తెలంగాణ

Lasya Nanditha Last Rites: అశ్రు నయనాల మధ్య ముగిసిన లాస్య నందిత అంత్య‌క్రియ‌లు, మారేడ్‌ప‌ల్లి శ్మ‌శాన‌వాటిక‌లో ప్ర‌భుత్వ లాంఛనాల‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు తుది వీడ్కోలు

Hazarath Reddy

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత (Lasya Nanditha) అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. బోయన్‌పల్లిలోని ఇంటి నుంచి మారేడుపల్లిలోని శ్మశాన వాటిక వరకు అంతిమ యాత్ర సాగింది. ఈ యాత్రలో బీఆర్ఎస్ శ్రేణులు భారీగా పాల్గొని లాస్యకు తుది వీడ్కోలు పలికారు.

Lasya Nanditha Dies: డ్రైవ‌ర్ నిర్ల‌క్ష్యం వ‌ల్లే ఎమ్మెల్యే లాస్య నందిత మృతి, కారు డ్రైవ‌ర్ ఆకాశ్‌పై కేసు న‌మోదు చేసిన సంగారెడ్డి జిల్లా పోలీసులు, మీడియాకు వివరాలను వెల్లడించిన అడిష‌న‌ల్ ఎస్పీ సంజీవ‌రావు

Hazarath Reddy

కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత (BRS MLA Lasya Nanditha Dies) శుక్ర‌వారం ఉద‌యం రోడ్డు ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయిన సంగ‌తి తెలిసిందే.ఈ ఘటనలో ఎమ్మెల్యే లాస్య నందిత కారు డ్రైవ‌ర్ ఆకాశ్‌పై కేసు న‌మోదు (Case Registered Against on MLA PA) చేసిన‌ట్లు సంగారెడ్డి జిల్లా పోలీసులు తెలిపారు

MLA Lasya Nanditha Funeral: లాస్య నందిత భౌతిక‌కాయానికి నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి, పలువురు కాంగ్రెస్ మంత్రులు

Hazarath Reddy

కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత భౌతిక‌కాయానికి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నివాళుల‌ర్పించారు. నందిత కుటుంబ స‌భ్యుల‌ను సీఎం ప‌రామ‌ర్శించారు. సీఎంతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్ర‌భాక‌ర్, శ్రీధ‌ర్‌బాబుతో పాటు ప‌లువురు నివాళుల‌ర్పించారు. మారేడుపల్లిలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు ప్రారంభం అయ్యాయి.

MLA Lasya Nanditha Funeral: ఎమ్మెల్యే లాస్య నందిత అంతిమయాత్ర, పాడె మోసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

మారేడుపల్లిలో అధికారిక లాంఛనాలతో లాస్య నందిత అంత్యక్రియలు ప్రారంభం అయ్యాయి. ఎమ్మెల్యే లాస్య నందిత అంత్యక్రియల్లో ఎమ్మెల్యేలు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి మరియు పలువురు బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Lasya Nanditha Dies: సీటు బెల్ట్‌ పెట్టుకోకపోవడం వల్లే లాస్య నందిత మృతి, పోస్టుమార్టం నివేదికలో కీలక విషయాలు, తలకు బలమైన గాయాలు కావడంతో స్పాట్ లోనే..

Hazarath Reddy

పటాన్‌ చెరు ఓఆర్‌ఆర్‌పై ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆమె మృతదేహానికి జరిగిన పోస్టుమార్టం నివేదిక(ప్రాథమిక) బయటకు వచ్చింది. తలకు బలమైన గాయాలు కావడంతోనే ఆమె స్పాట్‌లోనే చనిపోయినట్లు పోస్టుమార్టం నివేదిక తేల్చింది.

Lasya Nandita Dies: సాయంత్రం అధికారిక లాంఛనాలతో లాస్య నందిత అంత్యక్రియలు, ప్రమాద ఘటనపై దర్యాప్తును వేగవంతం చేసిన పోలీస్ అధికారులు, కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే మృతికి సంతాపం తెలిపిన పలువురు రాజకీయ నేతలు

Hazarath Reddy

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత(33) శుక్రవారం వేకువ ఝామున పటాన్‌చెరు ఓఆర్‌ఆర్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సంగతి విదితమే. ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ప్రమాదానికి గురి కావడంతో లాస్య నందిత అక్కడికక్కడే మృతి చెందారు. కారు నడిపిన ఆమె పీఏ ఆకాష్‌ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Telangana Fire Video: కరీంనగర్లో ఓ ఇంట్లో భారీ పేలుడు, మంటలు అదుపులోకి తీసుకువస్తుండగా మళ్లీ పెద్ద ఎత్తున పేలిన సిలిండర్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

కరీనంగర్ లో ఓ కుటుంబం ఇంట్లో దేవుడికి దీపం పెట్టి మేడారం జాతరకు వెళ్లింది. అయితే ఆ దీపం ప్రభావంతో ఇంట్లోని వస్తువులకు నిప్పంటుకుని మంటలు చెలరేగాయి. కొంతమంది స్థానికులు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువస్తుండగా మంటల ధాటికి ఇంట్లోని సిలిండర్ ఒక్కసారిగా పేలి పెద్దఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.

