తెలంగాణ

Tellam Venkatarao: పొంగులేటికి ఝలక్‌ ఇచ్చి బీఆర్ఎస్‌లోకి జంప్ అవుతున్న తెల్లం వెంకట్రావ్, భద్రాచలం టికెట్ ఒకే అయినట్లుగా వార్తలు

Hazarath Reddy

ఇటీవల రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అనుచరుడు తెల్లం వెంకట్రావ్ తిరిగి బీఆర్ఎస్‌లో చేరబోతున్నట్లు ప్రకటించాడు.భద్రాచలం టికెట్ తెల్లం వెంకట్రావుకు ఆఫర్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.

Tension in Srinidhi College: శ్రీనిధి ఇంజినీరింగ్‌ కాలేజీ దగ్గర ఉద్రిక్తత, వసూలు చేసిన డబ్బు ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్‌, విద్యార్థి ఆత్మహత్యా యత్నం

Hazarath Reddy

మేడ్చల్‌ జిల్లాలోని ఘట్‌కేసర్‌ శ్రీనిధి ఇంజినీరింగ్‌ కాలేజీ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాలేజీ ఫర్నిచర్‌, అద్ధాలను విద్యార్థులు ధ్వంసం చేశారు. వర్శిటీ గుర్తింపు వస్తుందంటూ వసూలు చేసిన డబ్బు ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు.న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ ఓ స్టూడెంట్‌ కాలేజీ బిల్డింగ్‌ పైకి ఎక్కడంతో కలకలం రేగింది.

Hyderabad Bikes Stunt Videos: హైదరాబాద్‌లో బైక్స్ స్టంట్‌లతో విధ్వంసం సృష్టించిన యువకులు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్

Hazarath Reddy

హైదరాబాద్‌లోని అనంతగిరి హిల్స్‌ శివారులో యువకులు కారు, బైక్‌ రేసింగ్‌లు, విన్యాసాలతో హల్‌చల్‌ సృష్టించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మంగళవారం సెలవు దినం కావడంతో, ఈ బృందం అటవీ ప్రాంతంలో డ్రాగ్ రేసింగ్‌లో మునిగిపోయింది,

Hyderabad: షటిల్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలిన ప్లేయర్, ఆస్పత్రికి తరలించే లోపే తిరిగిరాని లోకాలకు..

Hazarath Reddy

వరుస గుండెపోటు మరణాలు భయాందోళన కల్గిస్తున్నాయి. ఈరోజు ఉప్పల్ పరిధి రామంతాపూర్లోని ఎండోమెంట్ కాలనీలో షెటిల్ ఆడుతూ కృష్ణారెడ్డి (46) గుండెపోటుతో కుప్పకూలాడు. స్నేహితులు, స్థానికులు అతన్ని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మృతిచెందినట్లు నిర్దారించారు.

Advertisement

Yellow Alert for Telangana: తెలంగాణకు ఎల్లో అలర్ట్‌, ఈ నెల 18, 19 తేదీల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు, ఈ జిల్లాలకు భారీ వర్షాల అలర్ట్

Hazarath Reddy

ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో ఈ నెల 18, 19 తేదీల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. వచ్చే రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉన్నట్టు ప్రకటించింది.

Warangal Accident: వరంగల్‌ జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం, ఐదుగురు స్పాట్‌లోనే మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం, బాధితులంతా తేనె అమ్ముకునే వ్యక్తులే!

VNS

వరంగల్ జిల్లాలో (Warangal) విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని వర్ధన్నపేట మండలం (Wardhannapet) ఇల్లంద గ్రామం వద్ద బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ – ఖమ్మం జాతీయ రహదారిపై వరంగల్ నుంచి తొర్రూరు వైపు వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న లారీ (Lorry Hits Auto) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌తో పాటు ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు.

Telangana: ప్రాణాలకు తెగించి వరదలో ఈదుకుంటూ వెళ్లి విద్యుత్ సమస్య సరిచేసిన జూనియర్ లైన్‌మెన్‌, స్వాతంత్ర్య దినోత్సవం రోజున సత్కరించిన సీఎం కేసీఆర్

Hazarath Reddy

తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లాయి. జనగాం జిల్లా దేవరుప్పుల మండలం చింతల తండా, ధర్మాపురం, పడమటి తండా గ్రామాలకు విద్యుత్ ఇవ్వడం కోసం ప్రాణాలకు తెగించి వరదలో ఈదుకుంటూ వెళ్లి విద్యుత్ సమస్య సరిచేసిన జూనియర్ లైన్‌మెన్‌ ఎండీ రహమాన్‌ను ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినోత్సవం రోజున సత్కరించిన సీఎం కేసీఆర్.

