తెలంగాణ

Telangana Early Elections Row: తెలంగాణలో త్వరలో ముందస్తు ఎన్నికలు, సంచలన వ్యాఖ్యలు చేసిన బీఎస్పీ నేత ప్రవీణ్ కుమార్

Hazarath Reddy

తెలంగాణలో త్వరలో ముందస్తు ఎన్నికలు రానున్నాయని రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 6 నెలల్లో ముందస్తు ఎన్నికలకు వెళ్తారని తెలంగాణ బీఎస్‌పీ అధ్యక్షుడు తెలిపారు.

Shilpa Layout Flyover: వీడియో ఇదిగో, ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెడుతూ హైదరాబాద్‌లో మరో ఫ్లైఓవర్, శిల్పా లేఅవుట్ మొదటి దశ ఫ్లై ఓవర్‌ను నేడు ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్

Hazarath Reddy

హైదరాబాద్‌లో ఐటీ కారిడార్‌ను ఓఆర్ఆర్‌తో అనుసంధానం చేస్తూ రూ. 250 కోట్ల వ్యయంతో నిర్మించిన శిల్పా లేఅవుట్ మొదటి దశ ఫ్లై ఓవర్‌ను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నేడు ప్రారంభించనున్నారు.

Shilpa Flyover Ready: హైదరాబాద్‌లో శిల్పా ఫ్లై ఓవర్ రెడీ.. నేడు కేటీఆర్ చేతులమీదుగా ప్రారంభం.. రూ. 250 కోట్ల వ్యవయంతో బ్రిడ్జి నిర్మాణం.. ట్రాఫిక్ కష్టాలకు ఇక చెల్లు

Rudra

ఐటీ కారిడార్‌ను ఓఆర్ఆర్‌తో అనుసంధానం చేస్తూ రూ. 250 కోట్ల వ్యయంతో నిర్మించిన శిల్పా లేఅవుట్ మొదటి దశ ఫ్లై ఓవర్‌ను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నేడు ప్రారంభించనున్నారు.

Telangana: డిసెంబర్ నుంచి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు, వారం రోజుల పాటు సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly, winter session) డిసెంబర్‌లో నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిర్ణయించారు. దాదాపు వారం రోజుల పాటు సమావేశాలను నిర్వహించాలని సంకల్పించారు.

Advertisement

IT Raids on Malla Reddy: తెల్లవారుజామున మల్లారెడ్డి ఇంట్లో హైడ్రామా, ఐటీ రైడ్స్ ముగియగానే ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్న మల్లారెడ్డి, ఐటీ అధికారులు, విచారణకు హాజరుకావాలంటూ సమన్లు జారీ, భారీ ఎత్తున నగదు, డాక్యుమెంట్లు స్వాధీనం

Naresh. VNS

తెలంగాణ కార్మిక మంత్రి మల్లారెడ్డిపై (Mallareddy) ఐటీ సోదాలు ముగిశాయి. రెండు రోజుల పాటూ మంత్రి మల్లారెడ్డి, ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు (IT Raids) చేశారు. కాగా, ఈ తనిఖీల్లో రెండు రోజుల్లో భారీగా డబ్బు సీజ్ (Money seize) చేశారు అధికారులు.

National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసు, ఈడీ ముందుకు కాంగ్రెస్‌ నేత అంజన్‌ కుమార్‌ యాదవ్‌, యంగ్‌ ఇండియాకు ఇచ్చిన విరాళాలపై ఈడీ అధికారులు ప్రశ్నలు

Hazarath Reddy

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నేషనల్ హెరాల్డ్‌ కేసు (National Herald case)మరోసారి తెర మీదికి వచ్చింది. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ నేత అంజన్‌ కుమార్‌ యాదవ్‌ ఈడీ ప్రధాన కార్యాలయానికి హాజరయ్యారు. యంగ్‌ ఇండియాకు ఇచ్చిన విరాళాలపై అంజన్‌ కుమరా్‌ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

Telangana: వైరల్ వీడియో, బూతు తిడుతూ జిల్లా స్థాయి అధికారి కాలర్ పట్టుకొని వెనక్కి తోసేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, జోగులాంబ గద్వాల జిల్లాలో ఘటన

Hazarath Reddy

జోగులాంబ గద్వాల జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ప్రభుత్వ అధికారి పట్ల ప్రవర్తించిన తీరు వివాదాస్పదం అవుతోంది. అధికారి కాలర్ పట్టుకొని వెనక్కి తోసేశారు. అప్పుడే ఓ బూతు కూడా మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Shashidhar Reddy Quits Congress: రోజురోజుకు కాంగ్రెస్ పార్టీ దిగజారిపోతోంది, కాంగ్రెస్ పార్టీకి మర్రి శశిధర్ రెడ్డి రాజీనామా, లేఖలో ఘాటు వ్యాఖ్యలు

Hazarath Reddy

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఎంతో బాధతో పార్టీని వీడుతున్నానని ఆయన (Former Minister Marri Shashidhar Reddy) చెప్పారు. అన్ని వివరాలతో సోనియాగాంధీకి లేఖ రాశానని తెలిపారు. రోజురోజుకు కాంగ్రెస్ పార్టీ దిగజారిపోతోందని అన్నారు.

