ఆంధ్ర ప్రదేశ్
CJI DY Chandrachud: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ చంద్రచూడ్, గర్బాలయంలో ప్రత్యేక పూజలు చేస చంద్రచూడ్..వీడియో ఇదిగో
Arun Charagondaతిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు భారత సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్ద స్వాగతం పలికారు టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి. గర్భాలయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు జస్టిస్ చంద్రచూడ్. రంగనాయకుల మండపంలో జస్టిస్ కు ఆశీర్వచనం అందించారు పండితులు.
IIFA 2024 Awards: బాలయ్య కాళ్లకు నమస్కరించి తన సింప్లీసిటీ చాటుకున్న అందాల తార ఐశ్వర్యరాయ్.. వైరల్ వీడియో
Rudraటాలీవుడ్ అగ్రనటుడు నందమూరి బాలకృష్ణ కాళ్లకు బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ నమస్కరించారు. అబుధాబిలో జరిగిన ఐఫా ఉత్సవం-2024లో ఈ ఘటన చోటుచేసుకుంది.
Leopard found at Tirumala: తిరుమల మెట్ల మార్గంలో మరోసారి చిరుత కలకలం.. భయంతో కంట్రోల్ రూమ్‌లోకి పరుగులు తీసిన సెక్యూరిటీ సిబ్బంది (వీడియో)
Rudraకలియుగ ప్రత్యక్ష దైవం ఆ ఏడు కొండల వెంకన్నను దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకునేందుకు ఎక్కడెక్కడి నుండో భక్తులు రోజూ తరలి వస్తుంటారు. కొండపైకి భక్తులు నడక మార్గంలో వెళ్లడానికే ఇష్టపడతారు. అయితే గత ఏడాది నుండి నడకమార్గంలో వెళ్తున్న భక్తులను చిరుతలు భయాందోళనకు గురి చేస్తున్నాయి.
Rajinikanth Reaction On Tirumala Laddu: తిరుమల లడ్డూ వ్యవహారంపై సూపర్ స్టార్ రజనీకాంత్ రియాక్షన్ చూశారా? వెట్టయాన్ ప్రమోషన్ లో రజనీ ఏం చెప్పాడంటే?
VNSఈ విషయంలో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే పలువురు స్పందించారు. తాజాగా ఇదే అంశంపై సూపర్ స్టార్ రజనీకాంత్‌ని ప్రశ్నించగా.. సమాధానం చెప్పేందుకు ఆయన పెద్దగా ఆసక్తి కనబరచలేదు.
SIT Team Visits Tirumala: తిరుమలలో సిట్ టీం, కల్తీ నెయ్యిపై విచారణ..వీడియోలు ఇవిగో
Arun Charagondaతిరుమల లడ్డూ లో వినియోగించిన నెయ్యి లో జంతువుల కొవ్వు, ఇతర పదార్థాలు ఉన్నాయని దానిపై విచారణ కు రాష్ట్ర ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. తొమ్మిది మంది సభ్యులతో కూడిన సిట్ బృందం ఈరోజు తిరుపతి లోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహానికి చేరుకుంది.
RK Roja On Chandrababu: శ్రీవారి మీదే నమ్మకం లేకుండా చేశారు, ఫేక్ రిపోర్టుతో డిఫెన్స్‌లోకి చంద్రబాబు, దేవుడు శిక్ష వేసిన బాబుకు బుద్దిరాలేదన్న మాజీ మంత్రి రోజా
Arun Charagondaఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి రోజా. చెన్నైలో మీడియాతో మాట్లాడిన రోజా.. తిరుమలలో వెయ్యికాళ్ల మండపాన్ని కూల్చాడంతో అదే తిరుమలలో చంద్రబాబు కు బాంబ్ బ్లాస్ట్ జరిగి.. దేవుడు శిక్ష వేసిన బుద్దిరాలేదన్నారు. చంద్రబాబు తన విధానాలతో వెంకటేశ్వర స్వామి మీదే నమ్మకం లేకుండా చేశాడన్నారు. ఇలాంటి దరిద్రపు రాజకీయాలు దేశంలో ఏ రాజకీయ నేత చేయలేదు అని దుయ్యబట్టారు.
CM Chandrababu On Religions: ఏపీలో త్వరలో కొత్త చట్టం, ఏ మతాలకు చెందిన మందిరాల్లో వారే పనిచేయాలన్న సీఎం చంద్రబాబు, ఆలయాల్లో అన్యమతస్థులు ఉండటానికి వీల్లేదని వెల్లడి
Arun Charagondaఏపీలో త్వరలో కొత్త చట్టం తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు సీఎం చంద్రబాబు. ప్రార్థనా మందిరాలు, చర్చిలు, మసీదుల్లో ఆయా మతాలకు సంబంధించిన వారే పనిచేయాలన్నారు.
