తెలంగాణ

Konda Surekha in Another Controversy: మ‌రో వివాదంలో మంత్రి కొండా సురేఖ‌, ఎస్సై సీట్లో కూర్చొని పోలీసుల‌కు వార్నింగ్, రేవూరీ Vs కొండా ఫ్లెక్సీ వార్ లో వివాదాస్ప‌దంగా మంత్రి తీరు

VNS

నాగచైతన్య- సమంత విడాకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ (Konda Surekha) ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నారు. తన వర్గీయులను అరెస్టు చేశారని స్వయంగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి మరి పోలీసులకే వార్నింగ్‌ ఇచ్చారు. ఆ సమయంలో ఎస్సైని నిలబెట్టి ఆ కుర్చీలో ఆమె కూర్చోవడంతో మరింత వివాదాస్పదంగా మారింది.

Harishrao: రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి ఏ పార్టీ వ్యక్తి...ఆయనకు చీఫ్ విప్ పదవా?,తీవ్రంగా మండిపడ్డ హరీష్ రావు

Arun Charagonda

చీఫ్ విప్ గా మహేందర్ రెడ్డి నియామకం రాజ్యాంగ విరుద్ధం. ? అన్నారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. మీడియాతో చిట్‌ చాట్‌గా మాట్లాడిన హరీశ్‌.. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తుందన్నారు. బిల్ పాస్ చేయించడం, ప్రభుత్వ బిజినెస్ జరిగేలా చీప్ విప్ బాధ్యత...మహేందర్ రెడ్డి ఇప్పుడు ఎవరికి విప్ ఇష్యూ చేస్తాడు?.. అధికార పార్టీ సభ్యులకా... ప్రతి పక్ష పార్టీ సభ్యులకా అని ప్రశ్నించారు.

Andhra Pradesh: హైదరాబాద్ - విజయవాడ హైవే పై రోడ్డు ప్రమాదం..రాంగ్‌రూట్‌లో వచ్చి కారును ఢీకొట్టిన టిప్పర్ లారీ, ఒకరు మృతి

Arun Charagonda

హైదరాబాద్ - విజయవాడ హైవే పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఐతవరం వద్ద రాంగ్ రూట్ లో వచ్చి కారుని ఢీకొట్టింది టిప్పర్ లారీ. ఈ ఘటనలో కారు డ్రైవర్ మృతి చెందగా హైవేపై కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అయింది.

Jagga Reddy: మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన కామెంట్స్, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటన,ఎవరు పోటీచేస్తారో చెప్పేసిన జగ్గారెడ్డి

Arun Charagonda

కాంగ్రెస్ నేత,మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన కామెంట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయను అని వెల్లడించారు. తన భార్య లేదా చేర్యాల ఆంజనేయులు పోటీ చేస్తారు అని తెలిపారు జగ్గారెడ్డి.

Advertisement

Telangana Cabinet Expansion: మంత్రివర్గ విస్తరణ ఆశావాహులకు నిరాశేనా...సీఎం రేవంత్ రెడ్డి మనస్సులో ఏముంది...ఈ దీపావళికైనా కేబినెట్ విస్తరణ ఉంటుందా?

Arun Charagonda

తెలంగాణ కేబినెట్ విస్తరణ ఎప్పుడు?, దసరా వచ్చింది పోయింది..కానీ కేబినెట్ విస్తరణ మాత్రం జరగలేదు..సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు జోరందుకుంటున్న ఆశావాహులకు మాత్రం నిరాశే ఎదురవుతోంది.

Warangal: గుండెపోటుతో కుప్పకూలిన యువకుడు, వరంగల్ నగరంలోని ఉర్సు రంగలీలా మైదానంలో ఘటన

Arun Charagonda

గుండెపోటుతో కుప్పకూలిన యువకుడికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు కానిస్టేబుల్. వరంగల్ నగరంలోని ఉర్సు రంగలీలా మైదానంలో ఘటన చోటుచేసుకుంది. రావణ వధ కార్యక్రమంలో జరిగిన తోపులాటలో గుండెపోటుకు గురయ్యాడు యువకుడు. సీపీఆర్ చేసి యువకుడి ప్రాణాలు కాపాడారు కానిస్టేబుల్ ఆసిఫ్.

Komatireddy Rajagopal Reddy Stunning Look: కొత్త లుక్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డంతో సర్‌ప్రైజ్ ఇచ్చిన మునుగోడు ఎమ్మెల్యే, మంత్రిపదవి కోసమేనని కామెంట్స్

Arun Charagonda

కాంగ్రెస్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏం చేసినా సంచలనమే. తాజాగా దసరా వేళ కొత్త లుక్‌లో దర్శనమిచ్చారు రాజగోపాల్ రెడ్డి. వైట్ గడ్డంలో రాజగోపాల్ రెడ్డిని చూసిన వారు అంతా షాక్ అవుతుండగా మంత్రి పదవి కోసమేనని టాక్ మొదలైంది.

Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీలో భారీ వర్షాలు, తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

Arun Charagonda

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 14,15,16 తేదీల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తుపాను వల్ల ముప్పు వాటిల్లకుండా అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అప్రమత్తం చేసింది ఏపీ హోం మంత్రి అనిత.

Advertisement

Violence at Devaragattu Karrala Samaram: మల్లన్న సాక్షిగా మరోసారి చిందిన రక్తం.. దేవరగట్టు కర్రల సమరంలో చెలరేగిన హింస.. 92 మందికి గాయాలు.. ముగ్గురి పరిస్థితి విషమం

Rudra

విజయదశమి సందర్భంగా మల్లన్న సాక్షిగా మరోసారి రక్తం చిందింది. కర్నూలు జిల్లా హోళగుంద మండలం దేవరగట్టులో బన్నీ ఉత్సవంలో మరోసారి రక్తపుటేరులు పారాయి.

Hyderabad: గుడి ముందు మాంసం ముక్క, తప్పుడు ప్రచారం చేయొద్దని పోలీసుల విజ్ఞప్తి..అవాస్తవాలను ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక

Arun Charagonda

హైదరాబాద్ - మాసాబ్ ట్యాంక్ ప్రాంతంలో నిన్న మధ్య రాత్రి ఒక గుడి ముందు రోడ్డు పైన ఓ ప్రాణి యొక్క మాంసం పడి ఉందని సమాచారం రాగానే పోలీసు అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేశారు. అయితే పక్కనే ఉన్న చెత్త పదార్తాల నుంచి ఒక వీధి కుక్క.. ఆ మాంసం ముక్కను నోట్లో పట్టుకొని వెళ్ళేటప్పుడు ఆకస్మాతుగా రోడ్డుపైన గుడి ముందు పడేసి వెళ్ళింది అనే విషయం సీసీ టీవీ కెమెరాల ద్వారా తెలిసింది.

CM Revanth Reddy: కొండారెడ్డిపల్లి దసరా వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి, జమ్మిచెట్టు వద్ద ప్రత్యేక పూజలు, పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సీఎం

Arun Charagonda

సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి దసరాకు తన స్వగ్రామం కొండారెడ్డిపల్లికు వచ్చారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డికి ఘనస్వాగతం లభించింది. కొండారెడ్డిపల్లి గ్రామస్తుల ఆనందోత్సాహాల మధ్య శనివారం ముఖ్యమంత్రి దసరా పండుగ జరుపుకున్నారు. గ్రామస్తులంతా ఊరేగింపుగా జమ్మి చెట్టువద్దకు రాగా ముఖ్యమంత్రి గారు ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి జమ్మి పూజలో పాల్గొన్నారు. అంతకు ముందు వారు గ్రామంలోని శ్రీశ్రీశ్రీ కోట మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Alai Balai: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌ లో నేడు దత్తన్న ‘అలయ్ బలయ్’.. హాజరుకానున్న ప్రముఖులు

Rudra

హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌ లో నేడు అలయ్ బలయ్ కార్యక్రమం జరగనుంది.

Advertisement

CPI Narayana Fires On Nagarjuna: నాగార్జున పరువు బిగ్ బాస్ షోతో ఎప్పుడో పోయింది.. కొండా సురేఖపై పరువు నష్టం దావా వేయడం ఓ జోక్ లా ఉంది.. సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు

Rudra

తెలంగాణ మంత్రి కొండా సురేఖ తమ కుటుంబంపై చేసిన వ్యాఖ్యలపై సీనియర్ నటుడు నాగార్జున కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. దీనిపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యంగ్యంగా స్పందించారు.

50 Members Hospitalized in Narayanakhed: బావి నీళ్లు తాగి 50 మందికి తీవ్ర అస్వ‌స్థ‌త‌, ఇద్ద‌రు మృతి, ప‌లువురి ప‌రిస్థితి విష‌మం, మిష‌న్ భ‌గీర‌థ నీళ్లు రాక‌పోవ‌డంతో బావిలో నీరు తాగిన గ్రామ‌స్తులు, సంగారెడ్డి జిల్లా నారాయ‌ణ‌ఖేడ్ లో ఘ‌ట‌న‌

VNS

బావి నీళ్లు తాగిన 50 మంది తీవ్ర అస్వ‌స్థ‌త‌కు (50 Members Hospitalized) గుర‌య్యారు. నీళ్లు తాగిన కాసేప‌టికే వారంతా వాంతులు, విరేచ‌నాల‌కు గుర‌య్యారు. బాధితులంతా బీసీ కాల‌నీకి చెందిన వారు. స‌మాచారం అందుకున్న అధికారులు అప్ర‌మ‌త్త‌మై.. అస్వ‌స్థ‌త‌కు గురైన వారిని చికిత్స నిమిత్తం నారాయ‌ణ‌ఖేడ్‌లోనిప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించారు. అందులో ఇద్ద‌రు మృతి చెందారు.

