ఆంధ్ర ప్రదేశ్

Andhra Pradesh Shocker: తాడిపత్రిలో దారుణం, బైక్ పై వస్తున్న వ్యక్తిని రాళ్లతో దాడి చేసి హత్య చేసిన దుండగులు..వీడియో

Arun Charagonda

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. పడమటగేరి వీధిలో బైక్‌పై వస్తున్న వ్యక్తి పై కొందరు దుండగులు రాళ్లతో దాడి చేసి అత్యంత దారుణంగా హత్య చేశారు. మృతుడు నూరుల్లా స్టీల్ ప్లాంట్ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు

Gurucharan Passes Away: టాలీవుడ్ లో విషాదం.. ‘ముద్దబంతి నవ్వులో మూగబాసలు..’ వంటి హిట్‌ సాంగ్స్ అందించిన పాటల రచయిత గురు చరణ్‌ ఇకలేరు

Rudra

టాలీవుడ్ కు చెందిన నిన్నటి తరం ప్రముఖ గీత రచయిత గురుచరణ్‌ (77) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన ఆనారోగ్యంతో బాధపడుతున్నారు.

Telugu States Weather Update: మొన్నటి విలయానికి ఇంకా కోలుకోకముందే తెలంగాణ, ఏపీకి ముంచుకొస్తున్న మరో ముప్పు.. రానున్న రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరికలు

Rudra

ఇటీవలి భారీ వర్షాలతో అతలాకుతలం అయిన తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు పొంచి ఉన్నది. గత పది రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ఇరు రాష్ట్రాలు ఇంకా పూర్తిగా కోలుకోనే లేదు.

Ram Mohan Naidu: ఆసియా పసిఫిక్‌ సభ్యదేశాల ఛైర్మెన్‌గా కింజరాపు రామ్మోహన్‌నాయుడు, ఏకగ్రీవంగా ఎన్నికైన కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి

Hazarath Reddy

ఆసియా పసిఫిక్‌ సభ్యదేశాల ఛైర్మన్‌గా కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఎన్నికయ్యారు. ఢిల్లీలో జరుగుతున్న రెండవ ఆసియా-పసిఫిక్‌ మంత్రుల స్థాయి సదస్సులో బుధవారం ఆయన ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. రామ్మోహన్‌నాయుడి పేరును సింగపూర్‌ ప్రతిపాదించగా భూటాన్‌ బలపరిచింది.

Advertisement

Tirupati Road Accident: తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, అధిక వేగంతో వెళ్తూ అదుపుతప్పి కారుపై పడిన కంటైనర్‌ లారీ, నలుగురు మృతి

Hazarath Reddy

తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అధిక వేగంతో వెళ్తున్న కంటైనర్‌ లారీ అదుపుతప్పి కారు, బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 4గురు మృతిచెందారు.

Andhra Pradesh Shocker: వీడియో ఇదిగో, వారణాసి ఆశ్రమంలో ఏపీకి చెందిన ఇద్దరు అన్నదమ్ములు ఉరివేసుకుని ఆత్మహత్య, వీళ్లే మా చావుకు కారణం అంటూ సెల్ఫీ వీడియో

Hazarath Reddy

వారణాసిలోAndhra Pradeshకి చెందిన ఇద్దరు అన్నదమ్ములు ఆశ్రమంలో ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. వారిద్దరినీ ఏలూరు జిల్లా ఉంగుటూరుకు చెందిన లక్ష్మీనారాయణ, వినోద్ గా గుర్తించారు.

Andhra Pradesh Shocker: వినాయక మండపం వద్ద డీజే సౌండ్ గొడవ, కత్తితో ఓ వ్యక్తి హల్‌చల్, సౌండ్ ఎక్కువ పెట్టొద్దని చెప్పిన వినకపోవడంతో కత్తితో దాడి.. వీడియో

Arun Charagonda

హిందూపురంలో కత్తితో వ్యక్తి వీరంగం సృష్టించాడు. శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలోని లక్ష్మీపురంలో శ్రీహరి అనే వ్యక్తి కత్తితో బీభత్సం సృష్టించాడు. తన తల్లి ఆరోగ్యం బాగోలేదని, వినాయకుడి మండపం వద్ద డీజే సౌండ్ ఎక్కువ పెట్టొద్దని చెప్పినా వినకపోవడంతో కత్తికి పనిచెప్పాడు

