తెలంగాణ

Operation Akarsh In Telangana: నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ బేరసారాలు, ముగ్గురు నిందితులు అరెస్టు, కుట్రను భగ్నం చేసిన తెలంగాణ పోలీసులు

kanha

అధికార టీఆర్ఎస్ కు చెందిన నలుగురు శాసనసభ్యులను కొనుగోలు చేసేందుకు బీజేపీ చేసిన రహస్య ఆపరేషన్ బెడిసి కొట్టినట్లు వార్తలు వస్తున్నాయి. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్వయంగా పోలీసులను పిలిచి, తమను పార్టీ మారేందుకు వచ్చిన బీజేపీ ప్రతినిధులను పోలీసులకు అప్పచెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.

MLA Raja Singh: రాజాసింగ్‌పై 101 కేసులు, అందులో 18 కేసులు మత సంబంధితవేనన్న హైదరాబాద్ పోలీసులు, పీడీ యాక్ట్‌ ఎత్తేయాలన్న రాజాసింగ్‌ విజ్ఞప్తిని తిరస్కరించిన అడ్వైజరీ బోర్డు

Hazarath Reddy

బీజేపీ సస్పెండెడ్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు అడ్వైజరీ బోర్డు నుంచి చుక్కెదురు అయింది. పీడీ యాక్ట్‌ ఎత్తేయాలన్న రాజాసింగ్‌ విజ్ఞప్తి తిరస్కరణకు గురైంది. ఈ మేరకు ఆయనపై నమోదు అయిన పీడీయాక్ట్‌పై బుధవారం అడ్వైజరీ బోర్డు తీర్పు వెలువరించింది.

Telangana: టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్న మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్‌, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి కేటీఆర్

Hazarath Reddy

మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్‌ టీఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి కేటీఆర్‌.

Telangana: బీజేపీకి రాజీనామా చేసిన రాపోలు ఆనంద భాస్కర్, రాజీనామా లేఖను జేపీ నడ్డాకు పంపిన రాజ్యసభ మాజీ సభ్యుడు

Hazarath Reddy

రాజ్యసభ మాజీ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ బీజేపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన తన రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపారు. బీజేపీ నుంచి వైదొలగుతున్నట్లు ఆయన తన లేఖలో వెల్లడించారు.

Advertisement

Telangana: పండుగ వేళ దీపాలను తన్నిన మహిళ, క్రిస్టియన్-హిందూ కోణం లేదని చిక్కడపల్లి పోలీసులు వెల్లడి, మహిళపై కేసు నమోదు

Hazarath Reddy

తెలంగాణలోని హైదరాబాద్‌లో ఒక మహిళ దీపాలను తన్నడం మరియు పొరుగువారిని దుర్భాషలాడడం వంటి వీడియో వైరల్‌గా మారింది. విచారణ అనంతరం, క్రిస్టియన్-హిందూ కోణం లేదని, పొరుగువారికి కొన్ని సమస్యలు ఉన్నాయని పోలీసులు స్పష్టం చేశారు.

Gas Cylinder Blast In Hyd: సికింద్రాబాద్‌లో పెద్ద శబ్దంతో పేలిన గ్యాస్ సిలిండర్, ఒకరు మృతి, తొమ్మిది మందికి గాయాలు, పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసం

Hazarath Reddy

సికింద్రాబాద్ లోని చిలకలగూడ పరిధిలోని దూద్ బావి బస్తీలో బుధవారం గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో తొమ్మిది మందికి గాయాలయ్యాయి.

Drunken SI Creates Ruckus: తాగిన మత్తులో పోలీసులను చితకబాదిన ఎస్సై,స్థానికులు అడ్డకోవడంతో కారు వదిలి పరార్, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన బాధిత పోలీసులు

Hazarath Reddy

బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్నానన్న విషయాన్ని మరచి ఫుల్‌ గా మద్యం సేవించిన ఓ ఎస్‌ఐ (Drunken SI Creates Ruckus), అతని స్నేహితులు మంచిర్యాలలో వీరంగం సృష్టించారు.జిల్లాలోని అంబేద్కర్‌ చౌరస్తా వద్ద ఎస్‌ఐ తిరుపతి, తన స్నేహితులు హల్‌ చల్‌ చేశారు.

Telangana Shocker: స్కూల్లో గుండెపోటుతో కుప్పకూలిన మూడో తరగతి విద్యార్థి, రాజన్న సిరిసిల్లాలో విషాదకర ఘటన

Hazarath Reddy

తెలంగాణలోని రాజన్న సిరిసిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. దీపావళి పండుగను ఆనందోత్సావాల మధ్య జరుపుకున్న ఓ చిన్నారి పాఠశాలకు వెళ్లిన తరువాత గుండెపోటుతో (Class III boy dies of heart attack) కుప్పకూలిపోయాడు.