Harish Rao: తెలంగాణ భవన్ కు చేరుకున్న సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు.. హైడ్రా మూసీ బాధితులతో మాట్లాడనున్న మాజీ మంత్రి (వీడియో)
Rudraహైడ్రా మూసీ బాధిత కుటుంబాలు శనివారం ఉదయం నుంచి తెలంగాణ భవన్ కు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో కాసేపటి క్రితం తెలంగాణ భవన్ కు చేరుకున్న సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు.. కాసేపట్లో వారితో మాట్లాడి వారి సమస్యలను వినబోతున్నారు. ఇప్పటికే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అక్కడికి చేరుకున్నారు.
HYDRA Notices to Shilpa Mohan Reddy: వైసీపీ నేత, మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డికి 'హైడ్రా' నోటీసులు.. సంగారెడ్డి జిల్లాలోని నల్లవాగును కబ్జా చేసి వెంచర్ వేసినట్లు గుర్తింపు
Rudraఏపీ మాజీ మంత్రి, వైఎస్సాఆర్ సీపీ నేత శిల్పా మోహన్ రెడ్డికి హైడ్రా నోటీసులు జారీ చేసింది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నాగ్సన్ పల్లిలోని నల్లవాగును ఆయన ఆక్రమించి వెంచర్ వేసినట్లు హైడ్రా అధికారులు గుర్తించారు.
Jagan Press Meet: దర్శనానికి వెళ్తుంటే అడ్డుకోవడం దేశంలో ఇదే మొదటిసారి, ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తోందంటూ మండిపడిన వైఎస్ జగన్
Hazarath Reddyతన రాజకీయ జీవితంలో ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి అయిన తాను తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి వెళ్తుంటే అడ్డుకునే ప్రయత్నం చేశారని అన్నారు.
Jagan Cancels Tirupati Visit: జగన్ తిరుమల పర్యటన రద్దు, తిరుపతి పర్యటన పూర్తి వివరాలపై కాసేపట్లో ప్రెస్‌మీట్ నిర్వహించనున్న వైసీపీ అధినేత
Hazarath Reddyవైసీపీ అధినేత జగన్ తిరుమల పర్యటన అనూహ్య రీతిలో రద్దయింది. ఈ సాయంత్రం కాలినడకన తిరుమల చేరుకుని, రేపు (సెప్టెంబరు 28) స్వామివారి దర్శనం చేసుకోవాలని జగన్ భావించారు.
Andhra Pradesh: షాకింగ్ వీడియో, వాగు దాటేందుకు బాలింత కష్టాలు, భుజంపై మోసి పెద్దేరు వాగును దాటించిన కుటుంబ సభ్యులు
Hazarath Reddyవాగు దాటేందుకు బాలింత కష్టాలు...అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం సుందరికొండలో బాలింతను ఆస్పత్రికి తీసుకువెళ్ళేందుకు అవస్థలు పడిన కుటుంబ సభ్యులు. ప్రమాదకర పరిస్థితుల్లో బాలింతను భుజంపై మోసి, పెద్దేరువాగు దాటించిన కుటుంబ సభ్యులు. ప్రభుత్వం స్పందించి తమ గ్రామానికి బ్రిడ్జ్ నిర్మించాలని కోరుతున్న గ్రామస్తులు
Andhra Pradesh: చంద్రబాబుపై ప్రేమతో ఓట్లు వేయలేదు, జగన్‌పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత వల్లే ఓట్లు పడ్డాయి, చంద్రబాబు విజయంపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyవైసీపీ అధినేత జగన్ పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత వల్లే చంద్రబాబుకు ఓట్లు పడ్డాయని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. కూటమి పార్టీలపై ప్రేమతో ఓట్లు పడలేదని ఆమె చెప్పారు. చంద్రబాబు సీఎంగా వద్దు అనుకున్న ఓటర్లు కూడా 38 శాతం మంది ఉన్నారని అన్నారు
Tirupati Laddu Row: టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి కనిపించడం లేదు, పోస్టర్లు రిలీజ్ చేసిన బీజేపీ నేత, ఆచూకీ తెలిపిన వారికి బహుమతి అంటూ ప్రకటన
Arun Charagondaతిరుమల లడ్డూ వ్యవహారంలో టీటీడీ మాజీ EO ధర్మా రెడ్డి కనబడుట లేదని పోస్టర్లు వెలిశాయి. బీజేపీ నేత నవీన్ రెడ్డి...ధర్మారెడ్డి కనిపించడం లేదని ఆయన ఆచూకీ తెలిపిన వారికి రూ.1116/- బహుమతి ఇస్తానని ప్రకటించారు. తిరుమల లడ్డూ వివాదంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతుంటే.. జవహర్ రెడ్డి, ధర్మారెడ్డి మాత్రం తేలు కుట్టిన దొంగల్లా దాక్కున్నారని తెలిపారు బీజేపీ నేత.