Independence Day 2023: వీడియో ఇదిగో, రెండు జాతీయ జెండాలతో వీధులన్నీ చుట్టేసిన అసదుద్దీన్ ఒవైసీ, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్న హైదరాబాద్ ఎంపీ

Hazarath Reddy

AIMIM చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్వాతంత్ర్య దినోత్సవాన్ని తన స్టైల్లో ప్రత్యేకంగా జరుపుకున్నారు. వీధుల్లో తన మోటర్‌బైక్‌పై తిరుగుతూ తనదైన శైలిలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకున్నారు.

Advertisement

Chandrababu on Hyderabad: నా పోరాటం వల్లే ఈరోజు హైదరాబాద్ ఇలా ఉంది, చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యల వీడియో ఇదిగో..

Hazarath Reddy

హైదరాబాద్ 1995లో ప్రారంభమైంది..నా పోరాటం వల్లే హైదరాబాద్‌ ఇలా ఉంది. తెలంగాణ ప్రజలందరూ నేడు లబ్ధిపొందుతున్నారు. అది ఆరోజు ఇచ్చిన భిక్ష’’ అంటూ చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై తెలంగాణ వాసుల నుండి వ్యతిరేకత ఎదురవుతోంది. ట్విట్టర్లో నెటిజన్లు విమర్శలు ఎక్కుపెడుతున్నారు.

YS Sharmila Padayatra: 3800 కిలో మీటర్లు పాదయాత్ర చేసిన మొదటి మహిళగా వైయస్ షర్మిల రికార్డు, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదు

Hazarath Reddy

తెలంగాణలో 3800 కిలో మీటర్లు పాదయాత్ర చేసినందుకు గాను వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నారు. 3800 కిలో మీటర్లు పాదయాత్ర చేసిన మొదటి మహిళగా వైయస్ షర్మిల రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు వైయస్ షర్మిల గారిని కలిసి అభినందించి అవార్డును ప్రదానం చేశారు.

'Made in India' AirPods: హైదరాబాద్ యాపిల్ ఎయిర్ పాడ్స్ తయారీ, ఫాక్స్‌కాన్ ప్లాంట్‌లో 400 మిలియన్ డాలర్ల పెట్టుబడులతో ఉత్పత్తి

Hazarath Reddy

హైదరాబాద్‌లోని కొంగరకలాన్‌లో ఫాక్సాకాన్ కంపెనీ ప్లాంట్లో 400 మిలియన్ డాలర్ల పెట్టుబడులతో ఐఫోన్ ఎయిర్ పాడ్స్ తయారీ చేయనుంది. డిసెంబరు 2024 నుంచి ఇక్కడ ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

Independence Day 2023: గోల్కొండ కోట‌ నుంచి ప్రజలకు వరాల జల్లులు కురిపించిన సీఎం కేసీఆర్, జాతీయ జెండాను ఎగుర‌వేసిన అనంత‌రం ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్రసంగించిన ముఖ్యమంత్రి

Hazarath Reddy

గోల్కొండ కోట‌పై జాతీయ జెండాను ఎగుర‌వేసిన అనంత‌రం ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి కేసీఆర్ ప్ర‌సంగించారు. రాష్ట్రంలోని గూడు లేని నిరుపేద‌లు ఆత్మ‌గౌర‌వంతో బ‌త‌కాల‌నే ఉద్దేశంతో కేసీఆర్ స‌ర్కార్ డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌ను క‌ట్టించి ఇస్తున్న సంగ‌తి తెలిసిందే.

Advertisement

Revanth Reddy: వీడియో ఇదిగో, ఆ పోలీసుల గుడ్డలు ఊడదీసి కొడతా, డైరీలో పోలీసుల పేర్లు రాసి పెడుతున్నానని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

మహబూబ్ నగర్ పోలీసులను గుడ్డలు ఊడతీసి కొడతా అంటూ వార్నింగ్ ఇచ్చిన రేవంత్ రెడ్డి. డైరీలో పోలీసుల పేర్లు రాసి పెడుతున్నాం. 100 రోజుల తరువాత అధికారంలోకి రాగానే మీ గుడ్డలు ఊడతీసి, అసలు మిత్తితో సహా చెల్లిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.