Advertisement

MLA Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఊహించని ట్విస్ట్, బీజేపీ నేత సంతోష్‌తో పాటు జగ్గు స్వామికి లుకౌట్‌ నోటీసులు జారీ చేసిన సిట్ అధికారులు

Hazarath Reddy

తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసు (MLAs Purchase Case)లో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. పరారీలో ఉన్న జగ్గుస్వామికి లుకౌట్‌ నోటీసులు జారీ చేసింది సిట్ నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన పోలీసులకు జగ్గుస్వామి అందుబాటులోకి లేకుండా పోయారు.

Minister PS Son Suicide: తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యక్తిగత అదనపు కార్యదర్శి కుమారుడి ఆత్మహత్య.. డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తామని పలువురి నుంచి డబ్బులు వసూలు చేసిన కేసులో గతంలో అరెస్ట్

Rudra

తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యక్తిగత అదనపు కార్యదర్శి దేవేందర్ కుమారుడు అక్షయ్ కుమార్ (23) ఆత్మహత్య చేసుకున్నారు.

IT Raids in Minister Mallareddy House: మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు.. ఆయన కుమారుడు, అల్లుడుకు సంబంధించిన ఇళ్లు, సంస్థల్లోనూ ముమ్మరంగా సోదాలు.. ఒకేసారి 50 బృందాలతో సోదాలు

Rudra

హైదరాబాద్ లోని పలు ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీశాఖ మెరుపు దాడులు చేపట్టింది. ఈరోజు తెల్లవారుజాము నుంచే అధికారులు బృందాలుగా విడిపోయి ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ మంత్రి మల్లారెడ్డి.. ఆయన కుమారుడు, అల్లుడుకు సంబంధించిన ఇళ్లు, సంస్థల్లో సోదాలు చేస్తున్నారు.

Telangana: పాతబస్తీలో బాంబు కలకలం, చార్మినార్‌ను బాంబులతో లేపేస్తామని పోలీసులకు కాల్ చేసిన అగంతకుడు, బాంబ్‌ స్క్వాడ్‌తో చార్మినార్‌ వద్దకు వెళ్లి తనిఖీలు నిర్వహించిన పోలీసులు

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో బాంబు కలకలం చెలరేగింది. ఓ అజ్ఞాత వ్యక్తి పోలీసులకు ఫోన్‌ చేసి చార్మినార్‌ వద్ద బాంబు పెట్టామంటూ వ్యాఖ్యలు చేశారు.బాంబు ఫోన్‌ కాల్‌ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు బాంబ్‌ స్క్వాడ్‌తో చార్మినార్‌ వద్దకు వెళ్లి తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Advertisement

TRS MLAs Purchase Case: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కొనుగోలు కేసు, సిట్‌ విచారణ కొనసాగించాల్సిందేనని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు

Hazarath Reddy

TRS ఎమ్మెల్యేలకు ఎర కేసులో (TRS MLAs Purchase Case) సిట్టింగ్‌ జడ్జి పర్యవేక్షణను సుప్రీంకోర్టు ఎత్తివేసింది. సింగిల్‌ జడ్జి పర్యవేక్షణ, సిట్‌ విచారణ నిలిపేయాలంటూ ఈ కేసు నిందితులు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.

Telangana: ప్రభుత్వ డాక్టర్ నిర్లక్ష్యం, ప్రసవం సరిగ్గా చేయకపొవడంతో శిశువు మృతి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన బాధిత కుటుంబ సభ్యులు, జోగులాంబ గద్వాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఘటన

Hazarath Reddy

ప్రభుత్వ డాక్టర్ల నిర్లక్ష్యంతో శిశువు మృతి చెందిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో (Jogulamba Gadwal Government Hospital) చోటు చేసుకుంది. దీంతో డాక్టర్లపై చర్యలు తీసుకోవాలంటూ శిశువు బంధువులు ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు.

