తెలంగాణ

IMD Alert For Telangana: రాబోయే రెండో రోజుల పాటూ తెలంగాణ‌కు భారీ వ‌ర్ష‌సూచ‌న‌, హైద‌రాబాద్ స‌హా ఈ జిల్లాల‌కు అల‌ర్ట్ జారీ చేసిన ఐఎండీ

VNS

తెలంగాణలో రాగల మూడురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం (Heavy rains) ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (IMD Hyderabad) హెచ్చరించింది. వాయువ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా (Rain Alert) పయనిస్తుందని పేర్కొంది.

BFSI Skill Programme: నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్, మరో 35 వేల పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్‌, బీఎఫ్‌ఎస్‌ఐ స్కిల్‌ ప్రోగ్రామ్‌ ప్రారంభించిన తెలంగాణ ముఖ్యమంత్రి

Hazarath Reddy

Nara Lokesh: వాహనదారుడికి సారీ చెప్పిన మంత్రి లోకేశ్..ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటానని ట్వీట్..ఇంతకీ ఏం జరిగిందో తెలుసా?

Arun Charagonda

రెండు రోజుల క్రితం విశాఖలో పర్యటించారు మంత్రి నారా లోకేశ్. ఈ సందర్భంగా లోకేశ్‌ కాన్వాయ్‌లోని ఓ వాహనం రోడ్డు పక్కన నిలిపిన మరో కారును ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ విషయాన్ని ఎక్స్ ద్వారా లోకేశ్ దృష్టికెళ్లారు సదరు వాహనదారుడు.

Tension Erupt in Kamareddy: యూకేజీ చిన్నారిపై పీఈటీ టీచర్ దారుణం, స్కూలును ముట్టడించిన బంధువులు, ఆందోళనకారులపై పోలీసులు లాఠీఛార్జ్, సీఐ తలకు గాయం

Hazarath Reddy

కామారెడ్డిలోని జీవదాన్ పాఠశాల వద్ద ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి.ఆరేళ్ల చిన్నారిపై పీఈటీ టీచర్ అఘాయిత్యం ఘటన వెలుగులోకి వచ్చింది. UKG చదువుతున్న చిన్నారిపై పీఈటీ టీచర్ అత్యాచారానికి పాల్పడటంతో బంధువులు, పాప తల్లిదండ్రులు స్కూలు వద్ద ఆందోళనకు దిగారు

Advertisement

Accident Caught on Camera: షాకింగ్ వీడియో ఇదిగో, వేగంగా వచ్చి అదుపుతప్పి బైకును ఢీకొట్టిన కారు, ఎగిరి అవతల పడిన భార్యాభర్తలు, భార్యకు తీవ్ర గాయాలు

Hazarath Reddy

మెదక్‌లోని వెల్కమ్ బోర్డు వద్ద కారు బీభత్సం స‌ృష్టించింది. వేగంగా వస్తూ అదుపుతప్పి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో దంపతులు ఎగిరి అవతల పడ్డారు. మెదక్ మున్సిపాలిటీ మిషన్ భగీరథలో పనిచేస్తున్న సల్మాన్ కు అతని భార్యకు తీవ్ర గాయాలు అయ్యాయి.

KTR Inspection Of STP: మూసీ సుందరీకరణ పేరుతో వేల కోట్ల కుంభకోణం, పాకిస్తాన్ కంపెనీకి సుందరీకరణ పనులా?..కేటీఆర్ ఫైర్,హైడ్రాపై త్వరలో ఓ నిర్ణయం

Arun Charagonda

పబ్లి సిటీ స్టంట్లతో సీఎం రేవంత్ ఎక్కువ కాలం ప్రభుత్వాన్ని నడపలేరు అని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కూకట్‌పల్లి నియోజకవర్గంలోని ఫతేనగర్ లో నిర్మాణం పూర్తి చేసుకున్న ఎస్టిపిని సందర్శించింది బీఆర్ఎస్ బృందం. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్... మూసీ సుందరీకరణను సీఎం రేవంత్ పాకిస్తాన్ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని ఆరోపించారు.

R Krishnaiah To Joins Congress: కాంగ్రెస్‌లోకి ఆర్‌ కృష్ణయ్య?, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన కృష్ణయ్యతో ఎంపీ మల్లు రవి భేటీ

Arun Charagonda

మరో నాలుగేళ్లు ఉండగానే తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు ఆర్ కృష్ణయ్య. ఈ నేపథ్యంలో ఇవాళ కృష్ణయ్యతో భేటీ అయ్యారు నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి. విద్యానగర్‌లోని కృష్ణయ్య నివాసంలో మర్యాదపూర్వకంగా కలవగా వీరిద్దరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఆర్ కృష్ణయ్య కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జోరందుకుంది.