Vijayawada Floods: వీడియో ఇదిగో, విజయవాడ వరదలతో ఇంకా తీరని కష్టాలు, ప్రభుత్వం అందించే ఆహారం కోసం ఎగబడ్డ జనాలు

Hazarath Reddy

విజయవాడలో వరదలు మిగిల్చిన కష్టాలు ఇంకా పలు ప్రాంతాలను వెంటాడుతున్నాయి. ముఖ్యంగా సింగ్ నగర్, సుందరయ్య నగర్, రాధానగర్, కండ్రిగ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇంట్లోని వంట సామాన్లు, గ్యాస్ స్టవ్లు పాడైపోవడంతో పది రోజులుగా పొయ్యి వెలిగించలేని స్థితిలో ప్రజలు ఉన్నారు.

Advertisement

MLA Koneti Adimulam Video Case: ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక ఆరోపణల కేసులో మరో ట్విస్ట్, పోలీసులు పెట్టిన కేసును కొట్టేయాలని కోర్టులో క్యాష్ పిటిషన్

Hazarath Reddy

సత్యవేడు టీడీపీ సస్పెండెడ్‌ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక ఆరోపణల కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. వేధింపులు వెలుగులోకి రాగానే చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆదిమూలం. తాజాగా డిశార్జి అయ్యి ఇంటికి చేరుకున్నారు.

Cancer Patient Last Wish: దేవర సినిమా చూసి చనిపోతా..క్యాన్సర్ పేషంట్ చివరి కోరిక, అప్పటివరకు బతికించండని విన్నపం

Arun Charagonda

దేవర సినిమా చూసి చనిపోతా..సినిమా విడుదలయ్యే వరకు నన్ను బతికించండని ఓ క్యాన్సర్ పేషంట్ చివరి కోరిక కోరాడు. టీటీడీ కాంట్రాక్ట్ డ్రైవర్ కౌశిక్(19)కు బోన్ క్యాన్సర్ అని నిర్దారించారు డాక్టర్లు. జూనియర్ ఎన్టీఆర్‌కు వీరాభిమాని అయిన కౌశిక్‌.. దేవర సినిమా విడుదలయ్యే వరకు తనను బతికించమని కోరారు. తన కొడుకు ట్రీట్‌మెంట్‌కు రూ.60 లక్షలు ఖర్చ అవుతుందని దాతలు సహాయం చేయాలని వేడుకుంటున్నారు కుటుంబ సభ్యులు

Rain Alert: మరో వాయుగుండం, తెలుగు రాష్ట్రాలకు తప్పని వర్షం ముప్పు, భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక!

Arun Charagonda

ఇప్పటికే కురిసిన ఎడతెరపిలేని వర్షాలతో తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దయ్యాయి. తాజాగా వాతావరణ శాఖ మరో అలర్ట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాలకు మరో వాయుగుండం ముప్పు పొంచి ఉందని తెలిపింది. వాయుగుండం కారణంగా ఇవాళ ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది వాతావరణ శాఖ. ముఖ్యంగా కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

New Liquor Policy in AP: ఏపీలో అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త మద్యం పాలసీ, ఐదుగురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు, వివరాలను వెల్లడించిన మంత్రి కొల్లు రవీంద్ర

Hazarath Reddy

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, త్వరలోనే నూతన మద్యం విధానం అమల్లోకి రానుంది. పాత మద్యం పాలసీ ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో, నూతన మద్యం విధానంపై అధ్యయనానికి ఐదుగురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు.

Advertisement

Andhra Pradesh Road Accident: వీడియో ఇదిగో, ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం, జీడిగింజల లోడుతో వెళ్తున్న డీసిఎం వ్యాన్ బోల్తా, బస్తాల కింద పడి ఊపిరాడక ఏడు మంది మృతి

Hazarath Reddy

తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దేవరపల్లి మండలం చిన్నాయిగూడెం శివారు చిలకావారి పాకల వద్ద జీడిగింజల లోడుతో వెళ్తున్న డీసిఎం వ్యాన్ బోల్తా పడింది.

Andhra Pradesh: దేవరపల్లి ప్రమాదంపై సీఎం చంద్రబాబు, జగన్ దిగ్బ్రాంతి..బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చంద్రబాబు ప్రకటన

Arun Charagonda

తూర్పుగోదావరి జిల్లా, దేవరపల్లి మండలం, చిలకావారిపాకలు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. జీడిపిక్కల లోడ్‌తో వెళుతున్న లారీ అర్ధరాత్రి బోల్తాపడి ఏడుగురు మృతి చెందారు.