Bandi Comments On IRL: నగరం నడిబొడ్డున కార్ల రేసులు నిర్వహిస్తారా?.. విమర్శనాస్త్రాలు సంధించిన బండి సంజయ్.. తాము ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా రేసులు నిర్వహిస్తామని వెల్లడి

Rudra

హైదరాబాదులోని హుస్సేన్ సాగర్ తీరంలో ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్ఎల్) నిర్వహించడం పట్ల తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ విమర్శనాస్త్రాలు సంధించారు. నగరం నడిబొడ్డున కార్ల రేసులు నిర్వహిస్తారా? అని మండిపడ్డారు.

Cold Wave in Telugu States: వణుకుతున్న తెలుగు రాష్ట్రాలు.. రోజురోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. 2017 తర్వాత నవంబరులో తెలంగాణలో అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు.. రానున్న 48 గంటల్లో ఏపీలో భారీ వర్షాలు

Rudra

తెలంగాణలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్రత పెరిగి జనం గజగజ వణుకుతున్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం స్థిరంగా కొనసాగుతున్నట్టు అమరావతి వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది.

Advertisement

Cold Wave In Telugu States: చ.. చ.. చలి.. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలి తీవ్రత.. ఉత్తర భారతం నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో అంతకంతకూ పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. ఇవాళ, రేపు చలి మరింతగా ప్రభావం.. దక్షిణకోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు పడొచ్చన్న వాతావరణశాఖ

Rudra

పెరిగిన చలి తీవ్రతతో తెలుగు రాష్ట్రాలు వణికిపోతున్నాయి. ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో ఇరు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పడిపోతున్నాయి. పగటిపూట సైతం చలిగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటోంది. ఇవాళ, రేపు చలి మరింతగా ప్రభావం చూపెడుతుందని వాతావరణశాఖ తెలిపింది.

Bike Stolen From Police Station: ఇదేందయ్యా ఇది.. నేనెక్కడా చూడలే.. పోలీస్ స్టేషన్ నుంచే బైక్ కొట్టేశాడా? కేపీహెచ్ బీ ప్రాంతంలో బైక్ చోరీ.. డ్రంకెన్ డ్రైవ్ లో దొరికిన దొంగ.. పోలీస్ స్టేషన్ లో ఉంచిన బైక్ ను మళ్లీ ఎత్తుకెళ్లిన దుండగుడు

Rudra

ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి వాహనం చోరీ కావడం కలకలం రేపుతోంది. ఈ ఘటన హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

Indian Car Racing: హుస్సేన్ సాగర్ తీరంలో ఇండియన్ కార్ రేసింగ్... రయ్యిమని పరుగులు తీసిన ఫ్యూయల్ కార్లు.. రేసింగ్ ఈవెంట్ కు హాజరైన కేటీఆర్, హిమాన్షు.. రేసు జరుగుతున్న సమయంలో స్వల్ప అపశ్రుతి.. ఐమ్యాక్స్ వద్ద కుంగిన గ్యాలరీ.. నేడు కూడా రేసు కనువిందు..

Rudra

హైదరాబాదులోని హుస్సేన్ సాగర్ తీరంలో ఇండియన్ కార్ రేసింగ్ ప్రారంభమైంది. ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన రేస్ ట్రాక్ లో ఫ్యూయల్ కార్లు రయ్యిమని పరుగులు తీశాయి. ఈ రేసింగ్ కోసం తెలంగాణ మంత్రి కేటీఆర్, ఆయన తనయుడు హిమాన్షు కూడా విచ్చేశారు.

Hyderabad Traffic Rules: ఇకపై రాంగ్‌ రూట్‌లో వెళ్తే భారీ ఫైన్, రూల్స్‌ను కఠినంగా అమలు చేయనున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, త్రిపుల్ రైడింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్‌పై స్పెషల్ డ్రైవ్‌, రాంగ్ రూట్‌ రూ.1700, ట్రిపుల్ రైడింగ్‌ కు రూ. 1200 ఫైన్‌

Naresh. VNS

నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ మళ్లీ కొత్త రూల్స్ తీసుకొచ్చారు. ఇటీవల ఆపరేషన్ రోప్ (Operation Rope) పేరుతో.. వాహనదారులను లైన్‌లో పెట్టేందుకు చర్యలు తీసుకున్న పోలీసులు.. ఇప్పుడు రాంగ్ రూట్‌ లో వెళ్లే వారిపై, ట్రిపుల్ రైడింగ్ చేసే వారిపై ఫోకస్ పెట్టారు. వారిపై భారీగా జరిమానాలు విధించి సరైన రూట్‌లో పంపిచేందుకు సిద్ధమయ్యారు.

Advertisement
Advertisement