Hazarath Reddy

Andhra Pradesh: ఏపీలో ఇంకా అభివృద్ధికి దూరంగానే గ్రామాలు, నిండు గర్భిణికి నొప్పులు రావడంతో డోలీలోనే 6 కిలోమీటర్లు మోసుకువెళ్లిన బందువులు

Hazarath Reddy

Advertisement
Advertisement