తెలంగాణ
Telangana: ప్రాణం తీసిన వాట్సాప్ చాటింగ్, 7వ తరగతి బాలికతో వాట్సాప్ ఛాట్ చేసిన 9వ తరగతి బాలుడు, కుటుంబ సభ్యులకు భయపడి గడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్య
Hazarath Reddyరోజు మనోజ్, పల్లవితో వాట్సాప్‌లో చాటింగ్ చేసేవాడు.. ఇది గమనించిన ఆమె కుటుంబసభ్యులు మనోజ్‌కు ఫోన్ చేసి బెదిరించారు. దీంతో భయపడిన మనోజ్ ఇంట్లో ఉన్న గడ్డి పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు ఖమ్మం ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు
Car Stunts On ORR: ఔటర్ రింగు రోడ్డుపై లగ్జరీ కార్లతో స్టంట్.. ఇద్దరి అరెస్టు.. పూర్తి వివరాలు ఇవిగో..!
Rudraహైదరాబాద్ ఓఆర్ఆర్ పై రెండు కార్లతో స్టంట్ చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.
BRS MLAs Defection Case: సుప్రీంకోర్టులో నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసు విచారణ.. తీర్పుపై సర్వత్ర ఉత్కంఠ
Rudraబీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొంది కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్న 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ తుది విచారణను జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం నేడు చేపట్టనుంది.
Manchu Manoj Hulchul: ‘నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారా?’.. తిరుపతి జిల్లా భాకర పేట పీఎస్ వద్ద హీరో మంచు మనోజ్ హల్ చల్ (వీడియోతో)
Rudraగత కొన్ని రోజులుగా కొనసాగుతున్న మంచు ఫ్యామిలీ వివాదం తారాస్థాయికి చేరింది. హీరో మంచు మనోజ్ ప్రతి రోజూ వార్తల్లో నిలుస్తూ మీడియా ముందుకొచ్చి మాట్లాడుతున్నారు.
TTD Tickets: తిరుమల శ్రీవారిని దర్శించాలనుకునే భక్తులకు అలర్ట్.. మే నెలకు సంబంధించి కోటా వివరాలు ఇవిగో..!
Rudraతిరుమల శ్రీవారి దర్శించాలనుకునే వారికి అలర్ట్ మెసేజీ ఇది. మే నెలలో దర్శనానికి సంబంధించిన టికెట్లు విడుదల చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సిద్ధమైంది.
Hyderabad: షాకింగ్ వీడియో, రోడ్డు పక్కన శిశువును వదిలి వెళ్లిన ఇద్దరు మహిళలు, పోచమ్మ తల్లి దేవాలయం వద్ద మగశిశువును వదిలి వెళ్లిన కసాయి మహిళలు
Hazarath Reddyసికింద్రాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భూదేవినగర్ సమీపంలోని పోచమ్మ తల్లి దేవాలయం వద్ద రాత్రి సమయంలో ఇద్దరు మహిళలు.. అప్పుడే పుట్టిన మగశిశువును రోడ్డు పక్కన వదిలి వెళ్లారు. నవజాత శిశువును గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు శిశువును నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు ఇవిగో..
Hyderabad: వీడియో ఇదిగో, స్టీల్ రింగ్‌ను వేలుకి పెట్టుకున్న బాలిక, 10 గంటల పాటు శ్రమించి రింగ్‌ను కట్ చేసి తొలగించిన ఫైర్ సిబ్బంది
Hazarath Reddyహైదరాబాద్ నగరంలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఓ బాలిక వేలుకి ఇరుకున్న రింగ్ ను 10 గంటలు పాటు శ్రమించి తొలగించారు గౌలిగూడ అగ్నిమాపక సిబ్బంది.హైదరాబాద్ టోలిచౌకి ప్రాంతానికి చెందిన దీపిక ఆడుకుంటూ ఓ స్టీల్ రింగ్‌ను వేలికి పెట్టుకుంది.