Telugu States Rain Alert: తెలుగు రాష్ట్రాలకు 3 రోజుల పాటు భారీ వర్ష సూచన, హైదరాబాద్ నగరంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరిక, ఎమర్జెన్సీ నంబర్లు ఇవే..

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ వర్షాల అలర్ట్ జారీ చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నట్లు విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్రం వెల్ల­డించింది.

Advertisement

Edupayala Vana Durga Bhavani Temple: నీట మునిగిన ఏడుపాయల వనదుర్గ భవాని ఆలయం, భారీ వర్షాలతో గర్బగుడిలోకి ప్రవేశించిన నీరు..వీడియో ఇదిగో

Arun Charagonda

మెదక్ లోని ఏడుపాయల వనదుర్గ భవాని ఆలయం రెండో రోజుల జలదిగ్బందంలోనే ఉంది. సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో గర్భగుడిలోనికి ప్రవేశించింది వరద. ఆలయం ఎదుట ఉదృతంగా ప్రవహిస్తుంది మంజీరా నది. దీంతో ఈ నెలలో 12 రోజులు ఆలయం మూతపడింది.

CM Revanth Reddy On Hydra Demolitions: ఓఆర్ఆర్ లోపల ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చేయాల్సిందే, బాధిత పేదలకు డబుల్ బెడ్ రూం ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి, పాతబస్తీ మెట్రోపై కీలక రివ్యూ

Arun Charagonda

హైదరాబాద్ మెట్రో, ఓఆర్ఆర్ లోపల ఉన్న అక్రమ నిర్మాణాలపై కీలక రివ్యూ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్‌లో ఆక్రమిత చెరువులు, నాలాలతో పాటు మూసీ పరివాహక ప్రాంతాల పరిధిలో నివసించే అర్హులైన పేదల వివరాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్. అర్హులైన పేదలు రోడ్డున పడే పరిస్థితి ఉండకూడదని, అలాంటి వారికి డబుల్ బెడ్రూమ్ లేదా ఇతర ప్రత్యామ్నాయం చూపించాలని చెప్పారు.

Centipede Found in Dal: వీడియో ఇదిగో, తాజ్ మహల్ హోటల్లో పప్పులో ప్రత్యక్షమైన జెర్రీ, GHMC అధికారులకు ఫిర్యాదు చేసిన కస్టమర్

Hazarath Reddy

హైదరాబాద్ అబిడ్స్లోని తాజ్ మహల్ హోటల్లో ఓ కస్టమర్ పప్పు ఆర్డర్ చేయగా, అందులో జెర్రీ దర్శనమిచ్చింది. దీంతో కస్టమర్లు హోటల్ యాజమాన్యాన్ని నిలదీశారు. పప్పు తిన్న వారి పరిస్థితి ఏంటని అడిగారు. హోటల్ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో కస్టమర్లు GHMC అధికారులకు ఫిర్యాదు చేశారు.

Hyderabad: మల్లంపేటలో దారుణం, మహిళను హత్య చేసి ఒంటిపై బంగారం దోచుకెళ్లిన దొంగ, సీసీ కెమెరాల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపిన ఏసీపీ

Hazarath Reddy

హైదరాబాద్ మల్లంపేటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మేడ్చల్ జిల్లా దుండిగల్ పీఎస్ పరిధిలోని మల్లంపేటలో మహిళను హత్య చేసి ఒంటిపై బంగారం దోచుకెళ్లాడు దుండగుడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న శారద (50)ను గొంతు నులిమి హత్య చేసి ఒంటిపై నగలు, సెల్ ఫోన్ దోచుకెళ్లాడు దొంగ.

Advertisement

Viral Video: వీడియో ఇదిగో, చేపల లారీ బోల్తా, ఏరుకునేందుకు ఎగబడిన స్థానికులు, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం

Hazarath Reddy

మహబూబాబాద్ జిల్లా మరిపెడలో చేపల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడడంతో వాటిని ఏరుకునేందుకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన చేపలను ఏరుకుని సంచుల్లో వేసుకుని తీసుకెళ్లారు. లారీ ఖమ్మం వైపు నుంచి వరంగల్ వెళ్తుండగా లారీ అదుపుతప్పి ఒక్కసారిగా బోల్తాపడింది.