Jagan Slams CM Chandrababu: 60 మందిని పొట్టను పెట్టుకున్న బాబుపై కేసు ఎందుకు పెట్టరు? వైఎస్ జగన్ తీవ్ర వ్యాఖ్యలు, పాలన గాలికొదిలేసి రెడ్‌బుక్‌పైనే దృష్టి పెట్టారంటూ ఘాటు విమర్శలు

Hazarath Reddy

అక్రమ కేసులో అరెస్టై గుంటూరు జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను వైఎస్‌ జగన్‌ పరామర్శించి ధైర్యం చెప్పారు. అన్ని విధాలా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Case File Against Kodali Nani: కొడాలి నానిపై కేసు పెట్టిన ఆలూరు టిడిపి నేతలు, చంద్రబాబుని లోఫర్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు

Hazarath Reddy

మాజీ మంత్రి వైసీపీ నేత కొడాలి నాని ఆలూరు టిడిపి నేతలు కేసు పెట్టారు. ఆలూరు పోలీస్ స్టేషన్ కు చేరుకొని టిడిపి నేతలు సిఐ కి ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని లోఫర్ అంటూ కొడాలి నాని చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ కేసు పెట్టారు.

Advertisement

Ganesh Chaturthi 2024: వీడియో ఇదిగో, భక్తిని వదిలేసి రక్తిలో మునిగిన భక్తులు, తిరుపతి వినాయక మండపం వద్ద అశ్లీల నృత్యాలు, ఏడుగురుని అరెస్టు చేసిన పోలీసులు

Hazarath Reddy

తిరుపతి నగరం సప్తగిరి నగర్ లో వినాయకుడి మండపంలో విగ్రహం ముందు మంగళవారం రాత్రి యువతి, యువకులు అశ్లీల నృత్యాలు చేసిన ఘటనపై అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసి ఏడుగురును అరెస్టు చేశారు.

Viral Video: బొప్పాయిలో వినాయకుడు, జగ్గంపేటలో వినూత్న సంఘటన, వినాయకుడిని చూసేందుకు ఎగబడుతున్న జనం..వీడియో వైరల్

Arun Charagonda

కాకినాడ జిల్లా జగ్గంపేటలో బొప్పాయిలో దర్శనమిచ్చాడు లంబోదరుడు. గండేపల్లి మండలం నీలాద్రిరావు పేటలో గణపతి నవరాత్రుల పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్దకు అదే గ్రామానికి చెందిన ఒక భక్తుడు తన ఇంటి వద్ద ఉన్న బొప్పాయి చెట్టు మొట్ట మొదటిగా వినాయకుడికి నైవేథ్యంగా సమర్పించేందుకు కొట్టగా అందులో వినాయకుడి దర్శనం ఇచ్చాడు.

Sharmila Slams Chandrababu: చిన్న పిల్లల పాకెట్ మనీ తీసుకోవడం కాదు కేంద్రం నుండి 10 వేల కోట్లు తేండి.. సీఎం చంద్రబాబుపై వైఎస్ షర్మిల సెటైర్

Arun Charagonda

ఏపీ సీఎం చంద్రబాబుపై సెటైర్ వేశారు కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల. చిన్నపిల్లల పాకెట్ మనీ తీసుకోవడం కాదు‌‌‌ చంద్రబాబు గారు.. కేంద్రం నుండి10 వేల కోట్లు తీసుకు రండి అని ఎద్దేవా చేశారు. వరద బాధితులకు కనీసం లక్ష నష్టపరిహారం ఇవ్వాలి, తక్షణ సాయంగా‌... పదిహేను వేలు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు.

AP CM Chandrababu: ఉత్తరాంధ్రకు ఏపీ సీఎం చంద్రబాబు, వరద ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే,రైతులతో మాట్లాడనున్న టీడీపీ అధినేత.. షెడ్యూల్ ఇదే

Arun Charagonda

అకాల వర్షాలు ఏపీని ముంచెత్తిన సంగతి తెలిసిందే. ప్రధానంగా విజయవాడలోని బుడమేరు చెరువు పోటెత్తడంతో నగరం నీట మునగగా ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక బుడమేరు నుండి నీరు దిగువన ఉన్న కోల్లేరుకు చేరుకుంది. దీంతో ఉభయ గోదావరి జిల్లాలకు వరద పోటెత్తింది.

Advertisement
Advertisement