TGSRTC: హైదరాబాద్ నుండి బెంగుళూరు వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్, టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి టికెట్ ఛార్జీలో 10 శాతం రాయితీ
Hazarath Reddyతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) హైదరాబాద్ నుండి బెంగుళూరు వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్ తెలిపింది. తమ బస్సుల్లో ప్రయాణించే వారికి టికెట్ ఛార్జీలో 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ రాయితీతో ప్రయాణికులు రూ. 100 నుంచి రూ. 160 వరకు టికెట్ ఖర్చును ఆదా చేసుకోవచ్చు.
Ramzan 2025: ముస్లిం ఉద్యోగులు గంట ముందు ఆఫీసు నుండి వెళ్లిపోవచ్చు, రంజాన్ సందర్భంగా గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం, మార్చి 2 నుంచి మార్చి 31 వరకు వర్తింపు
Hazarath Reddyరంజాన్ (Ramzan) మాసం సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు (Muslim Employees) తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) శుభవార్తను తెలిపింది. రంజాన్ నెలలో ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు గంట ముందు తమ కార్యాలయాలు, పాఠశాలల నుంచి ఇంటికి వెళ్లడానికి అనుమతి ఇచ్చింది.
Telangana: దారుణం, భర్త అక్రమ సంబంధంతో మనస్తాపానికి గురై పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య, జగిత్యాల జిల్లాలో విషాదకర ఘటన
Hazarath Reddyవరకట్నపు వేధింపులు, వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో మనస్తాపానికి గురై.. ఈనెల 14న ఇద్దరు పిల్లలకు గడ్డి మందు తాగించి, తాను తాగి ఆత్మహత్య చేసుకుంది భార్య హారిక. ఈ ఘటనలో హారిక అక్కడిక్కడే ప్రాణాలు విడవగా.. మృత్యువుతో పోరాడి నిన్న రాత్రి మృతి చెందారు ఇద్దరు పిల్లలు కృష్ణాంత్(9), మాయంతలక్ష్మి(8).
Accident Caught on Camera: వీడియో ఇదిగో, జనగామ జిల్లాలో కారు బీభత్సం, మద్యం మత్తులో నలుగురు యువకులు ర్యాష్ డ్రైవింగ్ ఎలా ఉందో మీరే చూడండి
Hazarath Reddyతెలంగాణలోని జనగామ జిల్లాలో ఓ కారు బీభత్సం సృష్టించింది. జిల్లా కేంద్రంలో సూర్యాపేట రోడ్డులో అత్యంత ర్యాష్ డ్రైవింగ్ తో కార్ హల్ చల్ చేయడం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. మద్యం మత్తులో నలుగురు యువకులు అత్యంత వేగంతో కారు నడపడంతో అదుపు తప్పి రోడ్డుకు అడ్డం తిరుగుతూ దూసుకొచ్చింది
Suicide Selfie Video: ఆన్ లైన్ బెట్టింగ్ భూతం.. చనిపోతున్నానంటూ యువకుడి సెల్ఫీ వీడియో.. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలంలో ఘటన (వీడియో)
Rudraఆన్ లైన్ బెట్టింగ్ భూతం నిండు ప్రాణాలను బలికొంటున్నది. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం బంగారుపేటలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.
Baby Producer SKN’s Controversial Comments: తెలుగు అమ్మాయిలని ఎంకరేజ్ చేస్తే ఏం అవుతుందో తర్వాత తెలిసిందంటూ ‘బేబీ’ సినిమా నిర్మాత ఎస్కేఎన్ వివాదాస్పద వ్యాఖ్యలు (వీడియో)
Rudraతెలుగు నటీమణుల గురించి టాలీవుడ్ ప్రొడ్యూసర్, ‘బేబీ’ సినిమా నిర్మాత ఎస్కేఎన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆదివారం‘డ్రాగన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన ఎస్కేఎన్.. తాము తెలుగు వచ్చిన అమ్మాయిల కంటే తెలుగు రాని అమ్మాయిలనే ఎక్కువగా లవ్ చేస్తామని తెలిపారు.
