ఆంధ్ర ప్రదేశ్

Attack on Namburu Sankara Rao: వీడియో ఇదిగో, వైసీపీ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మీద కర్రలతో టీడీపీ శ్రేణుల దాడి

Hazarath Reddy

వరద ముంపు ప్రాంతాల పర్యటనకు వస్తున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మీద కర్రలతో టీడీపీ శ్రేణులు దాడి చేశారు. పల్నాడు జిల్లాలోని అమరావతి మండలంలో వరద ముంపు ప్రాంతాల పర్యటనకు బయలుదేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావుపై టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయి.

Andhra Pradesh Rains: వీడియోలు ఇవిగో, ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగును దాటుతూ కొట్టుకుపోయిన యువకులు, ఏపీలో పలు జిల్లాల్లో ఘటనలు

Hazarath Reddy

ఏపీని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగును దాటుతూ పలువురు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా వాగు దాటుతున్న యువకుడు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.

Eluru Car Fire Video: వీడియో ఇదిగో, ఏలూరు వెళుతూ మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైన కారు, తృటిలో ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికులు

Hazarath Reddy

ఏలూరు జిల్లా భీమడోలు మండలం పానసానిపల్లి సమీపంలో కారు దగ్ధం అయింది. రాజమండ్రి నుండి విజయవాడ వెళ్తున్న సమయంలో పోనసానిపల్లి దాటిన తర్వాత ఏసీ నుండి పొగలు వచ్చాయి. కొద్దిసేపటికి మంటలు చెలరేయి కారు పూర్తిగా దగ్ధమైంది. కారులో ఉన్న వారు అప్రమత్తమై దిగిపోవడంతో ప్రమాదం తప్పింది.

Vijayawada Landslide: వీడియో ఇదిగో, విజయవాడలో కొండచరియలు విరిగిపడి ఒకరు మృతి, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు

Hazarath Reddy

భారీ వర్షాల కారణంగా విజయవాడలో ఇటీవల కొండచరియలు విరిగిపడి ఐదుగురు మరణించిన ఘటన మర్చిపోకముందే మరోమారు అలాంటి ఘటనే జరిగింది. మాచవరం వద్ద కొండచరియలు విరిగిపడడంతో ఓ వ్యక్తి మరణించగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

Advertisement

Ganesh Immersion Tragedy: వినాయక నిమజ్జనంలో అపశృతి.. వినాయకుడి విగ్రహం మీదపడి ఇద్దరు యువకులు మృతి

Rudra

కడపలోని వీరపునాయునిపల్లె మండలం మొగమూరు వాగులో ఘోరం జరిగింది. వినాయక నిమజ్జనం చేస్తున్న సమయంలో వినాయకుడి విగ్రహం మీదపడి ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను వంశీ, రాజాగా గుర్తించారు.

Viral Video: కళ్ల ముందే మద్యం సీసాలను ధ్వంసం చేస్తుంటే భరించలేకపోయిన మందుబాబులు.. ఎగబడి ఎత్తుకెళ్లిన వైనం.. గుంటూరులో ఘటన (వీడియో వైరల్)

Rudra

గుంటూరు జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. వివిధ కేసుల్లో పట్టుబడిన రూ. 50 లక్షల విలువైన మద్యాన్ని పోలీసులు సోమవారం ఏటూకూరు రోడ్డులోని డంప్ యార్డులో ధ్వంసం చేశారు.

Vijayawada Floods: వీడియో ఇదిగో, విజయవాడలో వరద బాధితులపై చేయి చేసుకున్న వీఆర్వో సస్పెండ్, ఆహారం అందలేదని ప్రశ్నించినందుకు చెంప పగలగొట్టిన జయలక్ష్మి

Hazarath Reddy

విజయవాడలో వరద బాధితులపై చేయి చేసుకున్న వీఆర్వో జయలక్ష్మి తీరుపై ప్రభుత్వం సీరియస్‌ అయింది. వీఆర్వోను విధుల నుంచి తప్పిస్తున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్‌ సృజన వెల్లడించారు. ఆమెకు షోకాజ్‌ నోటిసులు ఇచ్చినట్లు తెలిపారు.