Advertisement

Human Sacrifice: నేడు అమావాస్య, సూర్యగ్రహణం... హైదరాబాదులో యువకుడి నరబలి!... కేపీహెచ్ బీలో క్షుద్రపూజల కలకలం.. శ్మశాన వాటిక వద్ద కాలిన స్థితిలో మృతదేహం.. పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు

Jai K

టెక్నాలజీ ఫలాలు మారుమూల గ్రామాలకు కూడా చేరుతున్న నేటి కాలంలో నగరాల్లో క్షుద్రపూజల వంటి అనాగరిక ఆచారాలు కొనసాగుతుండడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. తాజాగా, హైదరాబాద్ కేపీహెచ్ బీ లో క్షుద్రపూజల కలకలం రేగింది.

Nagula Chaviti 2022: దీపావళి తర్వాత వచ్చే మొదటి చవితిని నాగుల చవితిగా జరుపుకుంటారు. వచ్చే శుక్రవారం జరుగనున్న నాగుల చవితి పండుగ శుభాకాంక్షలను ఈ హెచ్ డీ ఇమేజెస్ ద్వారా మీ బంధు, మిత్రులకు షేర్ చేయండి.

Jai K

వచ్చే శుక్రవారం జరుగనున్న నాగుల చవితి పండుగ శుభాకాంక్షలను ఈ హెచ్ డీ ఇమేజెస్ ద్వారా మీ బంధు, మిత్రులకు షేర్ చేయండి.

Video: వరంగల్ ఆస్పత్రిలో రోగి మంచం కింద నాగుపాము, ఒక్కసారిగా ఉలిక్కిపడిన రోగులు, సిబ్బంది, అటెండర్లు, ఆస్పత్రిలో ఇలాంటి ఘటన జరగడం ఈ నెలలో ఇది రెండోసారి

Hazarath Reddy

వరంగల్‌లోని మహాత్మాగాంధీ మెమోరియల్ ఆస్పత్రిలో రోగుల వార్డులో పాము కనిపించడంతో రోగులు, సిబ్బంది, అటెండర్లు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Deepavali Wishes: దివ్వెల పండుగకు శుభాకాంక్షలు తెలిపిన తెలుగు రాష్ట్రాల సీఎంలు.. చీకటిపై వెలుగు సాధించిన విజయం అని ఏపీ సీఎం జగన్ వెల్లడి.. అజ్ఞాన అంధకారాన్ని పారదోలి జ్ఞానపు కాంతులు విరజిమ్మాలనే తత్వాన్ని దీపావళి చాటుతుందన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్

Jai K

దీపావళి సందర్భంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు ఏపీ సీఎం జగన్ వెల్లడించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందిస్తూ, దేశ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు వెల్లడించారు.

Advertisement

Satyavathi Rathod: కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే వరకు చెప్పులు ధరించను.. మంత్రి సత్యవతి రాథోడ్, సెప్టెంబరు 17 నుంచి దీక్షలో ఉన్నానన్న మంత్రి.. గిరిజనుల సంక్షేమం కోసం కేసీఆర్ ఎంతో చేస్తున్నారన్న ప్రశంస

Jai K

కేసీఆర్ మరోమారు ముఖ్యమంత్రి అయ్యే వరకు తాను పాదరక్షలు ధరించబోనని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సెప్టెంబరు 17 నుంచే దీక్షను ప్రారంభించినట్టు చెప్పారు. గిరిజనుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ తీవ్రంగా కృషి చేస్తున్నట్టు చెప్పారు.

Munugode Bypoll: డబ్బే డబ్బు! మునుగోడు ఉప ఎన్నికలో డబ్బు ప్రవాహం, మరో రూ. కోటి స్వాధీనం, తప్పించుకోబోతే చేజ్ చేసి పట్టుకున్న పోలీసులు, ఆ అభ్యర్ధి కోసమే తీసుకెళ్తున్నట్లు ఒప్పుకున్న నిందితులు

Naresh. VNS

కోమటిరెడ్డి సుమంత్ రెడ్డి, కోమటిరెడ్డి పవన్ రెడ్డి వద్దకు డబ్బు తీసుకెళ్తున్నట్లు పట్టుబడ్డ ముగ్గురు వ్యక్తులు పేర్కొన్నారు. కోకాపేట వాసి సునీల్ రెడ్డి నుంచి రూ. కోటి తీసుకెళ్తున్నట్లు ఒప్పుకున్నారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఆ నియోజకవర్గానికి వెళ్లే దారుల్లో పోలీసులు చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసి ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు

PRC for TSRTC Employees: ఆర్టీసీ ఎంప్లాయిస్‌కు దీపావళి కానుక, పీఆర్సీకి ఆమోదం తెలిపిన సీఎం కేసీఆర్, ఎన్నికల కోడ్ ఈసీకి లేఖ, ఆర్టీసీ ఎంప్లాయిస్‌పై వరాలు కురిపిస్తున్న సీఎం కేసీఆర్

Naresh. VNS

మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్నికల నియమావళి అమలులో (Election Code) ఉన్నందున టిఎస్ఆర్టీసి (TSRTC) ఉద్యోగులకు ఇవ్వనున్న పీఆర్సీకి (PRC) అవసరమైన చట్టపరమైన అనుమతుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు, భవనాలు, రవాణా శాఖ కార్యదర్శి ఎన్నికల ప్రధాన అధికారికి లేఖ రాశారని అన్నారు

Munugode Bypolls: బీజేపీ వాళ్లు ఇచ్చే తులం బంగారం, డబ్బులు తీసుకొని ఓటు టీఆర్ఎస్ కు వేయండి, మంత్రి కేటీఆర్ పిలుపు..

kanha

అవసరమైతే ఓటుకు తులం బంగారం ఇస్తానని రాజగోపాల్ రెడ్డి చెబుతుండంట. ఆ తులం బంగారం తీసుకోండి.. ఓటు మాత్రం అండగా ఉన్న కారు గుర్తుకు వేయండి. ఈ పైసలు గుజరాత్ గద్దల పైసలు. మునుగోడు ఆత్మగౌరవాన్ని కొనేందుకు ఎర వేస్తున్నారు. డబ్బు అహంకారానికి ఓటుతో సమాధానం చెప్పాలని ఓటర్లకు కేటీఆర్ పిలుపునిచ్చారు.

Advertisement

DAV School Horror: డీఏవీ స్కూల్ గుర్తింపును రద్దు చేయండి.. మంత్రి సబిత ఆదేశం.. ఇప్పటివరకూ ఈ భయానక ఘటనలో తీసుకున్న చర్యలు.. పరిణామక్రమం ఏమిటంటే??

Jai K

డీఏవీ స్కూల్ ఘటనపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. ఎల్‌కేజీ బాలికపై లైంగిక వేధింపులకు కారణమైన బంజారాహిల్స్‌లోని బీఎస్‌డీ డీఏవీ పాఠశాల గుర్తింపును తక్షణమే రద్దు చేయాలంటూ విద్యాశాఖ అధికారిని మంత్రి సబితా ఆదేశించారు.

SI, Constable Results: తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షా ఫలితాలు రిలీజ్, ఎంతమంది క్వాలిఫై అయ్యారో తెలుసా? ఇంత తక్కువ మంది అర్హత సాధిస్తారని ఎవ్వరూ ఊహించి ఉండరు

Naresh. VNS

తెలంగాణలో ఖాళీగా ఉన్న ఎస్‌ఐ, కానిస్టేబుల్ భర్తీ ప్రక్రియలో భాగంగా నిర్వహించిన ప్రాథమిక పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఎస్‌ఐ, కానిస్టేబుల్, ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుల్స్, ప్రొహిబిషన్‌, ఎక్సైజ్ కానిస్టేబుల్స్‌ ప్రాథమిక పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు తెలంగాణ స్టేట్‌ లెవల్ పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు ప్రకటించింది.

Komatireddy Venkat Reddy Audio Leak: మునుగోడులో తమ్ముడికి ఓటేయండి, కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ఆడియో లీక్‌ ప్రకంపనలు, ఇంకా స్పందించని కోమటిరెడ్డి

Hazarath Reddy

ఉప ఎన్నికలో తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఓటు వేయాలని పార్టీ నేతలకు ఫోన్‌ చేశారు కోమటిరెడ్డి (Komatireddy Venkat Reddy). పార్టీలను చూడొద్దని, రాజగోపాల్‌రెడ్డికి ఓటు వేయాలని సూచించారు. కాంగ్రెస్‌ ఓడితే.. ఈ దెబ్బతో పీసీసీ చీఫ్‌ అవుతానంటూ వెంకట్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

Munugode Bypoll 2022: బతికుండగానే జేపీ నడ్డాకు సమాధి కట్టిన గుర్తుతెలియని వ్యక్తులు, టీఆర్ఎస్ పని అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం

Hazarath Reddy

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపురంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు గుర్తుతెలియని వ్యక్తులు సమాధి నిర్మించారు. 2016లో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హోదాలో జేపీ నడ్డా దండుమల్కాపురంలో పర్యటించిన సమయంలో ఫ్లోరైడ్‌ రీసెర్చ్‌ అండ్‌ మిటిగేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

Advertisement
Advertisement