KTR Letter To Nirmala Sitharaman: తెలంగాణ అప్పులపై నిర్మలా సీతారామన్‌కు కేటీఆర్ ఘాటు కౌంటర్, రాష్ట్రం ఎప్పటికీ మిగులు రాష్ట్రమే అంటూ లేఖ
VNSస్వాతంత్రం వచ్చిన నాటినుంచి 14 మంది ప్రధానులు 65 ఏళ్లలో 56 లక్షల కోట్లు అప్పు చేస్తే.. 2014 నుంచి 2024 వరకు కేవలం పదేళ్లలోనే రూ.125 లక్షల కోట్ల అప్పు చేసిన బీజేపీ ప్రభుత్వానికి అప్పులపై (Telangana Debits) మాట్లాడే నైతిక హక్కే లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
IMD Update: తెలంగాణలో ఈ సారి ఎండలు దంచికొట్టడం ఖాయం, ఈ వేసవిలో ఏకంగా 49 డిగ్రీలు దాటే అవకాశముందని ఐంఎడీ అంచనా
VNSతెలంగాణలో ఈ వేసవికాలంలో ఎండలు మునుపటి కంటే అధికంగా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. 2023లో తెలంగాణలో ఎన్నడూలేనంత అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పుడు అంతకు మించి ఉష్ణోగ్రతలు ఉంటాయట. ఈ వేసవి కాలంలో 48-49 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదుకావచ్చని చెబుతున్నారు. వేసవికాలం ప్రారంభంలోనే ఫిబ్రవరిలో ఎండలు మండిపడుతున్నాయి.
Telangana Shocker: పట్టపగలు అందరూ చూస్తండగానే దారుణ హత్య.. మేడ్చల్ జిల్లాలో యువకుడిని హతమార్చిన దుండగులు, వైరల్ వీడియో
Arun Charagondaహైదరాబాద్‌లోని(Hyderabad) మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో షాకింగ్ సంఘటన జరిగింది. పట్టపగలు అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై (Hyderabad murder)కత్తులతో పొడిచి యువకుడిని దారుణ హత్య చేశారు.
Telangana: పోలీసును ఢీకొట్టి బైక్‌పై గంజాయితో పరారైన నిందితులు.. పోలీసులకు స్వల్ప గాయాలు, వీడియో
Arun Charagondaపోలీసును ఢీకొట్టి బైక్‌పై గంజాయితో పరారయ్యారు నిందితులు . భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బైక్‌పై అక్రమంగా గంజాయి తరలిస్తున్న వాహనాన్ని ఆపేందుకు యత్నించిన పోలీసును ఢీకొట్టి పరారయ్యారు నిందితులు.
Telangana: మరోసారి వార్తల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి.. పాల స్కూటర్ నడిపిన బీఆర్ఎస్ నేత, తన పాత రోజులను గుర్తు చేసుకుని ఎమోషన్
Arun Charagondaమాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. పాల స్కూటర్ నడిపారు మల్లారెడ్డి. స్కూటర్‌పై ఎక్కి తన పాత రోజులను గుర్తు చేసుకున్నారు మల్లారెడ్డి.
Andhra Pradesh: బ్యాంకులో బంగారం మాయం.. కస్టమర్ల ఆందోళన, తుని మండలం కెనరా బ్యాంక్‌లో ఘటన, వీడియో ఇదిగో
Arun Charagondaబ్యాంకులో బంగారం మాయం అయింది. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంట కెనరా బ్యాంక్ లో ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారం మాయం అయింది.
Telangana Caste Census Resurvey: తెలంగాణ సమగ్ర కులగణన రీసర్వే ప్రారంభం..టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు, ప్రజాపాలన సేవా కేంద్రాల్లోనూ దరఖాస్తులు ఇవ్వొచ్చు
Arun Charagondaతెలంగాణలో సమగ్ర కుటంబ రీసర్వే మళ్లీ ప్రారంభమైంది. ఇటీవల నిర్వహించిన కులగణన సర్వేలో పాల్గొనని వారి కోసం ఈ రీసర్వే చేపట్టారు.