Professor GN Saibaba Passes Away: మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా కన్నుమూత...నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

sajaya

ఢిల్లీ యూనివర్సిటీలో మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా కన్నుమూత.. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సాయిబాబా..నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాయిబాబా మృతి..

Jani Master Mother: జానీ మాస్టర్ తల్లికి గుండెపోటు...కొడుకు జైలుకు వెళ్లడంతో బెంగతో ఉన్న తల్లి బీబీ ఖాన్ కు తీవ్ర అస్వస్థత..

sajaya

బ్రేకింగ్ న్యూస్...జానీ మాస్టర్ తల్లికి గుండెపోటు...జానీ మాస్టర్ జైలుకు వెళ్లడంతో బెంగతో ఉన్న తల్లి బీబీ ఖాన్ గుండెపోటుకు గురైంది. ఆమెను నెల్లూరులోని బొల్లినేని ఆస్పత్రికి తరలించగా ఐసీయూలో చికిత్స పొందుతుంది.

Advertisement

CM Revanth Reddy Dussehra Celebrations: సొంతూరు కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్‌ రెడ్డి... తొలిసారి స్వగ్రామంలో సీఎం హోదాలో రేవంత్‌ దసరా వేడుకలు...

sajaya

నాగర్‌ కర్నూల్‌: సొంతూరు కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్‌ రెడ్డి దసరా వేడుకలు. సీఎం హోదాలో తొలిసారి స్వగ్రామంలో రేవంత్‌ దసరా వేడుకలు. కొండారెడ్డిపల్లిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌ రెడ్డి.

Ponnam Prabhakar:దేశానికే ఆదర్శంగా బీసీ కులగణన, ప్రతి ఒక్కరూ సహకరించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్, కులగణన పూర్తయ్యాకే ఎన్నికలు

Arun Charagonda

సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై సర్వే కోసం తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 18 విడుదల చేసిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. దేశంలోనే ఆదర్శంగా ఉండేలా 60 రోజుల పాటు సర్వే కొనసాగుతుందని...బీసీ కులగణన అయ్యాకే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయన్నారు. కులగణనకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు పొన్నం.

Jagtial: వివాదంలో జగిత్యాల ఫారెస్ట్ అధికారులు, వన్యప్రాణి మాంసంతో పార్టీ, ప్రశ్నించిన మీడియాపై దురుసు ప్రవర్తన...వీడియో ఇదిగో జగిత్యాలలో ఫారెస్ట్ ఆఫీస్‌లో అధికారుల లిక్కర్ దావత్

Arun Charagonda

వన్య ప్రాణి మాంసంతో ఫారెస్ట్ ఆఫీసర్ల దసరా దావత్ చేసుకున్నారని అనుమానం జగిత్యాలో కలకలం రేపింది. నెమలి, అడవి పంది మాంసంగా అనుమానాలు, మాంసం శాంపిల్ తీసుకుని ల్యాబ్‌కి పంపిస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని..ఈ దావత్ కు హాజరైన జిల్లా ఫారెస్ట్ సిబ్బంది, కొందరు బీట్, సెక్షన్ ఆఫీసర్లు హాజరైనట్లు తెలుస్తోండగా ఇదేంటని ప్రశ్నించిన మీడియా పై దురుసుగా ప్రవర్తించారు ఆఫీసర్లు.

Ponnam Prabhakar: దసరా...ట్రాఫిక్ రూల్స్‌పై ప్రతిజ్ఞ చేపించిన మంత్రి పొన్నం ప్రభాకర్, మద్యం తాగి వాహనాలు నడపరాదని ప్రజలకు విన్నపం

Arun Charagonda

విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని హుస్నాబాద్ ప్రజల చేత ట్రాఫిక్ రూల్స్ పై ప్రతిజ్ఞ చేపించారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, మద్యం తాగి వాహనాలు నడపరాదని , మన ప్రాణాలను మనం రక్షించుకోవడానికి ఇతరులకు అపాయం కలగకుండా చూడడానికి స్వీయ రక్షణకై ప్రతిజ్ఞ చేపించారు.

Advertisement
Advertisement