Sheep Distribution Scam: తెలంగాణ గొర్రెల స్కాంలో నలుగురు ప్రభుత్వ అధికారులు అరెస్ట్, చంచలగూడ జైలుకు తరలించిన అధికారులు, మార్చి 7 వరకు జ్యుడిషియల్‌ రిమాండ్‌

Hazarath Reddy

తెలంగాణ గొర్రెల స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గొర్రెల పంపిణీలో భారీగా అవకతవకలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ (Telangana Anti-Corruption Bureau) నలుగురు పశుసంవర్ధక శాఖ అధికారులను అరెస్టు చేసింది. ఈ నలుగురు ప్రభుత్వ అధికారులు కాంట్రాక్టర్లతో ప్రభుత్వాధికారుల కుమ్మక్కయి రూ. 2.01 కోట్లు మోసం చేశారని అవినీతి నిరోధకశాఖ దర్యాప్తులో తేలింది

Advertisement

Hyderabad Shocker: పెళ్ళి అయి పిల్లలున్న అధ్యాపకుడుపై మనసు పారేసుకున్న విద్యార్థిని, ప్రేమించడం లేదని న్యూడ్ ఫోటోలతో బ్లాక్ మెయిలింగ్‌, భయపడి పోలీసులను ఆశ్రయించిన బాధితుడు

Hazarath Reddy

విద్యార్థినులను ప్రేమ పేరుతో అధ్యాపకులు వేధించడంపై మనం ఎన్నో వార్తలు చూశాం. తాజాగా అధ్యాపకుడు ప్రేమించలేదని ఓ స్టూడంట్ అతనిపై కక్ష గట్టింది. వాళ్ల కుటుంబానికి సంబంధించిన ఫోటోలను మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టింది.

Lasya Nanditha: ఎమ్మెల్యే లాస్య నందిత అకాలమరణం పట్ల సీఎం రేవంత్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

Rudra

కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత అకాలమరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy ) అన్నారు.

Lasya Nanditha: ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబ సభ్యులను పరామర్శించిన హరీష్ రావు (వీడియో)

Rudra

హైదరాబాద్ ఓఆర్‌ఆర్‌‌ పై కారు ప్రమాదానికి గురై మృతిచెందిన లాస్య నందిత పార్దీవదేహాన్ని సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు.

Stampede at Medaram Jatara: మేడారం జాతరలో తొక్కిసలాట.. పదిమందికి తీవ్రగాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం

Rudra

దేశంలోనే అత్యంత వైభవంగా జరిగే గిరిజన పండగ మేడారం జాతర (Medaram Jatara)లో అపశృతి చోటుచేసుకుంది. వనదేవతలు సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేందుకు క్యూలైన్లలో ఉన్న భక్తుల్లో ఒక్కసారి గందరగోళం ఏర్పడి తొక్కిసలాటకు దారితీసింది.

Advertisement

Lasya Nanditha Passes away: బీఆర్ఎస్ నేత, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణం.. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన దివంగత సాయన్న కుమార్తె.. హైదరాబాద్ ఓఆర్ఆర్‌ పై ప్రమాదానికి గురై మృత్యువాత.. కలిసిరాని ఈ ఏడాది.. వరుసగా మూడుసార్లు ప్రమాదాలు.. మూడోసారి తప్పించుకోలేకపోయిన యువనేత (వీడియో)

Rudra

తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకున్నది. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆమె ప్రయాణిస్తున్న కారు హైదరాబాద్ ఓఆర్‌ఆర్‌‌ పై ప్రమాదానికి గురయ్యింది.

Telangana: ఈ నెల 27 నుంచి నూ. 500కే సిలిండర్, 200 యూనిట్లు లోపు కరెంట్ బిల్లు వస్తే జీరో బిల్లు, మరో రెండు గ్యారెంటీలు అమలుకు శ్రీకారం చుట్టిన రేవంత్ రెడ్డి సర్కారు

Hazarath Reddy

తెలంగాణలో మరో రెండు గ్యారెంటీలు గృహలక్ష్మీ, రూ 500కే సిలిండర్‌ పథకాలను ఈ నెల 27 లేదా 29న ప్రారంభించాలని క్యాబినెట్‌ సబ్‌ కమిటీ నిర్ణయించింది. అర్హులందరికీ లబ్ధి చేకూరాలని అధికారులను సీఎం రేవంత్‌ ఆదేశించారు. మార్చి నెల నుంచి 200 యూనిట్లు లోపు కరెంట్‌ వాడే వారికి జీరో బిల్లు వేయాలని ఆదేశించారు.

