మైనర్ బాలికను పెళ్లి చేసుకోమని మోసగించిన ఉపాధ్యాయుడిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. చిత్తూరు జిల్లా గంగవరంలోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఉపాధ్యాయుడు చలపతి (33) 17 ఏళ్ల విద్యార్థినిని వివాహం చేసుకున్నాడు. బాలిక ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం (12వ తరగతి) చదువుతుండగా, అప్పటికే వివాహితుడైన ఉపాధ్యాయుడు ఆమెను మార్చి 29న పరీక్షలు ముగిసిన వెంటనే బెంగళూరుకు తీసుకెళ్లి అక్కడ వివాహం చేసుకున్నాడు.
Vastu Tips: వాస్తు ప్రకారం ఇంటికి ఎన్ని ద్వారాలు ఉండాలి,
బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు చలపతిపై లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద కేసు నమోదు చేసి మార్చి 31న అరెస్టు చేశారు. బొమ్మనపల్లె గ్రామానికి చెందిన చలపతికి అదే గ్రామానికి చెందిన బాలికతో మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. వీరికి ఒక కొడుకు ఉన్నాడు. అతని భార్య ప్రస్తుతం గర్భవతిగా ఉంది. అయినప్పటికీ చలపతి తన స్టూడెంట్ ను పెళ్లి చేసుకోవడం పట్ల బంధువర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కేసు పోలీసుల విచారణలో ఉంది.