Ganesh Idol with Jaggery: వీడియో ఇదిగో, 20 వేల కేజీల బెల్లంతో వినాయకుడు, గాజువాకలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న గణపతి విగ్రహం

Hazarath Reddy

విశాఖ పట్నంలోని గాజువాకలో ప్రత్యేకమైన గణపతి విగ్రహం కనువిందు చేస్తోంది. 20 వేల కేజీల బెల్లంతో వినాయకుడుని తయారు చేశారు. దీని తయారీకీ సుమారు రెండు నెలల సమయం పట్టింది.

Advertisement

Andhra Pradesh Rains: వరద బాధితుల కోసం రూ. 31 వేలు విరాళం ఇచ్చిన చిన్నారులు, ఈ రోజును గొప్పగా మార్చిందంటూ సీఎం చంద్రబాబు ట్వీట్

Hazarath Reddy

ఈ వీడియో నిజంగా నా విషయంలో ఈ రోజును గొప్పగా మార్చింది. చిన్నారులు పెద్ద వాళ్లకు కూడా ఆదర్శం. విద్యార్థుల్లో ఇలాంటి ఉదాత్తమైన విలువలను పెంపొందించడం పట్ల స్కూలు యాజమాన్యాన్ని అభినందిస్తున్నాను. దయగల, బాధ్యతగల పౌరుల నేతృత్వంలోని మంచి భవిష్యత్తును ఇలాంటి సంఘటనలు వాగ్దానం చేస్తాయంటూ 'X' లో పోస్ట్ చేశారు.

Hari Babu Kambhampati: కంభంపాటి హరిబాబుకు తీవ్ర అస్వస్థత, శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఉండగా హఠాత్తుగా అనారోగ్యం

Hazarath Reddy

మిజోరం రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్ పర్యటనలో ఉన్న ఆయన శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఉండగా హఠాత్తుగా అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. దీంతో ఆయనను వెంటనే ఎయిర్ పోర్ట్ నుంచి గచ్చిబౌలిలోని స్టార్ ఆసుపత్రికి తరలించారు. ఆయనను తరలించడం కోసం ఎయిర్ పోర్ట్ నుంచి ఆసుపత్రి వరకు గ్రీన్ ఛానల్ ను ఏర్పాటు చేశారు

MLA Koneti Adimulam Case Update: సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం కేసులో కీలక మలుపు, గుండె నోప్పిగా ఉందని‌ వైద్య పరీక్షలకు సమయం కోరిన బాధితురాలు

Hazarath Reddy

సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై నమోదైన అత్యాచార కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తనపై ఎమ్మెల్యే అత్యాచారం చేశారంటూ కేసు పెట్టారు వరలక్ష్మి… ఇక, కేసు విచారణలో భాగంగా వరలక్ష్మికి వైద్య పరీక్షలు నిర్వహించాలని‌ పోలీసులు భావించారు..

Andhra Pradesh Rains: వీడియో ఇదిగో, భారీ వరదలకు ఉదృతంగా ప్రవహిస్తోన్న కొండ కాలువ, గర్భిణిని ట్రాక్టర్‌పై వాగు దాటించిన గిరిజనులు

Hazarath Reddy

ఏపీలో వర్షాలు దంచి కొడుతున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాను భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. అక్కడ కొండ కాలువ పొంగి పొర్లుతోంది.రంపచోడవరం మండలం చెరువు నిమ్మలపాలెం వద్ద కొండ కాలువ ఉదృతంగా ప్రవహిస్తోంది.

