Supreme Court (Credits: X)

Newdelhi, Jan 11: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును (Supreme Court) సామాన్య ప్రజలు కూడా సందర్శించేందుకు అవకాశం వచ్చింది. ప్రజలకు (Guided Tours) మరింత చేరువ కావడంతోపాటు సుప్రీంకోర్టు పట్ల వారికి అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ అవకాశం కల్పిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు. ఈ భవనంలోని ప్రతి విభాగం గురించి, దాని చారిత్రక విశిష్టత గురించి అధికారులు తెలియజేస్తారన్నారు. అయితే, నిర్దిష్ట  సమయాలు, రోజుల్లో మాత్రమే ఈ అవకాశం ఉంటుందని గుర్తుచేశారు.

గుండెపోటుతో 8 ఏళ్ల బాలిక మృతి.. గుజరాత్ అహ్మదాబాద్ లో ఘటన (వీడియో)

ఎప్పుడు అనుమతిస్తారు?

ప్రతి నెలా ఒకటో, మూడో శనివారాల్లో ప్రజలు సుప్రీంకోర్టును సందర్శించవచ్చు. అయితే, ఆ రోజుల్లో ప్రభుత్వ సెలవులు ఉంటే ఈ అవకాశం ఉండదు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తీసుకెళ్లి, చూపిస్తారు. అయితే, సుప్రీం వీక్షణకు ముందుగా ఆన్‌ లైన్‌ లో బుక్‌ చేసుకోవడం తప్పనిసరి.

పల్లెకు బయల్దేరిన పట్నం.. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ.. సొంతూళ్లకు హైదరాబాద్‌ వాసుల పయనం... టోల్‌ గేట్ల వద్ద రద్దీ (వీడియో)