Tirupati Laddu Row: మనకేం కావాలి...భావోద్వేగాలను రెచ్చగొట్టి .. రాజకీయ లబ్ధిని సాధించటమా..? ఎక్స్ వేదికగా ప్రశ్నించిన ప్రకాశ్ రాజ్, సున్నితంగా సమస్యను పరిష్కరించుకోలేమా అని పోస్ట్
Arun Charagondaతిరుపతి లడ్డూ వ్యవహారంలో సినీ నటుడు ప్రకాశ్ రాజ్ వరుస ట్వీట్‌లు చేస్తూనే ఉన్నారు. లడ్డూ వ్యవహారంపై తాను చేసిన ట్వీట్‌ను పవన్ కళ్యాణ్ అపార్థం చేసుకున్నారని ప్రస్తుతం తాను విదేశాల్లో ఉన్నానని వచ్చాక రిప్లై ఇస్తానని చెప్పిన ప్రకాశ్ రాజ్ జస్ట్ ఆస్కింగ్ అంటూ వరుస ట్వీట్లతో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
Jagan Tirumala Visit Update: జగన్ తిరుమల పర్యటన, వైసీపీ నేతలు హౌస్ అరెస్ట్, తిరుపతి జిల్లాలో సెక్షన్ 30 అమల్లోకి, ఐదేళ్లు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన నేతను అడ్డుకుంటారా అంటూ భూమన ఆగ్రహం
Hazarath Reddyమాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తిరుమల పర్యటన నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ నేతల హౌస్ అరెస్ట్ జరిగింది. తిరుపతికి ఎవరూ రావద్దంటూ వైఎస్సార్‌సీపీ నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నారు
Tirupati Laddu Row: తిరుమల లడ్డూ వివాదం.. సిట్ ఏర్పాటుపై జీవో విడుదల, సిట్‌కు సహకరించాలని హోంశాఖ-దేవాదాయ శాఖ-టీటీడీ ఈవోకు ఆదేశాలు
Arun Charagondaఏపీలో తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వివాదంలో సిట్ ఏర్పాటు పై ప్రభుత్వం జీవో విడుదల చేసింది. సిట్ చీఫ్ గా సర్వశ్రేష్ఠ త్రిపాఠిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ సిట్ సభ్యులుగా గోపీనాథ్ శెట్టి,హర్షవర్ధన్రాజు, వెంకట్రావు, సీతారామరాజు, శివ నారాయణ స్వామి, సత్యనారాయణ, సూర్య నారాయణ, ఉమామహేశ్వర్లును నియమించింది.
Parliamentary Standing Committee: పార్లమెంటరీ కమిటీల్లో వైసీపీ ఎంపీలకు చోటు, రవాణా టూరిజం సాంస్కృతిక శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఎంపీ విజయసాయిరెడ్డి
Hazarath Reddyఆర్థిక శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా వైవీ. సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి.. విదేశాంగ శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా వైఎస్ అవినాష్ రెడ్డి, రవాణా టూరిజం సాంస్కృతిక శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఎంపీ విజయసాయిరెడ్డిలకు చోటు దక్కింది.
Tirupati Laddu Row- Ram Mandir's Big Move: తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో అయోధ్య రామ మందిరం కీలక నిర్ణయం.. బయటి సంస్థలు తయారుచేసిన ప్రసాదాలపై ఆలయంలో నిషేధం
Rudraతిరుమల శ్రీవారి లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో అయోధ్య రామ మందిరం నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
Notices To YCP Leaders: తిరుమలకు వైఎస్ జగన్, వైసీపీ నాయకులకు పోలీస్ నోటీసులు, అవాంఛనీయ సంఘటనలు జరిగితే చర్యలు తప్పవని హెచ్చరిక
Arun Charagondaతిరుమలలో వైయస్ జగన్ పర్యటన సందర్బంగా కడప జిల్లా నేతలకు నోటీసులు జారీ చేశారు పోలీసులు. అవాంఛనీయ ఘటనలు జరిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు పోలీసులు. జిల్లా వ్యాప్తంగా ఉన్న వైసీపీ నేతలు నోటీసులు జారీ చేశారు పోలీసులు.