Technical Glitch in Hyderabad-Tirupati Flight: హైదరాబాద్-తిరుపతి విమానం అత్యవసర ల్యాండింగ్.. ఒంటిమిట్ట సమీపంలో సాంకేతిక సమస్య .. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ (వీడియో)

Rudra

హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి 66 మంది ప్రయాణికులతో తిరుపతికి బయలుదేరిన విమానంలో ఒంటిమిట్ట సమీపంలో సాంకేతిక సమస్య తలెత్తింది.

Rain Alert: అల్పపీడనం ప్రభావం.. తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజులు అతి భారీ వర్షాలు

Rudra

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో, దక్షిణ కోస్తా, మయన్మార్ ప్రాంతాలలో ఏర్పడిన రెండు ఉపరితల ఆవర్తనాలు తూర్పు-పశ్చిమ ద్రోణితో కలిగి అల్పపీడనంగా మారాయి.

IT Raids in Kukatpally: బీఆర్‌కే న్యూస్‌ చానల్‌ అధినేత బొల్లా రామకృష్ణ ఇంట్లో ఐటీ సోదాలు.. సోదాల్లో పాల్గొన్న 8 మంది అధికారులు (వీడియో)

Rudra

హైదరాబాద్ లోని కూకట్ పల్లి రెయిన్ బో విస్టాస్ అపార్టమెంట్ లో అధికారులు ఐటీ సోదాలు చేస్తున్నారు. ఉదయం ఐదున్నర గంటల నుంచి వ్యాపారవేత్త బొల్లా రామకృష్ణ చౌదరి నివాసంలో తనిఖీలు చేపట్టారు.

Advertisement

Hyderabad: వీడియో ఇదిగో, ఖరీదైన మద్యం సీసాలలో చీప్ లిక్కర్, ప్రముఖుల పార్టీలకు సరఫరా చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు

Hazarath Reddy

ఖరీదైన మద్యం సీసాలలో చీప్ లిక్కర్ నింపి ప్రముఖుల పార్టీలకు సరఫరా చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేసిన సికింద్రాబాద్ ఎక్సైజ్ పోలీసులు.. నలుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసి వారి నుండి 4లక్షల విలువైన 40 మద్యం సీసాలు, 189కాళీ సీసాలను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలిస్తున్న ఎక్సైజ్ పోలీసులు.

Accident Caught on Camera: షాకింగ్ వీడియో, బస్సు నుంచి జారి చక్రాల కింద పడి మృతి చెందిన విద్యార్థి, బోరబండలో విషాదకర ఘటన

Hazarath Reddy

బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ విద్యార్థి బస్‌ చక్రాల కింద పడి దుర్మరణంపాలయ్యాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ ఫుటేజ్‌లో రికార్డ్ అయ్యాయి. వీడియోలో బాలుడు బస్సులో నుంచి రోడ్డు మీద పడిపోయాడు.

BRS MLAs Arrest at Gandhi Hospital: గాంధీ ఆసుప‌త్రి వ‌ద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరెస్ట్‌, పోలీసులకు, బీఆర్‌ఎస్‌ నాయకులకు మధ్య స్వల్వ తోపులాట

Hazarath Reddy

హైదరాబాదులోని గాంధీ ఆసుప‌త్రి వ‌ద్ద ఉద్రిక్త‌త నెల‌కొంది. ఆసుప‌త్రి లోప‌లికి వెళ్లేందుకు య‌త్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంజ‌య్‌, మాగంటి గోపీనాథ్‌ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Telangana: షాకింగ్ వీడియో ఇదిగో, బోట్ వెనక్కి వెళ్లి ఒక్కసారిగా మానేరు డ్యాం లో దూకిన మహిళ, అప్రమత్తమై లైఫ్ జాకెట్ విసిరిన బోట్ డ్రైవర్

Hazarath Reddy

నడుస్తున్న బోట్ లో నుంచి డ్యాం లోకి దూకింది వివాహిత. కరీంనగర్ మానేరు డ్యాం లో నడుస్తున్న బోట్ లో నుంచి ఓ వివాహిత డ్యాం మధ్యలోకి దూకింది. గత కొన్ని రోజులుగా డ్యాం లో నడుస్తున్నాయి టూరిస్ట్ బోట్లు. బోట్ స్పీడ్ పెంచగానే బోట్ వెనక్కి వెళ్లి ఒక్కసారిగా మహిళ నీటిలో దూకింది

Advertisement
Advertisement