Telangana Shocker: తీవ్ర విషాదం, చిన్న విభేదాలతో భార్యని చంపి ఉరివేసుకున్న భర్త, కరీంనగర్‌లో విషాదకర ఘటన

Hazarath Reddy

కరీంనగర్ మార్కండేయ కాలనీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భార్యని చంపి ఓ భర్త ఉరివేసుకున్నారు. భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా భార్య లావణ్యను చంపిన భర్త ప్రవీణ్, 2 రోజులు మృతదేహాన్ని ఇంట్లోనే దాచి, హాస్టల్లో ఉన్న కూతురుని చూసొచ్చి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ప్రవీణ్.

Stray Dog Attack: నిజామాబాద్‌లో బాలుడి మీద దాడి చేసిన వీధి కుక్క, వీడియో ఇదిగో..

Hazarath Reddy

నిజామాబాద్ జిల్లాలో ఓ వీధి కుక్క బాలుడిపై దాడికి యత్నించింది. అందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 8వ డివిజన్‌లో ఓ బాలుడు నడుచుకుంటూ వెళ్తున్నాడు. కిరాణా షాపుకు వెళ్లి ఏదో తినే పదార్థాన్ని కొనుగోలు చేసిన బాలుడు దాన్ని చేతిలో పట్టుకొని ఇంటికి వెళ్తున్నాడు.

Video: వీడియో ఇదిగో, దొంగతనానికి వచ్చిన దొంగను తరిమి తరిమి కొట్టిన మహిళ, వేములవాడలో సీసీటీవీ పుటేజీ బయటకు

Hazarath Reddy

భగవంతరావు నగర్లో పిల్లి శ్రీలత అనే మహిళ భర్త గల్ఫ్‌లో ఉంటున్నాడు. ఆమె మొదటి కూతురుకు వివాహం కాగా, రెండో కూతురు అమెరికాలో ఉంటుంది. ఒంటరిగా ఉంటున్న ఆమెపై ఓ దుండగుడు దాడి చేసి దొంగతనానికి యత్నించాడు.శ్రీలత తప్పించుకోవడానికి ప్రయత్నించగా.. సదరు దొంగ ఆమె మెడలో నుంచి బంగారం అపహరించేందుకు యత్నించాడు.

Advertisement

Independence Day Celebrations: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జెండా ఎగురవేసిన ఇద్దరు సీఎంలు (వీడియో)

Rudra

తెలుగు రాష్ట్రాల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. విజయవాడలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. మరోవైపు గోల్కొండ కోటలో తెలంగాణ ప్రభుత్వం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జాతీయ జెండా ఎగరేసిన సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

Independence Day 2023 Google Doodle: భారత స్వాత్రంత్ర దినోత్సవ సంబురాన గూగుల్ ప్రత్యేక డూడుల్.. మీరూ చూడండి!

Rudra

మంగళవారం 77వ భారత స్వాతంత్ర్య దినోత్సవ సంబురాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గూగుల్.. ప్రత్యేక డూడుల్ ను రూపొందించి ప్రత్యేక శుభాకాంక్షలను తెలియజేసింది.

Independence Day Celebrations: దేశవ్యాప్తంగా ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ సంబురాలు.. జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ 10వ ప్రసంగం.. అమృత కాలంలో నవయవ్వన భారతమే లక్ష్యమని ప్రకటన (వీడియోతో)

Rudra

యావత్తు 140 కోట్లమంది భారతదేశ ప్రజల మనసులు గర్వంతో ఉప్పొంగిపోయాయి. మంగళవారం 77వ భారత స్వాతంత్ర్య దినోత్సవ సంబురాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఉదయం 7.30 గంటలకు రాజధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగరేశారు.

Telangana Farm Loan Waiver: లక్ష రూపాయలలోపు రుణమాఫీ పూర్తి చేసిన తెలంగాణ ప్రభుత్వం

kanha

తెలంగాణ ప్రభుత్వం రూ. లక్షలోపు రుణమాఫీని పూర్తి చేసింది. ఇవాళ ఒక్కరోజే 10,79,721 మంది రైతులకు రూ. 6,546.05 కోట్ల రుణాలను మాఫీ చేసింది. వెంటనే బకాయిలు చెల్లించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.

Advertisement
Advertisement