Hyderabad: కూకట్ పల్లిలో భవనం కూల్చివేత, మద్యం మత్తులో ఇంట్లోనే పడుకున్న వ్యక్తి శిథిలాల కింద చిక్కుకుని మృతి, కేసు నమోదు చేసుకున్న పోలీసులు

Hazarath Reddy

కూకట్ పల్లిలో నిర్మాణంలో ఉన్న ఇల్లు కూల్చివేత పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మూసాపేటలో మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ తన పాత ఇంటిని బుధవారం కూల్చివేశారు

YouTuber Shanmukh: అన్న కోసం వెళ్తే గంజాయి సేవిస్తూ అడ్డంగా దొరికిపోయిన తమ్ముడు బిగ్ బాస్ విన్నర్ షణ్ముఖ్‌, ఇద్దర్నీ అదుపులోకి తీసుకున్న నార్సింగి పోలీసులు

Hazarath Reddy

బిగ్‌బాస్‌ ఫేం, ప్రముఖ యూట్యూబర్‌ షణ్ముఖ్‌ గంజాయి సేవిస్తూ నార్సింగి పోలీసులకు పట్టుబడ్డాడు. ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు షణ్ముఖ్‌ సోదరుడు సంపత్‌ వినయ్‌ని అదుపులోకి తీసుకునేందుకు తన ఫ్లాట్‌కి వెళ్లిన పోలీసులకు.. అక్కడ షణ్ముఖ్‌ గంజాయి సేవిస్తూ కనిపించాడు. దీంతో సంపత్‌ వినయ్‌తో పాటు షణ్ముఖ్‌ని నార్సింగ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Viral Video: పుల్లుగా తాగి హై టెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కిన హల్ చల్ చేసిన యువకుడు, ముప్ప తిప్పలు పడి అతన్ని కిందకు దించిన పోలీసులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

హైదరాబాద్ లోని మీర్ పేట్ లో ఓ మందుబాబు హల్ చల్ చేశాడు. మద్యం మత్తులో హై టెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కి అక్కడ నుంచి కేకలు వేస్తూ హల్ చల్ చేశాడు. మీర్ పేట్ - పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాపూర్ చౌరస్తా వద్ద మద్యం బాబు విద్యుత్ స్థంభం ఎక్కి అక్కడ నుంచి కింద వెళుతున్న పాదాచారులను పిలుస్తూ న్యూసెన్స్ క్రియేట్ చేశాడు.

BRS Water War: మ‌రో నీటి యుద్ధానికి సిద్ధ‌మైన బీఆర్ఎస్, ఈ సారి క‌ర్ణాట‌క ప్రాజెక్టుపై పోరాటం చేసేందుకు ప్ర‌ణాళిక‌లు రెడీ

VNS

కర్నాటక ప్రభుత్వం కొత్తగా చేపడుతున్న బ్యారేజీ నిర్మాణాన్ని కూడా తమకు అనుకూలంగా మలచుకోవాలని చూస్తోంది బీఆర్‌ఎస్‌. తుంగభద్ర నదిపై చేపడుతున్న బ్యారేజీ వల్ల శ్రీశైలానికి వచ్చే నీరు ఆగిపోతుందని.. దీన్ని ఆపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తోంది బీఆర్‌ఎస్‌. రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌.. తెలంగాణ రైతుల పొట్టకొట్టే ప్రయత్నం చేస్తోందని మండిపడుతున్నారు

Siddipet Fire Video: సిద్దిపేటలో భారీ అగ్నిప్రమాదం, 132 కేవీ సబ్ స్టేషన్‌లో ట్రాన్స్‌పార్మర్‌ పేలి ఎగసిన మంటలు

Hazarath Reddy

తెలంగాణలోని సిద్దిపేట పట్టణంలో 130 కేవీ సబ్ స్టేషన్‌లో మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసి పడుతుండటంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. ఒక్కసారిగా ట్రాన్స్‌పార్మర్‌(Transfaram) పేలి మంటలు చెలరేగాయి. సమీపంలో ఉన్న స్థానికులు పేలుడు దాటికి బయటకు వచ్చారు.

Medaram Jathara: మేడారం జాతరలో గుండెపోటుకు గురైన భక్తుడిని కాపాడిన రెస్క్యూ సిబ్బంది, వీడియో ఇదిగో..

Hazarath Reddy

పెద్దపల్లి జిల్లా - రాజు అనే వ్యక్తి మేడారం జాతర క్యూ లైన్‌లో గుండెనొప్పితో శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడడం గుర్తించిన రెస్క్యూ సిబ్బంది వెంటనే స్పందించి ముందుగా కృతిమ శ్వాస అందించి స్థానిక హాస్పిటల్‌కి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉంది.

Advertisement
Advertisement