Advertisement

Andhra Pradesh Rains: వీడియో ఇదిగో, కొల్లేరు సరస్సులోకి దూసుకెళ్లిన ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ వాహనం, తృటిలో తప్పిన పెను ప్రమాదం

Hazarath Reddy

కొల్లేరు సందర్శనకు వెళ్లిన ఎమ్మెల్యే కామినేనికి తృటిలో ప్రమాదం తప్పింది. ఏలూరు జిల్లా కైకలూరు మండలం పందిరిపల్లి గూడెం వద్ద కొల్లేరులోకి కామినేని శ్రీనివాస్ వాహనం దూసుకెళ్లింది. అధికారులు, నాయకుల అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది.

Red Alert for Andhra Pradesh: ఏపీకి రెడ్ అలర్ట్, మరో 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారనున్న వాయుగుండం, స్కూళ్లకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

Hazarath Reddy

బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. మరో 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారనుందని ఐఎండీ వెల్లడించింది. దీంతో రానున్న 48 గంటల పాటు ఉత్తర కోస్తాలో అత్యంత భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Red Alert for Budameru: ‘బుడమేరు’ పరివాహక ప్రాంతంలో రెడ్ అలర్ట్.. ఏ క్షణమైనా వరద ముంచెత్తే ప్రమాదం.. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని అధికారుల హెచ్చరిక

Rudra

బుడమేరుకు మరోసారి వరద ముప్పు పొంచి ఉందని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించారు.

Clay Craftsman Ganesh: మట్టి గణపతిని చూశాం.. ఇప్పుడు కుండల తయారీలో బిజీగా ఉన్న గణపయ్యను చూడండి మరి..! (వీడియో ఇదిగో)

Rudra

పర్యావరణానికి మేలు చేసే మట్టి గణపతుల గురించి విన్నాం. చూశాం. అయితే, కుండలు తయారుచేస్తున్నట్టుగా ఉన్న వినాయకుడిని చూశారా? అయితే, నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని వెంకటేశ్వర కాలనీ వాసులు వినూత్నంగా రూపొందించిన కుండల తయారీలో బిజీగా ఉన్న గణపయ్యను చూడాల్సిందే.

Advertisement

Chocolate Ganesha: తియ్యని వేడుక చేసుకుందాం అంటున్న చాక్లెట్ వినాయకుడు.. అనంతపురం జిల్లా ఉరవకొండలో వినూత్న గణనాథుడు (వీడియో)

Rudra

వెరైటీ రూపాల్లో దర్శనమిస్తూ భక్తులను ఆకట్టుకుంటున్నారు గణనాథులు. అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని అంబేద్కర్ నగర్ లో చాక్లెట్ వినాయకుడు కొలువుదీరాడు.

Heavy Rains in Coastal AP: ఉత్తరాంధ్రలో ఎడతెరిపి లేని వానలు.. పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు.. నేడు విద్యాసంస్థలకు సెలవు

Rudra

భారీ వర్షాలతో ఉత్తరాంధ్ర వణికిపోయింది. శనివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, అల్లూరి జిల్లాలు అతలాకుతలమయ్యాయి.

Air Quality: మన నల్గొండలో స్వచ్ఛమైన గాలి.. కేంద్ర ప్రభుత్వం అవార్డు.. అసలెందుకు ఈ అవార్డు ఇచ్చారంటే?

Rudra

పెరుగుతున్న జనాభా, పారిశ్రామికీకరణ, అడవుల నరకివేత వెరసి వాతావరణ కాలుష్యం అంతకంతకూ పెరిగిపోతున్నది. దీంతో గాలి నాణ్యత పడిపోతున్నది. అయితే, గాలి నాణ్యత మెరుగుపరచడంలో తెలంగాణలోని నల్గొండ సత్తా చాటింది.

Andhra Pradesh: వినాయక చవితి వివాదం, ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ, రెండు గ్రామాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు..వీడియో ఇదిగో

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం లో వినాయక చవితి సందర్భంగా ఇద్దరు యువకుల ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఈ వివాదం కాస్త చిలికి చిలికి గాలి వానగా మారి రెండు గ్రామాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Advertisement
Advertisement