తెలంగాణ
Balapur Murder Case: తన ప్రియురాలితో చాటింగ్ చేస్తున్నాడనే స్నేహితుడిని చంపేశాడు, బాలాపూర్ హత్యకేసు వివరాలను వెల్లడించిన పోలీసులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyబాలాపూర్ హత్యకేసును పోలీసులు ఛేదించారు. తన ప్రియురాలితో చాటింగ్ చేస్తున్నాడనే కారణంతో ప్రశాంత్‌ను నిందితుడు చంపేశాడని పోలీసులు తెలిపారు. బాలాపూర్‌లో ఇంజినీరింగ్ విద్యార్థి ప్రశాంత్(24) తన ప్రియురాలితో చాటింగ్ చేస్తున్నాడని కక్ష పెంచుకున్న మాధవ యాదవ్.. ఆరుగురు స్నేహితులతో కలిసి హత్య చేశాడని హైదరాబాద్ పోలీసులకు మీడియాకు తెలిపారు.
Cyber Crime Gang Arrested: భారీ సైబర్ ముఠాను పట్టుకున్న హైదరాబాద్ పోలీసులు, దేశవ్యాప్తంగా 983 కేసుల్లో ప్రమేయమున్న 36 మంది గ్యాంగ్ అరెస్ట్
VNSప్రధాన నిందితుడిపై ఎల్‌వోసీ (LOC) జారీ చేయగా, మిగతా ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు సీపీ వెల్లడించారు. నిందితుల నుంచి రూ. 10.08 లక్షల నగదు, వివిధ బ్యాంకు చెక్ పుస్తకాలు, 22 బ్యాంకు ఖాతాల డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నామన్నారు.
Road Accident: ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా.. 30 మందికి గాయాలు.. నల్గొండ జిల్లాలో ఘటన
Rudraనల్గొండ జిల్లా వేములపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జగిత్యాల నుంచి దర్శి వెళుతున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా కొట్టింది. అద్దంకి, నార్కెట్ పల్లి ప్రధాన రహదారిపై వేములపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది.
Heavy Rains in Telangana: నేడు తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ
Rudraతెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, నిజామాబాద్, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో భారీగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది.
Hyderabad Marathon 2024: హైదరాబాద్ మారథాన్-2024 ప్రారంభం.. జెండా ఊపి ప్రారంభించిన హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి
Rudraహైదరాబాద్ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్-2024 13వ ఎడిషన్ కాసేపటి క్రితం లాంఛనంగా ప్రారంభమైంది. నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా నుంచి గచ్చిబౌలి బాలయోగి స్టేడియం వరకు ఈ మారథాన్ కొనసాగనుంది.
Bhatti Reacted Demolition Of Hydra: ఏకంగా చెరువులోనే నిర్మాణాలు చేపడితే కూల్చివేయరా? హైడ్రా కూల్చివేతలను సమర్ధించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
VNSహైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతల (N Convention) వ్యవహారంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy Cm Bhatti Vikramarka) శనివారం స్పందించారు. హైదరాబాద్ అంటే లేక్స్, రాక్స్‌కు నెలవని.. వీటిని కాపాడుకోవాలంటూ పర్యావరణవేత్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారని గుర్తు చేశారు. చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేయడం వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు
Telangana Weather Update: తెలంగాణకు మరోసారి భారీ వర్ష సూచన, ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం, రెండు రోజులు అలర్ట్ జారీ
VNSతెలంగాణలో రాగల రెండురోజుల పాటు భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD) హెచ్చరించింది. శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే (Rain Alert) అవకాశం ఉందని పేర్కొంది.
Ranganath On N Convention Demolition: ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైడ్రా కమిషనర్ రంగనాథ్, చట్టప్రకారమే కూల్చివేతలని కామెంట్,కేటీఆర్ ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలన్న బీజేపీ ఎంపీ
Arun Charagondaఅక్రమ కట్టడాల కూల్చివేత తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. చెరువులు, కుంటలను ఆక్రమించిన వారిపై కొరడా ఝుళిపిస్తోంది హైడ్రా. ఇందులో భాగంగా ఇవాళ సినీనటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేసింది. ఉదయం భారీ బందొబస్తు నడుమ కూల్చివేత ప్రక్రియ కొనసాగించగా నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై స్టే విధించింది న్యాయస్థానం.
Andhra Pradesh Shocker: ప్రకాశం జిల్లా దర్శిలో విషాదం..ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థుల గల్లంతు, ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు
Arun Charagondaప్రకాశం జిల్లా దర్శి లో విషాదం నెలకొంది. దర్శి సమీపంలోని సాగర్ కాలువలో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు గల్లంతు అయ్యారు. గల్లంతు అయిన విద్యార్థులు పోతిరెడ్డి లోకేష్, బత్తుల మణికంఠ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి గా గుర్తించగా కొత్తపాలెం గ్రామానికి చెందిన పోతిరెడ్డి లోకేష్ మృతదేహం లభ్యం అయింది.మరో ఇద్దరు విద్యార్థులు మణికంఠ, కిరణ్ మృతదేహాలు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Fake Baba At Vikarabad: వికారాబాద్ పట్టణంలో దొంగ బాబా హల్చల్, డబ్బులు ఇవ్వకపోతే పాపం చుట్టుకుంటుందని బెదిరింపులు, దొంగబాబాకు దేహశుద్ది చేసిన స్థానికులు
Arun Charagondaవికారాబాద్‌లో దొంగబాబాకు దేహశుద్ది చేశారు స్థానికులు. మీ ఇంట్లో నరదృష్టి ఉంది దయ్యాలు ఉన్నాయి 500, 1000 రూపాయలు ఇవ్వండి మేము తాయత్తు ఇస్తాము దయ్యాన్ని మాయం చేస్తామంటూ నాలుగైదు రోజుల నుండి రాజీవ్ గృహకల్పాల్లో హల్చల్ చేస్తున్నాడు ఓ దొంగ బాబా.
Telangana Congress: ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌కు చుక్కెదురు, ఫేక్ మెంబర్ షిప్ ఎఫెక్ట్, వెంకట్ సభ్యత్వాన్ని హోల్డ్‌లో పెట్టిన యూత్ కాంగ్రెస్!
Arun Charagondaతెలంగాణ యూత్ కాంగ్రెస్ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. తాజాగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌కు చుక్కెదురైంది. వెంకట్ సభ్యత్వాన్ని హోల్డ్‌లో పెట్టింది యూత్ కాంగ్రెస్.
Police Case On BRS MLA Palla: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు నమోదు, బఫర్ జోన్‌లో అనురాగ్ యూనివర్సిటీ నిర్మించారని ఫిర్యాదు, కేసు నమోదు చేసిన పోలీసులు
Arun Charagondaబీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు నమోదైంది. బఫర్ జోన్‌లో అనురాగ్ యూనివర్సిటీ నిర్మించారని పల్లాపై కేసు నమోదు చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వెంకటాపురంలో ఉంది అనురాగ్ యూనివర్సిటీ. బఫర్ జోన్‌లో నిర్మాణాలు చేపట్టారని పోచారం పీఎస్‌లో ఇరిగేషన్ డిపార్టుమెంట్ ఈఈ పరమేశ్వర్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
Shock to Hero Nagarjuna: హీరో నాగార్జునకు హైడ్రా షాక్.. మాదాపూర్ లోని ఎన్-కన్వెన్షన్ సెంటర్ ను కూల్చేస్తున్న అధికారులు.. భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు.. చెరువును కబ్జా చేసి నిర్మించడమే కారణం.. (వీడియో)
Rudraప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు తెలంగాణ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. అక్కినేని హీరోకు చెందినా మాదాపూర్ లోని ఎన్-కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు.
Hyderabad Shocker: వీధి కుక్కని హతమార్చిన వ్యక్తి, స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఫిర్యాదుతో కేసు నమోదు..వీడియో వైరల్
Arun Charagondaరంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో దారుణం జరిగింది. వీధి కుక్కని దారుణంగా హతమార్చాడు ఓ వ్యక్తి. స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్‌లో ఈ ఘటన జరుగగా కుక్కని హింసించిన వీడియో వైరల్‌గా మారింది.
Telangana NRI Dies In Saudi Arabia: పనిచేయని జీపీఎస్, ఎడారిలో దారి తప్పి డీహైడ్రేషన్‌తో తెలంగాణ యువకుడి మృతి, కరీంనగర్‌లో విషాద చాయలు
Arun Charagondaజీపీఎస్ పనిచేయక తెలంగాణకు చెందిన ఓ యువకుడు సౌది అరేబియాలో మృతిచెందాడు. ఐదు రోజుల క్రితం స్నేహితుడి దగ్గరకు వెళ్లేందుకు జీపీఎస్ పెట్టుకుని కారులో బయలుదేరాడు షహబాజ్ ఖాన్.
KTR: మరికొద్దిసేపట్లో మహిళా కమిషన్ ముందుకు కేటీఆర్.. ఎందుకంటే?
Rudraబీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మరికొద్దిసేపట్లో తెలంగాణ మహిళా కమిషన్ ముందు హాజరు కానున్నారు.
BRS MLAs To Join Congress: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్, ఆ ఐదుగిరి ఎమ్మెల్యేల చేరిక లాంఛనమే, సీఎం రేవంత్ అనుకున్నది చేసేస్తున్నారా?
Arun Charagondaతెలంగాణలో మరో ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరనున్నారా?, కాంగ్రెస్ అధిష్టానంతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు ఫలించాయా?, అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటివరకు బీఆర్ఎస్ నుండి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా మరో ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు ఒప్పుకోవడంతో ఒక్కసారిగా పొలిటికల్ వాతావరణం హీటెక్కింది.
Telangana CS Orders: నెలకు ఒక్కసారైనా హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూళ్లలో కలెక్టర్లు రాత్రి బస చేయాలి.. సీఎస్ కీలక ఆదేశాలు
Rudraతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి కలెక్టర్ లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇకపై కలెక్టర్ లు తమ పరిధిలోని రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్లను తనిఖీ చేయాలని ఆదేశించారు.
Femina Miss India 2024: ఫెమినా మిస్ ఇండియా పోటీలకు తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు యువతులు.. మిస్ తెలంగాణగా ప్రకృతి కంభం.. మిస్ ఆంధ్రప్రదేశ్ గా భవ్యారెడ్డి
Rudraమరికొద్ది రోజుల్లో జరుగనున్న ఫెమినా మిస్ ఇండియా-2024 పోటీలకు తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు యువతులు ఎంపికయ్యారు.
KTR Complaint To DGP: తెలంగాణ డీజీపీకి కేటీఆర్ ఫిర్యాదు, రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ నేతలతో కలిసి కంప్లైంట్ చేసిన కేటీఆర్
VNSరాష్ట్ర డీజీపీ కార్యాలయంలో డీజీపీ జితేందర్‌ను బీఆర్ఎస్ (BRS) నాయకులు శుక్రవారం మధ్యాహ్నం కలిశారు. తుంగతుర్తి రైతులపై, నిన్న సీఎం రేవంత్ సొంతూరు కొండారెడ్డిపల్లిలో జర్నలిస్టులపై జరిగిన దాడులపై డీజీపీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR Complaint) ఫిర్యాదు చేశారు.